మణికొండ: హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని పంచేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఆదివారం వరల్డ్ స్పారో డే సందర్భంగా బర్డ్ వాక్‌ను నిర్వహించారు. దాంతో తరలివచ్చిన పక్షి ప్రేమికులు వాటిని వీక్షించటంతో పాటు ఫొటోలను తీసుకున్నారు. మొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీఎస్‌టీడీసీ, ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.స్కైలాబ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కును.. ఎంతో ఆకర్షణీయంగా, పక్షుల ఆవాసానికి అనువుగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పార్కును వీక్షించేందుకు వచ్చే వారికి ట్రెక్కింగ్ రూట్స్, వాకింగ్‌పాత్, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్‌జిమ్ లాంటి సౌకర్యాలను కల్పిం చామన్నారు.
వైస్ చైర్మెన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ప్రతి పార్కులో పక్షులు, జంతువులకు ఆవాసంగా తీర్చిదిద్దటంతో పాటు విజిటర్స్‌కు అనుగుణంగా అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో బాగా నీడను ఇచ్చే మొక్కలనే ఎక్కువగా నాటామన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్‌డీసీ, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కె. సుమన్, రేంజ్ అధికారులు లక్ష్మారెడ్డి, మధు, సూపర్‌వైజర్లు శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ కల్యాణ్, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 రకాల పక్షులను వాకర్స్ గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment