eco tourism
-
అడవిలో ఆతిథ్యం
సాక్షి, అమరావతి: దట్టమైన అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెట్లపై ఆవాసాలు... వాటిలో కూర్చుని పక్షుల కిలకిలా రావాలు వింటూ.... స్వచ్ఛమైన గాలి పీలుస్తూ... ఒక కప్పు కమ్మటి కాఫీ తాగితే ఎలా ఉంటుంది... ఒక్కసారి ఊహించుకుంటేనే మనసు పరవశించిపోతుంది కదా...! కచ్ఛితంగా అటువంటి అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు... ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అడవినే నమ్ముకున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు రెండేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘అడవిలో ఆతిథ్యం’ పేరిట ఒక గొప్ప ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రూ.5.50కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘కూటమి’ గ్రహణం పట్టింది. సాంకేతిక సమస్య సాకుతో గత మూడు నెలలుగా పనులు నిలిపివేసింది. విశాఖ–అరకు రహదారి చెంతనే ‘అడవిలో ఆతిథ్యం’ విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో చెంతనే అనంతగిరి మండలం మర్ధగుడ గ్రామానికి సమీపంలోని అడవిలో ఆతిథ్యం ఇచ్చేలా గత ప్రభుత్వం 2022లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింహాద్రి ఎన్టీపీసీ సహకారం అందిస్తోంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఆర్అండ్బీ శాఖకు పనులు అప్పగించారు. కాఫీ తోటల మధ్య కాఫీ తాగేలా రూ.80 లక్షలతో కాఫీ హౌస్, రోడ్డు, మంచినీటి ట్యాంక్ నిర్మాణం పూర్తిచేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు వచ్చాక సాంకేతిక కారణాల పేరుతో మిగిలిన పనులు నిలిపివేశారు. ఇంకా రూ.4.70కోట్లతో పర్యాటకుల కోసం రెస్టారెంట్, కిచెన్, 16 కాటేజీలు, రిసెప్షన్, ఫర్నిచర్, విద్యుత్ కనెక్షన్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టేట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా మళ్లీ డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ విశేషాలు ఇవీ.. » ప్రకృతితో మమేకమయ్యే పర్యాటకులకు ‘జీవ వైవిధ్యం’ గురించి అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేక స్టడీ సెంటర్, సీతాకోక చిలుకల పార్క్, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని కార్యాచరణ చేపట్టింది. » చెట్లపైనే హట్స్(నివాసాలు) వేసి వాటిలోనే పర్యాటకులు బస చేసేలా ఏర్పాటు చేయడం ద్వారా వారికి గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను రూపొందించారు. » ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, ఆదాయాన్ని మర్ధగుడ వన సంరక్షణ సమితి(వీఎస్ఎస్)లో 80 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. » ఏజెన్సీలో లభించే పనస, చింతపండు తదితర అటవీ ఫల సాయంతోపాటు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయించేలా ప్రతిపాదించారు. కూటమి సర్కారు స్పందించి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
కొండెక్కిన కొల్లేరు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు. అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలుకొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళికజిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పక్షులపై కానరాని ప్రేమకొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. వలస పక్షుల సందడి షురూకొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి. ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. -
తుది దశకు ‘ఎకో టూరిజం’
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యంతో అలరారుతున్న తెలంగాణను ‘ఎకో టూరిజం సెంటర్’గా మలిచేలా కార్యాచరణ ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పర్యావరణ హితంగా, ప్రకృతి, సహజ సంపదకు హాని కలగకుండా చూస్తూనే, ప్రజలు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పలు గ్రామాలను ‘ఎకో విలేజ్ లుగా’తీర్చిదిద్దడంతోపాటు వారసత్వ, సాంస్కృతిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వంటకాలు, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను భాగం చేస్తూ ప్రకృతి పర్యాటకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎకో టూరిజం స్పాట్లను గుర్తించి, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకతలను అర్థవంతంగా చెప్పడంతోపాటు ఆన్లైన్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా వెబ్సైట్లు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా తెలంగాణ ఎకో టూరిజానికి ఓ బ్రాండ్‌గా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ఇతర ప్రదేశాల్లోనూ ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఎకో టూరిజం ప్రదేశాలను స్టడీ టూర్ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ఉద్యాన వనాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిపై ఆధారపడి జీవించే వారికి వీటిని ఉపాధి కేంద్రాలుగా మలిచే దిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎకో టూరిజం ప్రాజెక్టులపై అటవీశాఖాపరంగా ముసాయిదా విధానం సిద్ధం కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలన తర్వాత ప్రభుత్వపరంగా ఈ ప్రణాళికకు తుదిరూపు ఇస్తారు. ఈ మేరకు ఇటీవల ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఫైనల్ డ్రాఫ్ట్‌నకు ఆమోదం తెలిపారు. తుది అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషనే నోడల్ ఏజెన్సీ ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేస్తారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఇతర నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్), ఇతర నిధులను సమీకరించాలని అటవీశాఖ భావిస్తోంది. మొత్తంగా ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో ప్రభుత్వపరంగా అటవీశాఖ ద్వారానే నిర్వహించకుండా, ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీలకు ఇస్తే మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అటవీశాఖ పరంగా ఆయా అంశాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రకృతి సమతుల్యతకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టడమనేది కొంత కత్తిమీద సాము లాంటిదేనని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఎకో టూరిజం పేరుతో అటవీ ప్రాంతాల్లోని జీవజాలం, వైవిధ్యానికి ఇబ్బందికరంగా మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. -
మెట్లబావుల పునరుద్ధరణకు భారత్ బయోటెక్ సాయం!
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్‌ల సమక్షంలో భారత్ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్ జంగ్ సంగ్రహాలయంలోనిది కుతుబ్ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు. ఢిల్లీలోని అగ్రసేన్ కి బౌలీ, అహ్మదాబాద్‌లోని రాణీ కి వావ్‌లు యునెస్కో గుర్తింపు పొందాయని, చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
ఎకో ఊటీ.. నీలగిరి సౌందర్యం
ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్‌లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్ అవలాంచె చెక్‌పోస్ట్ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్ వ్యూ పాయింట్. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్ ట్రిప్ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్‌పోస్టు దగ్గర దింపుతారు.పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్ భవానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది. గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్ జోన్లోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్‌పోస్ట్ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్ డిపార్ట్మెంట్ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్‌కి గుర్తుగానూ ఉంటుంది.∙ -
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎకో టూరిజం ప్రాజెక్టులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఫోకస్
-
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
చూడదగిన ప్రదేశాలు
ప్రకృతి శోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు.. ప్రాచీన ఆలయాలు, శిల్పకళకు అద్దంపట్టే దేవాలయాలు, తిరుమల గిరులను పోలిన పర్వత శ్రేణులు.. అడుగడుగునా కనిపించే అలనాటి రాజమందిరాలు.. ఇలా ఎన్నెన్నో విశిష్టతలతో నిండిన ప్రాంతాలు పర్యాటక శోభితం కానున్నాయి. అవే ఉదయగిరి నియోజకవర్గంలోని సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలు. వీటిని అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, రాయలు ఏలిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు రతనాలు రాసులు పోసి అమ్మారని ప్రతీతి. రెండు శతాబ్దాలకు పూర్వం వరకు కూడా మహోన్నతంగా ఒక వెలుగు వెలిగిన ఉదయగిరి ప్రాంతం అనంతరం తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా మొండి గోడలు, శిథిల రాజభవనాలు నేటికీ ఈ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వంద కి.మీ. దూరంలో నీటి ఆధారం లేని మెట్టప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక శోభతో పరిఢవిల్లనుంది. తొలి సూర్యకిరణాలు పడే గిరి సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉదయగిరి కోట ఉంది. ఈ కోటపై 20 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ. వ్యాసార్థంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఈ కొండ(గిరి)పైనే పడతాయి. విజయనగర సామ్రాజ్యంలో సూర్యకిరణాలు ఒక్క కొండ కోటపైనే ముందుగా పడుతుండడంతో దీనికి ఉదయగిరిగా నామకరణం చేశారని పెద్దలు చెబుతుంటారు. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం గల ఉదయగిరి దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలుగా ఇక్కడే మకాంవేసి పాలన సాగించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అభివృద్ధిని మరిచిన గత పాలకులు ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీనిపై గత ఐదు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన గత పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్నికల వేళ హామీలు గుప్పించిన పారీ్టలు అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీలు మరిచిపోయాయి. దీంతో పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధి కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎంతో ప్రాశస్త్యం ఉన్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు, ఆ రెండు ప్రాంతాల్లో పర్యాటకులకు వసతులు కలి్పంచేందుకు అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్కులు, తాగునీటి వసతులు, రిఫ్రెష్ గదులు, గార్డెన్స్, జిమ్‌లు, పిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతిని వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా.. 45 రకాల పనులకు ఒక్కొక్క ప్రాంతంలో వసతులు కలి్పంచేందుకు రూ.2.78. కోట్ల వంతున అంచనాలతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి ఉదయగిరిని 1512లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు. గజపతులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణి మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేర్లు, సొరంగమార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ దర్శనమిస్తున్నాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాయిలో తవి్వన బావి తానాబావిగా ప్రసిద్ధి. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిర్మించిన ప్రార్థనా మందిరం, తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ. దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన శైవక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం ఉంది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను కూడా అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ. దూరంలో పల్లవులు అద్భుత శిల్పాకళా నైపుణ్యంతో ఒకే రాతిలో చెక్కిన దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాల నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అక్కడి నుంచి మరో 24 కి.మీ. ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం, మరో 10 కి.మీ. దూరంలో హనుముని కొండ, మరో 25 కి.మీ. దూరంలో వెంగమాంబ ఆలయాన్ని సందర్శించవచ్చు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన మేకపాటి ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్రం నుంచి కూడా మరికొంత నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి దోహదపడాలని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయగిరి దుర్గానికి వెళ్లేందుకు రోప్ వేతోపాటు ఉదయగిరిలో ఉన్న ప్రాచీన దేవాలయాలను జీవనోద్ధరణ చేసేలా ప్రతిపాదనలు అందజేశారు. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సుమారు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. త్వరలో నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రాయలు ఏలిన నేల కావడంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. – చంద్రశేఖర్, డీఎఫ్ఓ, నెల్లూరు -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో వరల్డ్ స్పారో డే
మణికొండ: హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని పంచేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఆదివారం వరల్డ్ స్పారో డే సందర్భంగా బర్డ్ వాక్‌ను నిర్వహించారు. దాంతో తరలివచ్చిన పక్షి ప్రేమికులు వాటిని వీక్షించటంతో పాటు ఫొటోలను తీసుకున్నారు. మొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీఎస్‌టీడీసీ, ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.స్కైలాబ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కును.. ఎంతో ఆకర్షణీయంగా, పక్షుల ఆవాసానికి అనువుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పార్కును వీక్షించేందుకు వచ్చే వారికి ట్రెక్కింగ్ రూట్స్, వాకింగ్పాత్, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్‌జిమ్ లాంటి సౌకర్యాలను కల్పిం చామన్నారు. వైస్ చైర్మెన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ప్రతి పార్కులో పక్షులు, జంతువులకు ఆవాసంగా తీర్చిదిద్దటంతో పాటు విజిటర్స్‌కు అనుగుణంగా అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో బాగా నీడను ఇచ్చే మొక్కలనే ఎక్కువగా నాటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కె. సుమన్, రేంజ్ అధికారులు లక్ష్మారెడ్డి, మధు, సూపర్వైజర్లు శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ కల్యాణ్, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 రకాల పక్షులను వాకర్స్ గుర్తించారు. -
Warangal: అందుబాటులోకి ఎకో టూరిజం.. చుట్టేద్దాం రండి!
బిజీ లైఫ్‌లో కాస్త ఊరట కోసం.. ఒత్తిడితో కూడిన జీవన విధానంలో కొంత మార్పుకోసం.. మానవ జీవితంతో ముడిపడిన అద్భుతమే ప్రక్రియ పర్యాటకం. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ప్రదేశాల వీక్షణకు ప్రస్తుతం మరోసారి అవకాశం లభించనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎకో టూరిజానికి కరోనా తర్వాత తిరిగి అనుమతి లభించడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. సాక్షి, వరంగల్: కరోనా కారణంగా నిలిచిన ఎకో టూరిజం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. గత రెండేళ్ల క్రితం ఏటూరునాగారం అభయారణ్యం తాడ్వాయిలో పర్యాటకుల ఆనందం కోసం ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆన్లైన్ ద్వారా ఈ ఎకో టూరిజం కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సైకిల్ ట్రాకింగ్, చిల్ర్డన్ ప్లే ఏరియా, వాక్ కెనాపిను వన కుటీరం ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నుంచి కరోనా కారణంగా ఎకో టూరిజం నిలిచిపోయింది. మళ్లీ ఎకో టూరిజం ఆన్లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ వారంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఎకో టూరిజం అందుబాటులోకి రానుంది. చిల్ర్డన్స్ ప్లే ఏరియా తెరుచుకోనున్న అధ్యయన కేంద్రం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ గురించి తెలిపేలా.. పర్యావరణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో ఉండే పక్షలు, అటవీ జంతువుల, చెట్లు బొమ్మలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. వాక్ కెనాపీని మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రెకింగ్ సైకిళ్లు మరమ్మతులకు రావడంతో కొత్త సైకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వన కుటీరాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. పర్యావరణ అధ్యయన కేంద్రం కొత్త సఫారి పర్యాటకులు అడవుల్లో నేరుగా పర్యటించేందుకు కొత్తగా సఫారీ ఏర్పాటు చేయనున్నారు. తాడ్వాయి ఆర్చి నుంచి గ్రాస్ ప్లాంట్ దారి గుండా హైవే రోడ్డు అడవిలో నుంచి మేడారం మార్గంలోకి.. తాడ్వాయి సమీపంలోని సారలమ్మ గుడి నుంచి కామారం సమీపాన రాక్షస గుహలను సందర్శించి, అక్కడి నుంచి చిన్నబోయినపల్లి నుంచి కొండాయి మీదుగా కొండేటి వాచ్‌టవర్ వ్యూ పాయింట్ వరకు అటవీ మార్గాన పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు చేస్తున్నాం ఎకో టూరిజం ఆన్లైన్ సేవలకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాడ్వాయి వన కుటీరాల నుంచి ఆరు కిలోమీటర్లు అడవి మార్గం గుండా పర్యాటకులు సైకిల్ ట్రాకింగ్ నిర్వహించేలా ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ వారంలో ఎకో టూరిజం సేవలను ప్రారంభిస్తాం. – చౌకాట్ హుసేన్, వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి బొగత వద్ద ట్రెక్కింగ్.. ములుగు జిల్లా వాజేడు మండల మరిధిలోని బొగత జలపాతం వద్ద కొత్తగా ఏర్పాట్లను చేపట్టనున్నారు. కరోనా కాలంలో బొగత జలపాతం పర్యాటకుల సందడి లేక వెల వెల బోయింది. ఎకో టూరిజం కూడా దూరంగా ఉండటంతో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గింది. మళ్లీ ఎకో టూరిజానికి పర్యాటక శాఖ ఉత్తర్వులతో జలపాతం వద్ద కొత్త హంగులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 2 కిలో మీటర్ల వరకు ట్రెక్కింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రహదారి సౌకర్యం లేకుండాపోయింది. దానిని అభివృద్ధి చేయడానికి ఉన్నతాధికారుల అనుమతులకు నివేదికలను పంపగా అనుమతులు వచ్చాయి. సైక్లింగ్ ప్రారంభిస్తున్న అటవీ శాఖ అధికారులు కొత్తగా 1.50 కిలో మీటర్ల పరిధిలో సఫారీ ట్రావెలింగ్కు అనుమతులను కోరగా ఆమోదం లభించింది. వీటిని త్వరలోనే అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, గతంలో ఉన్న సైక్లింగ్ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో దానిని మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జిఫ్ లైన్ సైతం దెబ్బ తిన్నప్పటికీ దానిని మరమ్మతులు చేసి పర్యాటకుల ఉత్సాహ పర్చడానికి వీలుగా అందించనున్నారు. బొగత వద్ద ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలను చేపడుతున్నారు. లక్నవరం గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరి ధిలోని లక్నవరం సరస్సు సందర్శనకు పర్యాటక శాఖ అనుమతి లభించింది. కరోనా కాలంలో ఆపేసిన పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కాజేట్లో ఉండేందుకు కరోనా కాలంలో అనుమతి నిరాకరించిన అధి కారులు ప్రస్తుతం అనుమతిస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జింకల పార్క్ తిరిగి ప్రా రంభించారు. సస్పెన్షన్ బ్రిడ్డిల నుంచి తూముల వరకు సైక్లింగ్, సమీపంలోని గుట్టలపై ట్రెక్కింగ్‌కు ఒక్కరికి రూ.100చొప్పున ప్రారంభించా రు. మరో పది రోజుల్లో నైట్ క్యాంపింగ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్నవరం ప్రాంతంలో వండర్ లా ను తలపించే విధంగా స్విమింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అటవీ శాఖ డివిజన్ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు నెలకొల్పాలని సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెరగాలి రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఇంధనశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్‌ను సబ్సిడీపై అందిస్తున్నాం, జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉందనే వివరాలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
ఝార్ఖండ్ సీఎం హేమంత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు ఆనంద్ మహీంద్రా సలహా.. అదేంటంటే?
Anand Mahindra: సోషల్ మీడియా వేదికగా వింతలు విశేషాలను పంచుకునే ఆనంద్ మహీంద్రా ఈసారి మరో కొత్త విషయంతో మన ముందుకు వచ్చారు. ఆ ప్రదేశం విశేషాలను చెబుతూనే తనలోని వ్యాపారిని తెర మీదకు తీసుకుచ్చారు. ఆ ప్రదేశాన్ని ఎలా అభివృద్ధి చేయోచ్చనే విషయాన్ని తెలిపారు. భూమండలంపై తొలి బీచ్ ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అనేక పరిశోధనల తర్వాత ఈ భూమండలం మొత్తం మీద తొలిసారిగా బీచ్‌గా మారిన ప్రాంతాన్ని కనుగొన్నామని ప్రకటించారు. ఈ ప్రదేశం ఇండియాలోని ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సింఘ్‌భూమ్ ప్రాంతంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒకప్పుడు భూమండలం అంతా సముద్రం వ్యాపించి ఉండేంది. ఆ తర్వాత కాలక్రమేనా టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు, భూఅంతర్భాగంలో పేలుడు తదితర చర్యల కారణంగా సముద్రం ఉపరితలం మీదకు తొలిసారిగా బయటకు వచ్చిన ప్రదేశంగా ఝార్ఖండ్ రాష్ట్రంలో సింఘ్భూమ్ని పేర్కొన్నారు. ఈ చర్య 3.2 బిలియన్ ఏళ్ల కిందట జరిగిందని అంటున్నారు. ఓ రకంగా భూమిపై తొలి బీచ్‌గా ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా తేల్చారు. అయితే ప్రస్తుతం ఝార్ఖండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్‌గా ఉంది. ఓ రకంగా భూగోళంపై జరిగిన అద్భుత ఘట్టాలకు నేటికి సింఘ్‌భూమ్ మౌన సాక్షిగా నిలిచి ఉంది. ఏకోటూరిజం సింఘ్భూమ్కి సంబంధించిన విశేషాలు ఇటీవల ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ ఈ ప్రదేశాన్ని టూరిస్టులను ఆకర్షించే ఆయస్కాంతంలాగా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచలోనే తొలి బీచ్ దగ్గరికి వెళ్లాలనే గోల్ లేని వారిని కూడా ఇక్కడికి రప్పించవచ్చు. స్థానికంగా ఉన్న గిరిజనుల సంస్కృతి జీవితాలకు ఇబ్బంది రాకుండా ఏకోటూరిజంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలను ట్యాగ్ చేశారు. I see an opportunity here to develop a magnet for global tourists. Who would not put the ‘world’s first ever beach’ on their travel bucket list? However the rights of tribal societies should not be trampled on & eco-tourism should be the goal. @HemantSorenJMM @kishanreddybjp https://t.co/5fHkUxZfkk — anand mahindra (@anandmahindra) November 24, 2021 చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా -
ఆ కాసేపు.. అడవి పుత్రులుగా..
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై .. నునులేత రెమ్మనై .. ఈ అడవీ సాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని తన కృష్ణపక్షం తొలి కవితగా రాసుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది నల్లమల. ఈ అభయా రణ్య విహారం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. పచ్చని ప్రకృతి సోయగాలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, నింగిని తాకుతున్న మహావృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులను చూస్తూ సాగే జంగిల్ సఫారీ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, ప్రకాశం జిల్లా పెదదోర్నాల సమీపంలోని తుమ్మలబయలు క్యాంపుల్లో ఏకో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. పలువురు పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తున్నది. కొండల్లో..కోనల్లో.. ఎకో టూరిజంలో భాగంగా ఆరుగురు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లో గంటన్నర పాటు జంగిల్ సఫారీ సాగుతుంది. స్థానిక చెంచుజాతి యువత గైడులుగా జంగిల్ క్యాంప్, ప్రకృతి వీక్షణం, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్‌ఫ్లై వాకింగ్, హెరిటేజ్ వాక్, సిద్ధాపురం ట్యాంక్ వాక్.. అటవీ అందాలను పరిచయం చేస్తుంది. ఆదిమ గిరిజన జాతి ‘చెంచులు’ సంప్రదాయ విలువిద్య సాధన యువతలో సరదాను నింపుతోంది. మూడు క్యాంపుల్లో.. ► పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని గోర్లెస్ కాలువ నుంచి లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తుమ్మలబయలు సఫారీ ఉంటుంది. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సుమారు 13కిలో మీటర్ల ప్రయాణం 1.30 గంటల పాటు ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సఫారీకి అనుమతిస్తారు. ► మహానంది సమీపంలోని పచ్చర్ల గిరిజన గ్రామం నుంచి సుమారు 10 కిలో మీటర్ల జంగిల్ ట్రాక్ ఉంది. దాదాపు గంటర్నరకుపైగా సాగే సఫారీలో సూర్యుడు కంటికి కనిపించనంతగా ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన చెట్ల కింద ప్రయాణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ సందర్శకులు బస చేసేందుకు రెండు కాటేజీలు, నాలుగు టెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. ► ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గిరిజన గ్రామంలో 10 కిలో మీటర్ల సఫారీ ట్రాక్ ఉంది. ఈ గ్రామం నుంచి మూడు కిలో మీటర్లు దూరం వెళ్తే టైగర్ జోన్ ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, డార్మెట్రీలు అందుబాటులో ఉన్నాయి. ► సఫారీకి ఆరు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్లను వినియోగిస్తున్నారు. ఒక రైడ్‌కి రూ.800 (ఒక వ్యక్తికి రూ.150) వసూలు చేస్తున్నారు. ఇక కాటేజీలు, టెంట్లకు రూ.5వేల నుంచి రూ.4వేల వరకు ధర ఉంది. ఇందులోనే భోజన సదుపాయం, సఫారీ కూడా కలిపి ఉంటుంది. జీవ వైవిద్యానికి నిలయం.. తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష, జంతుజాలానికి నిలయంగా ఉంది. పులులు, మచ్చల జింకలు, ఇండియన్ బస్టర్డ్స్, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులతో పాటు దాదాపు 70 రకాల క్షీరదాలు, 300 రకాల పక్షులు, 100 రకాల సీతాకోక చిలుకల ఆవాసాలున్నాయి. గ్రే హార్న్‌బిల్ (పొడవాటి ముక్కు పక్షి), డ్రోంగో, కోయెల్, ఇండియన్ రోలర్, ప్యారడైజ్ ఫ్లై చోచర్, బ్లాక్ హెడ్ ఓరియోల్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, పర్పుల్ సన్‌బర్డ్ జాతులు కనువిం దు చేస్తాయి. వీటిని చూడటానికి సందర్శకులు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగా ప్రకృతి నడకకు వెళ్తారు. అడవుల పరిరక్షణ, స్థానిక తెగల జీవన ప్రమాణాల పెంపు, అటవీ సంపదను రక్షించుకోవడంపై పర్యాటకులకు అవగాహన కల్పనలో భాగంగా పర్యాటక, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వన్యప్రాణి వారోత్సవాలకు సిద్ధమవుతోంది. -
కరోనా ఎఫెక్ట్: ఆ రంగంపై ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వన్యప్రాణి, ప్రకృతి–పర్యావరణహిత పర్యాటకానికి (వైల్డ్‌లైఫ్, ఎకో టూరిజం) ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి కారణంగా యావత్ మానవాళి ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో భారీ కుదుపునకు లోనైంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సురక్షిత, పర్యావరణహిత, జీవవైవిధ్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనే కుతూహలం పర్యాటకుల్లో అధికమైంది. ఈ నేపథ్యంలో విశాల భారత్‌లోని వైవిధ్యత, సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవులను దేశ, విదేశాల్లోని టూరిస్టులకు పరిచయం చేసి పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటిలో భాగంగా వైల్డ్‌లైఫ్, ఎకో టూరిజంకు అధిక ప్రాధాన్యతనిచ్చి కొత్త ఊపును ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణను అమలుచేస్తోంది. భారత్‌లోని అడవులు, వివిధ రకాల వన్యప్రాణులు, జంతుజాలం, ప్రత్యేకమైన వృక్షాలు, జలపాతాలు, సెలయేళ్లు, సరస్సులు, ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన వివిధ ప్రాంతాలను పర్యాటకానికి ఉపయోగించుకునేందుకు నడుం బిగించింది. దేశంలోని మొత్తం 981 రక్షిత ప్రాంతాలు, 566 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, 104 నేషనల్ పార్కులు, 214 కమ్యూనిటీ రిజర్వ్‌లు, 97 కన్జర్వేషన్ రిజర్వ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమదైన ప్రత్యేకతలతో కూడుకున్న ప్రదేశాలు, ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు, పర్యాటకంతో ముడిపడి ఉన్న శాఖలు, రంగాలు, ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లతో కలిసి కేంద్ర పర్యాటకశాఖ వినూత్న చర్యలు చేపడుతున్నట్టు ఆ శాఖ డైరెక్టర్ జనరల్, ఐటీడీసీ సీఎండీ గంజి కమలవర్ధన్‌రావు సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివిధ రాష్ట్రాలు, ఏజెన్సీలతో కేంద్రం సమన్వయం.. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, వాటిలోని పర్యాటక శాఖలు, టూరిజంతో మమేకమైన సంస్థలు, ఏజెన్సీలు, ఆపరేటర్లు, ఇతర భాగసామ్యపక్షాలను భాగంచేసి పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్‌రావు వెల్లడించారు. కేంద్రస్థాయిలో టూరిజం శాఖలోనే వివిధ కమిటీల భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వశాఖల కమిటీల్లో అటవీ, పర్యావరణ, విమానయాన, రోడ్లు, రైల్వే తదితర శాఖలు కలిసి వైల్డ్‌లైఫ్ టూరిజానికి ఊతమిచ్చే చర్యలపై దృష్టి నిలుపుతున్నామని, టూరిస్ట్‌లకు స్పెషల్ ప్యాకేజీలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అటవీశాఖల పరంగా సఫారీలు, శాంక్చురీల్లో డీఎఫ్‌వోల సహకారం, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం ద్వారా వైల్డ్‌లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇటీవల 8 ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక, సాంస్కృతికరంగాల అభివృద్ధి ప్రత్యేక సదస్సును నిర్వహించామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ–పర్యావరణశాఖలు తమ త మ టూరిస్ట్ ప్యాకేజీలు సిద్ధం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రాలతో, అటవీ, సంబంధిత శాఖలను సమన్వయపరిచే చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్‌రావు తెలిపారు. అటవీ అనుభవానికి భారత్‌ను మించింది లేదు.. ‘ప్రపంచ వైల్డ్‌లైఫ్ టూరిజం అనగానే మసైమారా, సౌతాఫ్రికా, కెన్యా తదితర దేశాలు గుర్తుకు వస్తున్నాయి. ఎక్కువ జంతువులను దగ్గర నుంచి చూసే అవకాశం, మౌలిక వసతులు, ప్యాకేజీల కారణంగా ఆ ప్రదేశాలు ఎంచుకుంటామని టూరిస్ట్‌లు చెబుతుంటారు. మనదేశం విషయానికొస్తే గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్ సింహాలకు పెట్టింది పేరు. రంతంబోర్ ఫారెస్ట్, కన్హా నేషనల్ పార్కు, తదితరాలు ప్రపంచ స్థాయిలోనూ బాగా గుర్తింపు పొందాయి. విదేశాల్లో కేవలం జంతువులు చూసి వెనక్కు తిరగాల్సి ఉంటుంది. మనదగ్గర మాత్రం అద్భుతమైన అడవి, జీవవైవిధ్యం, రకరకాల జంతువులు, పచ్చదనం, జలపాతాలు, తదితరాలను చూసే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా అడవిలోకి వెళ్లిన ఒక అరుదైన అనుభవం పొందే వీలు, ప్రత్యేకత మనదగ్గరే ఉంది. వీటన్నింటిని ఉపయోగించుకుని పర్యాటకానికి ఊపునిచ్చే దిశలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. కేవలం జంతువులు చూడాలంటే జూకు వెళితే సరిపోతుంది. అడవిని చూశామన్న అనుభూతి లభించాలంటే భారత్‌కు మించిన ప్రదేశం లేదని మేము గట్టిగా నమ్ముతున్నాం’అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కాలంలోనూ సానుకూలంశాలివే ‘కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండడంతో మనదేశంలోని వన్యప్రాణులు, వైవిధ్యభరితమైన అటవీ అందాలు, జీవవైవిధ్యం, సహజసిద్ధ ఆవాసాల్లో సింహాలు, పులులు, ఇతర రకరకాల జంతువులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విదేశాలకు స్వేచ్ఛగా వెళ్లి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దేశీయంగానూ టూరిస్ట్‌లు, ముఖ్యంగా మనదేశంలోని యువత వైల్డ్‌లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కువగా జనాలతో కిక్కిరిసిన ప్రాంతాలకు కాకుండా ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఉన్న ప్రదేశాలు, అడవుల్లోని జంతువులను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందువల్ల ఇప్పుడు లేహ్, లడాఖ్, శ్రీనగర్, గోవా, ఈశాన్య రాష్ట్రాలు తదితరాల్లో వైల్డ్‌లైఫ్ శాంక్చురీల సందర్శనకు ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా తర్వాత పర్యాటకానికి సంబంధించి ఇదొక సానుకూలాంశం’అని కమలవర్ధన్‌రావు వెల్లడించారు. చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో.. -
2020: కళలపై కరోనా కాటు
సాక్షి, కడప కల్చరల్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది జిల్లా కళా రంగంపై స్పష్టంగా కనిపించింది. జిల్లాలో అన్ని రకాల పర్యాటకానికి అనుకూలమైన ప్రదేశాలు ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సభలు, సమావేశాలపై నిషేధం ఉండడంతో కళా ప్రదర్శనలు, సాహిత్య సభలు కనిపించలేదు. ప్రజలకు ఆనందం, ఆహ్లాదం పంచాల్సిన శిల్పారామాలు, పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. లాక్డౌన్ తర్వాత రెండు నెలల్లో ఓ మోస్తరుగా పూర్వ వైభవం వైపు సాగుతున్నాయి. కరోనా భయంతో దేవుడే దిక్కని భావించిన భక్తులు దేవాలయాలు సైతం చాలా రోజులు మూసివేయడం, కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు ఉండడంతో దైవ దర్శనం కూడా చేసుకోలేక పోయారు. పర్యాటక ప్రాభవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పలు హరిత హోటళ్లు నిర్మించారు. 37 దేవాలయాలను అభివృద్ధి చేసి పర్యాటకాభివృద్ధికి కృషి చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కరోనా కష్ట సమయంలో కూడా జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇడుపులపాయ కేంద్రంగా ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ వైఎస్సార్ స్మారక పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వేంపల్లెలో అత్యాధునిక వసతులతో కొత్తగా శిల్పారామం ఏర్పాటు చేయనున్నారు. పులివెందులలోని శిల్పారామాన్ని మరింత హంగులతో ప్రజలను ఆహ్లాదపరిచేలా తీర్చిదిద్దనున్నారు. మోపూరు శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ హోటల్, పార్కు, పర్యాటకులకు వసతి కల్పన తదితర పనులు కూడా చేపట్టనున్నారు. (చదవండి: శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు) ఎకో టూరిజంలో భాగంగా సోమశిల వెనుక జలాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ‘వన విహారి’ పేరిట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఈ సంవత్సరం పర్యాటకాభివృద్ధి పుస్తకాలను ప్రచురించింది. రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కరోనా ఆటంకాలను దాటుకుని ఈ సంవత్సరంలో తొమ్మిది పర్యాటక సమావేశాలు నిర్వహించింది. ఐదు పర్యాటక అభివృద్ధి పుస్తకాలను ప్రచురించారు. బద్వేలుకు చెందిన ప్రముఖ చిత్ర, శిల్పకారుడు గొల్లపల్లి జయన్న రూపొందించిన శిల్పాలతో కడప నగరంలో రెండు రోజుల ప్రదర్శన నిర్వహించడం ఈ సంవత్సరంలో ప్రముఖ కళా ప్రదర్శనగా నిలిచింది. శాసనాలు: జిల్లాను శాసనాల ఖిల్లాగా అభివర్ణించడం న్యాయమేనని కడప నగరానికి చెందిన యువ శాసన శోధకుడు మునికుమార్ నిరూపించారు. ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సంవత్సరం మూడు శాసనాలను కనుగొన్నారు. తొండూరు, సుగమంచిపల్లెలతోపాటు మరో రెండుచోట్ల సాఫ్ట్వేర్ రంగానికి చెందిన యువకులు రెండు పురాతన శాసనాలను కనుగొన్నారు. బ్రౌన్ వైభవం: బ్రౌన్ గ్రంథాలయం రజితోత్సవ కార్యక్రమాలను వైవీయూ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ గ్రంథాలయ చరిత్రలో ప్రముఖమైనదిగా భావించిన ఈ రజితోత్సవాన్ని పలు సాహిత్య కార్యక్రమాలు, వెబ్‌నార్, నేరుగానూ పలు కళా ప్రదర్శనలను నిర్వహించారు. బ్రౌన్ జయంతి నుంచి వర్ధంతి వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రజితోత్సవ సంచిక, ఐదు సాహిత్య పుస్తకాలను ప్రచురించారు. బాలల దినోత్సవాన్ని నిర్వహించలేకపోయిన జిల్లా గ్రంథాలయాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘చదవడం మాకిష్టం’పథకంలో భాగంగా విద్యార్థులు నీతి కథల పుస్తకాలను చదివే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని జిల్లా రెడ్డి సేవా సమితి ఈ సంవత్సరం పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నగరంలో మరో ప్రముఖ కళా వేదికగా మారింది. ఫిబ్రవరిలో నెలనెల సాహిత్యం వంద కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. మెరుపులు ♦ గండికోట ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. అక్కడ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తెచ్చారు. ♦మార్చి మాసంలో గండికోటలో జరిగిన తవ్వకాల్లో ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలు కొనసాగిస్తే మరిన్ని చారిత్రక అవశేషాలు బయల్పడే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. ♦ పాతకడప చెరువు పరిసరాలను ఆధునికీకరించి ట్యాంక్‌బండ్ తరహాలో జిల్లా మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నగర పాలక సంస్థ సిద్ధమయ్యింది. ♦ కడప నగరంలోని రాజీవ్‌మార్గ్‌ను ఆహ్లాదకరమైన ట్యాంక్‌బండ్‌గా మార్చి నగర వాసులు సేద తీరేందుకు అనువుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. మరకలు ♦ కళారంగం పూర్తిగా కళ తప్పింది. కళాక్షేత్రాలు, రంగస్థలాలు కార్యక్రమాలు లేక వెలవెలబోయాయి. కళాకారులు ఆర్థికంగా చితికిపోయారు. ♦ 2021 జనవరిలో జరగాల్సిన గండికోట వారసత్వ ఉత్సవాలపై కరోనా కాటు పడనుంది. ♦ సీనియర్ రచయిత ఎన్సీ రామసుబ్బారెడ్డి, ధార్మికవేత్త, టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లాకు చెందిన కామిశెట్టి శ్రీనివాసులు, స్థానిక ఉర్దూ కవి మున్వర్ ఖాద్రి కన్నుమూశారు. ♦ ప్రముఖ రంగ స్థల కళాకారులు కేవీ శివారెడ్డి, చెక్కభజన కళాకారుడు లక్ష్మయ్య, అంధుడైన గాయకుడు, సంగీత దర్శకుడు సాంబశివుడు కన్నుమూశారు. ♦ సాహితీ కార్యక్రమాల నిర్వాహకులు, ముస్లిం మైనార్టీల్లో సాహిత్యాభిలాషకు కృషి చేసిన మస్తాన్‌వలీ, ఆకాశవాణి కడప కేంద్రం సీనియర్ వ్యాఖ్యాత మంజులాదేవి భౌతికంగా దూరమయ్యారు. -
కనువిందు చేస్తున్న విదేశీ పక్షులు
సాక్షి, సూళ్లూరుపేట: మూడు రోజులపాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్–2020 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత సూళ్లూరుపేటలో తప్పెట్లు, తాళాలు, కోలాటాలు, జానపద నృత్యాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పక్షుల పండగను ప్రారంభించారు. అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్–2020 బెలూన్ ఎగురవేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రులు వరుసగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్‌ను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక పరంగా ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పక్షుల పండగను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరావు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అటవీ శాఖ సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్, టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్‌కుమార్, చెంగాళమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కీసరలో ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్టు పార్కుకు శంకుస్థాపన
-
ఇక రాత్రిపూట పులులను చూడొచ్చు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహిత పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్క్‌ను ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తోంది. గతంలోనే గండిపేట మండలం కొత్వాల్‌గూడలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఏకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించింది. తాజాగా అదే ప్రాం తంలో నైట్ సఫారీ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీ పార్క్ అభివృద్ధి చేసిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులతో పురపాలక మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ చర్చలు జరిపా రు. సింగపూర్ నైట్ సఫారీ పార్క్ మాదిరిగా కొత్వాల్‌గూడ సఫారీ పార్క్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం, హిమాయత్‌సాగర్ సమీపంలో ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించగలుగుతుందని, హైదరాబాద్‌కు పర్యాటకంగా మంచి పేరు తీసుకొస్తుంద ని అభిప్రాయపడ్డారు. గండిపేట చెరువు అభివృద్ధికి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌రెడ్డిలతో కలసి కొత్వాల్‌గూడ ప్రాంతాన్ని సందర్శించిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేయడంలో నైట్ సఫారీ పార్క్‌కు సంబంధించిన డిజైన్లను సెప్టెంబర్‌లోపు సమర్పించాలని మంత్రి సూచించారు. నైట్ సఫారీ పార్క్ అంటే... సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో 6 అడవులను రూపొందించారు. మధ్య, మధ్యలో లైట్లుంటాయి. రాత్రి వేళల్లోనే ఈ పార్క్‌లో సందర్శకులకు అనుమతి ఉంది. ఆ వెలుతురులోనే జంతువులు కంటపడుతుం టాయి. అటు, ఇటు తిరుగుతూ అడవిలో ఉన్నట్టుగా నే ఉంటాయి. అక్కడ టాయ్‌ట్రైన్‌లో పర్యాటకులు జర్నీ చేస్తూ రాత్రి సమయాల్లో జంతువులను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నైట్ సఫారీ పార్క్‌ను పోలినట్టుగానే కొత్వాల్‌గూడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల సమయంలో సందర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండటంతో వీకెండ్లో కుటుంబసభ్యులతో పర్యాటకులు పోటెత్తే అవకాశముంటుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని వాసులకు ఆరోగ్య, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు. వాటి అభివృద్ధిలో పౌరులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలసి అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేబీఆర్ పార్కులో వాక్ వేలను రూపొందించినట్లుగా మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయలన్నారు. వీటికి అయ్యే ఖర్చులను స్వచ్ఛంద, కార్పొరేటు సంస్థల నుంచి సమీకరించుకోవాలని చెప్పారు. ఓఆర్ఆర్ వెంట ప్రతి 10 కిలో మీటర్లకు పూల మొక్కలు నాటాలని, హెరిటేజ్ రాక్స్‌ను గుర్తించి వాటి సమీప ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
సఫారీకి సై!
పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, వింతలు విశేషాలను తిలకించే అద్భుత అవకాశం పర్యాటకులకు కలుగబోతోంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. ఈ ఆదివారం ఎకో టూరిజాన్ని ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి ఏడాది దాటినా ప్రభుత్వ పెద్దల నిర్లిప్త ధోరణితో ఎప్పుడు ప్రారంబానికి నోచుకుంటుందోనన్న సంశయం కొంత కాలంగా అటు పర్యాటకులు, ఇటు అటవీశాఖాధికారుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం అనంతరం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఎకో టూరిజాన్ని ఫ్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్లు వేగవంతం.. పర్యావరణ నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పర్వతాలు, లోయలు, ఆకాశాన్ని తాకే మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇవి నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులకు కనిపించే నల్లమల సోయగాలు. పర్యాటకులను నల్లమలలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా చేపడుతున్నారు. ముఖద్వారం, టికెట్ కౌంటర్ గది, సిబ్బంది, మ్యూజియం గదులను నల్లమల అటవీ ప్రాంతంలోని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రయాణం కొనసాగేదిలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద నున్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు ఓపెన్ టాపు జిప్సీలలో ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ఈ ప్రయాణం ముగుస్తుంది, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని శీతోష్ణస్థితి ప్రాంతమైన పులిచెరువు ప్రాంతం వన్య ప్రాణులకు మంచి ఆవాసం, సహజ సిద్దంగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో వన్య ప్రాణులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశం కేవలం అటవీశాఖ అ«ధికారులకు మాత్రమే ఉండేది. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు. కానీ, ఎకో టూరిజం ఏర్పాటుతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం దక్కనుంది, సుమారు 14కిలో మీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకుల మనసును దోచనుంది. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అటవీశాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టుతో పర్యావరణ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. జంగిల్ సఫారీ వివరాలు ప్రయాణ దూరం : 17 కి.మీ సమయం : 1.30 గంటలు జిప్సీ చార్జి : రూ.800 ఒక్కొక్కరికి : రూ.150 (ఒక్కో జీప్సీలో ఆరుగురికి అనుమతి) -
ఎకో టూరిజానికి టెక్ మహేంద్ర సుముఖత
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గార మండలం కళింగపట్నం ప్రాంతంలోని రెండెకరాల స్థలంలో ఎకో – టూరిజం పార్కును ఏర్పాటు చేసేందుకు టెక్ మహేంద్ర సుముఖత వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెక్ మహేంద్ర ప్రాజెక్టు అధికారి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకో టూరిజం పార్కుకు కళింగపట్నం అనువైన ప్రాంతమని కలెక్టర్‌కు వివరించారు. ఇందుకు రెండెకరాల స్థలం అవసరముంటుందని, కళింగపట్నంలో ఉన్న టూరిజం రిసార్ట్స్ పక్కన ఉన్న స్థలం అనువుగా ఉంటుందని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాతూ పార్కుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. టెక్ మహేంద్ర ఏర్పాటు చేయబోయే పార్కులో హోటల్, రీసార్ట్స్ వంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును సందర్శించే వారికి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దర్శనీయ స్థలాలు, హస్తకళలు, జలపాతాలు, పక్షుల ఆవాస కేంద్రాలు వంటివి దర్శించేలా ప్యాకేజీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో అనేక రకాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, పురాతన గిరిజన నృత్యాలు, గ్రానైట్, దర్శనీయ స్థలాలు, ప్రముఖ దేవాలయాలు అమితంగా ఉన్నాయని, వీటన్నింటిని దర్శించేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 20న టెక్ మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన అనంతరం సమగ్రంగా చర్చించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సంయుక్త కలెక్టర్–2 పి. రజనీకాంతారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. దయానిధి, ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ప్రేమికులకు పచ్చని స్వాగతం
⇒ పర్యాటక రంగ అభివృద్ధికి ఎకో టూరిజం ⇒ కేరళ పెరియార్ టైగర్ అభయారణ్యం ఆదర్శం ⇒ పర్యావరణం, అటవీ సంరక్షణే ధ్యేయం ⇒ 20వ శతాబ్దంలో పెరిగిన ప్రాధాన్యం పర్యాటక రంగాన్ని విశేషంగా ఆకర్షించడానికి దేశంలో ఎకో టూరిజం కేంద్రాలు వెలిశాయి. యాత్రికుల సంఖ్యను పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆదివాసీలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల భాగస్వామ్యంతో వనాలు అభివృద్ధి చేయడం ఈ కేంద్రాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశాలు. 20వ శతాబ్దంలో దేశ వ్యాప్తంగా ఎకో టూరిజం ప్రాధాన్యం పెరిగింది. కేరళలోని పెరియార్ టైగర్ అభయారణ్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ స్థానికులకు జీవనోపాధి కల్పించడంతోపాటు విస్తృత అభివృద్ధి చేశారు. ఇటీవల కేరళలో రెండ్రోజులపాటు ఆరు దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎకో టూరిజంపై చర్చించారు. తెలంగాణలో ఈ తరహా విధానాన్ని అవలంబిస్తామని అటవీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం విశేషాలు మీకోసం.. -సాక్షి, స్కూల్ ఎడిషన్ తేన్మల ఎకో టూరిజం ప్రాజెక్టు.. భారతదేశంలో మొదటి పర్యావరణ ప్రాజెక్టు. ఇది కూడా కేరళ రాష్ట్రంలోని తిరుమంగళం రోడ్డులో ఉంది. సహజ ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం విలసిల్లుతోంది. ప్రకృతి ప్రియులకు, సాహస క్రీడాకారులకు కలిపి 5 విభాగాలుగా విభజించారు. కల్చర్ జోన్లో స్థానికులు దుకాణాలు నడుపుతున్నారు. మ్యూజికల్ డాన్స్ ఫౌంటేన్ ఉంది. సాహస క్రీడల జోన్లో పాత్‌వేస్ వివిధ రకాల క్రీడలకు సంబంధించిన అంశాలుంటాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు తెరిచి ఉంచుతారు. లేళ్ల పార్కులో పిల్లలకు ఎన్నో రకాల వినోదాలుంటాయి. పర్యాటకులు అక్కడి సిబ్బందితో సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. తెలంగాణలో.. పెరియార్ టైగర్ రిజర్వు ఎకో టూరిజం ప్రాంతాన్ని దక్షిణాది రాష్ట్రాల అటవీ మంత్రులతోపాటు తెలంగాణ మంత్రి జోగు రామన్న కూడా సందర్శించారు. అక్కడి టైగర్ ప్రాజెక్టు తరహాలో ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యాన్ని తీర్చి దిద్దుతామని మంత్రి వెల్లడించారు. ఆ జిల్లాలోని కడెం, జన్నారం ఎకో టూరిజానికి అనువుగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది జూలైలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మృగవని ఎకో టూరిజం కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతరించి పోతున్న తెగల నాటికలు, కళలను సందర్శకులకు పరిచయం చేయడం దీని ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలోనూ 300 ఎకరాల విస్తీర్ణంలో ఎకో టూరిజం పార్కులు ఏర్పాటు చేస్తామని రెండునెలల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 39 ప్రాంతాల్లో బీచ్ రిసార్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. విశాఖపట్నంలోని లంబసింగి, హార్స్లీహిల్స్లను వేసవి విడిది ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అటవీశాఖ సమన్వయ సహకారంతో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు సర్కారు చెబుతోంది. కేరళ ఎందుకు ఆదర్శం? కేరళలోని పెరియార్ టైగర్ అభయారణ్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా ఆ రాష్ట్రం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తూ సత్ఫలితాలు సాధించింది. పెరియార్ అభివృద్ధిలో ఆదివాసీలు కీలకపాత్ర పోషించినట్లు అటవీశాఖ పరిశీలనలో తేలింది. పోచర్స్ స్థాయి నుంచి ప్రొటెక్టర్ స్థాయికి ఎదిగినట్లు నిపుణులు నిర్ధరించారు. బ్యాంబో రాఫ్టింగ్, పగ్మార్క్ ట్రయల్, జంగిల్ స్కౌట్ వంటి కొత్త విధానాలు పెరియార్లో ప్రవేశపెట్టారు. తద్వారా ఈ ప్రాజెక్టు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. ఎకో టూరిజం అంటే? ఒక నిర్ణీత ప్రాంతంలోని అరణ్యాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరచడాన్ని ఎకో టూరిజం అంటారు. 1990లో అంతర్జాతీయ టూరిజం సొసైటీ (టైస్) ద్వారా ప్రతిపాదించారు. దీని ప్రాథమిక సూత్రాల ప్రకారం పర్యావరణాన్ని సంరక్షిస్తూ అడవులను కాపాడతారు. స్థానిక ప్రజల శ్రేయస్సుకు పాటుపడతారు. సహజ వనాల పరిరక్షణ బాధ్యత తీసుకుంటారు. ప్రయాణ సంబంధాలను మెరుగుపరుస్తారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పరిరక్షణ కోసం నేరుగా ఆర్థిక ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకుంటారు. అటవీ ప్రాంతంలోని ప్రజల సంస్కృతిని గౌరవించేలా అభివృద్ధి చేస్తారు. ఏం చేస్తారు? జీవశాస్త్ర, సాంస్కృతిక వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థ ద్వారా పరిరక్షించడం స్థానిక జనాభాకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా జీవ వైవిధ్య స్థిరమైన వినియోగం సాధించడం స్థానిక సంఘాలు, అన్ని సామాజిక, ఆర్థిక ప్రయోజనాల భాగస్వామ్యం ఆదివాసీల ఔషధాలు, ఇతర ఉత్పత్తులను ఎకో టూరిజంలో ఉపయోగించడం వ్యర్థాలను నివారించడం, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని అరికట్టడం వృక్ష, జంతు జాలాన్ని ప్రధాన ఆకర్షణగా తయారు చేయడం ఎకో టూరిజం ద్వారా స్థానికులకు జీవనోపాధి తోపాటు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం.