పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
Published Tue, Dec 6 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
వ్యక్తి పరిస్థితి విషమం
వెల్దుర్తి రూరల్ : కర్నూలు - బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున పాదచారులపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. డోన్ నుంచి వెల్దుర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో మాదార్‌పురంలోకి వెళ్లి హైవేపైకి చేరుతున్న సమయంలో హైవేపై వాకింగ్ చేస్తున్న వెల్దుర్తికి చెందిన మంగళి నాగరాజు (అగ్రిగోల్డ్ ఏజెంట్), సప్లయర్స్ చంద్రపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగరాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement