బెర్నార్డ్ హర్నిసన్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహిత పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్క్‌ను ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తోంది. గతంలోనే గండిపేట మండలం కొత్వాల్‌గూడలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఏకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళిక రూపొందించింది. తాజాగా అదే ప్రాం తంలో నైట్ సఫారీ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీ పార్క్ అభివృద్ధి చేసిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులతో పురపాలక మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ చర్చలు జరిపా రు.
సింగపూర్ నైట్ సఫారీ పార్క్ మాదిరిగా కొత్వాల్‌గూడ సఫారీ పార్క్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం, హిమాయత్‌సాగర్ సమీపంలో ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించగలుగుతుందని, హైదరాబాద్‌కు పర్యాటకంగా మంచి పేరు తీసుకొస్తుంద ని అభిప్రాయపడ్డారు. గండిపేట చెరువు అభివృద్ధికి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌రెడ్డిలతో కలసి కొత్వాల్‌గూడ ప్రాంతాన్ని సందర్శించిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేయడంలో నైట్ సఫారీ పార్క్‌కు సంబంధించిన డిజైన్‌లను సెప్టెంబర్‌లోపు సమర్పించాలని మంత్రి సూచించారు.
నైట్ సఫారీ పార్క్ అంటే...
సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో 6 అడవులను రూపొందించారు. మధ్య, మధ్యలో లైట్లుంటాయి. రాత్రి వేళల్లోనే ఈ పార్క్‌లో సందర్శకులకు అనుమతి ఉంది. ఆ వెలుతురులోనే జంతువులు కంటపడుతుం టాయి. అటు, ఇటు తిరుగుతూ అడవిలో ఉన్నట్టుగా నే ఉంటాయి. అక్కడ టాయ్‌ట్రైన్‌లో పర్యాటకులు జర్నీ చేస్తూ రాత్రి సమయాల్లో జంతువులను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నైట్ సఫారీ పార్క్‌ను పోలినట్టుగానే కొత్వాల్‌గూడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల సమయంలో సందర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండటంతో వీకెండ్‌లో కుటుంబసభ్యులతో పర్యాటకులు పోటెత్తే అవకాశముంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment