రెండు నెలల్లో గృహ ప్రవేశం! | SV Constructions Managing Partner sanjiva reddy talking on home entry | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో గృహ ప్రవేశం!

Published Sat, Mar 15 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

రెండు నెలల్లో గృహ ప్రవేశం!

రెండు నెలల్లో గృహ ప్రవేశం!

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు అంటే ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. కానీ, రెండు నెలల్లో గృహ ప్రవేశం చేసేందుకు మూడు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నామంటున్నారు ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్‌‌టనర్ సంజీవ్‌రెడ్డి.

ఇంకాఏమన్నారంటే..
మూడు ప్రాజెక్ట్‌లు రెండు నెలల్లో నిర్మాణం కానున్నాయి. బోడుప్పల్‌లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఫ్లాట్ల సంఖ్య 80. కెనరా నగర్‌లో 1,700 గజాల్లో ‘ఎస్వీ హార్మొనీ’నూ నిర్మిస్తున్నాం. మొత్తం 30 ఫ్లాట్లు. ఈ రెండు ప్రాజెక్టుల్లో చ.అ. ధర రూ. రూ.2,500.

తార్నాకలో 600 గజాల్లో ‘ఎస్వీ నెస్ట్’ను నిర్మిస్తున్నాం. మొత్తం 8 ఫ్లాట్లు. అన్నీ 3 బీహెచ్‌కే సూపర్ డీలక్స్ ఫ్లాట్లే. ఇందులో చ.అ. ధర రూ.4 వేలుగా ఉంది.

మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణం 8 నెలల్లో పూర్తికానుంది. బుద్ధ నగర్‌లో 800 గజాల్లో ‘ఎస్వీ ఫ్లోరా’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 20 ఫ్లాట్లు. బండి సత్తయ్య కాలనీలో 1,600 గజాల్లో ‘ఎస్వీ స్ప్లెండర్’ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్లు 30. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ చ.అ. ధర రూ.2,500.

ఈ నెలాఖరులోగా బోడుప్పల్‌లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ బృందావన్’ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లొస్తాయి. ఇందులోనూ చ.అ. ధర రూ.2,500గా చెబుతున్నాము.

ఇక వసతుల విషయాని కొస్తే.. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆర్వో సిస్టం, ఆధునిక రక్షణ ఏర్పాట్లు వంటి అన్ని రకాల వసతులూ ఏర్పాటు చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement