walkers
-
అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే ఆంక్షల సడలింపు
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టంచేశారు. అప్పటి వరకు చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధికారుల పనితీరు బ్రహ్మాండం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో ఇతర అధికారులందరూ ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్నారని వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు తిరుమల శ్రీవారిని 88,623 మంది దర్శించుకున్నారు. హుండీలో రూ. 4.67 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డీఎఫ్‌వో శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో వరల్డ్ స్పారో డే
మణికొండ: హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని పంచేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఆదివారం వరల్డ్ స్పారో డే సందర్భంగా బర్డ్ వాక్‌ను నిర్వహించారు. దాంతో తరలివచ్చిన పక్షి ప్రేమికులు వాటిని వీక్షించటంతో పాటు ఫొటోలను తీసుకున్నారు. మొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీఎస్‌టీడీసీ, ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.స్కైలాబ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కును.. ఎంతో ఆకర్షణీయంగా, పక్షుల ఆవాసానికి అనువుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పార్కును వీక్షించేందుకు వచ్చే వారికి ట్రెక్కింగ్ రూట్స్, వాకింగ్పాత్, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్‌జిమ్ లాంటి సౌకర్యాలను కల్పిం చామన్నారు. వైస్ చైర్మెన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ప్రతి పార్కులో పక్షులు, జంతువులకు ఆవాసంగా తీర్చిదిద్దటంతో పాటు విజిటర్స్‌కు అనుగుణంగా అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో బాగా నీడను ఇచ్చే మొక్కలనే ఎక్కువగా నాటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కె. సుమన్, రేంజ్ అధికారులు లక్ష్మారెడ్డి, మధు, సూపర్వైజర్లు శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ కల్యాణ్, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 రకాల పక్షులను వాకర్స్ గుర్తించారు. -
హైదరాబాద్ సిటీలో ఈ సమస్యలు తీరేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం మాటలకే పరిమితమవుతోంది. హైదరాబాద్ సిటీలో పాదచారులకు మాత్రం పిటీగా మారింది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 94 మంది పాదచారులు మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 53 నగరాలకు సంబంధించిన గణాంకాలు విడుదల కాగా... వీటిలో హైదరాబాద్ పాదచారుల మరణాలకు సంబంధించి ఆరో స్థానంలో నిలిచింది. ఈ సమస్యలు తీరేదెన్నడో... రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు, అందుకు అనుగుణంలో ‘ఆల్ రెడ్స్’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఇంకా జరుగుతూనే ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) నిర్మాణం, అందుబాటులోకి తీసుకురావడం నత్తనడకన సాగుతున్నాయి. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) భూగర్భ మార్గాలు కనుమరుగు... నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్లగతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు నిర్మించారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం అప్పట్లో సిటీలోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కొన్నింటిని నిర్మిస్తున్నా... అవసరాలకు తగ్గట్టు మాత్రం ఇవి లేవు. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల కారణంగా 590 మంది క్షతగాత్రులుగా కాగా... 94 మంది మరణించారు. ఈ చర్యలు తీసుకోవాల్సిందే... ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటల్ని మింగేసిన బడా మాల్స్ ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు వచ్చిపడి కాలిబాటలు బాటసారులకు బాసట కాలేకపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన, పెంచిన చెట్లకు తోడు అధికారులు ఉద్దేశపూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన (చేస్తున్న) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంబాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు పాదం మోపే చోటు లేకుండా చేస్తున్నాయి. రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండేలా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉంటున్న చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అధికంగా విస్తరించాలి. ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా చేయాలని సూచించారు. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కూడిన సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి. -
కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం
బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో భద్రత చర్యల వైఫల్యం వాకర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న ఓ మహిళా వాకర్ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాకర్లు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో మహిళా వారర్ పల్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆగంతకుడి కోసం అటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకోసం పార్కు చుట్టూ ఉన్న రహదారులకు ఇరువైపులా వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ► మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వైపు ఆగంతకుడు మహిళా వాకర్పట్ల అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారైన ఘటన పోలీసు వర్గాలను షాక్‌కు గురి చేసింది. నాలుగు నెలలు తిరగకుండానే వాక్‌వేలో మరో ఘటన చోటు చేసుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ► ఒక వైపు ఇంటర్సెప్టార్ పోలీసులు మరోవైపు ఫుట్ పెట్రోలింగ్ పోలీసులు దీనికి తోడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 20 మంది కానిస్టేబుళ్లు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాక్‌వేలో కాపలా కాస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఉన్నతాధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి తోడు వాక్‌వేలో ఉన్న ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడం పోలీసులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. సీసీ కెమెరాను వంచేశాడు.. మహిళా వాకర్‌ను వెనుక నుంచి వచ్చి ఇబ్బంది పెట్టిన ఘటనలో ఆగంతకుడు అక్కడ అంతకుముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాను నేలకు వంచినట్లు గుర్తించారు. ముందస్తు పథకంతోనే ఆగంతకుడు అక్కడ కాపుకాసి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. విరిగిన గేట్లకు మరమ్మతులేవి? జీహెచ్ఎంసీ వాక్‌వేలో నాలుగైదు చోట్ల గేట్లు విరిగాయి. వీటికి మరమ్మతులు చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు.గతేడాది నవంబర్ 11వ తేదీన సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి జరిగిన అనంతరం జీహెచ్ఎంసీ, పోలీసులు, అటవీ శాఖాధికారులు సమీక్ష నిర్వహించి సీసీ కెమెరాలతో పాటు వీధి దీపాలు, గేట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. సీసీ కెమెరాలేవి? నటి షాలూచౌరాసియాపై ఘటన జరిగిన సమయంలో వాక్‌వేలో 64 సీసీ కెమెరాలు ఉన్నట్లు తేలింది. ఆ కెమెరాల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదని అప్పుడే గుర్తించారు. అనంతరం డీసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయడమే కాకుండా కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయకపోగా ఒక్క సీసీ కెమెరా కూడా కొత్తది ఏర్పాటు చేయలేదు. హడావుడి తప్పితే సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టలేదు. (క్లిక్: గూగుల్ మ్యాప్స్‌లోకి ‘ట్రాఫిక్ అడ్డంకుల’ అప్డేట్) రూ. కోటి నిధులు అవసరం జీహెచ్ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే రూ. కోటి నిధులు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సంబంధిత సంస్థను కూడా పిలిపించి అంచనాలు రూపొందించారు. తీరా చూస్తే కోటి రూపాయలు ఎవరు ఇవ్వాలి అన్నదగ్గర నిర్ణయాలు ఆగిపోయాయి. ప్రభుత్వమే రూ. కోటి వెచ్చించి పార్కు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుండేది. దాతలను గుర్తించి వారి నుంచి విరాళాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆర్డర్లు పాస్ చేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. (చదవండి: హైదరాబాద్.. ఫలించిన యాభై ఏళ్ల కల! ) వెలగని వీధి దీపాలు పార్కు చుట్టూ వాక్‌వేలో చీకటి రాజ్యమేలుతున్నది. నటిపై ఆగంతకుడి దాడికి అక్కడ చీకటి ఉండటమే కారణమని గుర్తించారు. అనంతరం ఇక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తూతూ మంత్రంగా 30 చోట్ల తాత్కాలిక వీధి దీపాలు ఏర్పాటు చేసి నెల తిరగకుండానే వాటిని పట్టుకెళ్లారు. పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నిర్వాకంతోనే పార్కు చుట్టూ ఆగంతకుల దాడులు, అసాంఘిక కార్యకలాపాలు, వాకర్లకు భద్రత లేకపోవడం చోటు చేసుకుంటున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
డాగ్ వాకర్‌కు లక్షల్లో జీతం!
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లోని ‘జోసఫ్ హేజ్ ఆరోన్సన్’ న్యాయవాద సంస్థ ఓ చిత్రమైన ఉద్యోగానికి ఆకర్షణీయమైన ప్రకటన చేసింది. తమ సంస్థలోని ఓ సీనియర్ సభ్యుడికి ఓ పెంపుడు కుక్క ఉందని, ఆ కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పిందేకు ఓ డాగ్ వాకర్ కావాలని ప్రకటన సారాంశం. ఈ ఉద్యోగానికి కుక్కలను ప్రేమించేవారు, అంటే వాటిని ప్రేమగా చూసుకునే వారే ఈ ఉద్యోగానికి అర్హులంటూ పేర్కొంది. ఆ ఉద్యోగానికి అక్షరాల ఏడాదికి 30 వేల పౌండ్లను (దాదాపు 29 లక్షల రూపాయలు, నెలకు రెండు లక్షలపైనే) జీతంగా ఇస్తారని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జీతం కాకుండా పింఛను, జీవిత బీమాలతోపాటు ప్రైవేటు ఆరోగ్య , డెంటల్ బీమా సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది. ఉద్యోగపు వేళలు ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు పెంపుడు కుక్క యోగ క్షేమాలు చూసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా డాగ్ వాకర్ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఇందుకు ఉద్యోగికి ఫిట్నెస్ కూడా అవసరమని పేర్కొంది. ప్రతి శనివారం, ఆదివారం వీకెండ్ ఆఫ్‌లు తీసుకోవచ్చుగానీ, రోజు వారి పని వేళల్లో మాత్రం పట్టు విడుపులు ఉండాల్సిందేనని కూడా ఆ ‘వాంటెడ్’ ప్రకటన విన్నవించింది. ఈ డాగ్ వాకర్ ఉద్యోగానికి ఆడ, మగ ఎవరైనా అర్హులేనని, అయితే అనుభవం ఉండడం ముఖ్యమని కూడా పేర్కొంది. ఇంటర్వ్యూలు ఆ న్యాయవాద సంస్థ ప్రకటించలేదుగానీ దరఖాస్తులు మాత్రమే తెగ వచ్చి పడుతున్నాయట. చదవండి: దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం -
బేగంపేట ఎయిర్పోర్ట్ పాత రహదారి వద్ద వాకర్స్ ర్యాలీ
-
చుట్టేసి.. దూకేసి!
గ్రేటర్ వాసులకు మెట్రో డివైడర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్(13 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల మధ్యన ఎత్తయిన గోడలతో డివైడర్లు, పలు చోట్ల దూరంగా యూటర్న్లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా మారింది. వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఆయా యూటర్న్ల వద్ద జీబ్రా క్రాసింగ్స్, పాదచారుల మార్గం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రాకపోకలు కష్టమై మెట్రో రూట్లో రహదారికి ఇరువైపులా వ్యాపారాలు సైతం పడిపోయాయి. బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాక్షి నెట్వర్క్: మెట్రో మార్గాల్లో డివైడర్ల నిర్మాణంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఎత్తులో డివైడర్లు ఉండడం, అర కిలోమీటర్‌కు పైగా దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం, జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడంతోసిటీజనులు అవస్థలు పడుతున్నారు. దీంతో కస్టమర్లు రాక వ్యాపారాలు దివాళాతీస్తున్నాయని రోడ్‌సైడ్ వ్యాపారులు వాపోతున్నారు. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గాల్లో ‘సాక్షి’ బుధవారం విజిట్ నిర్వహించగా ఈ ఇబ్బందులు కళ్లకు కట్టాయి. సిగ్నల్స్ లేవ్... మలేసియాటౌన్‌షిప్:కూకట్పల్లి నుంచి మియాపూర్ మార్గంలో కొన్నిచోట్ల జిబ్రాక్రాసింగ్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాలు, పాదచారులు ఏక కాలంలో రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ♦ కేపీహెచ్‌బీ కాలనీ రైల్వే స్టేషన్ దాటాక రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రి దగ్గర జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ♦ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లు, నిజాంపేట్ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన్పటికీ.. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ♦ ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా వస్త్ర, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు. ఉప్పల్‌లో వ్యాపారులకు తిప్పలు.. ఉప్పల్: మెట్రో రైలు మార్గంలో పిల్లర్ల కింద నిర్మించిన డివైడర్లు స్థానిక వ్యాపారులకు శాపంగా మారాయి. దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు 50 శాతం వరకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ వీధి నెంబర్–8 నుంచి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల దూరంలో రెండే యూటర్న్లు ఉన్నాయి. దీంతో పాదచారులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. దివాళా... డివైడర్ల కారణంగా మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. వీధి నెంబర్–8 వద్ద దారిని మూసేయడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది. దారి లేక కస్టమర్లు రాలేకపోతున్నారు. మాగోడు ఎవరూ వినడం లేదు. – ప్రసాద్, వ్యాపారస్తుడు ట్రాఫిక్ జంఝాటం.. గచ్చిబౌలి: జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వరకు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఐదు యూటర్న్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ మార్గంలో 26 క్రాసింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. అవన్నీ ఇరుకుగా మారడంతో సిటీజనులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ రూట్లో ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో పార్కింగ్ సమస్యలతో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర కిలోమీటర్ నడవాల్సిందే.. సనత్‌నగర్/అమీర్‌పేట: అమీర్‌పేట్–ప్యారడైజ్ వరకు ఆరు యూటర్న్లు, అమీర్‌పేట్–ఎర్రగడ్డ వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ఒక్కో యూటర్న్‌కు అరకిలోమీటరు పైగానే దూరం ఉంది. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దూరం నడవలేక డివైడర్లు ఎక్కి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ♦ ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, ఈఎస్ఐ మెట్రో స్టేషన్లకు దూరంలో యూటర్న్లు ఉండడంతో ప్రయాణికులు ఆటోకు రూ.50 చెల్లించి రోడ్డు దాటాల్సి వస్తోంది. ♦ యూటర్న్ల వద్ద లైటింగ్, రేడియం స్టిక్కర్లతో ఇండికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ♦ అమీర్‌పేట్–సికింద్రాబాద్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలే ఉంటాయి. ఈ మార్గం మొత్తం డివైడర్లు ఏర్పాటు చేయడంతో అటు.. ఇటు వెళ్లే దారిలేక షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక్కడ కాస్త బెటర్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ – ప్యారడైజ్ – రసూల్‌పురా మార్గంలో పరిస్థితి కొంచెం బెటర్‌గా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ వరకు మినహా మిగతా మార్గంలో డివైడర్ల సమస్య లేదు. ♦ ఈ మార్గంలో ప్యాట్నీ, ప్యారడైజ్ ఫ్లైఓవర్లకు సమాంతరంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వెంబడి మెట్రో లైన్ ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే రోడ్డు దాటేందుకు పాదచారులకు కొత్తగా ఇబ్బందులేవీ లేవు. ♦ ఇక పరేడ్‌గ్రౌండ్స్ – సికింద్రాబాద్ ఈస్ట్ మార్గంలో పెద్దగా కమర్షియల్ జోన్ లేనందున వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేవు. ♦ ప్యారడైజ్ – రసూల్‌పురా స్టేషన్ల మధ్య దగ్గర్లోనే యూటర్న్ ఉంది. వ్యాపారం తగ్గింది.. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం బాగా తగ్గింది. సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు ఏర్పాటు చేయడంతో.. అంత దూరం వెళ్లలేక కస్టమర్లు షాపులకు రావడం లేదు. డివైడర్ల ఎత్తు తగ్గించి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలు కల్పించాలి. అమీర్‌పేట్ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసినా పాదచారులను అనుమతించడం లేదు. – గులాబ్‌సింగ్, వ్యాపారవేత్త, అమీర్‌పేట్ సౌకర్యాలేవీ? మెట్రో మార్గాల్లో రోడ్డు దాటాలంటే నరకమే.! అసలు రోడ్డు దాటేందుకు వీలుగా దారి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా దూరంగా యూటర్న్ ఉన్నాయి. ఇక జిబ్రాక్రాసింగ్లే లేవు. పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలి. – మంకయ్య, బల్కంపేట -
క్యాన్సర్‌పై క్విస్ విద్యార్థుల అవగాహన
ఒంగోలు : క్విస్ ఫార్మసీ విద్యార్థులు నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్‌పై ఆదివారం అవగాహన కల్పించారు. బ్లడ్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలపై ప్రజలను చైతన్యపరిచారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుందని, క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో వివరిస్తూ లక్షణాలను తెలియజేశారు. కార్యక్రమాన్ని క్విస్ ఫార్మశీ కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఫార్మశీ ప్రాక్టీసు విభాగం అధికారి డాక్టర్ జి.పిచ్చయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ద్యార్థులను క్విస్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిడమానూరి సూర్య కళ్యాణ చక్రవర్తి, క్విస్ విద్యాసంస్థల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావులు అభినందించారు. -
వాకర్స్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి
విజయవాడ: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాకర్స్‌పై ఓ ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని పెడనలో ఆదివారం ఉదయం మచిలీపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
వ్యక్తి పరిస్థితి విషమం వెల్దుర్తి రూరల్ : కర్నూలు - బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున పాదచారులపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. డోన్ నుంచి వెల్దుర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో మాదార్పురంలోకి వెళ్లి హైవేపైకి చేరుతున్న సమయంలో హైవేపై వాకింగ్ చేస్తున్న వెల్దుర్తికి చెందిన మంగళి నాగరాజు (అగ్రిగోల్డ్ ఏజెంట్), సప్లయర్స్ చంద్రపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగరాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్నింగ్ వాకర్సే టార్గెట్
విశాఖపట్నం: ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్ననలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖజిల్లా మహారాణిపేట పోలీసులు సోమవారం అల్లీపురం వాసన్ ఐకేర్ ఆసుపత్రి వద్ద యువకులను పట్టుకున్నారు. వారి నుంచి 240 గ్రాముల బంగారం, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు మహారాణిపేటకు చెందిన స్ధానిక యువకులు. వీరిపై పలు నేరాల్లో13 కేసులు ఉన్నాయి. -
ఇక మనకాళ్లు వాటంతటవే నడుస్తాయ్!
లండన్: వచ్చీపోయే వాహనాలతో బిజీ..బిజీగా ఉండే రోడ్డులో మెదడుతో పనిలేకుండా, ఎలాంటి ప్రమాదం జరుగకుండా మన కాళ్లే మనల్ని రోడ్డు దాటిస్తే...రోడ్డులోనో, పార్కులోనో ఎటూ చూడకుండా మనకిష్టమైన పుస్తకాన్ని చదుకుతుంటే మనం చేరాల్సిన చోటుకు మనకాళ్లే మనల్ని చేరిస్తే...కొత్త ప్రదేశాల్లో వెళ్లాల్సిన చోటు గురించి నలుగురిని వాకబు చేయాల్సిన అవసరం లేకుండానే మనకాళ్లే మనల్ని అటువైపు నడిపిస్తే...ఆ థ్రిల్లే వేరు. ఇది కలలో తప్పితే నిజంగా సాధ్యమయ్యేపని కాదు. కాని సాధ్యమని నిరూపించారు జర్మనీలోని హన్నోయర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మెదడుతో పనిలేకుండా గమ్యానికి మనకాళ్లను తీసుకెళ్లే ‘హ్యూమన్ శాట్నావ్’ (మానవ శాటిలైట్ నావిగేషన్) పరికరాన్ని వారు కనుగొన్నారు. వారు ఇటీవలనే స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యార్థులపై ప్రయోగించి దాని పనితీరును ప్రత్యక్షంగా ప్రయోగించి చూపారు. ఈ తరహా పరికరాన్ని వారు సృష్టించడం ఇదే మొదటి సారి. హ్యూమన్ శాట్నావ్ను మనం నడుముకు అమరుస్తారు. దాని నుంచి ఎలక్ట్రిక్ తరంగాలను తీసుకెళ్లే వైర్లను రెండు కాళ్లకు మోకాలు కింది భాగాన, పైభాగాన తొడపై అమరుస్తారు. సంకోచ, వ్యాకోచాలు కలిగి, మన నడకకు ఉపయోగపడే సార్టోరియస్ కండరాన్ని విద్యుత్ తరంగాలతో ప్రేరిపిస్తారు. అంతే మనకు తెలియకుండానే మనం నడిచేస్తాం. ప్రస్తుతం బ్లూటూత్ ద్వారా పనిచేస్తున్న ఈ పరికరానికి జీపీఎస్ వ్యవస్థను అనుసంధాలించాలని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పుడు ముందే ప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మన గమ్యానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం శాటిశైట్తో అనుసంధానించిన నావిగేషన్ యాప్ ద్వారా మనం వెళ్లాల్సిన చోటుకు వెళుతున్నాం గదా! ఇక నావిగేషన్ పరికరాన్ని తరచూ చూడాల్సిన అవసరం లేకుండా అలాంటి వ్యవస్థను మన కాళ్లకు హ్యూమన్ శాటినావ్ ద్వారా తగిలించుకోవడం ఈ కొత్త ప్రయోగం. ఈ కొత్త పరికరం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అల్జీమర్స్ లాంటి మతిమరుపు జబ్బు ఉన్నవాళ్లుకు ప్రోగ్రామ్ చేసిన హ్యూమన్ శాట్నావ్ను అమర్చినట్లయితే వారు ఇంటి నుంచి వెళ్లాల్సిన చోటుకెళ్లి మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగొస్తారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో అగ్నిమాపక అధికారులను కూడా ఈ పరికరం సరిగ్గా గైడ్ చేస్తుందట. క్రీడారంగంలో ఈ పరికరం మరింత ఉపయోగపడుతుందని, కోచ్ ప్రోగ్రామ్ చేసి ఈ పరికరాన్ని అథ్లెట్లకు వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా పరిసరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రేమికులు ఎక్కడున్నా ఒకరికొకరు కలుసుకోవచ్చని అంటున్నారు. ఈ పరికరం నుంచి వెలువడే విద్యుత్ తరంగాల వల్ల ప్రతికూల ప్రభావం ఉండదని, కనీసం నొప్పి కూడా కలగదని వారు చెప్పారు. ఈ పరికరాన్ని అమర్చుకొని నడిచిన కొంత మంది విద్యార్థులు మాత్రం తొడ కండరాల వద్ద కొంచెం ‘వేళ్లతో చక్కిలిగింతలు’ పెట్టిన అనుభూతి కలిగిందని తెలిపారు. చూసుకోకుండా నడిస్తే ప్రమాదాలు జరగవా అని ఆ విద్యార్థులు ప్రశ్నించగా, అడ్డుతగిలే వస్తువులను గుర్తించి అందుకు తగినట్లుగా కాళ్ల కండరాలకు సిగ్నల్స్ ఇచ్చే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందని పరిశోధకులు వివరించారు. -
కెబిఆర్ పార్క్‌లో వాకర్స్ భద్రత ఏంత?