sanjeeva reddy
-
YSR మరణం తరువాత..!
-
సంజీవరెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ దివంగత ఎమ్మెల్యే పి.కృష్ణారెడ్డి తనయుడు సంజీవరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి ఆయన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. అయితే పార్టీ ఆదేశాలను ధిక్కరించడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కీలక సమయంలో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు సంజీవరెడ్డి సిద్ధం కావడంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన అధికారికంగా మళ్లీ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
నయీం అనుచరుడికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు సామ సంజీవరెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. నయీం చేసిన దందాలలో సంజీవరెడ్డికి కూడా భాగం ఉందనే ఆరోపణలపై గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు సాయంత్రం సంజీవరెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. -
‘సెప్టెంబర్ 2న భారత్ బంద్’
పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఐఎన్టీయూసీ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది. కార్మికుల కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ కార్మిక సంఘాలతో కలిసి సెప్టెంబర్ 2న భారత్ బంద్ నిర్వహిస్తామని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ బంద్‌కు త్వరలోనే అన్ని సంఘాల నుంచి మద్దతు కూడగడతామని ఆయన అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ రామగుండంలోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
కారు ఢీకొని యువకుని మృతి
చిట్యాల(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సంజీవరెడ్డి(23) అనే యువకుడు వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్‌పై పొలానికి వెళుతుండగా విజయవాడ నుంచి చిట్యాల వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో సంజీవరెడ్డి మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుని మృతికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారును పట్టుకునేందుకు సమీప చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంజీవరెడ్డికే టిక్కెట్టు
‘ఖేడ్’ కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా ఖరారు ప్రకటించిన హైకమాండ్ ‘ఒప్పందం’తో వర్గపోరుకు చెక్ నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నిక కోసం కాంగ్రె?స పార్టీ సిద్ధమైంది.. ఆ దిశగా ముందస్తుగా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. మరోసారి విజయం సాధించాలన్న పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా ‘ఒప్పందం’ ప్రకారం వర్గపోరు సమసిపోయేలా మంత్రాంగం నడిపినట్టు సమాచారం. కార్యకర్తలను కూడా కార్యోన్ముఖులను చేసేందుకు అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి పెద్దకుమారుడు, నారాయణఖేడ్ ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి పేరును ఖరారు చేసినట్టు వినికిడి. కాంగ్రె?స పార్టీ హైకమాండ్ అభ్యర్థి ఖరారుపై సోమవారం ప్రకటన చేసింది. పార్టీ రా? వ్యవహారాలపై నేతలు జానారెడ్డి, పీసీసీ ?ఫ ఉత్తవఖుకుమార్‌రెడ్డి, శబ్బీర్ అలీ ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్ను కలిసి ఉప ఎన్నికలపై చర్చించారు. కిష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తవఖుకుమార్‌రెడ్డి అధికారికంగా ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కిష్టారెడ్డి కుమారులందరూ మాట్లాడుకొని సంజీవరెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిష్టారెడ్డి ఆగస్టు 25న గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అసెంబ్లీ టిక్కెటఖ విషయంపై కాంగ్రె?స పార్టీలో వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎంపీ సురేష షెట్కర్ వర్గానికి చెందిన నగేశఖ షెట్కర్ పోటీలో నిలబడుతారని ప్రచారం జరిగింది. ఇరువర్గాలు.. టికెటఖ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. పార్టీ అధినాయకత్వం సురేష షెట్కర్, కిష్టారెడ్డి కుమారుల మధ్య రాజీ కుదిర్చి ఒప్పంద పత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికల్లో సంజీవరెడ్డి పోటీచేస్తారని, ఆయనకు మాజీ ఎంపీ సురేష షెట్కార్ పూర్తిసహకారం అందించి గెలుపునకు కృషి చేయాలని, వచ్చే 2019 ఎన్నికల్లో సురేష షెట్కార్ అసెంబ్లీకి పోటీచేస్తారని, అప్చడు సంజీవరెడ్డి సహకరించి గెలుపునకు పాటుపడాలని ఒప్పందానికి వచ్చినట్టు వినికిడి. సురేష షెట్కార్, కిష్టారెడ్డిలు సైతం గతంలో ఇలాగే ఓ పర్యాయం ఒప్పందాలు చేసుకొని ఒకరి గెలుపునకు ఒకరు పాటుపడ్డారు. ప్రస్తుతం కూడా ఇదే తరహాలో పార్టీ గెలుపు కోసం ఇరువురూ పాటుపడాలని పార్టీ హైకమాండ్వద్ద ఒప్పందాలు జరిగినట్టు భ్ఠగట్టా. ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్ వద్ద జానారెడ్డి, ఉత్తవఖుకుమార్‌రెడ్డి, శబ్బీర్ అలీ జరిపిన చర్చల్లో ఒప్పందం విషయం చర్చించాక కిష్టారెడ్డి కుమారుల్లో ఒకరికి టికెటఖ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. -
'కార్మికులకు బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి'
కరీంనగర్: ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి: ఐఎన్టీయూసీ
జ్యోతినగర్ (కరీంనగర్): ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
రెండు నెలల్లో గృహ ప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు అంటే ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. కానీ, రెండు నెలల్లో గృహ ప్రవేశం చేసేందుకు మూడు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నామంటున్నారు ఎస్వీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ సంజీవ్‌రెడ్డి. ఇంకాఏమన్నారంటే.. మూడు ప్రాజెక్ట్‌లు రెండు నెలల్లో నిర్మాణం కానున్నాయి. బోడుప్పల్లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఫ్లాట్ల సంఖ్య 80. కెనరా నగర్లో 1,700 గజాల్లో ‘ఎస్వీ హార్మొనీ’నూ నిర్మిస్తున్నాం. మొత్తం 30 ఫ్లాట్లు. ఈ రెండు ప్రాజెక్టుల్లో చ.అ. ధర రూ. రూ.2,500. తార్నాకలో 600 గజాల్లో ‘ఎస్వీ నెస్ట్’ను నిర్మిస్తున్నాం. మొత్తం 8 ఫ్లాట్లు. అన్నీ 3 బీహెచ్‌కే సూపర్ డీలక్స్ ఫ్లాట్లే. ఇందులో చ.అ. ధర రూ.4 వేలుగా ఉంది. మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణం 8 నెలల్లో పూర్తికానుంది. బుద్ధ నగర్లో 800 గజాల్లో ‘ఎస్వీ ఫ్లోరా’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 20 ఫ్లాట్లు. బండి సత్తయ్య కాలనీలో 1,600 గజాల్లో ‘ఎస్వీ స్ప్లెండర్’ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్లు 30. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ చ.అ. ధర రూ.2,500. ఈ నెలాఖరులోగా బోడుప్పల్లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ బృందావన్’ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లొస్తాయి. ఇందులోనూ చ.అ. ధర రూ.2,500గా చెబుతున్నాము. ఇక వసతుల విషయాని కొస్తే.. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆర్వో సిస్టం, ఆధునిక రక్షణ ఏర్పాట్లు వంటి అన్ని రకాల వసతులూ ఏర్పాటు చేస్తున్నాం. -
భూ సర్వేయర్ల దందా
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఇప్పటివరకూ మనం దళారులు, భూకబ్జాదారులు భూదందా సాగించడం చూశాం. ఇప్పుడు సరికొత్తగా.. రెవెన్యూ ఉద్యోగులే (భూ సర్వేయర్లు) భూదందా సాగిస్తున్నారు. అసైన్డ్ భూమి పట్టాదారులను అదిరించి, బెదిరించి అందినంత దండుకుంటున్నారు. కాదూ... కూడదంటూ ఎవరైనా ఎదురుతిరిగితే.. ‘మీ భూమి సర్వే హద్దులు నిర్ణయించేది మేమే. మేం చెప్పినట్టు వినకపోతే.. మీ భూమి హద్దులు మారతాయి. మీ చేతుల్లోని భూమి ప్రభుత్వానికి స్వాధీనమవుతుంది’ అంటూ, బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఎదంతా ఎక్కడో మూరుమూలన కాదు.. నగరంలోనూ, దాని చుట్టుపక్కల సాగుతున్న ఈ ‘నయా దందా’కు సంబంధించి ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘునాధపాలెం మండలంలోని రఘునాధపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 21, 30లోని అసైన్డ్ భూములను అధికారులు 2009లో రైతుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. సాగర్ కాల్వ కట్టలపై తొలగించిన గుడిసె వాసులకు ఈ భూమిలో ప్లాట్లు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఈ భూమిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు గడిచిన 15 రోజులుగా చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇక్కడే, భూ సర్వేయర్లు బేరసారాలకు, అవి ఫలించకపోతే దందాగిరీకి దిగుతున్నారు. ఈ భూముల పరిసరాల్లోని పట్టా భూముల రైతులకు సర్వేయర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసైన్డ్ భూమికి అటూఇటూ ఉన్న తమ భూముల్లోనూ హద్దు రాళ్లు పాతుతున్నారని కొందరు రైతులు లబోదిబోమంటున్నారు. అక్కడ ఎకరం భూమి ధర 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇదే అదనుగా, అందనికాడికి దండుకునేందుకు మార్గంగా ఎంచుకున్న సర్వేయర్లు.. ఉద్దేశపూర్వకంగానే ప్రయివేటు భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇదేమంటూ ప్రశ్నించిన రైతులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘మా వద్ద పక్కాగా కాగితాలున్నాయి. మీకు రూపాయి కూడా ఇవ్వం’ అంటూ, తెగేసి చెప్పిన రైతులపట్ల సర్వేయర్లు దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేయర్ బాధిత రైతులకు, సర్వే అధికారులకు మధ్యవర్తిగా ఒక రెవెన్యూ అధికారిణి భర్త రాయబారం సాగిస్తున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. {పస్తుతం ప్లాట్లు చేస్తున్న అసైన్డ్ భూమిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఒక రియల్ వ్యాపారి పట్టా భూమిని ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన రోడ్డు వైపు ఉన్న అసైన్డ్ భూమిలో పేదలకు ప్లాట్లు చేసి ఇస్తే.. లక్షలు ధారపోసి కొన్న భూమికి విలువ పడిపోతుందని సదరు వ్యాపారి భీతిల్లుతున్నారు. అక్కడ ఉన్న అసైన్డ్ భూమిలో ప్లాట్లు చేయకుండా ఉండేందుకుగాను కొంద రు రెవెన్యూ అధికారులకు, సర్వేయర్లకు ఆ వ్యా పారి పెద్ద మొత్తంలో ముట్టచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒకవైపు అసైన్డ్ భూమిని పోలీసులకు ప్రభుత్వం కేటాయించిందని, ఆ వివరాలు సక్రమంగా లేవనే పేరుతో కొత్త పంచాయతీ మొదలైంది. ఈ వ్యవహారాలతో మొత్తంగా రెవెన్యూ శాఖ అభాసుపాలవుతోందన్నది జనాభిప్రాయంగా ఉంది. పరిసర మండలాల్లో కూడా ఇదే దందా... నగరీకరణలో భాగంగా ఖమ్మం పరిసర ప్రాంతాలైన రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, చింతకాని మండలాల సరిహద్దుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఇప్పటికే పలువురు అక్రమించి అడ్డదారిని పట్టాలు చేయించుకున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన అధికారులు ఇష్టా రాజ్యంగా ఇనాం తదితర భూములకు పట్టాలు ఇవ్వడం.. ఇప్పటి అధికారులకు వరంగా మారింది. {పధానంగా ఖమ్మం అర్బన్ మండలంలో పనిచేసి బదిలీపై వెళ్ళిన ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అనుచరులకు ప్రభుత్వ భూమిని రాసిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు అధికారిపై పలు ఆరోపణలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. పాత నక్షా తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమి ఎవ్వరి ఆధీనంలో ఉంది.. అనేది ఆరా తీసి పలువురు అధికారులు మామూళ్ళపర్వానికి తెర లేపినట్టు సమాచారం. ఈ సందర్భంలో నిజమైన భూ యజమానులను కూడా బెదిరించి పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు పలువురు ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, పట్టా భూములపై కూడా నిబంధల పేరుతో... అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని పలువురు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. రాసిస్తే చర్యలు తీసుకుంటా.. అంటున్నారు.. ఆర్డీఓ సంజీవరెడ్డి. దీని పై ఆయనను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ‘అలాంటిదేమీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, వాస్తవాలని తేలితే చర్యలు తీసుకుం టా. అసైన్డ్, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా కచ్చితంగా సర్వే చేసి స్వాధీనపర్చుకుంటాం. వాటిని ప్లాట్లు చేసి పేదలకు ఇస్తాం. సర్వే చేసే అధికారులపై మరో అధికారి పర్యవేక్షణ ఉంటుంది. సర్వేలో రాజీ పడేది లేదు’ అన్నారు. -
పాపం పిల్లాడు..
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ఆడుతూపాడుతూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించిన ఆ బాలుడికి అవే ఆఖరు ఘడియలయ్యాయి. మిత్రులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారిని ఆటో రూపంలో మృత్యువు కబళించి, ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. స్థానిక కొవ్వూరునగర్‌లోని సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో ఈ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో నివసిస్తున్న రవీంద్రారెడ్డి, కృష్ణవేణి దంపతులకు హేమంత్, కోదండరామిరెడ్ది(7) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కోదండరామిరెడ్డి సమీపంలోని విశ్వ భారతి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం నుంచి మిత్రులందరినీ కలసి చాక్లెట్లు పంచుతూ ఆనందంగా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలాడు. మధ్యాహ్నం భోజనం చేసి తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించగానే.. తాను మిత్రులతో కలసి ఆడుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి సమీపంలో మరమ్మతుకు గురై నిలిపి ఉంచిన ఆటోలో మిత్రులతో కలసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆటో యజమాని వచ్చి దానినిస్టార్ట్ చేసేందుకు యత్నించాడు. అది స్టార్ట్ కాకపోవడంతో ఆటోను వెనుక నుంచి నెట్టాల్సిందిగా పిల్లలకు సూచించగా వారు దానిని బలంగా నెట్టారు. అప్పటికే రివర్స్ గేర్‌లో ఉన్న ఆటో స్టార్ట్ అయి బలంగా వెనక్కు రావడంతో, దాని వెనుకనే ఆటోను తోస్తున్న కోదండరామిరెడ్డి దాని కింద పడి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. స్థానికుల సహాయంలో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, తక్షణం ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. దీంతో గాయాలపాలై విలవిల్లాడుతున్న బిడ్డను తీసుకుని ఆ దంపతులు సాయినగర్‌లో పేరెన్నికగన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు లేరంటూ వారు చికిత్సకు నిరాకరించారు. అక్కడి నుంచి ఐరన్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా, ఇక్కడ చిన్న పిల్లల వైద్యుడు లేరని చెప్పారు. కోర్టు రోడ్డులోని ప్రముఖ ఆస్పత్రికి వెళ్లగా ఇంత చిన్న పిల్లలకు తాము వైద్యం చెయ్యలేమని చెప్పారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బాలుడు కన్నుమూశాడు. ‘సామీ.. చికిత్స చేయండి.. మా పిల్లాడిని కాపాడండి..’ అని బాలుడి తల్లిదండ్రులు మొత్తం నాలుగు ఆస్పత్రుల్లోనూ కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై జనం మండిపడ్డారు. వైద్యులు ప్రాణాలు తీస్తున్నారు.. : గాయాలతో విలవిలలాడుతున్న తన బిడ్డను ప్రభుత్వ వైద్యులే పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డను బతికించుకుందామని ప్రభుత్వాస్పత్రికి వెళితే కనీస చికిత్స కూడా చేయకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారని, కొంత వైద్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికుండే వాడని, సుమారు గంటన్నర పాటు చేతుల మీద ప్రాణాలతో బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కాపాడుకోలేక పోయామని రోదించారు. ఇంత మంది వైద్యులు ఉండీ ఏం ప్రయోజనమని ఆ బాలుడి అత్త పద్మావతి కంట తడితో శాపనార్థాలు పెట్టింది. -
రక్తం చిందిన రోడ్డు
*అర్ధరాత్రి సమయంలో రహదారి రక్తసిక్తమైంది. గుంటూరు-కర్నూలు * రోడ్డుపై మృత్యుఘోష మార్మోగింది. మద్యం మత్తు, అతివేగం * కారణంగా సంతమాగులూరు-పాతమాగులూరు మధ్య మంగళవారం * అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వినుకొండలోని ఒకే * కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు * తీవ్రగాయాలపాలయ్యారు. సంతమాగులూరు(ప్రకాశంజిల్లా), వినుకొండ, న్యూస్‌లైన్ :వినుకొండ పట్టణం రెడ్డినగర్‌కు చెందిన ఆవుల అంజిరెడ్డి (45), ఆవుల శ్రీనివాసరెడ్డి (35), ఆవుల సంజీవరెడ్డి (27), ఆవుల నారాయణరెడ్డి సోదరులు కలిసి అమ్మ కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. వారిలో ఆవుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్యతో విభేదాలు రావడంతో విడాకుల నిమిత్తం అంజిరెడ్డి, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, మరో స్నేహితుడు రామినేని ప్రసాద్‌తో కలిసి మంగళవారం ఉదయం కారులో గుంటూరులోని కోర్టుకు వెళ్లారు. సాయంత్రానికి అక్కడ పని ముగించుకుని నరసరావుపేట చేరుకున్నారు. అందరూ కలిసి అర్ధరాత్రి వరకూ నరసరావుపేటలో పూటుగా మద్యం సేవించారు. అనంతరం అక్కడి నుంచి వినుకొండ బయలుదేరారు. శ్రీనివాసరెడ్డి కారు నడుపుతుండగా అంజిరెడ్డి పక్కన కూర్చున్నాడు. వెనుకసీట్లో సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్ కూర్చున్నారు.గుంటూరు జిల్లా సరిహద్దు దాటి సంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ పరిధిలో కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ముందుటైరు పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పి ముందువైపు ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టి కారు ఇరుక్కుపోయింది. ఇది గమనించిన టిప్పర్ డ్రైవర్ అక్కడే ఉంటే పోలీస్ కేసులో ఇరుక్కుని ఇబ్బందిపడాల్సి వస్తుందన్న భయంతో వాహనాన్ని స్టార్ట్‌చేసి వేగంగా పోనిచ్చాడు. అయితే, టిప్పర్ వెనుకవైపు ఇరుక్కుపోయిన కారు విడిపోలేదు. అయినప్పటికీ అలాగే పోనిచ్చాడు. దీంతో పాతమాగులూరు నుంచి సంతమాగులూరు వరకూ సుమారు మూడు కిలోమీటర్ల పొడవున కారును టిప్పర్ ఈడ్చుకెళ్లింది. అనంతరం గోతులు రావడంతో కుదుపులకు టిప్పర్ నుంచి విడిపోయిన కారు రోడ్డుకు తూర్పువైపున ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. టిప్పర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు... అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరూ గమనించలేదు. ఆ రోడ్డుపై రెండుసార్లు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ కారును గుర్తించలేదు. తెల్లవారిన తర్వాత బహిర్భూమికి అటుగా వెళ్లిన సంతమాగులూరు గ్రామస్తులు రోడ్డుపక్కన కారును గమనించారు. అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని ట్రాక్టర్ సాయంతో కారును రోడ్డుపైకి చే ర్చి పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, స్థానిక ఎస్సై ఎ.శివనాగరాజులు సిబ్బందితో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులోని ముందుసీట్లలో కూర్చుని ఉన్న శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి మృతిచెందగా, వెనుకసీట్లోని సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్ ప్రాణాలతో ఉన్నారు. అయితే, కారు నుజ్జునుజ్జు కావడంతో వారంతా లోపల ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు శ్రమించి కారుడోర్లను ఇనుపరాడ్లతో బద్దలుకొట్టి అందరినీ బయటకు తీశారు. కానీ, అప్పటికే వెనుకసీట్లోని సంజీవరెడ్డి కూడా కన్నుమూశాడు. తీవ్రగాయాలతో ఉన్న నారాయణరెడ్డి, ప్రసాద్‌లను 108 వాహనంలో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలించారు. మూడు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తల్లి, బంధువులు బోరున విలపించిన తీరు చూపరుల కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన జరిగిన తీరును ఆయన పూర్తిగా పరిశీలించారు. దాన్నిబట్టి ఆగిఉన్న టిప్పర్ వెనుకవైపు కారు ఢీకొని ఇరుక్కుపోయి ఉంటుందని, అలా ఇరుక్కుపోయిన కారును టిప్పర్ ఈడ్చుకొచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. మృతుల నేపథ్యం... మృతుల్లో అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి సొంత అన్నాదమ్ములు. అంజిరెడ్డికి భార్య, ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. రెండో భార్యకు సంతానం లేదు. మరో మృతుడు సంజీవరెడ్డి, గాయాలతో చికిత్స పొందుతున్న నారాయణరెడ్డి సొంత అన్నాదమ్ములు. సంజీవరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గొట్టిపాటి వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. రోదనలతో మిన్నంటిన ఏరియా వైద్యశాల నరసరావుపేటటౌన్, న్యూస్‌లైన్: స్థానిక ఏరియా వైద్యశాలలో బుధవారం రోడ్డు ప్రమాద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో మృతి చెందిన ఆవుల శ్రీనివాసరెడ్డి,అంజిరెడ్డి,సంజీవరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం ఇక్కడకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో ఏరియా వైద్యశాలకు చేరుకొని బోరున విలపించారు. దీంతో ఏరియా వైద్యశాలలో విషాదచాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బందువులకు అప్పగించారు. కాగా గాయపడిన నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలను మెరుగైన వైద్యం కోసం ఏరియా వైద్యశాల నుంచి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. -
నిరుపేదల అభివృద్ధికి కృషిచేయాలి
=‘నాటా’ సభ్యుల సేవలు అభినందనీయం =కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి =జనగామ అత్రి మహర్షి పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం జనగామ, న్యూస్‌లైన్ : సమాజంలో ఉంటున్న నిరుపేదల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి అన్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అత్రి మహర్షి పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాటా అధ్యక్షుడు టి. సంజీవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి వైశాలి ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో వైద్యవృత్తినే చేపట్టానని, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నందున వైద్యం చేయడం వీలు కావడంలేద ని తెలిపారు. నాటా సభ్యులు అమె రికాలో డబ్బు సం పాదనను వదిలి తమ అమ్యూలమైన సమయాన్ని జన్మభూమికి కేటాయించడం అభినందనీయమన్నారు. మనం బాగుపడితే కాదు.. అందరూ బాగుండాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న నాటా సేవా కార్యక్ర మాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. నాటా నిర్వహించే మంచి పనులకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలతో ముందుకు : డాక్టర్ సంజీవరెడ్డి, నాటా అధ్యక్షుడు తమ అసోసియేషన్ పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాటా అధ్యక్షుడు టీ.సంజీవరెడ్డి అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాటా సేవాడేస్‌లో భాగంగా ఈనెల 16 నుంచి 29 వరకు ప్రత్యేక సేవా కార్యమ్రాలు చేపడుతున్నామని తెలిపారు. వైద్య శిబిరాలే కాకుండా జిల్లాలోని పలు చోట్ల వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ర్టంలోని పలు జిల్లా ల్లో వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల ల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండియాలో అమెరికాస్థాయి వైద్యం : డీఎంహెచ్ఓ సాంబశివరావు ఇండియాలో కూడా అమెరికాస్థాయి వైద్యం లభిస్తోందని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. తమ శాఖ ఉద్యోగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. డీఫ్లోరైడ్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న నాటా సభ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు. వృత్తిరీత్యా అమెరికాలో ఉంటు న్నా స్వదేశంపై ఉన్న మమకారంతో నాటా సభ్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారని.. మున్ముందు వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కోఆర్డినేటర్ ఏ. శ్రీనివాసరావు, అట్లాంటా కాన్షరెన్స్ సభ్యుడు సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్ సురేంద్రకుమార్, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్, వైద్య శిబిరం నిర్వాహకుడు జనగాం రాజిరెడ్డి, జక్కుల వేణుమాధవ్ పాల్గొన్నారు. శిబిరంలో సేవలందించింది వీరే.. నాటా చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డితో పాటు, జనగామ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ ప్రవీ ణ్చందర్, స్థానిక ప్రభుత్వాస్పత్రి పీడియాట్రిషన్ శంకర్‌నాయక్, బచ్చన్నపేట పీహెచ్సీ వైద్యాధికారి అశోక్‌కుమార్, స్థానిక వైద్యులు కరుణాకర్‌రాజు, పద్మ, చేర్యాల, మద్దూరు. నర్మెట, బచన్నపేట, జనగామ పీహెచ్‌సీల వైద్య సిబ్బంది సేవలందించారు. కాగా, శిబి రానికి తరలివచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.