వాకర్స్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి
విజయవాడ: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాకర్స్‌పై ఓ ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని పెడనలో ఆదివారం ఉదయం మచిలీపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.