పంచతత్వ పార్క్‌ ప్రారంభించిన కేటీఆర్‌ | KTR Inaugurates Panchatatva park in Indira Park | Sakshi
Sakshi News home page

పంచతత్వ పార్క్‌ ప్రారంభించిన కేటీఆర్‌

Published Sun, Nov 15 2020 12:42 PM | Last Updated on Sun, Nov 15 2020 1:35 PM

KTR Inaugurates Panchatatva park in Indira Park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర ప్రజలకు  పంచతత్వ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన  ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ను మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్‌ మీద  నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్‌ సర్కిల్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement