జీవో 279ని రద్దు చేయండి
Published Fri, Nov 11 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
– కమిషనర్‌కు విన్నవించిన ఐఎన్‌టియుసి నాయకులు
కర్నూలు (టౌన్): జీవో 279ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు వై.వి. రమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుల సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఇఎస్‌ఐ చెల్లించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్స్, చెప్పులు, నూనె, ఆఫ్రాన్స్ ఇవ్వాలన్నారు. టైమ్ స్కేల్ వర్కర్స్ అందరికీ పీఆర్‌సీ వెంటనే ఇవ్వాలన్నారు.
Advertisement
Advertisement