వాకర్స్‌కు అవగాహన కల్పిస్తున్న క్విస్ విద్యార్థులు
ఒంగోలు : క్విస్ ఫార్మసీ విద్యార్థులు నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్‌పై ఆదివారం అవగాహన కల్పించారు. బ్లడ్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలపై ప్రజలను చైతన్యపరిచారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుందని, క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో వివరిస్తూ లక్షణాలను తెలియజేశారు. కార్యక్రమాన్ని క్విస్ ఫార్మశీ కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఫార్మశీ ప్రాక్టీసు విభాగం అధికారి డాక్టర్ జి.పిచ్చయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ద్యార్థులను క్విస్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిడమానూరి సూర్య కళ్యాణ చక్రవర్తి, క్విస్ విద్యాసంస్థల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment