పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఐఎన్‌టీయూసీ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది.
పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఐఎన్‌టీయూసీ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది. కార్మికుల కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ కార్మిక సంఘాలతో కలిసి సెప్టెంబర్ 2న భారత్ బంద్ నిర్వహిస్తామని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ బంద్‌కు త్వరలోనే అన్ని సంఘాల నుంచి మద్దతు కూడగడతామని ఆయన అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ రామగుండంలోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.