Night Life
-
నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!
రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? -
రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా?
చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్‌గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి యూకేలోని బార్న్స్లీలో క్లర్క్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్‌కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్‌కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్ స్టేజ్ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్‌కి స్టెమ్ సెల్స్ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్‌కి స్టెమ్‌సెల్ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్ కణాలు ఉండాలి. ఫిర్త్ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్ మార్పిడి అనేది ఫిర్త్‌కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. చివరికి ఫిర్త్ జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్‌ఫుల్‌గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!) -
డిజైన్ల చీరలు.. రూ.50 మాత్రమే.!
♦ ఒక చెప్పుల జోడు కేవలం రూ.50 మాత్రమే...!అమ్మకైనా... నాన్నకైనా... కొడుకుకైనా...ఇంట్లో ఎవరికైనా కేవలం యాబై రూపాయలకే ఒక జత. రండి... ఆలస్యమైతే స్టాక్ అయిపోతుందంటూ చార్‌కమాన్ వద్ద మైక్‌లో ఓ చెప్పుల వ్యాపారి.. ♦ బనియన్లు...పదిహేను రూపాయలే. అందరికీ అన్ని సైజులలో..తీసుకోండి...!! అంటూ పత్తర్‌గట్టి వద్ద టేలా బండిపై చిరువ్యాపారి పిలుపు ♦ రంగు రంగుల డిజైన్ల చీరలు..అన్ని వయసుల వారికి రూ.50 మాత్రమే.! అంటూ గుల్జార్‌హౌజ్ వద్ద రోడ్డుపై చీరలు ఉంచి రమ్మంటున్న ఓ చీరెల వ్యాపారి. ♦ రెండు రూపాయలకు ఒకటి...తీసుకోండి..అంటూ చార్మినార్ వద్ద టేలాబండిపై చిన్నచిన్న ప్యాకెట్లలో వంట దినుసులను ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడో టేలాబండి వ్యాపారి. పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో రోజూ కనిపిస్తున్న సందడి ఇది. నాణ్యతతో కూడిన వస్తువులను కూడా అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటంటూ కాదు.. అవసరమైన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చార్మినార్ :రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్–మక్కా మసీదు ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న రంజాన్ మార్కెట్ జనం రద్దీతో కళకళలాడుతోంది. రంజాన్ మాసం సందర్బంగా ఫుట్‌పాత్ విక్రయాలు రోడ్డుపైకొచ్చాయి. వినియోగదారులతో దుకాణాలన్నీ బిజీగా మారాయి. పండుగను పురస్కరించుకొని ప్రజలు పండుగ వస్తువులు ఖరీదు చేయడంలో నిమగ్నం కావడంతో పాతబస్తీ ముఖ్య వ్యాపార కేంద్రాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. మహిళలు పండుగను పురస్కరించుకొని ముచ్చటగొలిపే రంగురంగుల గాజులను ఖరీదు చేస్తుండడంతో లాడ్‌బజార్ గాజుల దుకాణాలు మహిళల రద్ధీతో కిటకిటలాడుతున్నాయి. ముస్లిం మహిళలు రంజాన్ పండుగకు ప్రత్యేకంగా గాజులను ఖరీదు చేసి ముచ్చటగా ధరిస్తారు. పాతబస్తీ ప్రజలే కాకుండా శివారు ప్రాంతాల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గాజులను ఖరీదు చేస్తున్నారు. లాడ్‌బజార్, ముర్గీచౌక్, గుల్జార్‌హౌజ్, శాలిబండ తదితర ప్రాంతాలలోని అత్తర్ దుకాణాలు ప్రజల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కిటకిటలాడుతున్న దుస్తుల దుకాణాలు రంజాన్ పండుగకు తప్పనిసరిగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తుండడంతో వాటిని ఖరీదు చేయడానికి అధిక సంఖ్యలో దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పటేల్ మార్కెట్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, రికాబ్‌గంజ్, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాలలోని వస్త్ర వ్యాపార కేంద్రాలు రద్దీగా మారాయి. ఖరీదు చేసిన నూతన వస్త్రాలను వెంటనే కుట్టించుకోవడానికి టైలర్ షాపులను కూడా ఆశ్రయించడంతో పాతబస్తీ టైలర్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తూ ఉపవాస దీక్షలను విరమించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా షాపింగ్ చేయడానికి చాలా కుటుంబాలు సుముఖత చూపిస్తున్నాయి. కళ్లు మిరమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా రంజాన్ మార్కెట్లను సందర్శిస్తున్నారు. వివిధ రకాల గృహోపకర వస్తువులను చూస్తూ.. అవసరమైన చోట ఖరీదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇఫ్తార్ విందుల అనంతరం మహిళలు, పురుషులు, చిన్నారులు పండుగ వస్తువులను ఖరీదు చేయడానికి వ్యాపార కేంద్రాలకు వస్తున్నారు. సంవత్సరానికోసారి రంజాన్‌ను పురస్కరించుకొని కుటుంబ సభ్యులంతా వ్యాపార కేంద్రాలకు వెళ్లడం సరదా, కాలక్షేపంగా ఉంటుందంటున్నారు. దీంతో పాతబస్తీలో ఎటుచూసినా ప్రజల రద్ధీతో ఫుట్‌పాత్‌లు, దుకాణాలు కళకళలాడు తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. -
దెయ్యం – భయం
రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్లడం, రావడం ఇదే పని. ఓ రోజు కాలేజ్ అయ్యాక తొందరగా ఇంటికి వచ్చి బ్యాగ్ బెడ్ మీద పడేసి బయటకు జంప్ అవుతుంటే ‘‘ఒరేయ్! ఏదన్న తిని పోరా’’ అని అమ్మ వంట గది నుంచే అరిచింది. ‘‘ఆకలైతలేదమ్మా!’’ అని గట్టిగా అంటూనే బయటపడ్డా. అదే రోజు రాత్రివరకు బయట షికార్లు కొట్టి, అమ్మకు ఫోన్ చేసి చెప్పా – ‘‘అమ్మా! ఇవ్వాళ లేటయితది’’. అమ్మ తిట్టాల్సిందంతా తిట్టి, జాగ్రత్త చెప్పి ‘సరే’ అంది. నా ఫ్రెండ్ అర్జున్‌తో కలిసి ఓ హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్‌కి వెళ్లా. సినిమా ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నా, కానీ చూడాలి అనిపిస్తోంది.‘‘ఏంది మామా! హర్రర్ సినిమాలు ఈ రేంజ్లో ఉంటాయా! నాకు భయమైతుంది. పోదామా?’’ అని అర్జున్ నా చెవిలో అరుస్తున్నాడు.‘‘నాకేం తెలుసురా! ఇంట్లో హర్రర్ సినిమాలు చూస్తే పెద్దగా భయం కాలేదు కానీ థియేటర్లో చూస్తే మాత్రం చాలా భయమైతుందిరా! సర్లే, మొత్తం సినిమా చూసే పోదాం’’ అన్నా. ఆ దెయ్యాలు, ఆ సౌండు, దెయ్యాలు మనుషుల రక్తాలు తాగడాలు.. వణుకుతూనే సినిమా చూస్తూ కూర్చున్నాం. సినిమా అయ్యాక, ‘ఇంకోసారి చీకట్లో ఇలాంటి హర్రర్ సినిమాలకు రావొద్దురా’ అనుకున్నాం. అసలే చీకటి. హర్రర్ సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. సడెన్‌గా, ‘‘రామ్! దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసా’’ అని వాడు నావైపు చూస్తూ అడిగాడు.‘‘ఈ టైమ్‌లో దెయ్యాల గురించి డిస్కషన్ ఏందిరా! నాకేం తెల్వదు.’’ అన్నాను భయపడుతూనే. ‘‘రామ్! నేను దయ్యాన్ని చూశా.’’ అని ఆగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. భయమేసింది. ‘‘ఎక్కడరా?’’ అనడిగా. ‘‘నువ్వేం భయపడకు. ఇప్పుడు కాదులే! చిన్నప్పుడు..’’ అని గట్టిగా నవ్వాడు. నాకు ఆ భయంలో వాడి మీద కోపమొచ్చింది. ఇంటికొచ్చేశాం. వాడిల్లు, మా ఇల్లు పక్కపక్కనే. ఇంటికి చేరేసరికి భయం కాస్త పోయింది. రాత్రి కలలు భయపెట్టాయి కానీ, పొద్దున్నే లేచి ఇంట్లోనే ఉన్నా అని నమ్మకం కలిగాక నాకు నేనే నవ్వుకున్నాను. ఆ తర్వాతిరోజు ఏదో ఫంక్షన్ ఉందని ఇంట్లోవాళ్లు ఊరెళ్లారు. నేను, తమ్ముడు ఎప్పట్లానే కాలేజీకి వెళ్లిపోయాం. నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటిముందు జనం. ‘ఏమైంది.. ఏమైంది..’ అని పరిగెత్తాను. అక్కడున్న వాళ్లెవరూ ఏం చెప్పట్లేదు. పక్కింటి ఆంటీని అడిగా – ‘‘ఏమైందాంటీ?’’ అని. ‘‘మీ తమ్ముడు ఇందాకే వచ్చి వెళ్లిండు. తాళంచెవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత గంట నుంచి ఇగో.. ఇట్ల సౌండ్..’’ అని భయంతో చెప్పింది. ‘‘అరెయ్ రామ్! కొంపదీసి ఇంట్లో దయ్యముందారా?’’ అన్నాడు నన్ను చూసి అటు దూరంనించి నడుచుకుంటూ వచ్చిన అర్జున్. రాత్రి భయపెట్టింది చాలనట్లు ఇంకా భయపెడుతున్నాడు.డోర్ ఓపెన్ చేసి వెళ్దామంటే కీ లేదు. జనం మొత్తం వచ్చేస్తున్నారు. అయ్యో ఇంట్లో ఏదో చొరబడిందని భయపెట్టిస్తున్నారు. ఓ పెద్ద మనిషైతే ‘‘మొన్ననే ఒక దెయ్యాన్ని చూశిన. ఈ ఇంట్లనే జొరబడ్డదేమో!’’ అన్నాడు. ఈ కాలంలో దయ్యాలుంటాయా అని అనిపించినా నాకూ భయం పెరిగిపోతూనే ఉంది. కీ కోసం తమ్ముడికి కాల్ చేశా. వాడు రావడానికి అరగంట పడుతుందన్నాడు.లాభం లేదు. తాళం పగలగొట్టాలి. కానీ లోపల్నించి వస్తోన్న సౌండ్? భయం పెరుగుతూనే ఉంది. తమ్ముడి కోసం ఎదురుచూశా. వాడు రావడమే అందరం తలుపు పక్కన భయపడుతూ నిలబడ్డాం. కాసేపట్లో నిజంగానే హర్రర్ సినిమా లైవ్‌లో కనబడుతుంది అనుకుంటున్నా. లోపల్నించి ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. ‘‘నా వల్ల కాదు. అమ్మో దయ్యముందేమో!’’ అని నేను దూరంగా పరిగెత్తా. ‘‘ఎవరూ లోపల?’’ అని అరిచా గట్టిగా. అటువైపు నుంచి మాటలు రాలేదు కానీ డోర్‌ను గట్టిగా తంతూ ఓ వింత సౌండ్ మళ్లీ వినిపించింది. ‘తలుపు తీయ్’ అంటున్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందుకు కదలట్లేదు. మా తమ్ముడైతే దూరంగా వెళ్లి నిలబడ్డాడు అప్పటికే.‘‘అర్రె! ఏం భయంరా. అందరం ఉన్నాంగా! మేం దూరంగా నిలబడుతాం’’ అని నన్ను డోర్ దగ్గర వుంచి అందరు దూరంగా వెళ్లిపోయారు. ‘‘తలుపు తీయ్.. తలుపు తీయ్..’’ అని అరుస్తున్నారు. ఇక లాభం లేదని తాళంచెవి పెట్టి, తలుపు తీసి వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చాను. అందరూ భయంభయంగా తలుపు వైపే చూస్తున్నారు. ఇంట్లోంచి ఎప్పుడూ వినని విధంగా సౌండ్ చేసుకుంటూ ఓ కుక్క బయటకు వచ్చి అందరిని చూసి భయపడి రెండు నిమిషాల్లో సందు దాటేసింది. అది వెళ్లిపోయాక అందరూ ఒకటే నవ్వులు. ‘భయపడి సచ్చినం కదరా!’ అనుకున్నారు అందరూ. అసలు విషయం ఏమైందంటే, మధ్యాహ్నం తమ్ముడు ఇంటికొచ్చి అన్నం తిని వెళ్లాడు. ఆ టైమ్‌లో ఆ కుక్క ఇంట్లో జొరబడింది. ఆ తర్వాత వాడు అది చూసుకోకుండా తాళమేస్కొని బయటికెళ్లాడు. దాన్ని చూసి వీళ్లంతా దయ్యమనుకొని భయపడ్డారు. నన్నూ భయపెట్టి పడేశారు. – రమేశ్ రాపోలు, నల్లగొండ. -
వేర్ ఈజ్ దీపికా?
ముంబైలో నిక్ జోనస్– ప్రియాంకా చోప్రాల నిశ్చితార్థం సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. నైట్ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. పార్టీ టైమ్ అయ్యింది. వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు మధు చోప్రా (ప్రియాంక తల్లి). అప్పుడే హీరోయిన్స్ పరిణీతి చోప్రా, ఆలియా భట్ తళుక్కున మెరిశారు. పార్టీ కళ వచ్చేసింది. అంతలోనే... సల్మాన్‌ఖాన్ సిస్టర్ అర్పితా ఖాన్, దర్శకుడు విశాల్ భరద్వాజ్, ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్.. ఇలా చాలా మంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు రావడంతో పార్టీ హడావిడి మొదలైంది. ఇంతలోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ టైమ్‌లో రణ్‌వీర్‌సింగ్ రావడం ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిందట. త్వరలో దీపికా పదుకోన్‌ను పెళ్లి చేసుకోబోయే రణ్‌వీర్‌సింగ్ ఎందుకు సింగిల్‌గా వచ్చాడు? అంటే.. దీపికా పదుకోన్‌కు ప్రియాంక ఆహ్వానం పంపలేదా? వేర్ ఈజ్ దీపికా? అనే అనుమానాలను లేవదీశారు పార్టీకి వచ్చిన కొందరు. అదేం లేదు.. దీపిక కంటే ప్రియాంకా చోప్రా ఐదేళ్లు పెద్ద అయినప్పటికీ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉంటారు. మూడేళ్ల క్రితం రణ్‌వీర్‌సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. సో.. ఆహ్వానం అందే ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరి... ఈ విషయంపై దీపికా అయినా లేక ప్రియాంకా చోప్రా అయినా నోరు విప్పితే కానీ గాసిప్ రాయుళ్ల నోటికి మూత పడదు. ఇవన్నీ సరే కానీ.. త్వరలో రణ్వీర్–దీపిక నిశ్చితార్థం జరిగితే అప్పుడు ఆ వేడుకకు ప్రియాంక వస్తారా? రారా? అనేది ఇప్పుడు బాలీవుడ్లో మొదలైన మరో హాట్ టాపిక్. -
‘నైటీల’ చరిత్ర ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : నైటీలంటే రాత్రిపూట మహిళలు వేసుకునే దుస్తులు అని అందరికి తెల్సిందే. కానీ వాటిని ఇప్పుడు రాత్రులందే కాకుండా పగటి పూట పనులందూ వేసుకుంటున్నారు. ఎందుకంటే అవి అందుకు ఎంతో అనువుగా ఉంటాయికనుక. భారత దేశంలో ఈ నైటీలకు బహుళ ప్రాచుర్యం తీసుకొచ్చిందీ మాత్రం కేరళకు చెందిన భార్యాభర్తలు. వారే బెన్నీ ఎన్ఏ, షెర్లీ బెన్నీలు. షెర్లీ బెన్నీ కథనం ప్రకారం 1987లో బెన్నీ ఎన్ఏ వద్ద మూడు వేల రూపాయల మిగులు రూపాయలున్నాయట. అందరిలాగా ఆయన వాటిని బ్యాంకులో దాచుకోకుండా ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడట. ఆడవారికి అనువైన దుస్తులు తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందీ ఆయనకు ఓనాడు. కేరళలో మహిళలు ఎక్కువగా కష్టపడతారుకనుక వారికి అనువైన, అంతగా అందుబాటులో లేని అరుదైన దుస్తులను తయారుచేసి అమ్మితే లాభసాటిగా ఉంటుందని భావించారట. కేవలం నైటీలనే మాత్రమే తయారు చేయాలనుకొని కేవలం 300 చదరపు అడుగుల స్థలంలో ‘ఓరియన్స్ క్రియేటర్స్’ పేరిట ఓ ముగ్గురు పనివాళ్లతో ఓ కుట్టుమిషన్ కేంద్రాన్ని బెన్నీ ఏర్పాటు చేశారు. కొచ్చీకి గంటన్నర దూరంలోని పిరవోమ్లో ముగ్గురు కార్మికులతో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు 600 మంది కార్మికులు పనిచేసే ‘ఎన్‌స్టైల్’ ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ని సంపాదించుకున్న ఈ ఎన్స్టైల్కు ఇప్పుడు కేరళ వ్యాప్తంగా 400 రిటేల్ షాపులున్నాయి. ముందు కేరళ, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ నైటీలకు ఎంతో ఆదరణ లభించింది. ఇప్పుడు ఎన్స్ట్ల్కు ఫాషన్ డిజైనర్‌గా, సీఈవోగా బెన్నీ భార్య షెర్లీ బెన్నీ వ్యవహరిస్తున్నారు. భర్త మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. 1980 దశకంలో దేశవ్యాప్తంగా నైటీలు ప్రాచుర్యం కావడానికి ఈ కంపెనీ ఉత్పత్తులే కారణమని చెబుతారు. 90 శాతం కాటన్, పది శాతం పాలిస్టర్‌తో తయారు చేసిన ఈ నైటీలు మార్కెట్లో 200 రూపాయల నుంచి 800 రూపాయల మధ్య లభిస్తాయి. గల్ఫ్ దేశాల్లో మహిళలు ఎక్కువగా నైటీలు ధరిస్తారని, కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు పనికోసం ఎక్కువగా వెళ్లే మగవాళ్లు, తమ భార్యల కోసం అక్కడి నుంచి నైటీలు తెచ్చేవారని, అలా కేరళ మహిళల్లో నైటీలకు ఆదరణ మొదలైందని స్థానికులు చెబుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే బెన్నీలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారని కూడా వారంటున్నారు. వాస్తవానికి భారత దేశంలో విక్టోరియా రాణి కాలం నుంచి మహిళలకు నైటీలు పరిచయం. ఇంగ్లాండ్ రాజవంశానికి చెందిన మహిళలు, బ్రిటీష్ ఉన్నతాధికారుల భార్యలు నైటీలు ధరించేవారు. వారు కేవలం పడుకునేటప్పుడు మాత్రమే ధరించే వీటిని నైట్ గౌన్లు అని పిలిచేవారు. వారిని చూసి భారతీయ కులీన వర్గానికి చెందిన మహిళలు కూడా నైటీలు ధరించడం మొదలు పెట్టారు. 1960వ దశకాల్లో మన బాలీవుడ్ తారలు సినిమాల్లో నైటీలతో దర్శనమిచ్చారు. ‘అందాజ్’ బాలివుడ్ సినిమాలో నర్గీస్, ‘అన్బె వా’ తమిళ చిత్రంలో సరోజా దేవీ, ‘కలివీడు’ మలయాళం చిత్రంలో ప్రముఖ నటి మంజూ వారియర్లు నైటీలు ధరించారు. ముంబైలో 1980వ దశకంలోనే మరాఠీ, గుజరాతీ మహిళలు నైటీలు ధరించడం ప్రారంభించారు. బ్రిటీష్ పాలకులకు ముందే అంటే, ప్రాచీన ఈజిప్టు, రోమన్ల ద్వారా మనకు నైటీలు పరిచయమయ్యాయని బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ స్లైలిస్ట్, కొరియాగ్రాఫర్ ప్రసాద్ బిడప తెలిపారు. స్కర్టులు, ప్యాంట్లు ఎక్కువగా ధరించే అమెరికా మహిళలు కూడా ఇప్పుడు నైటీల వెంట పడుతున్నారట. అక్కడి నైటీల మోజుపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత జూలై నెలలో ‘వియర్ యువర్ నైటీ అవుట్’ శీర్షికన ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఒకప్పుడు రాత్రిపూట వేసుకునేందుకే పరిమితమైన నైటీలు ఇప్పుడు ఇంట్లో ఉన్నంత సేపు వేసుకునే దుస్తులుగా మారిపోయాయి. అంతేకాకుండా పలు నగరాల్లో తల్లులు నైటీలపైనే తమ పిల్లలను కాన్వెంట్లలోనూ, స్కూళ్లలోనూ దించొస్తున్నారు. అలా తల్లులు నైటీలపై వస్తున్నందుకు 2013లో చెన్నైలోని ఓ స్కూల్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకముందు అలా వస్తే పిల్లలను స్కూల్లోకి అనుమతించమని బెదిరించింది. నవీ ముంబైలో ఓ మహిళా సంఘం నైటీలపై బయట తిరిగే మహిళలకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించేందుకు ప్రయత్నించింది. ఈ రెండు సంఘటనల్లోనూ న్యాయ పోరాటంలో నైటీలే గెలిచాయి. కార్మికుల సమ్మె, యూనియన్ల గొడవల కారణంగా ‘ఓరియన్స్ క్రియేటర్స్’గా మూడు దశాబ్దాలు ‘ఎన్‌స్టైల్’గా రెండు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన తమ ఉత్పత్తి కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు మార్చాలని బెన్నీ దంపతులు నిర్ణయించారు. అక్కడ చాలా చౌకగా కార్మికులు లభించడమే అందుకు కారణం. -
సిటీలో మరో ఏడు నైట్ షెల్టర్లు
హైదరాబాద్ : మహానగరంలో నిరాశ్రయుల కో సం మరికొన్ని నైట్ షెల్టర్లు అందుబాటులో రా ను న్నాయి. రూ.9.71 కోట్ల అంచనా వ్యయంతో ఏడు నైట్ షెల్టర్ల చేపట్టగా అందులో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉ న్నాయి. ఇవిగాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు కమ్యూనిటీ హాళ్ల ను నైట్ షెల్టర్లుగా మార్చనున్నారు. ఉప్పల్‌లోని దేవేంద్రనగర్ కమ్యునిటీహాల్, ముషిరాబాద్ సర్కిల్ రోజ్ కాలనీ కమ్యూనిటీహాల్, చందానగర్ లోని హఫీజ్‌పేట్ కమ్యూనిటీహాల్, బేగంపేట పో స్టాఫీస్ కమ్యూనిటీ హాల్ ఇందులో ఉన్నాయి. నగరంలో పది రోజులుగా కురుస్తున్న ముసురు నేపథ్యంలో నైట్ షెల్టర్లు నిరాశ్రయులకు వరంగా మా రాయి. అధికశాతం పేదలు, ఏవిధమైన ఆధారంలేకుండా జీవనోపాధి కోసం వచ్చేవారే. వీరందరికీ ఈ షెల్డర్లు నీడినిస్తున్నాయి. 1516 మందికి పైగా నిరాశ్రయులు గ్రేటర్లో అధికారిక లెక్కల ప్రకారం 1,516 మంది నిరాశ్రయులు ఉన్నట్టు తేలింది. వీరిలో 1,128 మంది పురుషులు, 328 మంది మహిళలు. ప్రస్తుతం నగరంలో ఉన్న 12 నైట్ షెల్టర్లలో 530 మంది తల దాచుకుంటున్నారు. వీటిలో 8 షెల్టర్లు పురుషులకు, నాలుగు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. వీటి నిర్వహణ బాధ్యతలను సేవారంగంలో పేరొందిన స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇందులో ఆశ్రయం కల్పించేవారి ఆధార్, ఓటర్ గుర్తింపులతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా తెరుస్తారు. ఈ నైట్ షెల్టర్లలో ఉండేవారికి ప్రైవేట్ రంగంలో తగు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా జీహెచ్ఎంసీ చేపట్టింది. మహిళల నైట్ షెల్టర్లు ఇవే.. ఉప్పల్ సర్కిల్లోని పాత మున్సిపల్ ఆఫీస్ ఎల్బీనగర్ సర్కిల్లోని సరూర్‌నగర్ పాత ఞచావడి భవనం అంబర్‌పేట సర్కిల్ గోల్నాక క్రాంతి నగర్ కమ్యూనిటీహాల్ సికింద్రాబాద్ సర్కిల్ నామాలగుండులో నైట్‌షెల్టర్ పురుషుల నైట్‌షెల్టర్లు.. చార్మినార్ సర్కిల్లోని పేట్లబుర్జు వార్డు ఆఫీస్ గోషామహల్ సర్కిల్ శివరాంపల్లి వీకర్ సెక్షన్‌కాలనీ యూసుఫ్‌గూడలోని వార్డు కార్యాలయం మొదటి అంతస్తు ఖైరతాబాద్ సర్కిల్లోని బేగంపేట ఫ్లై ఓవర్ కింద గచ్చిబౌలి సర్కిల్ శేరిలింగంపల్లి పాత మున్సి పల్ కార్యాలయం మల్కాజ్గిరి సర్కిల్లోని ఆర్.కె.పురం బ్రిడ్జి సమీపంలో.. సికింద్రాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ బ్రాహ్మణవాడి మెహిదీపట్నం సర్కిల్ మాసాబ్‌ట్యాంక్ మహవీర్ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రి గోషామహల్‌లోని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ -
నైట్ షిఫ్ట్లతో రిస్క్ ఎందుకంటే..
లండన్ : నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ఆరోగ్యానికి పెను ముప్పని తాజా అథ్యయనం వెల్లడించింది. రాత్రి పనివేళల ఫలితంగా ఒబెసిటీ, స్ర్టోక్, గుండె జబ్బుల ముప్పు అధికమని తేల్చిచెప్పింది. శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో మన శరీర జీవ క్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్తమై జీవ గడియారాల్లో మార్పులకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ద్వారా మెదడులోని ప్రధాన గడియారం కాకుండా శరీరంలో ఉండే జీవ గడియారాలన్నీ ప్రభావితమవుతాయని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సర్రే నిర్వహించిన అథ్యయనంలో తొలిసారిగా ఈ అంశాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో పనిచేయడానికి, తీవ్ర కిడ్నీ వ్యాధులకు ఉన్న సంబంధంపైనా ఈ అథ్యయనం దృష్టిసారించింది. శరీరంలోని కాలేయం, ప్రాంకియాస్, జీర్ణవ్యవస్థల్లో ఉండే గడియారాలు సైతం షిఫ్ట్ వేళలకు అనుగుణంగా మారిన నిద్ర, ఆహారపు అలవాట్లకు స్పందిస్తాయని దీంతో శరీరంలోని ఇతర గడియారాలు, మెదడులో ఉండే మాస్టర్ క్లాక్‌కు మధ్య సమతూకం దెబ్బతింటోందని అథ్యయన రచయిత, సర్రే యూనివర్సిటీ న్యూరో ఎండోక్రినాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవ్రా సేన్ వెల్లడించారు. రాత్రి, పగటి వేళల్లో పనిచేసే ఉద్యోగులపై వీరు పరిశోధన చేపట్టారు. వీరి రక్త నమూనాలను పరీక్షించారు. కేవలం మూడు రోజులు నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసిన వారిలో జీవక్రియల్లో ఆటంకాలను గుర్తించామని , ఇవి ఇలాగే కొనసాగితే క్యాన్సర్, ఒబెసిటీ, కిడ్నీ సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ముప్పు ఉందని డాక్టర్ స్కెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అథ్యయన ఫలితాల నేపథ్యంలో రాత్రివేళల్లో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సాయంత్రం వేళ్లల్లో ఆహారం తీసుకోవద్దని, పగటి కంటే సాయంత్ర సమయాల్లో నిద్రించడం మేలని సూచించారు. -
స్పెషల్ అట్రాక్షన్ సింగపూర్ పులి!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో తొలిసారి కొత్వాల్ గూడలో ఏర్పాటు చేసే నైట్ సఫారీ పార్కులో విదేశీ జంతువులను ఉంచనున్నారు. వీటిలో సింగపూర్ పులి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సింగపూర్‌కు వెళ్లి నైట్ సఫారీలో విహరించిన అనుభూతినే ఇక్కడా పొందేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 40 హెక్టార్లలో నైట్ సఫారీ వినియోగంలో ఉంది. దానికంటే పెద్దగా 50 హెక్టార్లలో దాదాపు తొమ్మిది రకాల ఆడవులను ఏర్పాటు చేసి సుమారు 140 జాతులకు చెందిన జంతువులను ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసే ఈ పార్కు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా రూపొందించనున్నారు. హెచ్ఎండీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెర్నార్డ్ హారిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు మరో రెండు నెలల్లో పూర్తి డిజైన్లను సమర్పించనున్నారు. ఇటీవల కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించిన ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. సహజంగానే చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో నైట్ సఫారీ పార్కులో ట్రెక్కింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో నొయిడాలో నైట్ సఫారీ పార్కును ఏర్పాటు చేయాలనుకున్నా నిధుల లేమితో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. వాహనాల వెలుగులో పర్యటన సింగపూర్ నైట్ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్ లేదా టాయ్ ట్రైన్లో సందర్శకులు రాత్రివేళ అడవిలో తిరిగే ఏర్పాటు చేయనున్నారు. దాదాపు గంటపాటు జంతువులను చూసే వీలుకల్పిస్తారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్యప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులను చూడవచ్చు. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. ఈ కృత్రిమ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలాన్ని ఉంచాలని అధికారులు నిర్ణయించారు. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు.. ఇలా వివిధ రకాల జంతువులను తీసుకురానున్నారు. వీటిపై మరో రెండు నెలల్లో స్పష్టత రానుంది. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడా కుంటల్లో మొసళ్లు కూడా కనిపిస్తాయి. గిరిజన ప్రదర్శనలతో స్వాగతం.. సింగపూర్ నైట్ సఫారీ పార్కు ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు బస చేసేందుకు ప్రత్యేక కాటేజీలు కూడా తీర్చిదిద్దనున్నారు. కుటుంబంతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహరాన్ని అస్వాదించేందుకు రెస్టారెంట్లు కూడా ఉంటాయంటున్నారు. రాత్రి సమయాల్లో నైట్ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. -
ఇక రాత్రిపూట పులులను చూడొచ్చు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహిత పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్క్‌ను ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తోంది. గతంలోనే గండిపేట మండలం కొత్వాల్‌గూడలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఏకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించింది. తాజాగా అదే ప్రాం తంలో నైట్ సఫారీ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీ పార్క్ అభివృద్ధి చేసిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులతో పురపాలక మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ చర్చలు జరిపా రు. సింగపూర్ నైట్ సఫారీ పార్క్ మాదిరిగా కొత్వాల్‌గూడ సఫారీ పార్క్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం, హిమాయత్‌సాగర్ సమీపంలో ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించగలుగుతుందని, హైదరాబాద్‌కు పర్యాటకంగా మంచి పేరు తీసుకొస్తుంద ని అభిప్రాయపడ్డారు. గండిపేట చెరువు అభివృద్ధికి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌రెడ్డిలతో కలసి కొత్వాల్‌గూడ ప్రాంతాన్ని సందర్శించిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేయడంలో నైట్ సఫారీ పార్క్‌కు సంబంధించిన డిజైన్లను సెప్టెంబర్‌లోపు సమర్పించాలని మంత్రి సూచించారు. నైట్ సఫారీ పార్క్ అంటే... సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో 6 అడవులను రూపొందించారు. మధ్య, మధ్యలో లైట్లుంటాయి. రాత్రి వేళల్లోనే ఈ పార్క్‌లో సందర్శకులకు అనుమతి ఉంది. ఆ వెలుతురులోనే జంతువులు కంటపడుతుం టాయి. అటు, ఇటు తిరుగుతూ అడవిలో ఉన్నట్టుగా నే ఉంటాయి. అక్కడ టాయ్‌ట్రైన్‌లో పర్యాటకులు జర్నీ చేస్తూ రాత్రి సమయాల్లో జంతువులను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నైట్ సఫారీ పార్క్‌ను పోలినట్టుగానే కొత్వాల్‌గూడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల సమయంలో సందర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండటంతో వీకెండ్లో కుటుంబసభ్యులతో పర్యాటకులు పోటెత్తే అవకాశముంటుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. -
అర్ధరాత్రి సూరీడొచ్చెనమ్మా!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వేసవి కాలం ముగింపుకొచ్చేసింది... రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... అనుకున్న ప్రజల ఆశలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు! ఎండలు తగ్గినట్టే తగ్గి గత నాలుగు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. వడగాలులు భయపెడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా వేసవికాలంలో రాత్రిపూట (కనిష్ట) ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకూ ఉంటే కాస్త అహ్లాదంగా ఉంటుంది. కానీ ఇప్పుడది కాస్త 30 డిగ్రీలకు తగ్గట్లేదు. అంతేగాకుండా ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం పగటిపూట (గరిష్ట) ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రానురాను ప్రమాదకరంగా మారుతున్నాయి. జిల్లాలో ఏదొక చోట అడపాదడపా వర్షాలు పడుతున్నా అనూహ్యమైన వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాటికితోడు పిడుగులు హడలెత్తిస్తున్నాయి! ఇటీవల కాలంలో ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంటోంది. ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కేవలం పది డిగ్రీలకు తగ్గిపోవడం పర్యావరణంలో ప్రమాదకర సంకేతాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్లే అర్ధరాత్రి కూడా వేడిగాలులు, ఉక్కపోత తగ్గట్లేదు. దీంతో ప్రజలకు వడదెబ్బతో నిస్సత్తువ, చిరాకుతో నిద్రలేమి సమస్యలు తప్పట్లేదు. పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలు... రాజాం, కొత్తూరు ప్రాంతంలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సోమవారం రాత్రి నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కూడా కొత్తూరు మినహా జిల్లాలో మిగతా అన్నిచోట్ల 30 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ పరిస్థితి వల్ల తలెత్తే వడగాల్పులు, పొడి వాతావరణం వల్ల వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈనెల 23వ తేదీ వరకూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టరు జగన్నాథం తెలిపారు. 24వ తేదీ నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. -
రాత్రి సంచారానికి అలవాటు పడుతున్న జంతువులు!
ఒకప్పుడు సింహం, పులి వంటి జంతువుల చూస్తే మనుషులు దూరంగా పారిపోయేవారు. మరి ఇప్పుడో.. పరిస్థితి రివర్స్ అవుతోంది. అడవుల్లో ఉండే చాలా క్షీరదాలు మనిషి నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట సంచరానికి అలవాటు పడుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం చెబుతోంది. పులులు, సింహాలతోపాటు ఎలుగుబంట్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఆహారం కోసం వేటాడే సమయాన్ని తగ్గించుకోవడం, పరిసరాలపై మరింత ఎక్కువ నిశిత దృష్టిని పెట్టుకోవడం, మానవ సంచారమున్న ప్రాంతాలకు దూరంగా పారిపోవడం వంటి అనేక ఇతర లక్షణాలను కూడా ఇవి ఆపాదించుకుంటున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కైట్లిన్ గేనర్ అంటున్నారు. అటవీ ప్రాంతాల్లో మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ ఈ క్షీరదాలు మనిషి ఉనికి గురించి తెలియగానే దూరంగా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై ఇప్పటికే జరిగిన 76 అధ్యయనాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని టాంజానియా సింహాలు, నేపాల్, పోలాండ్‌లలోని పులులు, కాలిఫోర్నియా ప్రాంతంలోని అడవి పందులతోపాటు దాదాపు 62 జాతులపై అధ్యయనం జరిగిందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో మానవ సంచారం ఎలా ఉంది? అదే సమయంలో ఈ జంతువుల ప్రవర్తన ఎలా ఉందన్న వివరాలు సేకరించి తాము ఈ అధ్యయనం జరిపినట్లు గేనర్ వివరించారు. -
తలకిందులైంది
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఆ రోజంతా చేయాల్సిన పనులకు రెడీ అయిపోవడం కామన్. అయితే రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం ఎన్ని గంటలు నిద్రపోదామా? అని ఆలోచిస్తున్నారు. అదేంటీ.. ఆమె చేతిలో సినిమాలు లేవా అంటే.. ఎందుకు లేవు. ఈ బ్యూటీ ఫుల్ బిజీ. మరి.. పొద్దు పొద్దున్నే నిద్ర ఏంటీ? షూటింగ్‌లు డుమ్మా కొడుతున్నారా? అంటే.. అదేం కాదు. ఆమె నైట్ షూట్స్‌లో పాల్గొంటున్నారు. అదీ సంగతి. రాత్రంతా షూటింగ్ చేసి మార్నింగ్ ప్యాకప్ చెప్పాక బ్రేక్‌ఫాస్ట్ చేసి, వెంటనే నిద్రపోతున్నారు. నైట్ డిన్నర్ చేసి, షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు రకుల్. సో.. నైట్ షూట్స్‌లో పాల్గొంటూ సూర్యుడికి గుడ్‌నైట్, చంద్రునికి గుడ్‌మార్నింగ్ చెప్తున్నారీ బ్యూటీ. అంటే రకుల్ రొటీన్ లైఫ్ తలకిందులైందన్నమాట. రంజిత్ దర్శకునిగా పరిచయం అవుతూ కార్తీ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో రకుల్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్లోనే పాల్గొంటున్నారు రకుల్. ఇంతకుముందే ‘ఖాకీ’ చిత్రంలో జంటగా నటించిన కార్తీ, రకుల్ మళ్లీ ఈ సినిమా కోసం జోడీ కట్టడం విశేషం. ఇందులో రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ కీలక పాత్రలు చేయనున్నారని టాక్. ఈ సినిమాకు ‘దేవ్’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంతో పాటు సూర్య సరసన ఒక సినిమా, శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్. హిందీలో అజయ్ దేవగణ్ సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతా సరే కానీ.. తెలుగులో రకుల్ అధికారికంగా ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం విశేషం. -
నిద్రలేమితో ఆయుఃక్షీణం!
రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఉదయాన్నే లేవడానికి బద్దకించి పొద్దు ఎక్కేదాకా ముసుగేసి పడుకుంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్త ఈ రెండు పనులూ చేయని వారితో పోలిస్తే మీరు తొందరగా తనువు చాలించేందుకు అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనే వారికి వ్యాధుల సమస్యలూ అధికంగానే ఉంటాయని తాము తొలిసారి అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు సర్రే విశ్వవిద్యాలయం, నార్æ్తవెస్టర్న్ మెడిసిన్ల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 5 లక్షల మంది వివరాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని క్రిస్టన్ నట్సన్ చెప్పారు. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు జీవక్రియలకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి పెడితే తాము మరణ ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశామని వివరించారు. రాగల జబ్బులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా రాత్రిళ్లు మెలకువగా ఉండే వారు ఇతరులతో పోలిస్తే మరణించేందుకు ఉన్న అవకాశాలు పదిశాతం ఎక్కువని అర్థమైందని నట్సన్ చెప్పారు. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ దీనిపై దృష్టి పెట్టాలని.. కొందరు ఉద్యోగుల కోసం ఆఫీసు పనివేళలను మార్చే ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. అయితే రాత్రిళ్లు మేలుకునే వారు తమ అలవాట్లను మార్చుకునేందుకు ప్రయత్నించడమూ అవసరమేనని వీలైనంత ఉదయాన్నే వెలుతురు అందేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇందుకు ఒక మార్గమని తెలిపారు. -
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్ అధికం
లండన్ : పగటి వేళ పనిచేసే మహిళలతో పోలిస్తే నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు అధికమని ఓ అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మూడు రెట్లు, పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదు రెట్లు అధికమని కనుగొన్నారు. రాత్రి షిఫ్ట్‌ల్లో పనిచేసే నర్సులకు పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే 58 శాతం అధికంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు లోనవుతున్నారని అథ్యయనం పేర్కొంది. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే నర్సుల్లో లంగ్ క్యాన్సర్ కేసులు కూడా మూడో వంతు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ర్టేలియా, ఆసియాలో 40 లక్షల మందిని కవర్ చేస్తూ సాగిన 61 విభిన్న అథ్యయనాల్లోని డేటా ఆధారంగా చైనాకు చెందిన సిచువన్ యూనివర్సిటీ ఈ పరిశోధన చేపట్టింది. మహిళల్లో సాధారణ క్యాన్సర్లకు నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ప్రధాన ముప్పుకారకంగా వెల్లడైందని అసిస్టెంట్ ప్రొఫెసర్ లీమా చెప్పారు. రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు తరచూ వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవాలని సూచించారు. -
యోగి.. సడెన్ విజిట్
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం రాజధానిలోని బలరామ్ పూర్ ప్రభుత్వాసుత్రి, నిరుపేదల కోసం కొత్తగా నిర్మించిన షెల్టర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. అంతేకాక ప్రభుత్వ షెల్టర్లలో రాత్రిపూట తలదాచుకుంటున్న నిరుపేదలతో మాట్లాడారు. ప్రభుత్వ షెల్టర్లలోని మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఏడు చలి తీవ్రంగా ఉండడంతో పేదల కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇండ్లులేని, ఇతర పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చలి నుంచి కాపాడుకునేందుకు అవసరమైన దుస్తులు, దుప్పట్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన వసతులు పేదలకు అందుతున్నాయో? లేదో? తెలసుకునేందుకు ఇలా వచ్చానని యోగి చెప్పారు. షెల్టర్లను పరిశీలించాక.. అందులో హీటర్లను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. -
చ.. చ.. చలి బాబోయ్!
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్ టౌన్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని, 2014 డిసెంబర్ 20న ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మరో రెండ్రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 8, భద్రాచలంలోనూ 5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. రామగుండంలో 12 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లలో 13, హకీంపేటలో 14, నల్లగొండలో 15, మహబూబ్‌నగర్‌లో 16 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత కంటే పగటి ఉష్ణోగ్రత 7 రెట్లకు మించి 29 డిగ్రీలు రికార్డయింది. -
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటిరెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత లు 9 డిగ్రీలు, మెదక్‌లో 12 డిగ్రీలు రికార్డయ్యాయి. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నల్లగొండలో 2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో ఒక డిగ్రీ ఎక్కువగా 15 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 డిగ్రీ లు ఎక్కువగా 32 డిగ్రీలు, మెదక్‌లో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సిటీలో అడ్రస్ లేని కొత్త నైట్ షెల్టర్లు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకులక్ష జనాభాకో షెల్టర్ తప్పనిసరి ఆ లెక్కన గ్రేటర్ జనాభా మేరకు 200 షెల్టర్లు అవసరం ప్రస్తుతం ఉన్నవి: 12, ఆశ్రయం పొందుతున్నవారు 200 మంది నీడలేని వారిని గుర్తించే ప్రక్రియలో నిర్లక్ష్యం తూతూ మంత్రపు సర్వేలను తిరస్కరించిన కేంద్రం. పొట్టకూటి కోసం వలస వచ్చి..ఏ ఆధారమూ లేక జీవన పోరాటం చేస్తున్న అభాగ్యులు నగరంలో ఎందరో..ఇక కుటుంబ సభ్యుల ఆదరణ లేక... సంతానం లేక..ఏ తోడూ నీడా లేని వారు మరెందరో. వివిధ జిల్లాల నుంచి నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారూ వేలల్లోనే ఉంటారు. వారి సహాయకులకూ సిటీలో నీడ దొరకడం కష్టమే. ఇలాంటి వారికి కనీస ఆశ్రయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 12 నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. మూడేళ్ల క్రితమే కొత్తగా మరికొన్ని షెల్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా లేవు. దీంతో చలిలో వణుకుతూ వేలాది మంది నిరాశ్రయులు రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన అవస్థలు పడుతున్నారు. నిరాశ్రయులను గుర్తించడంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఇక ఉన్న షెల్టర్లలోనూ కొన్నిచోట్ల వసతుల కొరత ఉంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది. సాయంత్రం నుంచే మొదలవుతున్న చలిగాలులతో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఇక ఎలాంటి ఆశ్రయమూ లేని వారు చలి రాత్రుల్లోనే జాగారం చేయాల్సి వస్తోంది. చలిని తట్టుకోలేని వారు కడుపులోకి కాళ్లు ముడుచుకొని పడరాని పాట్లు పడుతున్నారు. దుకాణాలు మూసివేశాక షట్టర్ల కింద కొందరు తలదాచుకుంటుండగా..ఫుట్‌పాత్‌లతో సహా ఎక్కడ ఏ మాత్రం దాపు కనిపించినా అక్కడ ముడుచుకుంటున్న వారు ఎందరో. ప్రతి చలికాలం సీజన్లో నిరాశ్రయులకు తగినన్ని నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తున్న జీహెచ్ఎంసీ మాటలు నీటి మూటలవుతున్నాయి. గత మూడేళ్లుగా నైట్‌షెల్టర్లను పెంచుతామంటున్నప్పటికీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చేవారు..ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా ఉంటున్నవారు.. నా అన్నవారు లేని అనాథలు.. యాచకులు తదితరులు చలి తీవ్రతతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రుల వద్ద ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా ఏర్పాటు కాలేదు. గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో 14 నైట్‌షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ కనీస సదుపాయాల్లేక చాలామంది వాటిని కూడా వినియోగించుకోవడం లేరు. తూతూమంత్రపు సర్వేలు.. ఏ గూడు లేక ఆకాశం కప్పుకిందే తలదాచుకుంటున్న వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు గత మార్చిలో సర్వే నిర్వహించారు. అలాంటి వారు కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు మూడేళ్లక్రితం నిర్వహించిన సర్వేలో 3500 మంది ఉండగా, ఈ సంఖ్య సగంకంటే తగ్గింది. ఇంతపెద్ద మహానగరంలో ఇంత తక్కువమంది ఉండటాన్ని నమ్మలేక మరోమారు సర్వే నిర్వహించాల్సిందిగా కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందం సూచించింది. అయినప్పటికీ ఇంతవరకు మళ్లీ సర్వే నిర్వహించలేదు. నైట్‌షెల్టర్లను పెంచలేదు. చలిరాత్రుల్లో వణకుతున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు మూడేళ్ల క్రితమే గుర్తించి, ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీలతో సహా మొత్తం ఏడు ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్‌కు అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు. ఉండాల్సిన చోట లేక.. ఉన్నవాటి గురించి తెలియక.. నైట్‌షెల్టర్లను ఆశ్రయించేవారికి కేవలం ఆశ్రయం మాత్రమేకాక, తగిన పడక, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లతోపాటు, లాకర్లు, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయాలున్నాయి. 12 నైట్‌షెల్టర్లలో 380 మంది ఉండేందుకు సదుపాయాలున్నాయని జీహెచ్ఎంసీ చెబుతుండగా, వాటిల్లో ఉంటున్న వారు 200 మందికి మించడం లేదు. వీటి గురించి తెలియక చాలామంది షెల్టర్లను వినియోగించుకోవడం లేదు. ఉన్న నైట్‌షెల్టర్లు ప్రధాన రహదారులు, ఆస్పత్రులు, బస్టాండ్లకు దూరంగా ఉండటంతో వీటి గురించి సమాచారం తెలియడం లేదు. ఉస్మానియా, నిలోఫర్, ఆస్పత్రుల్లో వెయ్యిమందికి పైగా ఉండే ఇన్‌పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారు అంతకు ఎక్కువే ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్, కోఠి, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే అటెండెంట్లు కూడా వెయ్యి మంది వరకు ఉంటారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో హోటళ్లు, లాడ్జిల్లో ఉండలేక ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలి రాత్రుల్లో అల్లాడుతున్నారు. ఉపయోగించుకుంటున్నది ఎందరు? బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్ కాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 నైట్షెల్టర్లున్నాయి. వాటిల్లో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ 200మంది కూడా ఉండటం లేదు. జీహెచ్ఎంసీ లెక్కల్లో మాత్రం ఎక్కువ మంది ఉంటున్నట్లు చూపుతున్నారు. రాత్రిపూట తక్కువ ధరకు (రూ. 5 )భోజనం ఏర్పాట్లు ఏ నైట్షెల్టర్లోనూ లేవు. సరూర్‌నగర్ మహిళల నైట్‌షెల్టర్‌లో 20 మందికి వసతి ఉన్నట్లు పేర్కొనగా, 12 మంచాలున్నాయి. వండుకునే వారి కోసం గ్యాస్, స్టవ్ సదుపాయాలున్నాయి. నిలువ నీడ లేక..వేరే దారి లేక...బంజారాహిల్స్‌లో రోడ్ల పక్కనే నిద్రిస్తున్న దృశ్యం నామాలగుండులో వసతులు ఓకే... సికింద్రాబాద్: సికింద్రాబాద్ నామాలగుండులోని జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో మహిళల కోసం నైట్‌షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో 29 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. 15 మంది మహిళలు బయట ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఆశ్రయం పొందుతుండగా, మిగతా 14 మంది ఇక్కడే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లతో ఇక్కడే శిక్షణ పొంది మహిళలు ధరించే నైటీలను కుడుతున్నారు. బయట నుంచి కొన్ని కంపెనీలు నైటీలను బల్క్‌లో కుట్టడం కోసం అవపరమైన క్లాత్, దారంను అందిస్తున్నాయి. ఒక్కో నైటీ కుట్టినందుకుగాను వీరికి రూ.40 కూలీ ఇస్తుంటారు. నైట్ షెల్టర్‌లో వసతులు బాగున్నాయని ఆశ్రయం పొందుతున్న మహిళలు చెబుతున్నారు. పేట్లబురుజులో 20 మంది బస దూద్‌బౌలి: పేట్లబురుజులోని వార్డు కార్యాలయంలో నైట్ షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో గతంలో 30 మంది ఉండగా... ప్రస్తుతం 20 మంది బస చేస్తున్నారు. వీరికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భోజన సదుపాయంతోపాటు దుప్పటి, బకెట్, సబ్బులు, పరుపుతో కూడిన మంచం ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్ కేర్‌టేకర్ ఖాలేద్ ఖాన్ మాట్లాడుతూ... 20 మందికి సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారికి సమయానికి భోజన, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఒక వేళ అధిక సంఖ్యలో సభ్యులు చేరితే వారిని బేగంపేట్ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు. బేగంపేటలో 50 మంది... సనత్‌నగర్: బేగంపేట బ్రిడ్జి కింద ఉన్న జీహెచ్ఎంసీ పునరావసం కేంద్రంలో దాదాపు 50 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఇక్కడ ఉంటూ హౌస్ కీపింగ్, ఫ్లంబర్, హోటల్స్, హెల్పర్స్, అడ్డా కూలీలు, కాల్ సెంటర్...ఇలా తమకు తోచిన పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇక ఇక్కడ వసతుల విషయానికొస్తే...నిద్రించేందుకు బెడ్స్, మ్యాట్స్, బెడ్‌షీట్స్, దిండ్లు, సామాన్లు భద్రపరచుకునేందుకు లాకర్స్, టాయిలెట్స్, కిచెన్ అండ్ ఫుడ్, టీవీ తదితర సదుపాయాలున్నాయి. షెల్టర్‌ను ఆనుకునే ఉన్న రూ.5 భోజన కౌంటర్లో చాలా మంది మధ్యాహ్నం భోజనాలు కానిచ్చేస్తారు. రాత్రికి ఎవరైతే షెల్టర్‌లో భోజనం చేయాలనుకుంటారో లిస్ట్ తయారుచేసి, వారికి రూ.20లకు భోజనం అందిస్తారు. నగరం వ్యాప్తంగా ఉన్న షెల్టర్లలోని వారంతా ప్రతి ఏటా అక్టోబర్ 2న కలుసుకుని పరస్పరం తమ అనుభవాలను పంచుకుంటున్నారు. -
గణనీయంగా తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, ఖమ్మంలో 5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, రామగుండంలో 2 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. నగరంలోనూ పెరిగిన చలి తీవ్రత ఈశాన్యం నుంచి వీస్తున్న చలిగాలులు.. శరవేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో నగర వాసులు గజగజలాడుతున్నారు. మంగళవారం నగరంలో కనిష్టంగా 13.6 డిగ్రీలు, గరిష్టంగా 32.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
అర్ధరాత్రి వరకూ సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణ స్నేహితుడు శ్రావణ్ బెంగుళూరు వెళ్తుంటే తోడుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాడు. బస్ రాత్రి 11 గంటలకు స్నేహితుడు బస్ ఎక్కి వెళ్లిపోయాడు. ఇంక కొండాపూర్‌లోని తన రూమ్‌కు వెళ్లడానకి బస్సు కోసం చూస్తే సిటీబస్సు లేదు. షేర్ ఆటోలో వెళ్దాం అంటే రాత్రి కావడంతో ఎంత అడిగితే అంత ఇవ్వాలి. లేకపోతే ఇంటికి వెళ్లలేం. ఇలాంటి సన్నివేశాలకు ఇకపై కాలం చెల్లనుంది. భాగ్యనగరంలో దూర ప్రాంతాలలో ఉండే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి పొద్దు పోయాక కూడా సిటీబస్సులను నడిపించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నిర్ణయించింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల తర్వాత బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. వారికి అండగా ఉండాలని ఆర్టీసీ నిర్ణయించింది. ట్రాఫిక్ సర్వే ఆధారంగా హయత్‌నగర్, ఎన్జీవో కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కుషాయిగూడ, కాళీమందిర్, జీడిమెట్ల, సీబీఎస్, కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బోరబండ, సుచిత్ర, మెహిదీపట్నం, తాళ్లగడ్డ, బడంగ్పేట్, ఉప్పల్ ప్రాంతాల ప్రజలకు కోసం పొద్దుపోయాక బస్సులు అవసరమని గుర్తించారు. ఈ ప్రాంతాలకు అర్థరాత్రి వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
నైట్ సఫారీగా తిరుపతి జూపార్క్
తిరుపతి : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సింగపూర్ తరహా నైట్ సఫారీగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జూ అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్, లే అవుట్లతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో సందర్శకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాలని అటవీ శాఖ యోచిస్తోంది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఆమోదం తెలియజేస్తే జూ అధికారులు టెండర్లకు వెళ్లే అవకాశం ఉంది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతుల మేరకు నైట్ సఫారీ ఏర్పాటుకు పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న జూ మెయిన్ గేటు నుంచి శ్రీవారి మెట్లకు వెళ్లే రోడ్డుకు కుడివైపున నైట్ సఫారీ పనులు చేపట్టడం వల్ల సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే వీలుందని జూ అధికారులు భావిస్తున్నారు. -
రాత్రికి ..రాత్రే తొలగింపు!
⇒ రాత్రికి రాత్రే..తరలిన ‘శివాజీ’ విగ్రహం ⇒ మెరీనాలో కనిపించని నిలువెత్తు ‘గాంభీర్యం’ ⇒ అభిమానుల్లో నిరాశ రాజకీయ పక్షాల వ్యతిరేకత ⇒ అడయార్‌లోని స్మారక మండపంలో ఏర్పాట్లు చెన్నై మెరీనా తీరంలో ఉన్న నడిగర్ తిలగం శివాజీ గణేషన్ విగ్రహాన్ని అధికార వర్గాలు చడీ చప్పుడు కాకుండా, రాత్రికి రాత్రే తొలగించాయి. ఆమార్గంలో గాంభీర్యంగా నిలువెత్తులో ఇన్నాళ్లు అందర్నీ ఆకర్షించిన విగ్రహం గురువారం ఉదయాన్నే అదృశ్యం కావడం సర్వత్రా విస్మయంలో పడ్డారు. నడిగర తిలగం అభిమానుల్లో తీవ్ర ఆవేదన బయలుదేరింది. తొలగించిన విగ్రహాన్ని అడయార్‌లోని శివాజీ స్మారక మండపానికి తరలించారు. ఈ చర్య అభిమానులకు తీవ్ర మనస్తాపం కలిగించింది. సాక్షి, చెన్నై : మెరీనా తీరంలో ఉన్న శివాజీ గణేషన్ తొలింపుతో ఆయన అభిమానుల్లో ఆవేదన నెలకొంది. తెలుగు సినీ రంగంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీలోకానికి ఎంజీయార్, నడిగర్ తిలగం శివాజీ గణేషన్ రెండు కళ్లు లాంటి వారనేది జగమెరిగిన సత్యం. వీరంతా ఇప్పుడు మన మధ్యలో లేరు. అయితే, వారి మదుర జ్ఞాపకాలు వెండి తెర వెలుగుల రూపంలో నేటికీ దర్శనం ఇస్తున్నాయి. వీరిని గౌరవించుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఆ దిశగా తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత జన సంచారంతో నిండిన ప్రదేశంలో ఉన్న మెరీనా తీరంలో నడిగర్ తిలగంకు 2006లో డీఎంకే ప్రభుత్వం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ తీరంలోని కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు కూడలిలో నడిగర్ తిలగం నట ఖ్యాతిని, అభిమానాన్ని, గౌరవాన్ని చాటే విధంగా గాంభీర్యంగా ఈ విగ్రహం దర్శనం ఇస్తుంటుంది. వ్యతిరేకతతో ఆగ్రహం ఎంతో ప్రతిష్టాత్మకంగా డీఎంకే హయంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహంపై 2011లో వ్యతిరేకత బయలుదేరింది. అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో విగ్రహం రచ్చకెక్కింది. ఈ నిలువెత్తు విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న గాంధేయ వాది శ్రీనివాసన్ పిటిషన్ వివాదానికి దారితీసింది. ఈ పిటిషన్‌కు వ్యతిరేకత బయలుదేరింది. విగ్రహాన్ని తొలగించొద్దంటూ సినీ ప్రముఖులు కమిషనరేట్‌ను ఆశ్రయించారు. అభిమానులు ఆందోళనలకు దిగారు. అదే సమయంలో పోలీసుల్ని వివరణ కోరగా, ఆ విగ్రహానికి వ్యతిరేకంగానే రిట్ పిటిషన్ దాఖలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఈ వివాదంతో ఈ పిటిషన్‌ను తాము విచారించబోమంటూ తొలుత విచారించిన బెంచ్ చేతులు ఎత్తేసింది. అలాగే, విగ్రహం తొలగింపునకు జరుగుతున్న కుట్రలపై రాజకీయ పక్షాలు కదిలాయి. తమ గళాన్ని గట్టిగా విన్పించాయి. ఆ విగ్రహాన్ని తొలగించొద్దంటూ డిమాండ్ చేశాయి. అయితే, ఫలితం శూన్యం. రాత్రికి రాత్రే.. మెరీనా తీరంలో నిలువెత్తులో గాంభీర్యంగా 4040 రోజుల పాటుగా దర్శనం ఇస్తూ వచ్చిన నడిగర్ తిలగం శివాజీ విగ్రహం గురువారం ఉదయాన్నే అదృశ్యం కావడం అందర్మీ విస్మయంలో పడేసింది. అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అధికార వర్గాలు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాయి. వెల్డింగ్ మిషన్లు, క్రేన్లు వంటి వాటి సాయంతో అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీశారు. వీర పాండి కట్టబొమ్మన్ పాత్రలో ఇనుప సంకెళ్లను తెంచుతూ శివాజీ గణేషన్ జీవించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ తరహాలో ఆయన విగ్రహాన్ని ఇనుప సంకెళ్లతో కట్టి మరీ లారీల్లో ఎక్కించి విగ్రహం చెక్కు చెదరకుండా అడయార్‌కు తరలించారు. స్మారక మండపంలో విగ్రహాన్ని ఉంచారు. అన్ని పనులు ముగియగానే, త్వరలో ఈ మండపాన్ని ప్రారంభించనున్నారు. అప్పుడే ఈ విగ్రహ దర్శనం అభించనుంది. తొలగించాల్సిందే చివరకు శివాజీ విగ్రహం వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ల విచారణలన్నీ అప్పటి న్యాయమూర్తి అగ్ని హోత్రి, కేకే శశిధర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు చేరాయి. విచారణను ముగించిన ఈ బెంచ్ 2014 జనవరిలో తీర్పును వెలువరించింది. ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేనని కోర్టు తీర్పు ఇవ్వడం అభిమానుల్లో ఆవేదనను మిగిల్చింది. అయితే, దివంగత సీఎం జయలలిత విగ్రహం తొలగింపునకు కొంత సమయాన్ని కోర్టును కోరారు. ఇందుకు కారణం, అడయార్‌లో శివాజీ కోసం నిర్మిస్తున్న స్మారక మండపం పనుల కోసం. ఆ మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆ మండపం పనులు ముగింపు దశకు చేరాయి. మరో విగ్రహం ఏర్పాటు తమ అభిమాన కథానాయకుడి విగ్రహం అదృశ్యంతో అభిమానుల్లో తీవ్ర ఆవేదన బయలుదేరింది. ఆ విగ్రహం ఉన్న దిమ్మె వద్ద గురువారం పాలాభిషేకం చేశారు. మెరీనా తీరంలో మరో విగ్రహం ఏర్పాటు చేసే వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేశారు. శివాజీ కుమారులు, నటులు ప్రభు, రామ్‌కుమార్ మాట్లాడుతూ, చట్టపరంగా మెరీనా తీరంలో మరో విగ్రహం ఏర్పాటుకు అభిమానులతో కలిసి తమ కుటుంబం సైతం ముందుకు సాగుతుందన్నారు. కాగా, ఈ విగ్రహం తొలగింపును రాజకీయపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రాత్రికి రాత్రే తొలగించడం భావ్యమా అని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, వీసీకే నేత తిరుమావళవన్ తీవ్రంగా ఖండించారు. -
నైట్‌క్లబ్ అమ్మాయిలపై కీచకపర్వం
అది ఢిల్లీ శివారు గురుగ్రామ్. నైట్‌క్లబ్స్, షాపింగ్‌మాల్స్ అధికంగా ఉండే ఎంజీ రోడ్ ప్రాంతం. సమయం రాత్రి ఒంటిగంట. నైట్‌క్లబ్స్‌లో డ్యూటీ పూర్తిచేసుకుని ఇళ్లకు బయలుదేరిందో యువతుల బృందం. క్యాబ్ కోసం రోడ్డుమీద ఎదురుచూస్తుండగా వాళ్లను నలుగురు పోకిరీలు చుట్టుముట్టారు. అసభ్య పదజాలంతో మాటలదాడి చేశారు. ప్రతిగా అమ్మాయిలు తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు.. ఐదు నిమిషాల తర్వాత మరో పది మంది స్నేహితులను వెంటేసుకొచ్చి దాడికి పూనుకున్నారు. ఒక అమ్మాయిని బలవతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యతో నిర్ఘాంతపోయిన మిగతా యువతులు.. సివంగుల్లా గర్జించారు. చెప్పులు చేతబట్టి కీచకులపై ప్రతిదాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక ముష్కరులు తోకముడిచారు. శనివారం రాత్రి నడిరోడ్డుపై దాదాపు అరగంటపాటు ఈ రణరంగం సాగింది. అయినాసరే.. ఏ ఒక్కరూ అమ్మాయిలకు అండగా నిలవలేదు. రక్షకభటుల జాడ తెలియరాలేదు. గుమ్మికూడిన జనం దృశ్యాలను కెమెరాల్లో బంధించారేతప్ప, ఇదేంటని నిలదీయలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఇప్పటివరకు పోలీసు కేసు మాత్రం నమోదుకాకపోవడం గమనార్హం. సెక్స్ డీల్స్ ఓపెన్ సీక్రెట్ శనివారం రాత్రి అమ్మాయిలపై కీచకులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్న లాల్ అనే వ్యక్తి ఆ ప్రాంతం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. గురుగ్రామ్‌లోని ప్రఖ్యాత ఎంజే రోడ్డులోనే దాదాపు 15 నైట్‌క్లబ్స్ ఉన్నాయి. ‘ఇక్కడ డ్రగ్స్, సెక్స్ డీల్స్ భారీ ఎత్తున జరుగుతాయన్నది ఓపెన్ సీక్రెట్. మామూళ్ల మత్తులో జోగే పోలీసులు.. విషయం సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాతగానీ స్పందించరు. దీనిపై ఎంతో మంది ఎన్నోసార్లు ఫిర్యాదుచేసినా పరిస్థితిలో మార్పురాలేదు’అని లాల్ పేర్కొన్నాడు. -
ఖురాన్ అవతరించిన శుభరాత్రి
లైలతుల్ ఖద్ర్ ఇస్లాం వెలుగు రమజాన్ నెల పవిత్రమైనది, శుభప్రదమైనది. చివరి పది రోజులకు మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈనెల చివరి పదిరోజుల్లో వేయి నెలలకన్నా విలువైన ఒక మహా రాత్రి ఉంది. ‘ఏతెకాఫ్’ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఈ చివరి పదిరోజుల్లోనే ఆచరిస్తారు. ‘ఈ ఘనమైన రాత్రిని’ గురించి దైవం అల్ ఖద్ర్ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘మేము ఈగ్రంథాన్ని (ఖురాన్) ఒక విలువైన రాత్రిన అవతరింపజేశాం. అది వెయ్యి నెలలకన్నా అత్యంత విలువైనది. దైవదూతలు తమప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రిన దిగి వస్తారు. అది శుభోదయం వరకూ శాంతియుతమైన రాత్రి’. (అల్ ఖద్ర్ 97) మానవజాతికి రుజుమార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని ఖురాన్. రమజాన్ నెలలో, ప్రత్యేకించి చివరిభాగంలోని ‘లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈ రాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధనలు వెయ్యినెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనలతో సమానమంటే దీని ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి రాత్రుల్లో ఆరాధనలు అధికంగా చెయ్యాలని, ఇందులోనే శుభరాత్రి ఉంది కనుక దాన్ని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఆ శుభరాత్రి ఫలానారాత్రి అని స్పష్టమైన నిర్ధారణలేదు. కాని దాన్ని ఖచ్చితంగా ఎలా సొంతం చేసుకోవచ్చో ప్రవక్త స్పష్టంగా వివరించారు. రమజాన్ చివరి పది రోజుల్లోని బేసిరాత్రుల్లో షబెఖద్ర్ను అన్వేషించమని ముహమ్మద్ ప్రవక్త(స) ఉపదేశించారు. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ‘షబెఖద్ర్’ గడుపుతారో వారి పూర్వపాపాలన్నీ మన్నించబడతాయి. మరెవరైతే నిర్లక్ష్యం వహించి ఆ మహా రాత్రిని పోగొట్టుకుంటారో వారికి మించిన దౌర్భాగ్యులు మరెవరూ ఉండరని ప్రవక్త వారి ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతోంది. కనుక ఈ పవిత్రమాసం చివరి పదిరోజుల్లో మామూలుకంటే ఎక్కువగా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరించి దైవప్రసన్నత పొందాలి. అల్లాహ్ మనందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వాయు కాలుష్యంతో రాత్రిళ్లు నిద్రాభంగం!
వాషింగ్టన్: వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలోని వారికి రాత్రి నిద్ర సరిగా ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలుష్య తీవ్రత 60 శాతంగా ఉన్న ప్రాంతాలలోని వారికి రాత్రి నిద్రలో ఆటంకాలు కలుగుతాయని తాజా పరిశోధనలో తేలింది. ‘వాయు కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తులపై భారం పడుతుంది. కానీ మా పరిశోధనల్లో.. వాయు కాలుష్యం నిద్రపై ప్రభావం చూపుతున్నట్లు తేలింద’ని అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ మార్తా వెల్లడించారు. ఆరుపదుల వయసు దాటిన 1,863 మందిని ఎంపికచేసి, వీరిని 4 గ్రూపులుగా విభజించారు. ఓ మాదిరి కాలుష్య ప్రాంతంలో నివసించేవారిని 3 గ్రూపులుగా, అత్యధిక కాలుష్యానికి గురవుతున్న వారిని నాలుగో గ్రూపులో చేర్చి, వారి మధ్య వ్యత్యాసాలను విశ్లేషించారు. ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నవారు నిద్రలేమితో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కారణం గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉండడమేనని నిర్ధారించారు. -
‘ఐటీల్లో మహిళలకు నైట్ షిప్ట్స్‌కు నో’
బెంగళూరు: రాత్రి వేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ ఒకటి స్పష్టం చేసింది. ఐటీ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో రాత్రి వేళల్లో మహిళలకు షిప్ట్‌లు వేయొద్దని సూచించింది. వారి భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే బెంగళూరులోని ఏ కంపెనీ కూడా మహిళలకు రాత్రి పూట విధుల అప్పగించరాదని స్పష్టం చేసింది. మహిళ సంరక్షణ, చిన్నారుల సంక్షేమంపై కర్ణాటక ప్రభుత్వం ఓ శాసనసభా కమిటీని వేసింది. దీనికి ఎన్ఏ హ్యారిస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ చివరకు ఐటీ, బీటీ రంగాల్లో మహిళలకు విధులు రాత్రి వేళల్లో అప్పగించరాదని, అందుకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేసింది. వారికి ఉదయం లేదా మధ్యాహ్న వేళల్లో మాత్రమే బాధ్యతలు ఇవ్వాలని చెప్పింది. ఆయా కంపెనీలు రాత్రి పూట పనులకు పురుషులనే ఉపయోగించుకోవాలని సూచించింది. గత ఏడాది(2016) సెప్టెంబర్ 9 ఈ కమిటీ బెంగళూరులోని ఇన్ఫోసిస్, బైకాన్ వంటి కంపెనీలకు వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుని తాజాగా ఈ ప్రతిపాదనలు చేసింది. -
నైట్ షిఫ్ట్‌లో మహిళలు.. ఈ సమస్య తప్పదు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగం, లేదా ఏదైనా ఉపాధికోసం పని చేయడం మంచిదే.. అయితే కొన్ని విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే మహిళల్లో సంతానోత్పత్తిపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తాజా సర్వే (స్టడీ వెనస్ డే)లో తేలింది. గతంలో పనికి, సంతానోత్పత్తికి సంబంధించి అధ్యయనాలు జరిగాయి. అయితే తొలిసారిగా షిఫ్ట్ ల వారీగా పని, ఆ పని శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. దాని ప్రభావం పుట్టబోయే సంతానంపై ప్రభావం చూపనుందా అనే కోణంలో అమెరికా రీసెర్చర్స్ ఈ అధ్యయనం చేశారు. మసాచుసెట్స్‌లో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చిన దాదాపు 400 మంది మహిళల(సగటు వయసు 35)పై ఈ సర్వే చేశారు. 40 శాతం మహిళలు శారీరక శ్రమ చేస్తున్నారని, 91 శాతం మహిళలు రెగ్యూలర్ ఆఫీస్ వేళల్లో జాబ్ చేస్తున్నట్లు వెల్లడైంది. శారీరక శ్రమ చేసేవారు, నైట్ షిఫ్ట్‌లో జాబ్ చేసేవారిలో అండాల ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. ప్రతి తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు సరైన ఆహార నియమాలు పాటించడం లేదని, ఇతరత్రా కారణాల వల్ల అండాల నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పత్తిరేటుపై ప్రతికూల ప్రభావం ఉందని అమెరికా రీసెర్చర్స్ తెలిపారు. వీటితో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ చన్న జయసేన ఇంపీరియల్ కాలేజ్ బృందం వెల్లడించింది. -
పగలు ఎండ... రాత్రి చలి
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణం మారింది. కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో రాత్రిళ్లు చలి కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత కనిపిస్తోంది. గురువారం అగళి మండలంలో కేవలం 9.5 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా కొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అగళితో పాటు తనకల్లు 10.3 డిగ్రీలు, మడకశిర 10.4, రొద్దం 10.8, అమరాపురం 11.9, గాండ్లపెంట 12, చెన్నేకొత్తపల్లి 12.3, కనగానపల్లి 12.3, గుమ్మగట్ట 12.6, ఎన్పీ కుంట 12.6, తలుపుల 12.9 కనిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పలు మండలాల్లో 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడంతో ఎండ తీవ్రత పెరిగింది. ఇందులో కొన్ని మండలాల్లో కనిష్టం, గరిష్టం రెండూ నమోదు కావడం విశేషం. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87 శాతం, మధ్యాహ్న సమయంలో కేవలం 10 నుంచి 20 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మొత్తమ్మీద ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు చురుగ్గా ఉండటంతో మున్ముందు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండతీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
నైటౌటా..? ఎక్కువ నిద్రపోండి!
టొరంటో: రాత్రంతా మెలుకువగా ఉండి చేయాల్సిన పనులేమైనా మీకు ఉన్నాయా? అయితే అంతకుముందు రోజు కాస్త ఎక్కువ నిద్రపోండి. ఇక మరుసటి రాత్రికి మీ మెదడు పనితీరు మెరుగుపడటంతోపాటు, పనులు కూడా మరింత కచ్చితత్వంతో చేయగలరట. కెనడాలోని కల్గరీ విశ్వవిద్యాలయం వారు పరిశోధన చేసి ఈ విషయం చెబుతున్నారు. పరిశోధనకు వారు 12 మంది పూర్తి ఆరోగ్యవంతులైన, యుక్త వయసులో ఉన్న పురుషులను ఎంపిక చేసుకున్నారు. రెండు వారాల పాటు పరిశోధన చేసి పురుషులు ఎక్కువ సేపు నిద్ర మేల్కొని ఉన్నపుడు వారి మెదడు పనితీరు, అలసట స్థాయిలను పరిశీలించి ఈ విషయం తేల్చారు. -
పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. శనివారం గుత్తిలో 14.5 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా... బెళుగుప్పలో 14.9 డిగ్రీలు, గుంతకల్లు 15.3 డిగ్రీలు, బొమ్మనహాల్ 15.4 డిగ్రీలు, కంబదూరు 16.2 డిగ్రీలు, యాడికి 16.6 డిగ్రీలు, కళ్యాణదుర్గం, కనేకల్లు 16.8 డిగ్రీలు మేర కొనసాగాయి. మిగతా మండలాల్లో 17 నుంచి 21 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87, మధ్యాహ్నం 28 నుంచి 38 మధ్య ఉంది. గాలులు గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. రాత్రి ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగినా చలితీవ్రత ఇంకా కొనసాగుతోంది. -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేర తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండల్లో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, హైదరాబాద్‌లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదయ్యాయి. -
పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం అగళి మండలంలో 14.8 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా తక్కిన మండలాల్లో 16 నుంచి 20 డిగ్రీల వరకు కొనసాగాయి. నాలుగైదు మండలాల్లో 20 డిగ్రీలకు పైబడి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పగలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్న సమయంలో 25 నుంచి 40 మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. చలికాలం మధ్యలోనే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవి సంకేతాలు ముందస్తుగానే కనిపిస్తున్నాయి. -
టర్కీ నైట్ క్లబ్బులో దుండగుడి కాల్పులు
► 39 మంది మృతి.. 70 మందికి గాయాలు ► మృతుల్లో ఇద్దరు భారతీయులు ఇస్తాంబుల్: ఉగ్ర దాడులతో అట్టుడుకుతున్న టర్కీలో కొత్త సంవత్సరం కూడా నరమేధంతోనే మొదలైంది. ఇస్తాంబుల్‌లో ఆదివారం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న ప్రముఖ నైట్ క్లబ్బులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 39 మంది మృతిచెందగా, 70 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు సహా పలువురు విదేశీయులు, టర్కీ పౌరులు ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 1.15 గంటలకు శాంటాక్లాజ్ దుస్తుల్లో వచ్చినట్లు భావిస్తున్న ముష్కరుడు బాస్ఫోరస్ నది ఒడ్డున ఉన్న రీనా క్లబ్బు ప్రవేశ మార్గం వద్ద తొలుత ఓ పోలీసును, ఓ పౌరుణ్ని కాల్చి చంపాడు. తర్వాత లోపలికెళ్లి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కాల్పుల సమయంలో క్లబ్బులో 700 మంది ఉన్నారు. ప్రాణభయంతో పలువురు నదిలోకి దూకారు. దాడికి ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. ఇంతవరకు గుర్తించిన 20 మృతదేహాలను బట్టి 15 మంది విదేశీయులు, ఐదుగురు టర్కీ వాసులు చనిపోయినట్లు తేలిందని, గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోం మంత్రి సోయ్లూ చెప్పారు. క్షతగాత్రుల్లో పలువురు అరబ్బులు ఉన్నారని అధికారులు చెప్పారు. ఓవర్‌కోటులో తుపాకీ దాచుకుని వచ్చిన దుండగుడు దురాగతం తర్వాత వేరే దుస్తులు ధరించి పారిపోయాడన్నారు. నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతల కోసం 17 వేల మంది పోలీసులను మోహరించగా, వారిలో కొందరు శాంటాక్లాజ్ దుస్తుల్లో ఉన్నట్లు మీడియా తెలిపింది. మృతుల్లో ఇద్దరు జోర్డాన్ వాసులు, ఇద్దరు టునీషియన్లు, ఒక ఇజ్రాయెలీ మహిళ, ఒక బెల్జియన్ పౌరుడు ఉన్నారు. దాడి అమానవీయమని రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు గర్హించాయి. దాడి పాశవికమన్న భారత ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపారు. ఈ దారుణంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు భయాందోళనల నడుమ సాగాయి. గత ఏడాది డిసెంబర్ 10న ఇస్తాంబుల్‌లోనే జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 44 మంది చనిపోయారు. తామే ఈ పేలుళ్లకు నిషిద్ధ పీకేకే (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) అనుబంధ సంస్థ కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ప్రకటించుకుంది. జూన్ లోనూ నగరంలోని ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 47 మంది బలయ్యారు. అల్లర్లు రెచ్చగొట్టడానికే తాజా దాడి చేశారని, ఇలాంటి వాటికి బెదరబోమని దేశాధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగాన్ అన్నారు. జూలై నాటి ఆర్మీ తిరుగుబాటు నుంచి ఇంకా కోలుకోని టర్కీ ఉగ్రదాడులతో మరింత సతమతమవుతోంది. తమ సరిహద్దులోని ఐసిస్, కుర్దూ మిలిటెంట్లను తరిమి కొట్టేందుకు టర్కీ ఆర్మీ సిరియాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యం చేసుకుంటున్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ కుమారుడు బలి న్యూఢిల్లీ: ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మృతిచెందారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకరిని రాజ్యసభ మాజీ ఎంపీ, బాడీ బిల్డర్ అక్తర్ హసన్ రిజ్వీ కుమారుడైన అబిస్ రిజ్వీగా, మరొకరిని గుజరాత్ మహిళ ఖుషీ షాగా గుర్తించామని, టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్ వెళ్తున్నారని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులు టర్కీ వెళ్లేందుకు వీసా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
చలిగిలి
చలి పంజా విసిరింది. చిన్నా పెద్దా..ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ గజగజవణుకుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి ఉషో్ణగ్రత 14,15 డిగ్రీలకు పడిపోతుండటంతో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లపైనే జీవితాన్ని గడిపే నిరాశ్రయులు, పారిశుద్ధ్య కార్మికులు, చిరువ్యాపారులు, పనిచేస్తే కానీ పూటగడవని కూలీల పరిస్థితి చెప్పనక్కరలేదు. చలికి వణుకుతూ వారు పడే యాతన అంతా ఇంతా కాదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలలో ప్రయాణికులు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బెడ్షీట్లు, టవళ్లు, సె్వటర్ కప్పుకొని, మరికొందరు టీ తాగుతూ, ఇంకొందరు చలిమంటలు వేసుకుంటూ వెచ్చదనం పొందుతున్నారు. - వి. శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఏటీఎంలకు పోటెత్తిన జనం
- రాత్రి సమయాల్లో కూడా కేంద్రాల వద్ద క్యూ - నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న ఖాతాదారులు కర్నూలు(అగ్రికల్చర్): నగరంలో రాత్రిళ్లు సైతం ఏటీఎంలు జనంతో కిటకిటలాడుతున్నాయి. కేవలం ఎస్బీఐకి చెందిని నాలుగైదు ఏటీఎంలలో మాత్రమే నగదు పెడుతుండటంతో రాత్రివేలల్లో సైతం వీటికి జనం పోటెత్తుతున్నారు. రాత్రిపూట అయితే ఏటీఎం ల దగ్గర రద్దీ ఉండదు. కనీసం రూ.2500 అయినా తెచ్చుకోవచ్చని వచ్చిన వారు ఇక్కడి జానాన్ని చూ సి షాక్‌కు గురవుతున్నారు. అర్ధరాత్రి సైతం ఏటీఎంల దగ్గర 20 నుంచి 30 మీటర్ల మేర క్యూలైన్లుండటంతో బిత్తరపోతున్నారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచీ, మెడికల్ కాలేజీల దగ్గర ఉన్న ఏటీఎంలకు రాత్రిళ్లు తాకిడిపెరిగింది. గంటల పాటు లైన్లో ఉన్నా చివరి నగదు కాళీ అవుతుండటంతో నగదు పెట్టేంత వరకు వెల్లేది లేదని ఏటీఎంల్లోనే కూర్చుంటున్నారు. -
'ఎర్ర' దొంగలు అరెస్ట్
- 11 మంది నిందితుల్లో ప్రకాశం జిల్లా, కర్ణాటక వాసులు - 64 దుంగలు, రెండు కార్లు స్వాధీనం కర్నూలు: 'ఎర్ర దొంగలు' అవుకు నుంచి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తూ పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొల్లగొట్టిన ఎర్ర చందనం దుంగలను కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లా మీదుగా బెంగళూరుకు తరలించేవారు. అక్కడ పోలీసు నిఘా పెరగడంతో మరో దారి గుండా ఎర్ర చందనాన్ని తరలించే ప్రయత్నంలో దొంగలు దొరికిపోయారు. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా అవుకు మండలం పాతచెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఏపీ09 టీవీ3, ఏకే01 పి 5310 కార్లలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేయగా అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. అవుకు మండలం సంగపట్నం గ్రామం పొలిమేరలో ఎస్ఆర్బీసీ కెనాల్ దగ్గర పొలాల్లో దాచి ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను, వాటిని రవాణా చేస్తున్న వ్యక్తులను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఓఎస్డీ రవిప్రకాష్, డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద వద్ద నుంచి రూ.8 లక్షలు విలువ చేసే 64 ఎర్ర చందనం దుంగలు, నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు సుమారు 13 టన్నులు ఉంటుంది. పట్టుబడిన నిందితులు: అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన దుర్గా నూర్ బాషా, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన షమీవుల్లా, సులేబైలు హబీబుల్లా, వూంలేబైలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నదికోట గ్రామానికి చెందిన బాణాల చెన్నకేశవ, గంధం నాగేంద్రప్రసాద్, దిగువమెట్ట గ్రామానికి చెందిన పసుపుల బేబితో పాటు, తుమ్మలపల్లె గ్రామానికి చెందిన సారే కాశయ్య, సూరేపల్లె గ్రామానికి చెందిన పఠాన్ మాబూవలి, పెద్ద మస్తాన్‌రెడ్డి తదితరులను అరెస్టు చేశారు. రెండేళ్లుగా కొనసాగుతున్న అక్రమ రవాణా... గిద్దలూరు ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనం రవాణా రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన నూర్ బాషా మిరప పంటను గుంటూరుకు తీసుకెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమిట్ట గ్రామం వద్ద టీ దుకాణం నిర్వహించే బేబీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మిర్చీ వ్యాపారి నూర్ బాషాకు ఎర్ర చందనం రవాణాదారులు షమీవుల్లా, హబీబుల్లాకు కూడా టీ స్టాల్ వద్ద పరిచయం పెరిగింది. ఈ క్రమంలో నూర్ బాషా ద్వారా షమీవుల్లాకు, అక్కడి నుంచి హబీబుల్లాకు ఎర్ర చందనం సరఫరా చేసే క్రమంలో నిందితులందరూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్ర దొంగలను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నందుకు బనగానపల్లె సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాకేష్, జయలక్ష్మి, అవుకు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి, డోన్ ఎస్ఐ శ్రీనివాస్, అవుకు పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బంది శ్రీనివాస్, ప్రసాద్, మోహన్‌రాజు, పురుషోత్తం, బనగానపల్లె హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడు, సిబ్బంది నాగన్న, మహేష్, ఖాసీం వలి, హుసేనయ్య, మధుసూదన్, సురేష్, రమేష్, రాజశేఖర్, నాగన్న, భారతి, సుల్తాన్, కంబగిరి స్వామి తదితరులను ఎస్పీ అభినందించారు. -
బాబోయ్.. చలి
రాష్ట్రవ్యాప్తంగా భారీగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి వేళల్లో 4 నుంచి 8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో కనిష్టంగా 11 డిగ్రీలు, హైదరాబాద్‌లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 8 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. మెదక్, నల్లగొండ, హైదరాబాద్, హన్మకొండల్లో సాధారణం కంటే 7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ ప్రభావంతో రాత్రి వేళలో చలిగాలులు వీస్తున్నాయి. మధ్యలో ఉష్ణోగ్రతలు కొద్దిగా అటుఇటుగా ఉన్నా సంక్రాంతి వరకు చలి తీవ్రత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు కాగా, రాత్రి 13 డిగ్రీలుగా ఉంది. మెదక్‌లో పగలు 31 డిగ్రీలు, రాత్రి ఏకంగా 11 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్‌లో గరిష్టంగా 31 డిగ్రీలు ఉండగా.. కనిష్టంగా 12 డిగ్రీలు ఉండటం గమనార్హం. మారిన వాతావరణ పరిస్థితులు, చలి గాలుల తీవ్రత, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ తేడా వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోతుందని, వేడి పెరిగిన సమయంలో దీనివల్ల పగుళ్లు ఏర్పడతాయని చర్మ నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శరీరానికి చలి తగలకుండా, శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం మొత్తం కప్పి ఉంచేలా ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాతే నడక, ఇతర పనుల కోసం బయటకెళ్లాలని పేర్కొంటున్నారు. -
ఆ లైబ్రరీలో అమ్మాయిలకు రాత్రిపూట కర్ఫ్యూ!
సాధారణంగా పీజీ వైద్యులు, ఇంటర్న్‌షిప్ చేసేవారు, యువ రెసిడెంట్ డాక్టర్లను అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే పిలవడం సర్వసాధారణం. పుణెలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (బీజేఎంసీ) కూడా ఇలాగే చేస్తారు. కానీ, కాలేజి లైబ్రరీలో అర్ధరాత్రి చదువుకోవాలంటే మాత్రం.. అమ్మాయిలకు కర్ఫ్యూ విధిస్తున్నారు. బీజేఎంసీ డీన్ అజయ్ చందన్వాలే తీసుకున్నఈ నిర్ణయం పట్ల విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11.15 అయ్యేసరికల్లా కాలేజి గార్డులు లైబ్రరీకి వెళ్లి అక్కడున్న అమ్మాయిలందరినీ వాళ్ల వాళ్ల హాస్టళ్లకు పంపేస్తున్నారు. అబ్బాయిలు మాత్రం ఎంతసేపు కావాలన్నా ఉండి చదువుకోడానికి వీలుంటోంది. అయితే ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులకు ఆడ.. మగ తేడా ఆధారంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడానికి బదులు, వాళ్లకు తగిన రక్షణ కల్పించాలని అంటున్నారు. కానీ చందన్వాలే మాత్రం తమ కొత్త నిబంధనలను సమర్థించుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కూడా అమ్మాయిలు చదువుకోడానికి లైబ్రరీకి వస్తున్నారని, ఇది వారికి ఏమాత్రం సురక్షితం కాదనే తాము ఈ నిబంధనలు విధించామని అన్నారు. మొదటి ఐదున్నరేళ్ల పాటు ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలు రాత్రి 9.30 గంటలకల్లా తిరిగి హాస్టళ్లకు చేరుకోవాల్సిందే. ఇక్కడ కూడా అబ్బాయిలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొంత క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఉండాలని, అప్పుడే కాలేజి హాస్టళ్లలో అమ్మాయిలకు తగినంత భద్రత ఉంటుందని చందన్వాలే చెప్పారు. మరి అబ్బాయిలకు ఇవి వర్తించవా అంటే.. తాము మహిళల భద్రత గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నామని, త్వరలోనే అబ్బాయిలకు కూడా ఈ నిబంధనలు వర్తింపజేస్తామని ఆయన వివరించారు. విద్యార్థినుల వాదన వేరేలా ఉంది. తమకు ఒక నెలలో ఆలిండియా పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష ఉందని, పుస్తకాలు కొనాలంటే చాలా ఖరీదు అవుతున్నందున.. తప్పనిసరిగా లైబ్రరీలోనే చదువుకోవాలని.. ఎక్కువసేపు అక్కడ ఉంటే తప్ప తమకు పోర్షన్లు పూర్తికావని.. ఇలాంటి సమయంలో ఆంక్షలు పెట్టడం వల్ల ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు రావడం కష్టమవుతుందని వాపోయారు. ఒక్కొక్కళ్లు ఒక్కోలా చదువుతారని, కొందరు తెల్లవారుజామునే లేచి చదివితే మరికొందరికి అర్ధరాత్రి ఎంతసేపయినా మెలకువగా ఉండి చదవడం అలవాటు ఉంటుందని.. అలాంటప్పుడు తమపై ఆంక్షలు పెడితే ఎలాగని మరో ఇంటర్న్ విద్యార్థిని ప్రశ్నించింది. -
ఇకపై పోలీసుల చేతుల్లో నిఘా నేత్రం
– జిల్లాకు 15 సోనీ హ్యాండ్ కెమెరాలు కేటాయింపు – అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలపై వీటితో నిఘా – పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు : నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాకు 15 సోనీ హ్యాండీ కెమెరాలు వచ్చాయి. గత నెలలో జిల్లాకు నాలుగు డ్రోన్ కెమెరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.వీటి నిఘాతో పోలీసులు అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జన సమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. వాటి వినియోగంపై ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు శిక్షణ కూడా పొందారు. పోలీసుల చేతుల్లో ఇకపై నిఘా నేత్రాలు ఉంటాయి. అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలను హ్యాండ్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్ కెమెరాలతో రహస్యంగా షూట్ చేసి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి హ్యాండ్ కెమెరాలు ఉపయోగపడతాయని ఎస్పీ ఆకె రవికృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో హ్యాండ్ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించి ప్రారంభించారు. ధర్నాలు, రాస్తారోకోలు, అల్లర్లు, ఉత్సవాల వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కానిస్టేబుళ్లు ఇకపై వీటిని ఖచ్చితంగా వినియోగిస్తారని వెల్లడించారు. హ్యాండ్ కెమెరాలను డీఎస్పీ, క్రైం బ్రాంచ్ కార్యాలయాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, మురళీధర్, వెంకటాద్రి, సుప్రజ, కొల్లి శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, వినోద్‌కుమార్, బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లు, థియేటర్లు ఇక 24గంటలు
ముంబై మహానగరంలో హోటళ్లు, థియేటర్లు, మాల్స్, కాఫీ హౌస్ లు ఇక 24X7 నడవనున్నాయి. యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే 2013లో చేసిన ఈ ప్రపోజల్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. నైట్ ప్లాన్ కింద దీనిని ఆదిత్య వివరించినప్పుడు బీజేపీ, మిగిలిన రాజకీయపార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. కేవలం బడా వ్యాపారులకు మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఆరోపించాయి. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ఆదిత్య నైట్ లైఫ్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న వారికి ముంబై నగరం గురించి తెలియదని అన్నారు. ఈ స్కీమ్ అందరికీ వర్తింస్తుందని చెప్పారు. నైట్ లైఫ్ ప్లాన్ కు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆమోదం కూడా పడింది. ఫుడ్ స్ట్రీట్ ల ఎంపిక కూడా పూర్తయింది. వీటిలో బీకేసీ, డాక్ యార్డు, నారిమన్ పాయింట్లు కూడా ఉన్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలో ఉన్న శివసేన, కేంద్రప్రభుత్వాలు కూడా ఈ స్కీమ్ బిల్లును పాస్ చేశాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మాత్రమే మిగిలివుందని ఆదిత్య తెలిపారు. నైట్ లైఫ్ ప్లాన్ ద్వారా రాష్ట్ర రెవెన్యూని పెంచుకోవచ్చని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించుకోగలగడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందుతుందని చెప్పారు. ప్లాన్ లో భాగస్వామ్యమయ్యే హోటళ్ల కు సింగింల్ విండో పద్ధతి ద్వారా లైసెన్స్ లు మంజూరు చేస్తామని చెప్పారు. -
మూడో కన్ను మూత
⇒ మహానందిలో మూడు రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు ⇒ పట్టించుకోని ఉన్నతాధికారి మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో నిఘా నేత్రాలు మూడురోజులుగా మూతపడ్డాయి. వర్షం వస్తుండడంతో వైర్లు పాడవుతాయంటూ నిఘా వ్యవస్థనే మూసేయడం గమనార్హం. ఆలయంలో హుండీలు, రూ. లక్షల విలువైన ఆభరణాలు ఉండటం, వేలాదిగా భక్తులు దర్శనానికి వస్తుండడం, కోనేరుల వద్ద తరచూ చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలా సీసీ కెమెరాలను మూసేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ భద్రతపై ప్రత్యేక దష్టి పెట్టామని, మరో 22 సీసీ కెమెరాలు వస్తున్నాయని ప్రకటనలు చేస్తున్న ఉన్నతాధికారులు వర్షం సాకుతో వాటిని నిలిపేయడం గమనార్హం. మహానందిలో ఆలయ, భక్తుల భద్రత దష్ట్యా సుమారు 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు ఇదివరకటి నుంచే పని చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత వర్షాల కారణంగా మిగతా కెమెరాలు కూడా పనిచేయడం లేదు. వర్షం వస్తుండడంతో సర్వర్ ఆఫ్ చేశామని, విషయాన్ని ఉన్నతాధికారికి తెలియజేశామని అక్కడి తాత్కాలిక ఉద్యోగి శివ సాక్షికి తెలిపారు. క్షేత్రంలో సీసీ కెమెరాల ఆపరేటింగ్ సిస్టమ్ నిలిపేయడం దారుణమని, ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యులంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే వరుసగా నాలుగు చోరీలు జరిగాయి. శనివారం సెల్‌ఫోన్ లాకర్ల వద్ద సిబ్బంది, భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వాటి వివరాలు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన ఉద్యోగి.. వేళలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సెల్‌ఫోన్ లాకర్ల వద్ద వాగ్వాదం.. గుడి తలుపులు మూసేస్తారన్న విషయం చెప్పకుండా సెల్ఫోన్లను లాకర్లో ఉంచుకున్న విషయంపై శనివారం భక్తులు, అక్కడి సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటర్ వద్ద రశీదు పుస్తకం చించేయడంతో సిబ్బంది వాదనకు దిగారని కాంట్రాక్టర్ తెలిపారు. విషయంపై ఈఓతో మాట్లాడగా విచారణ చేపడతామని తెలిపారు. -
జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ మంజూరు
– పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు: డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ కేటాయించారు. నేరాల నియంత్రణకు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించిన పోలీసు అధికారులు ఇకపై డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జనసమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించే అవకాశం ఉంది. కెమెరా నిర్వహణపైన జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు 6వ బెటాలియన్ మంగళగిరిలో శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ డ్రోన్ కెమెరాను రిమోట్‌తో ఆపరేట్ చేసి పనితీరును పరిశీలించారు. టెక్నాలజీ వాడకంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండే విధంగా డ్రోన్ కెమెరా వాడకాన్ని వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ సి.వి.నరసింహులు, ఆర్ఎస్ఐ నగేష్, ఏఆర్పీసీలు ఓబులేసు, విజయ్‌కుమార్, ఐటీ కోర్డు టీం పీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీని ప్రత్యేకత: డ్రోన్ కెమెరా 2006లో చైనా దేశస్థులు కనుగొన్నారు (ద జియాన్ ఇన్నోవేషన్) డీజేఐ ప్యాంథమ్ 4 బరువు 1380 గ్రాములు, 800 నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి వెళ్తుంది. 3 నుంచి 5 కిలో మీటర్ల దూరం వరకు రిమోట్, జీపీఎస్ సహాయంతో పనిచేస్తుంది. ట్యాబ్, ఐప్యాడ్, సెల్‌ఫోన్ సహాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు. -
నిఘా నేత్రం..ఉద్యమ రూపం
– ప్రచారం కోసం పదివేల పోస్టర్లు – వ్యాస్ ఆడిటోరియంలో ఆవిష్కరణ – ప్రజాచైతన్యం కోసం త్వరలో పాటపాడనున్న ఎస్పీ ఆకె రవికృష్ణ – సీసీ టీవీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కర్నూలు – ఆగస్టు 17వ తేదీ పాతబస్తీకి చెందిన శ్యామలమ్మ బంగారునగలు రిపేరు చేసుకునేందుకు కాలి నడకన వెళ్తుండగా, సూపర్ స్వీట్స్ పమీపంలో పర్సు జారిపడి పోయింది. అదేమార్గం గుండా వెళ్తున్న ఒక వ్యక్తి పర్సు గుర్తించి, తెరిచి చూడగా అందులో బంగారు నగలు ఉన్నాయి. అతను జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఆలస్యంగా తేరుకున్న బాధితురాలు తిరిగి అదే మార్గం గుండా గాలించినా పర్సు దొరకలేదు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,అదే మార్గంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఉన్న సీసీ పుటేజీలో నిందితున్ని గుర్తించి రెండున్నర్ర రోజుల వ్యవధిలోనే బంగారు నగలును రికవరీ చేశారు. – జనవరి 18వ తేదీన సరస్వతి నగర్లో ఉదయం 10.30 గంటల సమయంలో ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి నడుచుకుంటూ విధులకు వెళ్తుండగా, దార్వాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు మోటర్ సైకిల్‌పై ఆమెను సమీపించి, రెండు తులాల బంగారు నగలు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, సమీపంలో బాలాజి హాస్టల్లో ఉన్న సీసీ పుటేజీ ద్వారా మూడో పట్టణ పోలీసులు.. నిందితులు సలీమ్, మహ్మద్ అలీగా గుర్తించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని, నేర నియంత్రణే కాకుండా, దర్యాప్తులోనూ ఆలస్యం జరగకుండా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీసీ కెమెరాల ఆవశ్యకతను గురించి వివరించారు. బంగారు నగలు పోగొట్టుకున్న పాతబస్తీ మహిళ శ్యామలను అక్కడికి రప్పించి ఆమె అనుభవాన్ని చెప్పించారు. మహిళల భద్రత, సమాజ రక్షణ కోసం సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రచారం కోసం పదివేల పోస్టర్లు సీసీ టీవీల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు పదివేల వాల్ పోస్టర్లను సిద్ధం చేశారు. నేర రహిత సమాజ స్థాపన కోసం పోలీసులు తీసుకునే చర్యలకు జిల్లా ప్రజలు సహకరించాలంటూ పోస్టర్లలో ముద్రించారు. కళాశాల, స్కూల్ బస్సులు, ఆటోలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే ప్రాంతాల్లో వాటిని అతికించి అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఎస్పీ స్వయంగా ఆటోలకు వాల్‌పోస్టర్లను అతికించి, కింది స్థాయి సిబ్బందికి ఆ బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, సీఐలు కష్ణయ్య, ములకన్న, నాగరాజురావు, నాగరాజు యాదవ్, మధుసూదన్‌రావు, ఆర్ఐ జార్జ్, ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సీసీటీవీల ఏర్పాటుపై త్వరలో పాప్గీతం నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెయ్... చెయ్... నేత్రదానం అంటూ పాప్సాంగ్ పాడిన ఎస్పీ ఆకె రవికష్ణ తనలోని కళను మరోసారి ఆవిష్కరించేందుకు ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. పెట్టు.. పెట్టు.. సీసీ టీవీ పెట్టు.. తల్లికి.. చెల్లికి.. సమాజ రక్షణ కోసం.. సీసీ టీవీ పెట్టు... అంటూ త్వరలోనే సీసీ టీవీలపై పాప్గీతం పాడి వీడియో, ఆడియో రూపంలో విడుదల చేయనున్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు, అపార్టుమెంటు వాసులు, శివారు కాలనీల ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఎస్పీ స్వీయ రచన చేశారు. పాతబస్తీకి చెందిన ముగ్గురు యువకులు ఈ పాప్గీతానికి సంగీతం సమకూర్చనున్నారు. -
ఆలయంలో చోరీ
నందిపేట : మండలంలోని వన్నెల్ కే గ్రామంలోని శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై జాన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పూజారి నరేశ్ శర్మ గురువారం రాత్రి ఆలయంలో పూజలు చేసిన అనంతరం గుడిని మూసివేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆలయంలో హుండీలో గల నగదుతో పాటు సీతమ్మ విగ్రహం మెడలో గల నాలుగు మాసాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైంది. ఆలయ చైర్మన్ దేగాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం తీస్తున్న కునుకు
⇒ డ్రైవర్లకు కొరవడిన విశ్రాంతి ⇒ అర్ధరాత్రి దాటిన తర్వాత అధిక వేగం ⇒ రాత్రివేళ ప్రయాణాల జోరు ⇒ ‘రెప్ప’పాటులోనే రోడ్డు ప్రమాదాలు తిరుపతి : జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల డ్రై వర్లకు తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడంతో వారు కునుకు తీస్తున్నారు. దీనికితోడు అతివేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నారు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలూ డ్రైవర్లు కునుకు తీయడంతోనే చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి వద్ద గత వారం బస్సు బోల్తా పడడానికి కూడా డ్రైవర్ కునుకే కారణమని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి మలుపు వద్ద బోల్తా కొట్టింది. డ్రై వర్ కునుకుతీయడంతోపాటు అతివేగంగా వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా సోమవారం విజయవాడలో కృష్ణా పుష్కరాలు ముగించుకుని ఇంటికి బయలుదేరిన మదనపల్లె నెహ్రూవీధికి కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిలోని సి.మల్లవరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ రెండు రోజులుగా నిద్రలేకుండా వాహనాన్ని నడపడంతో కునుకు తీశాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 10 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన నలుగురు శ్రీవారి దర్శనం కోసం కారులో బయలుదేరారు. వేకువజామున 2 గంటల ప్రాంతంలో డ్రైవింగ్ చేసే వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి సమయంలోనే ఎక్కువ జిల్లాలో గత ఏడాది సుమారు 1800 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో రాత్రి సమయంలోనే అధిక శాతం జరగ్గా, తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా గత ఏడాదిలో రోడ్డు ప్రమాదంలో 570 మందికి పైగా మతిచెందారు. 1272 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో రాత్రి సమయంలో ప్రమాదం బారిన పడిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు. తెల్లవారుజామున జాగ్రత్త అవసరం తెల్లవారజామున 2 నుంచి 6 గంటల వరకు నిద్ర ఆపుకుందామనుకున్నా కష్టం. ఈ సమయంలో నిద్ర ముంచుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. మిగతా సమయంలో ఎలా ఉన్నా ఈ 4 గంటలు డ్రైవర్ పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకుంటే కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు... ⇒ దూరప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్కడో ఒక చోట ఆగి నిద్రపోవడం ఉత్తమం. ⇒ 2, 3 గంటలకు ఒకసారి డ్రైవర్‌కు టీ తాగేందుకు అవకాశం ఇవ్వాలి. డ్రై వింగ్ సమయంలో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తుండాలి. ⇒ పోలీస్‌శాఖ పరిధిలో పట్రోలింగ్ వాహనాలు రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తాయి. ఏదో ఒక చోట అర్ధరాత్రి వెళ్లే వాహనాలను తరచూ తనిఖీ చేయడం ద్వారా అందులో ఉన్న వారు అప్రమత్తమవుతారు. దీని ద్వారా కొంతదూరం నిద్రలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. గస్తీ సమయంలో వాహనాలపై వెళ్లేవారు పెద్ద శబ్దాలతో హారన్లు మోగించాలి. ⇒ విహారయాత్రకు వెళ్లే కుటుంబ సభ్యులు 6 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. డ్రైవర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిద్రలేకుండా ప్రయాణం చేయకూడదు. ⇒ ముఖ్యంగా వంతెనలు, లోతట్టు ప్రాంతాల్లో వేగం ఎంత ఉండాలి, రోడ్డు ఉన్న తీరు గురించి తెలిపే బోర్డులను గమనించి డ్రైవర్ వాహనాన్ని నడపాలి. ⇒ వాహనం ముందు సీట్లో కూర్చునేవారు డ్రైవర్ సహా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. తద్వారా ప్రమాదం జరిగితే తీవ్రత తగ్గుతుంది. బెలూన్లు తెరుచుకుంటాయి. ఇవి ప్రమాదాలకు కారణాలు... ⇒ చాలా మంది దైవదర్శనాలకు, విహార యాత్రలకు వెళ్లే వారు సమయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ దశలో వాహన డ్రైవర్ రాత్రి అంతా వాహనం నడుపుతారు. సరైన నిద్ర లేక అర్ధరాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ⇒ రాత్రి సమయంలో ఎక్కువగా భోజనం తీసుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో హోటళ్లు, దాబాల్లో దొరికే మసాలా భోజనాలు తీసుకోవడం వల్ల అధిక నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ⇒ ప్రతి మనిషికీ రోజుకు 6 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోవడంతో డ్రైవింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు. ⇒ రాత్రి సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు నిద్రపోతారు. డ్రై వర్తో మాట్లాడేందుకు ప్రయత్నించరు. కొద్ది సమయం బాగానే వాహనం నడిపినా తరువాత మాట్లాడేవారు లేక డ్రైవర్‌కు కళ్లుమూసుకుపోతాయి. దీంతో ప్రమాదాలకు గురవుతారు. అర్ధరాత్రి డ్రై వింగ్ వద్దు అర్ధరాత్రి డ్రైవింగ్ మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే కడుపు నిండిపోతుంది. ఈ సమయంలో మెదడకు రక్తం సరఫరా తగ్గి నిద్ర ముంచుకొస్తుంది. ప్రతి రోజూ 6– 8 గంటల నిద్ర పోయిన వారికి ఈ సమయంలో ఏమీ కాదు. డ్రైవర్లు దూరప్రయాణాలకు వెళ్లినప్పుడు ఆ మేరకు నిద్ర సాధ్యం కాదు. ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి ప్రయాణాలు మానుకోవడం మంచిది. తప్పని సరి అయితే తెల్లవారుజామున 4 గంటలు విశ్రాంతి తీసుకొని వెళ్లాలి. –డాక్టర్ వెంకటముని, జనరల్ ఫిజీషియన్ -
ఉగ్రకదలికలపై పోలీసు నిఘా
– రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు – నగరంలో డీఎస్పీ విస్తృత పర్యటన కర్నూలు: ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతత్వంలో నగరమంతా సోదాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సీఐలు ములకన్న, నాగరాజు రావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు సిబ్బందితో వారి స్టేషన్ల పరిధితో పాటు రైల్వే స్టేషన్, కొత్తబస్టాండు, రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తతంగా తనిఖీలు చేపట్టారు. సబ్ డివిజన్ అధికారులను డీఎస్పీ అప్రమత్తం చేస్తూనే బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, రాజ్విహార్తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ కొత్త వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని సీఐలను ఆదేశించారు. వాహనాల తనిఖీతో పాటు వ్యాపార దుకాణ దారులను అప్రమత్తం చేశారు. -
పీజీ పాఠ్యాంశంగా ‘రాత్రి సూర్యుడు’
రాయదుర్గం అర్బన్: రాయదుర్గం పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ కెరె జగదీష్ రాసిన ‘రాత్రిసూర్యుడు’ దీర్ఘకావ్యాన్ని పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేశామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ జి.నరసింహన్, బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు చైర్మన్ ప్రొఫెసర్ జి.బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు వీరు కెరె జగదీష్‌కు లేఖ పంపారు. అంధుల జీవితాలపై రచించిన ‘రాత్రిసూర్యుడు’ దీర్ఘకావ్యాన్ని ఎంఏ తెలుగు మూడవ సెమిస్టర్ నాల్గవ పేపర్లో (ఆధునిక సాహిత్యం)పాఠ్యాంశంగా ఉంచినట్లు తెలిపారు. పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంచడంపై ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, సాహితీ స్రవంతి రాయదుర్గం శాఖ కన్వీనర్ జి.శివకుమార్, సాహితీ మిత్రులు డాక్టర్ శాంతినారాయణ, డాక్టర్ రాధేయ, జూపల్లి ప్రేమ్‌చంద్, మల్లెల నరసింహమూర్తి, వి.వెంకటేశులు తదితరులు తమ హర్షం వ్యక్తం చేశారు. -
ఆ రాత్రి వచ్చింది?
పట్టుకోండి చూద్దాం ‘‘ఇంత అన్యాయం చేసి పోతావనుకోలేదయ్యా....’’ బిగ్గరగా రోదిస్తున్నాడు రమణయ్య. అందరూ రమణయ్యను జాలిగా చూస్తున్నారు. ‘‘ఎవరండీ ఆయన?’’ ‘‘రమణయ్య అని ఈ ఇంట్లో పనిమనిషి. గత పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు. రాజావారికి అన్నీ తానై చూస్తున్నాడు... ఎంత గొప్ప అనుబంధమో...’’ రాజావారి అసలు పేరు... రాజారావు. అందరూ గౌరవంగా ‘రాజావారు’ అని పిలుస్తుంటారు. రాజావారిది పెద్ద చెయ్యి. దానధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇది నచ్చని ఆయన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి గానీ ఆమె తిరిగి రాలేదు. అలా ఒంటరైన రాజావారికి రమణయ్య చేదోడువాదోడు అయ్యాడు. ‘‘పాపం... రమణయ్యను చూడండి.... భార్యాపిల్లలు కూడా అంతగా తల్లడిల్లిపోరు...’’ అని ఎవరో సానుభూతిగా అంటున్నారు. ఒకరోజు... బంధువు చనిపోయాడంటూ రమణయ్య ఏదో ఊరు వెళ్లాడు. మరుసటి రోజు తిరిగి వచ్చాడు. ఉదయం పదిదాటినా... ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే... ఉదయం నాలుగింటికల్లా లేచి, వ్యాయామాలు చేసి, ఇంటి ముందు వసారాలో పేపర్ చదువుతూ కూర్చోవడం రాజావారి అలవాటు. ఆరోజు మాత్రం తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. తలుపులు దబదబా బాదాడు రమణయ్య. ఎంతసేపటికీ అవి తెరుచుకోలేదు. రమణయ్య ఇరుగు, పొరుగు వాళ్ల దగ్గరికి పరుగెత్తి.... ‘‘ఎంత గట్టిగా తలుపులు బాదినా మా అయ్యగారు... తీయడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకేదో భయంగా ఉంది’’ అని బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. ‘‘ఏమైందో చూద్దాం పదా’’ అని ఇరుగుపొరుగు రాజావారి ఇంటికి చేరుకున్నారు. ‘‘రాజావారు... రాజావారు’’ అని గట్టిగా తలుపులు బాదడం మొదలుపెట్టారు. అందరికీ అనుమానం వచ్చింది. ‘కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది’ అనుకున్నారు అందరు. అందరూ కలిసి తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఒక చిన్న టేబుల్ ముందు కుర్చీలో కళ్లు మూసుకొని కనిపిస్తున్నారు రాజావారు. టేబుల్ మీద ఒక హాఫ్‌బాటిల్ మందు, ప్లాస్కు, ఖాళీ అయిన ఒక గ్లాస్ కనిపిస్తుంది. రాజావారిని కదిలించి చూశారు. అనుమానించినట్లే... ఆయన చనిపోయి ఉన్నారు. ‘‘రెండు పెగ్గులకు మించి తాగినట్లు కనిపించడం లేదు. ఈ మాత్రం దానికే...’’ అని ఎవరో ఆశ్చర్యపడ్డారు. ‘‘రాజావారి శక్తి గురించి నాకు తెలుసు. ఇలా కూర్చొని అలా ఫుల్‌బాటిల్ తాగేయగలరు. అలాంటి వ్యక్తి ఆఫ్ట్రాల్ రెండు పెగ్గులకు చనిపోవడం ఏమిటి? ఏదో జరిగింది...’’ ‘‘అనుమానం ఎందుకు? ఇది ఖచ్చితంగా హత్యే’’ ‘‘వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి... పని మనిషి రమణయ్య ఊరికెళ్లాడు. బయటి వ్యక్తి ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించడం లేదు... ఇది హత్యేనంటావా?’’ ‘‘అలా అయితే ఆత్మహత్య అని చెప్పడానికి కూడా ఏ ఆధారం కనిపించడం లేదు కదా...’’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రాజావారిపై విషప్రయోగం జరిగిందనే విషయం తెలిసింది. దర్యాప్తు తరువాత... పోలీసులు పనిమనిషి రమణయ్యను అరెస్ట్ చేసి నిజం కక్కించారు. రాజావారు మందు తాగిన ఆ రాత్రి రమణయ్య ఊళ్లోనే లేడు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. బయట నుంచి ఎవరూ రాలేదు. మరి విషప్రయోగం ఎలా జరిగింది? ఊరికి వెళ్లేముందు... విషం కలిపిన నీళ్లను డీప్ ఫ్రిజ్‌లో పెట్టాడు రమణయ్య. విషయం తెలియని రాజావారు... ఫ్రిజ్ నుంచి ఆ విషంతో కూడిన ఐస్‌క్యూబ్‌లను తీసుకొని మందు గ్లాస్లో వేసుకున్నారు. తాగి చనిపోయారు. తనను అనుమానించకుండా ఉండడానికి ఆరోజు ఊళ్లో లేకుండా జాగ్రత్తపడ్డాడు రమణయ్య. -
రాత్రయితే అన్నం రంగు మారుతోంది!
– వారం రోజులుగా కోట కందుకూరులో వింత – ఓ ఇంట్లో చీకటి పడితే ఎరుపు రంగులోకి మారుతున్న అన్నం – భయాందోళనలో కుటుంబీకులు ఆళ్లగడ్డ: ఎన్నెన్నో అనుమానాలు.. ఏయేవో భయాలు.. కోట కందుకూరులో ఓ కుటుంబం వారం రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. గ్రామానికి చెందిన గాలిమిషన్ ఉషేన్‌బాషా, ఇమాంబి దంపతులు వ్యవసాయ కూలీలు. వారం రోజుల క్రితం వీరి ఇంట్లో అన్నం వండి కొంత సద్ది వేసుకుని మిగిలిన అన్నం కుమారుడు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత తినేందుకు పెట్టి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడు అన్నం తిందామని చూడగా కాస్త ఎర్రగా కనిపించింది. దీంతో తినలేక అన్నాన్ని పడేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. మరుసటి రోజు రాత్రి అన్నం వండి భోజనం చేసిన తరువాత మిగిలిన అన్నం ఉదయం తినవచ్చని తీసి పెట్టారు. ఉదయం లేచి చూసేసరికి అన్నం అంతా ఎర్రగా రక్తం పులిమినట్లు కనిపించడంతో ఆందోళన చెందారు. బియ్యమో, నీళ్లలోనో తేడా వచ్చి ఉంటుందని అన్నం గేదెలకు వేశారు. రంగు మారిన అన్నాన్ని గేదెలు కూడా తినలేదు. మరుసటి రోజు కూడా కొద్దిగా మిగిలిన అన్నం కూడా తెల్లవారే సరికి ఎర్రగా మారింది. పక్కింటి అన్నం ఈ ఇంట్లో పెట్టినా అంతే: మరుసటి రోజు రాత్రి ఉషేన్‌బాషా ఇంట్లో వండిన అన్నం పక్కింట్లో పెట్టి తెల్లారిని చూస్తే ఎటువంటి రంగు మారలేదు. వేరేవారి ఇంట్లో వండిన అన్నం ఉషేన్‌బాషా ఇంట్లో ఉంచగా ఆ అన్నం కూడా ఎర్రగా మారింది. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామంలోని ప్రజలు ఈ ఇంటిని, అన్నాన్ని పరిశీలించేందుకు బారులు తీరుతున్నారు. ఇదేదో స్వామి మాయ అని కొందరు.. దెయ్యం తిరుగుతోందని కొందరు చెబుతున్నారు. మరి కొందరు ఏదో ఉపద్రవానికి సూచకమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంగా ఉంది: ఇమాంబి గురువారం నుంచి వండిన అన్నం రాత్రి అయ్యేసరికి కొంచెంకొంచెంగా ఎర్రగా మారుతూ తెల్లవారే సరికి పూర్తిగా రక్తం కలిపినట్లు అవుతోంది. ఎండపొద్దున మా పిల్లాడు ఇంటికి రావడంతో వాడి వెంట దెయ్యం వచ్చి ఇంట్లో ఉందని దీంతో ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. రేవనూరు ఉషేనయ్య స్వామికి ముక్కుబడి చెల్లించనందుకే ఇలా జరుగుతుంది వెంటనే వెల్లి ముక్కుబడి చెల్లించాలని మా అత్త చెబుతోంది. ఇంట్లో ఉండాలంటే భయంభయంగా ఉంది. అందుకే చీకటి పడేసరికి బయటనే ఉంటున్నాం. -
డీఎస్పీ ఆత్మహత్యపై బీజేపీ ఆందోళన
-
రాత్రిపూట ట్విట్టర్ వాడుతున్నారా.. గుడ్ న్యూస్..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ తన యూజర్ల కోసం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో నైట్ మోడ్ యూజర్ ఇంటర్ ఫేస్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ ఆండ్రాయిడ్ యాప్ తో స్క్రీన్ లో వైట్ బ్రాక్ గ్రౌండ్ బదులుగా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్నాలజీ వెబ్ సైట్ మంగళవారం అ వివరాలను తెలిపింది. అయితే తర్వలో యూజర్లు ఇష్టం ఉన్న మోడ్ సెలెక్ట్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఆటోమేటిక్ గా నైట్ మోడ్ అప్లై అవుతుందా.. లేక యూజర్స్ సెలెక్ట్ చేసుకోవాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ట్విట్టర్ సైట్ లో బ్యాక్ గ్రౌండ్ వైట్ గా ఉండి, లెటర్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయన్న విషయం తెలిసిందే. యూజర్లు రాత్రివేళ ట్వీట్లు చేయడం, బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు పడరాదని భావించిన తర్వాతే ట్విట్టర్ ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 'నైట్ మోడ్' తో పాటు కొన్ని బటన్లపై కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. ఓవర్ ఫ్లో బటన్స్, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్స్ ఫీజర్లతో కొత్త తరహాలో ట్వీట్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
13 ఏళ్లలో మొదటిసారి..
ఇస్లామాబాద్: పగటి పూట మాత్రమే ఉత్సాహంగా ఉంటూ.. రాత్రయితే డీలా పడిపోతున్న పాకిస్తాన్ 'సోలార్ కిడ్స్'.. రషీద్, హషీమ్‌లు ఎట్టకేలకు కొంత పురోగతి సాధించారు. తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, పదమూడేళ్ల వయసుగల హసీమ్ సోదరులు బుధవారం రాత్రి తమ జీవితంలో మొదటి సారిగా రాత్రి వేళలో కొంత సమయాన్ని ఆస్వాదించారు. 13 ఏళ్లలో మొదటిసారిగా రాత్రి వేళ తన కుమారులు స్వయంగా మెట్లెక్కారనీ, కాసిన్ని మంచినీరు కూడా త్రాగారని వారి తండ్రి మహమ్మద్ హషిం హర్షం వ్యక్తం చేశాడు. పగటి పూట అందరు పిల్లల మాదిరిగానే ఉంటున్న ఈ చిన్నారులు సూర్యుడు అస్తమించడంతోనే వారి చైతన్యాన్ని కోల్పోతున్నారు. మళ్లీ సూర్యోదయం కాగానే శక్తి పుంజుకుంటున్నారు. దీనికి పరిష్కారం కోసం ఇటీవల వారికి నిర్వహిస్తున్న న్యూరోట్రాన్స్మిషన్ ట్రీట్మెంట్ మూలంగా కొంత మార్పు వచ్చిందని హషిం తెలిపాడు. అయితే ఈ చిన్నారుల డీఎన్ఏను పరీక్షించడం ద్వారా వైద్యులు వారి సమస్యకు పూర్తి పరిష్కారం చూపాలని భావిస్తున్నప్పటికీ.. ఇప్పటికే 300కు పైగా డీఎన్ఏ టెస్టులు నిర్వహించినా ఆశించిన ఫలితం మాత్రం లేదు. వీరికి పూర్తి స్థాయిలో నయం చేసేందుకు అమెరికాలోని మేరిలాండ్ యూనివర్సిటీ బృందం సైతం సహకారం అందిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారుల వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు. -
ఇక రాత్రుల్లోనే ప్రచారం కెప్టెన్ కొత్తబాట
సాక్షి, చెన్నై: ఎండ దెబ్బకు తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి, డీఎండీకే అధినేత విజయకాంత్ ఉన్నట్టుంది. ఇక, సాయంత్రం, రాత్రుల్లోనే ప్రచారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించే పనిలో పడ్డారు. విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదీ ముందుగా తలచుకోరు, సమయానికి తగ్గట్టుగా మాత్రమే వ్యవహరిస్తారు. ప్రసంగాల్లో కూడా తనకు తోచిందే మాట్లాడుతుంటారు. అలాంటి విజయకాంత్‌కు తరచూ కోపం రావడం సహజం. బుధవారం మీడియాను టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించిన విజయకాంత్, ఇక జాగ్రత్తల్లో పడ్డారు. ఇదంతా ఎండ దెబ్బే అని చాటుకునే విధంగా, దానికి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ప్రచారానికి దూరం అని ప్రకటించేసుకున్నారట!. అబ్బో విజయకాంత్ ఏమైనా తెలివైన వాడే. ఎండ దెబ్బకు తానే కాదు, తన కార్యకర్త కూడా సొమ్మసిల్లి పోకూడదనే, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రచార, బహిరంగ సభలకు చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలకు సూచించే పనిలో పడ్డారు. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉందని, ఇతరుల సభల్లో కార్యకర్తలు భానుడి దెబ్బకు మృత్యువాత పడుతున్నారని పరోక్షంగా అమ్మ జయలలిత సభల్లో చోటుచేసుకున్న ఘటనల్ని ఎత్తి చూపుతూ కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు గురువారం సందేశాన్ని పంపించారు. -
అలాంటివి మహిళలకే డేంజర్!
లండన్: మానవ జీవిత చక్రంలో నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనది. శారీరక విశ్రాంతి కన్నా మానసిక విశ్రాంతి అత్యంత ముఖ్యం. ఈ విశ్రాంతికి భంగం కలిగిందో ఇక అంతే సంగతులు. నిద్రాభంగం జరిగితే పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయని, వారికే తొందరగా ప్రమాదం జరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి వేళ షిప్టుల్లో పనిచేసే పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా దుష్ప్రభావాలు చవిచూడాల్సి ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. 24 గంటల జీవ క్రియలో సర్కాడియల్ ప్రభావం పురుషుల మెదడుపై కన్నా స్త్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. 'మొట్టమొదటిసారి సర్కాడియన్ క్లాక్ ఎఫెక్ట్స్ పురుషుల్లో స్త్రీలలో వేర్వేరుగా ఉండటం మేం తొలిసారి గుర్తించాం. షిప్టుల్లో పనిచేసేవాళ్లలో ఈ వైరుద్యాన్ని మేం స్పష్టంగా గుర్తించాం. నైట్ షిప్టులో ఉన్న మహిళలపై ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది' అని యూనివర్సిటీ ఆఫ్ సర్రే అధ్యయనకారుల్లో ఒకరైన నయనతార శాంతి అన్నారు. సరిగా నిద్ర భంగం జరిగితే మానసిక నైపుణ్యాలు, మోటారు వాహనాల నియంత్రణ, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, ఈ పరిస్థితి మహిళల్లో తొందరగ కలుగుతుందని తెలిపింది. -
కొంపముంచిన రాత్రి కరెంట్
♦ అర్ధరాత్రి వేళ రైతు మృతి రాయిలాపూర్‌లో ఘటన ♦ వీధిన పడ్డ కుటుంబం విద్యుదాఘాతానికి రైతు బలి కౌడిపల్లి: రాత్రి కరెంటు ఓ రైతు కొంపముంచింది. వరి పొలానికి నీరు పారబెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై రైతు ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య, శంకరయ్య, కిష్టయ్య, రాములు నలుగురు అన్నదమ్ములు. వీరు వేరుగా ఉంటున్నారు. వీరికి 1.20 ఎకరాల పొలం ఉంది. పంచుకోగా ఒక్కొక్కరికి 15 గుంటలు వచ్చింది. బోరు ఉమ్మడిగా ఉంది. వంతుల వారీగా తమ వాటా పొలానికి నీరుపారబెట్టుకుంటున్నారు. తనవంతు రావడంతో కిష్టయ్య(45) సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. తెల్లవారుజాము రెండుగంటల ప్రాంతంలో కరెంటు రావడంతో మోటారు ఆన్ చేశాడు. మోటార్ నడవకపోవడంతో స్టాటర్‌ను పరిశీలిస్తుండగా కరెంటు షాక్‌తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. కిష్టయ్యకు భార్య వీరమణి, కూతురు సంతోష, మాధవి, కొడుకు పవన్‌కుమార్ ఉన్నారు. ఇటీవల పెద్ద కూతురు సంతోష పెళ్లిచేశారు. కిష్టయ్య తల్లి శివ్వమ్మ(75) నెలరోజుల క్రితమే మరణించింది. అందరితో కలుపుగోలుగా ఉండే కిష్టయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. సర్పంచ్ శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి రైతు కుంటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
రాత్రిపూట అధిక వేడి.. సీక్రెట్ తెలిసింది
లండన్: పగటి పూట కంటే రాత్రి వేళల్లో వేడి ఎందుకు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిపోయిందట. గత యాబై ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న పరిశోధనలకు తగిన ఫలితం కనిపించింది. రాత్రి పూట వాతావరణంలో మార్పులు చాలా త్వరగా సంభవిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భూమికి పగటి పూట కంటే కూడా రాత్రి సమయాలలో వేడికి గ్రహించేశక్తి ఎక్కువగా ఉంటుందట. ఇందుచేతనే రాత్రిళ్లు వాతావరణ మార్పులను త్వరగా పసిగట్టేయవచ్చునని పరిశోధకులు తేల్చేశారు. 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమెటాలజీ' లో రీసెర్చర్స్ కనుగొన్న వివరాలు ప్రచురితమయ్యాయి. నార్వే కేంద్రంగా ఉన్న నాన్సెన్ ఎన్విరాన్ మెంటల్ అండ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రీసెర్చర్ రిచర్డ్ డేవీ నేతృత్వంలో 20వ శతాబ్ధం వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వాతావరణ మార్పు అనేది గాలి లోని కొన్ని పొరలలో వచ్చే మార్పులతో సంబంధం కలిగి ఉందని కనుగొన్నారు. పగటిపూట ఈ పొర చాలా కిలోమీటర్ల మందంతో ఉంటుందని, రాత్రివేళల్లో ఈ పొర చాలా పలుచగా, కేవలం వందల మీటర్ల మందంతో ఉంటుందట. ఈ కారణం వల్లనే రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పగటి పూట కంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయని రీసెర్చ్ లో కనుగొన్నారు. మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను గాలిలోకి వదులుతుంటాం కదా.. అయితే రాత్రివేళల్లో కార్బన్ డై ఆక్సైడ్ తో మరికొంత శక్తి కలిసి ఉష్ణోగ్రతను పెంచేస్తాయని గుర్తించారు. గత యాబై ఏళ్ల రాత్రివేళ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గతంలో కంటే ఈ 5 దశాబ్దాలుగా రాత్రివేళల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించవచ్చని రీసెర్చర్స్ చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు నాలుగో వంతు ఉష్ణోగ్రత పెరిగిందని, ఈ వాతావరణ ఉష్ణోగ్రత మార్పులు వల్ల మానవుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రిచర్డ్ డేవీ నాన్సెస్ బృందం వివరించింది. -
అరటిపండు కోసం పోలీసుల ముష్టియుద్ధం
చెన్నై: ఒక్క అరటిపండు... ఇద్దరు పోలీసులు మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి వేళ దొంగలు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలను కాపాడటం కోసం నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో వున్నవాళ్లు... ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరి మధ్య ముష్టి యుద్ధమే జరిగింది. దీంతో ఇతర సిబ్బంది జోక్యంతో వాళ్లిద్దరూ రక్తమోడుతూ ఆసుపత్రిలో చేరారు. స్వల్పవిషయానికే బహిరంగంగా ఘర్షణకు దిగి రచ్చకెక్కడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం తిరుచునాపల్లి స్పెషల్ ఎస్ఐ రాధా, డ్రైవర్ శరవణన్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. శరవణన్ రాత్రి పూట తినడానికి ఓ అరటిపండు తెచ్చుకున్నాడు. దాన్ని కాస్తా ఎఎస్ఐ రాధా తినేశాడు. అంతే వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం బూతులు తిట్టుకుంటూ శ్రీరంగం వీధుల్లో రెచ్చిపోయారు. రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు. సహచర పోలీసులు వచ్చి వారిని విడదీసే దాకా అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరినీ వారించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ముక్కుల్లోనూ, పక్కటెముకల నుంచి రక్తస్రావం జరిగిందని ఆసుపత్రి సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
తెల్లబోయిన రాత్రి
శ్వేతవర్ణం ఉదయించింది. చీకటి చిన్నబోయింది. రంగు మారిన తనను తాను చూసుకుని రాత్రి ‘తెల్ల’బోయింది. సిటీలో శనివారం రాత్రి జరిగిన వైట్ ఈవెంట్... నైట్ లుక్‌ని అమాంతం మార్చేసింది. వేదిక నుంచి వేడుక దాకా అంతా తెలుపే పులుముకుని కొత్త వెలుగుల్ని విరజిమ్మింది. కార్పొరేట్ కుర్రాళ్ల నుంచి సెలబ్రిటీ స్టార్ల దాకా అందర్నీ గచ్చిబౌలి స్టేడియంకు రప్పించిన వైట్ సెన్సేషన్... తెల్లని డ్రెస్‌కోడ్‌లో పార్టీ పీపుల్‌కి పీస్‘ఫుల్’ కలర్ ఇచ్చింది. ఆమ్స్టర్ డామ్ నుంచి తరలి వచ్చిన అద్భుతమైన ఆర్టిస్టుల ప్రదర్శనలు, ప్రపంచ టాప్ క్లాస్ డీజేల మ్యూజిక్ హోరు.. కలగలిసి ఈ సెన్సేషన్ ఓ మరపురాని స్వీట్ అండ్ వైట్ మెమరీ అని అతిథుల చేత అనిపించింది. -సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
లైట్లతో నిద్రలేమి..
న్యూయార్క్: కాలుష్యం చాలా రకాలు. ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది. కాంతి కాలుష్యం కూడా ఈ కోవలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాలలో ఇదో సమస్యగా మారింది. రాత్రి వేళల్లో లైట్ల వల్ల చాలా మంది నిద్ర లేకుండా గడుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. దీని ప్రభావం మరుసటి రోజు పని మీద పడుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్ని పట్టణాలతో పోలిస్తే నగరాల్లో నివసించే వారిలో ఈ సమస్య మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. కాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ వర్సిటీ బృందం 15,863 మందిని 8 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. వారి నిద్ర అలవాట్లు, మానసిక స్థితి వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైట్ల ప్రభావం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో నిద్ర లేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల పగలు పనిలో త్వరగా అలసిపోవడంతో పాటు నిద్రమత్తులో ఉంటున్నారని వెల్లడించారు. ‘పస్తుత సమాజంలో 24/7 ఉద్యోగాలు వచ్చేశాయి. భద్రత కోసం వీధుల్లో పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత సంగతి అలా ఉంచితే వీటి వల్ల చాలా మందికి నిద్రలేమి వస్తోంది. కాంతి కాలుష్యం వల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరుగనున్నాయి’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకుడు మారిస్ హయాన్ తెలిపారు. ఈ నివేదికను వచ్చే ఏఫ్రిల్‌లో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే అమెరికన్ ఎకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంస్థ 68వ వార్షిక సమావేశంలో సమర్పించనున్నారు. -
రోగుల సహాయకులకు షెల్టర్లు
నగరంలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మాణం: కేసీఆర్ సీఎంను కలసిన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కేన్సర్ ఆసుపత్రిలో నిర్మాణాల క్రమబద్ధీకరణకు విజ్ఞప్తి హైదరాబాద్: ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగుల సహాయకులకు తగినన్ని నైట్ షెల్టర్లను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. కేన్సర్ ఆసుపత్రితో పాటు పలుచోట్ల ఇప్పటికే నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరికొన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులనే తేడా లేకుండా అన్ని చోట్ల నిర్మిస్తామని, ఆసుపత్రుల యాజమాన్యాలు దీనికి సహకరించాలని సీఎం కోరారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలుసుకున్నారు. కేన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను సీఎంకు వివరించారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలు చేపట్టామని, వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలని బాలకృష్ణ కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న కేన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు అందించే విషయంలో శ్రద్ధ చూపాలని, ఈ విషయంలో ఆసుపత్రి నిర్వాహకులకు ప్రభుత్వం సాయం అంది స్తుందన్నారు. త్వరలోనే ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై చర్చిస్తామని వెల్లడించారు. డిక్టేటర్ చూడండి: బాలకృష్ణ ఇటీవల విడుదలైన డిక్టేటర్ సినిమా చాలా బాగుందని, ఆ చిత్రాన్ని చూడాల్సిందిగా కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు. వందో సినిమా ఎప్పుడు చేస్తున్నారని సీఎం అడగగా... ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నామని, తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో తాను ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సినిమాలు చూసే వాడినని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ కూడా ఎన్టీఆర్, బాలకృష్ణతో తనకున్న సినీ రంగ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్పీ సింగ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు కూడా ఉన్నారు. బాలకృష్ణను తన ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం వెళ్లేటప్పుడు కారు దాకా వచ్చి సాగనంపారు. తన పట్ల చూపిన ఆదరణకు బాలకృష్ణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
చలి @12.5 డిగ్రీలు
♦ చలిలో ఎలా..? నైట్ షెల్టర్లు లేక అవస్థలు ♦ జీహెచ్ఎంసీ సిద్ధమైనా.. అంగీకరించని ఆస్పత్రులు ♦ వణుకుతున్న రోగుల బంధువులు ఒక్కసారిగా విజృంభించిన చలితో నగరం వణుకుతోంది. శనివారం శీతల గాలులు మరింత పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 నుంచి 12.5 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం 9.30 గంటలు వరకూ బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 5 గంటలు దాటితే కాలు బయట పెట్టలేని స్థితి ఎదురవుతోంది. మరోవైపు నగరంలోని ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు లేక... రోగుల బంధువులు రాత్రంతా చలితో గజగజలాడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: అసలే చలి కాలం. ఆపై వణికిస్తున్న శీతల గాలులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన వారిని వణికిస్తున్నాయి. మరోవైపు దోమలు తినేస్తున్నాయి. తల దాచుకుందామంటే ఆస్పత్రుల వద్ద నిలువ నీడ ఉండదు. దీంతోరోగుల బంధువుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి వారి కోసం రాత్రి బస కేంద్రాల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. ఒక్కోదానికి రూ.5.50కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. స్థలాలను కేటాయించాల్సిందిగా లేఖలు రాయ గా... నిమ్స్, సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు నిరాకరించాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిలోఫర్ న వజాత శిశువుల ఆస్పత్రి, కోఠి మెటర్నిటీ, ఈఎన్టీ ఆస్పత్రులు స్థలాలు కేటాయించాయి. దీంతో అక్కడ వసతి కేంద్రాలకు పునాదులు పడ్డాయి. మరో ఆరు నెలల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో ఆస్పత్రి ముందు వెయ్యి మందికిపైనే... ఉస్మానియా ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా మరో 1200 మంది ఇక్కడే ఉంటారు. నిలోఫర్‌లో వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా 1500 మంది ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 500 మంది చికిత్స పొందుతుం డగా... మరో 150-200 మంది రేడియేషన్ కోసం అక్కడే ఎదు రు చూస్తుంటారు. గాంధీలో 1500-2000 మంది రో గులు.... మరో 1500 మంది సహాయకులు ఉంటారు. సుల్తాన్‌బజార్,పేట్లబురుజు ప్రభు త్వ ఆస్పత్రుల్లో వెయ్యి మంది వరకు ఉంటారు. రోగుల సహాయకులకు సరైన వసతి లేకపోవడంతో వీరంతా చెట్ల కిందే తల దాచుకుంటున్నారు. మరుగు దొడ్లు లేవు. ఇన్‌పేషెంట్లకు ఇవ్వరు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి.. చిరిగిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గాంధీలో సరిపడే దుప్పట్లు ఉన్నా రోగులకు ఇవ్వడం లేదు. పొరపాటున ఎవరై నా దుప్పటి తెచ్చుకోకపోతే రాత్రంతా ఇబ్బంది పడాల్సిందే. నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో మంచాలే కాదు... దుప్పట్లు కూడా లేకపోవడంతో శిశువులు వణికిపోతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించినా... దుప్పట్ల కొనుగోలుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. దీన్ని బట్టి రోగులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
రీతూ పవనాలు
ఆమె పేరే చాలు అంటారు ఫ్యాషన్ ప్రియులు. దేశీయ చేనేతలదే ఆ ఘనతంతా అంటారామె వినమ్రంగా. మన చుట్టుపక్కలే ఉన్న హస్తకళానైపుణ్యంతో విదేశీ సెలబ్రిటీలు సైతం తన ఫ్యాషన్‌కు చుట్టాలు పక్కాలుగా మారిపోయేలా చేసిన ఆ రీతూ‘పవనాలు’ మీ ఇంటా వీయాలని కోరుకుంటున్నారా... అయితే ఈ డిజైన్లు మీకోసమే... బనారస్ పట్టు చీర అనగానే పెళ్లిళ్లకు మాత్రమే అనుకుంటారు. కానీ, స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్ బ్లౌజ్, బాటమ్‌గా షిమ్మర్ చుడీ ధరించి బెనారస్ పట్టు చీర కడితే సంప్రదాయ పార్టీ ఏదైనా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు. పాలనురగ లాంటి లెహంగా , చున్నీ నైట్ పార్టీలో ప్రధాన ఆకర్షణ. చేతికి వెడల్పాటి పట్టీ, చెవులకు పెద్దపెద్ద రింగులు ధరిస్తే వెస్ట్రన్పార్టీకీ బాగా నప్పుతుంది.వేడుకలలో వైభవంగా వెలిగిపోవాలంటే ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్ కలర్స్ బ్రైట్‌గా ఉండాలి. బెనారస్, క్రేప్ ఫ్యాబ్రిక్‌పైన జరీ పువ్వులు, ఆకులు, లతలతో గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ఇది. పూర్తి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ లెహంగాను తీర్చిదిద్దారు. ట్రెడిషనల్, వెస్ట్రన్ కలగలిపి డిజైన్ చేసిన టాప్, లెగ్గింగి కాంబినేషన్ ఇది. -
గీత... ద ఘోస్ట్!
రాత్రి, అర్ధరాత్రి, దెయ్యాల వేట, భయం భయం... హారర్ సీరియల్ అనగానే ఇలాంటి పేర్లే కనిపిస్తుంటాయి మనకి. హిందీలో అయితే ఆహట్, భూత్ ఆయా, ఫియర్ ఫైల్స్ అంటూ దెయ్యాల్ని మన మీదికి వదులుతున్నారు కొన్ని చానెళ్లవారు. అయితే వీటిని చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకేనేమో... ఓ కొత్త టైటిల్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త కథనంతో ఓ సీరియల్ తీశారు. అదే... ‘గీతాంజలి’. * ఇద్దరు అక్కాచెల్లెళ్లు. చెల్లెలు మహా నెమ్మదస్తురాలు. అక్క పరమ భయంకరురాలు. అన్నీ తాను అను కున్నట్టే జరగాలంటుంది. అన్నింట్లో కల్పించుకుని చెల్లెలికి సంతోషమన్నదే లేకుండా చేస్తుంది. చివరికి ఊహించని పరిస్థితుల్లో చనిపోతుంది. మామూలుగానే కుదురుండనిది, దెయ్యమయ్యాక ఊరుకుంటుందా? నానా రభసా చేస్తోంది. ఆ రభస చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. అందుకే గీతాంజలి సక్సెస్ఫుల్ సీరియళ్ల లిస్టులో చేరిపోయింది. * అయితే ఈ సీరియల్ సక్సెస్‌లో ముఖ్యభాగం హీరోయిన్ రూపకే చెందుతుంది. ‘చిన్న కోడలు’ సీరియల్‌తో సుపరిచితమైన ఈ అమ్మాయి... అంజలిలా అమాయకంగా ఆకట్టుకుంటూనే, దెయ్యంగా హడలెత్తిస్తోంది. ఆమె పర్ఫార్మెన్సే ఈ సీరియల్‌కి ప్రాణం పోసిందని ఒప్పుకుని తీరాలి! -
నైట్‌వాచ్‌మెన్ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి ఎంపీడీవో కార్యలయంలో నైట్‌వాచ్‌మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన నర్సింహ గౌడ్(55) ఎంపీడీవో కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసిశాడు. అనంతరం అక్కడే ఉన్న కంప్యూటర్ వైర్లతో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
మన పోలీసు భేష్
సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు * జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది * రాష్ట్రంలో పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకం * సింగపూర్, చైనా పోలీసుల మాదిరి మనోళ్లు కూడా తయారవ్వాలి * అక్కడి మాదిరి 'నైబర్‌హుడ్ వాచ్' ప్రవేశపెడతాం * హైదరాబాద్‌లో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం * జంట ఆకాశహర్మ్యాలకు శంకుస్థాపన.. అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ పోలీసు విభాగానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి, జాతీయస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు, హోం సెక్రటరీతో జరిగే ఆంతరంగిక సమావేశాల్లో వారంతా మన పోలీసులను అభినందించినప్పుడు ఎంతో గర్వపడుతుంటానని చెప్పారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన పెద్దలు చేపట్టిన కార్యక్రమాల వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ, ఐసీసీసీ) భవనాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి, అందులో ఏర్పాటు చేసే టెక్నాలజీకి రూ.302 కోట్లు మంజూరు చేశామని, రానున్న బడ్జెట్లో మరో రూ.700 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్సార్) కార్యక్రమం కింద ఖర్చు చేసే నిధులన్నింటినీ పోలీసు విభాగం సాంకేతిక అభివృద్ధి కోసమే వెచ్చించేలా చర్యలు తీసుకుంటామని, దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తారని తెలిపారు. నగర ఎంపీలు కూడా తమ ఎంపీ లాడ్స్ నుంచి వీలైనంత మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కనీసం రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని, ఇలా ప్రజా ప్రతినిధులే రూ.100 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. ఈ భవనం కేవలం పోలీస్ కమిషనర్ బిల్డింగ్ కాదని, అన్ని విభాగాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల పర్యవేక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. గతంలో పోలీసు అంటే ప్రజలకు ఒక విధమైన అభిప్రాయం ఉండేదని, అయితే ఏ పరిస్థితినీ ఒక్కరోజులో మార్చలేమని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో 9 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోందని, అయితే మనం ముంబై కంటే ఒక అడుగు ముందుకు వేసి జంట కమిషనరేట్లలో ప్రభుత్వ నిధులతో 10 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకం అంతర్జాతీయంగా ఏ సదస్సుకు వెళ్లినా తనను పెట్టుబడిదారులు రాష్ట్రంలోని శాంతిభ్రదతల పరిస్థితిపైనే తొలి ప్రశ్న అడిగారని సీఎం చెప్పారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. సింగపూర్, చైనాలో రోడ్డుపై ఒక్క పోలీసు కనిపించరని, అయినా నిత్యం పరిశీలిస్తుంటారన్నారు. బాధితులు ఫోన్ చేస్తే చాలు.. ఇంగ్లిషు సినిమాలో చూసినట్టు రెండున్నర లేదా మూడు నిమిషాల్లో వచ్చేస్తారని, తనకు పలువురు స్నేహితులు చెప్పారని, ఇది టెక్నాలజీ వల్లే సాధ్యమని వివరించారు. ఆ దిశగా మన పోలీసు కూడా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, సింగపూర్‌లో పోలీసు వ్యవస్థలు విజయవంతం కావడానికి అక్కడి ప్రజల భాగస్వామ్యం కీలకమైందన్నారు. ఆ దేశాల్లో 'నైబర్‌హుడ్ పోలీసు' ప్రయోగం మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇక్కడ కూడా ఇలాంటిది ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మాదిరిగా ఫ్రెండ్లీ పీపుల్ కూడా అవసరమని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నగరంలోని వర్తక వాణిజ్య వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర వ్యాపారస్తులు హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి ముందుకు రావాలిని, వీలైనన్ని కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిత్యం కాలుష్యం మధ్య పని చేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అదనంగా అలవెన్స్ ఇస్తున్నామని, ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రతి ఏడాదీ మాజీ సైనికోద్యోగులతో పాటు కానిస్టేబుళ్లకు 10 శాతం ఉచితంగా కేటాయిస్తున్నామన్నారు. ఐసీసీసీకి అవసరమైన ఫైబర్ ఆప్టిక్ బ్యాండ్‌విడ్త్‌ను ఐదేళ్లపాటు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీని సీఎం అభినందించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న మాదిరి తక్షణ స్పందన కోసం సిటీ పోలీసుకూ నాలుగైదు హెలీకాప్టర్లు కేటాయించాలి'అని సీఎంను కోరారు. సీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 'అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి ఆడపిల్లలు కూడా ఒంటరిగా, భద్రతతో జీవించేలా నగరంలో పరిస్థితుల్ని మారుస్తున్నాం. రానున్న రెండేళ్లల్లో రోడ్లపై ట్రాఫిక్ పోలీసు లేని వ్యవస్థను చూడనున్నాం' అని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్, ఇన్చార్జి డీజీపీ సుదీప్ లక్టాకియా తదితరులు పాల్గొన్నారు. -
దాండియా.. రెడీయా..!
కలర్‌ఫుల్ స్టిక్స్‌తో, కోలాటంలా అనిపించే నృత్యోత్సవం ఇప్పుడు సిటీ నైట్‌లైఫ్‌కు ట్రెడిషనల్ కలర్. అక్టోబరు నెలలో తాత్కాలిక వారాంతపు వినోదం దాండియా. మోడ్రన్, ట్రెడిషన్ల మిక్స్ అయిన దాండియా పండుగకు 10 రోజుల ముందుగానే సిటీజనులు డ్యాన్స్ క్లాసెస్. డ్రెస్‌లతో సిద్ధమైపోతున్నారు. - ఎస్.సత్యబాబు సిటీలో ఈవెంట్ మేనేజర్ల దాండియా నైట్స్‌తో ఈ సంప్రదాయ సందడి సమకాలీన ఒరవడిగా మారింది. సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభమై అర్ధరాత్రి దాకా కొనసాగి నైట్‌లైఫ్ ప్రియుల్ని ఆకర్షిస్తోంది. నృత్యానికి క్విజ్, గేమ్స్, సెలబ్రిటీ లు జతవుతూ ఈవెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. సిటీ నలుచెరగులా... సిటీలోని సిఖ్వాల్ కల్చరల్ అసోసియేషన్, నామ్థారి ఈవెంట్స్, ఆది ఈవెంట్స్, లేడీస్ క్లబ్స్, సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.500 మొదలుకొని రూ.2500 వరకూ దాండియా నైట్స్‌కు ప్రవేశ రుసుం ఉండే ఈ ఈవెంట్లలో కొన్ని ఒకటి లేదా రెండు రోజులకే పరిమితమైతే కొన్ని తొమ్మిది రాత్రులూ సందడి చేస్తున్నాయి. మల్లారెడ్డి గార్డెన్స్, క్లాసిక్ గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ వంటి చోట్ల దాండియా ఉత్సవాలకు కనీసం 2 నుంచి 5వేల మంది దాకా హాజరవుతున్నారు. పాతబస్తీలోనూ షురూ అయ్యాయి. ‘రోజూ 3 వేల నుంచి 4వేల దాకా మా ఈవెంట్లో పార్టీసిపేట్ చేస్తారు’ అని ఓల్డ్‌సిటీలో దాండియా నైట్స్ నిర్వహించే రాజస్తానీ ప్రగతి సమాజ్ ఎగ్జిబిషన్ సొసైటీ కన్వీనర్ గోవింద్ రాఠీ చెప్పారు. దాండియా నృత్యం నేర్చుకోవాలనుకునేవారి కోసం పలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లు ఇప్పటికే క్లాసులు ప్రారంభించేశాయి. ప్రత్యేక శిక్షణ సంస్థలూ వెలుస్తున్నాయి. ‘గతంతో పోలిస్తే సిటీలో క్రేజ్ బాగా పెరిగి, దాండియాకు అన్ని వయసుల వారూ ఆకర్షితులవుతున్నారు’ అని శిక్షకురాలు ప్రమీలావ్యాస్ చెప్పారు. -
రైతు ప్రాణం తీసిన రాత్రి కరెంటు
కొల్లాపూర్(మహబూబ్‌నగర్): పైరును కాపాడుకునేందుకు వెళ్లిన ఓ రైతు పొలంలోనే విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన బోయ లింగస్వామి(25) తన రెండెకరాల పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పైరుకు నీళ్లు పారించేందుకు మంగళవారం రాత్రి బోరుబావి దగ్గరకు వెళ్లాడు. బోరు మోటార్ వైర్ తెగి నేలపై పడిన విషయం తెలియక అటుగా వెళ్లటంతో షాక్‌కు గురై మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన పక్క పొలం రైతులు గమనించి తల్లిదండ్రులు లింగస్వామి, ఈశ్వరమ్మకు సమాచారం అందజేశారు. -
నిద్రలో కలల స్క్రీన్ ప్లే
స్వప్నలోకం కల జీవితానికి స్ఫూర్తి. ఆ మాటకొస్తే బతకడానికి ఓ ఆర్తి! అసలు కలలు కనని వారుంటారా? పగటి కలలు, రాత్రి కలలు... ఎన్ని అందమైన అనుభూతులను మిగులుస్తాయి! ఇంకెన్ని భయాలను కలిగిస్తాయి! మన ప్రమేయం లేకుండానే మస్తిష్కం నుంచి ప్రొజెక్ట్ అయి మూసిన కనురెప్పల మాటున కలర్‌ఫుల్ సినిమాను చూపిస్తాయి. ఒక్కోసారి కథానాయకుడిగా స్టోరీనంతా నడిపిస్తుంటాం! మరోసారి ప్రతినాయకుడిగా కత్తి పట్టుకొని కనిపిస్తాం! మన మరణానికి మనమే చింతిస్తుంటాం! నిజ జీవితంలో సాధ్యంకాని సాహసాలన్నిటినీ చేసేస్తుంటాం! కొన్ని కలలు మన ఆశయాలకు ప్రేరణనిస్తూ.. ఇంకొన్ని రాబోయే కీడును హెచ్చరిస్తూ జీవనమార్గాన్ని చూపెడతాయంటారు స్వప్నశాస్త్ర పండితులు. అందులో నిజానిజాలెలా ఉన్నా లక్ష్యసిద్ధికి కలలు కనాల్సిన అవసరం ఉందని నొక్కివక్కాణిస్తారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. అలా కలలు కని జీవితాశయాన్ని ఏర్పర్చుకున్న వాళ్లు ఉన్నారు.. భవిష్యత్ గమ్యం గురించి కలలు కని దాన్ని చేరుకున్న వాళ్లూ ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఇలియాస్ హోవే తనకు చిన్నప్పడు వచ్చిన కల వల్లే ‘కుట్టు మిషన్’ కనుక్కున్నానని చెప్పారట. అలాగే ‘ఏసీ ఇండక్షన్ మోటార్’ పుట్టడానికి కారణం సైంటిస్ట్ ‘నికోలా టెస్లా’కు వచ్చిన కలే! ప్రపంచాన్నంతా తన చుట్టే తిప్పుకుంటున్న ‘గూగుల్’ ఐడియాను ‘లారీ పేజ్’కు అందించింది ఈ కలామతల్లే! ఈ అద్భుతాలన్నీ మనిషికి కలల కురిపించిన వరాలు. ప్రమాద సంకేతాలుగా... అయితే కొందరికి భవిష్యత్తులో తమకు ఎదురయ్యే ప్రమాద సంకేతాలు కూడా కలలుగా వస్తాయట. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు ఓ కల వచ్చిందట. అతణ్ని ఎవరో హత్య చేసినట్టు. అచ్చం అతను కలకన్నట్టే తన భార్యతో ఓ థియేటర్లో ఉన్నప్పుడు బూత్ అనే వ్యక్తి లింకన్‌ను గన్‌తో కాల్చి చంపాడు. కల నిజమైన విషాదం ఇది. అలాగే 9/11 సంఘటన బాధితులు కూడా తమకు ఏదో ప్రమాదం జరగనున్నట్టు కల కన్నామని చెప్పారట. కలలకున్న ప్రాధాన్యం ఇది మరి. ఏమైనా కలలు రావడం ఆరోగ్యకరమని, కలల ఆధారంగా తమ మానసిక పరిస్థితిని ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చని మానసిక వైద్యులూ చెప్తున్నారు. తరచూ పీడ కలలు వచ్చేవారికి మనసులో ఏదో ఆందోళనగా ఉంటుందని, వారు తప్పక నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు. కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు - గురక పెడుతున్నప్పుడు కలలు రావడం అసాధ్యం (ట). - నిద్ర లేచిన మొదటి నిమిషంలోనే 90 శాతం కలను మరచిపోతారు. - మూడు సంవత్సరాలలోపు పిల్లలు తమ గురించి కలలు కనలేరు. - మనుషులు ఒక రాత్రి 3-7 కలలు కంటారు. మొత్తం రాత్రిలో రెండు నుంచి మూడు గంటలు కలల్లోనే ఉంటారు. - ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో దాదాపు 6 ఏళ్లు కలల్లోనే ఉంటారు. - పురుషుల కలల్లో 70 శాతం పురుషులే వస్తారట. కానీ మహిళల కలల్లో పురుషులు, మహిళలూ సమానంగా వస్తారట. - 12 శాతం మందికి కలలు బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయట. - అంధులూ కలలు కంటారు. జన్మతః అంధులకు వారి కలల్లో కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయట. అలాగే మధ్యలో చూపు కోల్పోయిన వారికి వారు చూసిన వ్యక్తులు, దృశ్యాలు కలలోకి వస్తాయట. -
రాత్రి ఉపవాసాలు నిద్రకు మంచిదట
న్యూయార్క్: రాత్రి వేళల్లో ఏమీ తినకుండా పడుకుంటే మధ్య రాత్రిలో ఆకలివేస్తుంది, సరిగ్గా నిద్ర పట్టదు.. లాంటి అభిప్రాయాలు మనలో చాలా మందికి ఉంటాయి. కానీ అవేమీ నిజం కాదని, రాత్రి పూట చేసే ఉపవాసాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయని న్యూయార్క్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత, చురుకుదనం కూడా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో సుమారు 500 కేలరీలు ఖర్చవుతాయని ఈ అధ్యయనంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 44 మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరికి కొంత కాలం పాటు తిన్నంత ఆహారం, తాగినన్ని చక్కెర పానీయాలు ఇచ్చి వారు నిద్రపోతున్న సమయాన్ని, నిద్రలో ఎదుర్కొంటున్న లోపాలను గమనించారు. ఇలా 20 రోజులు గడిచాక వీరికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా కేవలం మంచి నీళ్లు మాత్రమే ఇచ్చి ఎలా నిద్రపడుతున్నదీ గమనించారు. కడుపునిండా తిన్నప్పటి కంటే ఎటువంటి ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు వారు చెప్పారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా తినడం వల్ల నిద్రపరంగానే కాకుండా ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడతాయని అన్నారు. -
ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి రాత్రివేళ ఫ్రీకాల్స్
బీఎస్ఎన్ఎల్ డీజీఎం శ్రీనివాసమూర్తి నల్లగొండ అర్బన్: ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి రాత్రంతా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తున్నారని టెలికాం జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆఫర్‌ను మే 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నుంచి రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశంలో ఏ ప్రాంతానికైనా ఏ నెట్వర్క్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ల్యాండ్‌లైన్ పట్టణ, గ్రామీణ, సాధారణ ప్లాన్లు, స్పెషల్ ప్లాన్, కాంబోప్లాన్‌లకు బ్రాడ్‌బాండ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. అంతకంతకు తగ్గిపోతున్న ల్యాండ్లైన్ల కనెక్షన్లకు మళ్లీ గిరాకీ కనిపించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ల్యాండ్లైన్ల కోసం దగ్గరలో వున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసుల కోసం సంప్రదించాలని సూచించారు.18003451500 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఈ పథకం ఎంత కాలం కొనసాగించాలనే విషయాన్ని నిర్ధారించలేదని తెలిపారు. ఆరునెలల తరువాత ప్రగతిని సమీక్షించి సేవలను కొనసాగించే యోచన చేస్తారని అన్నారు. ఇదే కాకుండా బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లను కూడా అమలు చేస్తున్నదని వివరించారు. డాటా ప్లాన్ ఓచర్ స్కీం ద్వారా రూ. 3299 తీసుకునే వారికి డాటా కార్డు ఉచితంగా అందిస్తారని అన్నారు. బీపీవీ-229 తీసుకుంటే రూ.300 కే డాటా కార్డును ఇస్తారని, డీపీవీ-1251 తీసుకుంటే రూ. 600 డాటా కార్డును అందజేస్తారని తెలిపారు. రూ. 2వేల నుంచివెయ్యి వరకు, రూ. 1500 నుంచి రూ. 10వేల వరకు ఫుల్‌టాక్‌టైమ్ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు వేణుగోపాల్, వజీరుద్దీన్, జగన్మోహన్రెడ్డి, జేటీఓ శ్రీనివాస్ పాల్గొన్నార -
‘నైట్‌లైఫ్’కు రెడ్ సిగ్నల్ శాంతిభద్రతలు తలెత్తుతాయని
సాక్షి, ముంబై: నగరంలో ‘నైట్ లైఫ్’కు ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రి సమయంలో హోటళ్లు, టీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెరిచి ఉంచడం వల్ల శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని భావించిన హోం శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నగరంలో వాణిజ్య కేంద్రాలకు నిలయమైన నారిమన్ పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ తదితర నాన్ రెసిడెన్సియల్ ప్రాంతాల్లో అనేక కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం కార్యాలయాలు రాత్రి కూడా తెరిచి ఉంటాయి. దీంతో ముంబైతోపాటు పుణేలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇతర షాపులు 24 గంటలు తెరిచి ఉంచాలనే ప్రతిపాదనను యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే.. నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు కొద్ది రోజుల కిందట భేటీలో తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ మారియా ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు. అయితే శాంతి భధ్రతల ృష్ట్యా ప్రతిపాదనకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రులందు షాపులు, మాల్స్ తెరిచి ఉంచడంవల్ల ఆకతాయిలు, నేర చరిత్ర గల వారితో శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని హోం శాఖ వెల్లడించింది. ఇప్పటికే నగర పోలీసులపై పని భారం ఎక్కువగా ఉందని, షాపులకు అనుమతిస్తే మహిళలకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని హోం శాఖ స్పష్టం చేసింది. అయితే వీటి వల్ల అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలాన్ని బట్టి రాత్రులందు షాపింగ్ మాల్స్, హోటళ్లు తెరిచి ఉంచడం వల్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
రాత్రివేళల్లో కోళ్ల తరలింపు..!
బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం కోళ్లను చంపేస్తారన్న భయంతో వ్యాపారుల అక్రమ మార్గాలు ఇది మరింత ప్రమాదకరంఅంటున్న అధికారులు ఇప్పటివరకూ రూ.10 కోట్ల మేర వ్యాపారులకు నష్టం సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. వేల కోళ్లను పశుసంవర్థక శాఖ అధికారులు చంపేస్తుండటంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చినా రాకున్నా ఆయా ప్రాంతాల్లో కోళ్లను చంపేస్తుండటంతో తమకు కోట్లలో నష్టం వస్తుందని గ్రహించిన కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రి వేలాది కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక కోళ్లను చికెన్ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు బర్డ్‌ఫ్లూ గుర్తించిన ఒక ఫామ్‌లో దాని యజమాని మొదట 35 వేల కోళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తీరా వాటిని లెక్కించేసరికి అందులో 52 వేల కోళ్లు ఉన్నాయని తేలింది. తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో కోళ్లను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి అమ్మేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అక్రమంగా ఎన్నింటిని ఎక్కడెక్కడికి పంపారో ఆరా తీస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని రోజులపాటు చికెన్ షాపులు తెరవకూడదని.. గుడ్ల అమ్మకాలు కూడా జరపకూడదని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి. 72 వేల కోళ్ల చంపివేత రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలోని కొన్ని కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధికారక హెచ్5ఎన్1 వైరస్ నిర్ధారణ కావడంతో ఇది మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 71,918 కోళ్లను చంపి పాతిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. 8,946 కోడి గుడ్లను ధ్వంసం చేశారు. ఇప్పటివరకూ కోళ్ల చంపివేత వల్ల వ్యాపారులకు సుమారు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోళ్లను చంపి పాతిపెట్టే కార్యక్రమంలో మొత్తం 62 బృందాలు.. 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో పశువైద్యులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కోళ్లను పూడ్చిపెట్టే పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ముందస్తుగా టామీఫ్లూ మాత్రలను అందిస్తున్నారు. తొర్రూరు పరిసరాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిలోనూ బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తొర్రూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటినీ పరీక్షించారు. రెండు శాఖల మధ్యా లోపించిన సమన్వయం.. బర్డ్‌ఫ్లూపై కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు.. వచ్చినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులకు తెలియదట. వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్థక శాఖల మధ్య సమన్వయం లోపించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బృందం రాకపై పశుసంవర్థక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘కేంద్ర బృందం వస్తుందా? ఎవరు చెప్పారు? నాకు సమాచారం లేదే?’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, పశుసంవర్ధక శాఖ అధికారులు తమతో కలసిరావడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు కేంద్ర బృందం రాక.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నుంచి జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, 16 రకాల అంటువ్యాధులను దేశవ్యాప్తంగా పర్యవేక్షించే ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, కేంద్ర ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. వీరు గురువారం నుంచి తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తారు. శాంపిళ్లు సేకరించి.. పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజులపాటు ఇక్కడే ఉండి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. -
నైట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 150 నైట్ షెల్టర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా సామాజిక సంఘాలు మాత్రం మరో 575 అవసరమని చెబుతున్నాయి. వీధుల్లోనే నివసిస్తున్న 57 వేల మంది ప్రజల కోసం 150 నైట్ షెల్టర్లను నిర్మించాలని బీఎంసీ తాజాగా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో షెల్టర్‌లో వంద మంది వరకు తల దాచుకోవచ్చు. ఇటీవల బీఎంసీ డ్రాఫ్ట్ డవలప్మెంట్ ప్లాన్ (డీపీ)లో ఇల్లు లేని వారికి తక్కువ సంఖ్యలో ప్రొవిజన్స్ సమకూర్చింది. ఇదే విషయాన్ని ఓ ఎన్జీవో సంస్థ బీఎంసీ దృష్టికి తీసుకువచ్చింది. కార్పొరేషన్ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కేవలం 150 నైట్ షెల్టర్లను మాత్రమే అందజేస్తోందని, నగరంలో ప్రస్తుతానికి తొమ్మిది షెల్టర్లు మాత్రమే ఉన్నాయని, ప్రజల అవసరాలతో పోల్చితే అవి చాలా తక్కువ అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. హోం లెస్ కలెక్టివిటీ అనే సామాజిక సంస్థ సభ్యుడు బ్రిజేష్ ఆర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2011 గణాంకాల ప్రకారం నగరంలో 57,416 ఇళ్లులేని వారు ఉన్నారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ప్రతి లక్ష మందికి ఒక నైట్ షెల్టర్ ఉండాలి. అందులో వంద మందికి సరిపడా మౌళిక సదుపాయాలు కల్పించే వీలు ఉండాలి. సుప్రీం ఆదేశాల ప్రకారం 575 నైట్ షెల్టర్లను నగరం కలిగి ఉండాలి’ అని అన్నారు. ‘వార్డు స్థాయిలో చాలా వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశాం. అయినా బీఎంసీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్ సీతారాం కుంటే, రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం’ అని అన్నారు. నగరంలో టాటా, కేం లాంటి ఎన్నో ఆస్పత్రులు ఉన్నాయని, రోగుల బంధువులు భారీ అద్దెలు చెల్లించలేక ఆస్పత్రుల బయటే ఉంటున్నారని ఆర్య చెప్పారు. ఈ అంశమై బీఎంసీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందనీ తాము కూడా మరిన్ని షెల్టర్లు అవసరం ఉంటాయని సూచిస్తామని ఆర్య తెలిపారు.అయితే సమస్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీపీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
యువ నాటక తరంగం...
ఆదరణ తగ్గుతున్న కళకు అండగా సామాజిక రుగ్మతలే ఇతివృత్తాలుగా... ‘ఉయ్ మూవ్ థియేటర్’తో {పజల ముందుకు వెండితెర, బుల్లితెరల మధ్య నాటక రంగం నలిగిపోయింది. కోట్ల రూపాయల సెట్టింగుల తళుకుల ముందు నాటకాలనే నమ్ముకున్న కళాకారులు కనిపించకుండా పోయారు. పబ్‌లు, డిస్కోలు, నైట్‌పార్టీలు వీటన్నింటితో గజి‘బిజీ’గా తయారైన నేటి యువతకు ఈనాటి కళలన్నింటికి ఆ నాటక రంగమే ఆసరాగా నిలిచిందన్న నిజం తెలియకుండా పోయింది. అందుకే ప్రస్తుతం ఎక్కడో, ఏ పండక్కో పబ్బానికో తప్ప నాటకాలు కనిపించడం లేదు. ఇక బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో వీ టి ఊసేలేదు. అయితే కళ తగ్గుతున్న నాటకరంగానికి సరికొత్త మెరుగులద్దడానికి నగరంలోని కొంత మంది యువకులు ఉద్యమించారు. వృత్తి పరంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లుగా స్ధిరపడ్డా ప్రవృత్తిగా నాటకాలను ఎంచుకున్నారు. ఆదరణ తగ్గుతున్న నాటకాలకు ఆసరాగా నిలబడి ‘ఉయ్ మూవ్థియేటర్’ సంస్ధను స్ధాపించారు. ఏడేళ్లుగా నాటక రంగానికి తమ సేవలందిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ గురించి... - సాక్షి, బెంగళూరు కళారంగంపై అభిమానంతో.... బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ నరేన్‌కి చిన్నప్పటి నుంచి స్టేజి మీద నటించడం ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టం ఆయనతో పాటే పెరిగింది. కాలేజీలో కూడా అనేక నాటకాలు ప్రదర్శించిన అనంతరం సాఫ్ట్వే ర్ ఇంజినీర్‌గా స్ధిరపడ్డారు. అయితే నాటకాలపై ఉన్న మమకా రం తగ్గకపోవడంతో ఏడేళ్ల క్రితం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సంస్ధను ప్రారంభించాడు. నాటకాలంటే ఇష్టం ఉన్న అతని స్నే హితులు రంగరాజ్, డాక్టర్ సోహన్ జత కలిశారు. అప్పటి నుంచి వీరు కలిసి సొంతంగా నాటకాలు రాయడం, వాటికి ద ర్శకత్వం వహించడం వంటివి చేస్తూ వస్తున్నారు. వీరి ప్రయత్నం మెచ్చిన యువతీ యువకులు ‘ఉయ్ మూవ్ థియేటర్’ లో చేరారు. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మందికి పైగా కళాకారులు నాటక రంగాన్ని నిలబెట్టడం కోసం శ్రమిస్తున్నారు. స్ఫూర్తిని కలిగించే నాటకాలకే తొలి ప్రాధాన్యం.... ఉయ్ మూవ్ థియేటర్‌ను స్ధాపించిన ఈ ఏడేళ్లలో మొత్తం 50 నాటకాలను ప్రదర్శించారు. వీటన్నింటిలో సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహనను పెంచే నాటకాలకే సంస్ధ సభ్యులు మొదటి ప్రాధాన్యాన్ని కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూగర్భ జలాలను పెంపొందించడం, వరకట్న దురాచారం వంటి వాటన్నింటి పై ఉయ్ మూవ్ థియేటర్ సభ్యులు నాటకాలను ప్రదర్శిం చారు. వీరు ప్రదర్శించిన నాటకాల్లో ‘మాల్గుడి డేస్’కి ఎక్కువ జనాదరణ లభించింది. అంతేకాదు నగర జీవితంలోని ఆధునిక పోకడలు, తద్వారా కలుగుతున్న నష్టాలను వివరించేలా వీరు రూపొందించిన ‘నమ్మ మెట్రో ఫేజ్-2’ నాటిక సైతం ఎంతో ప్రజాదరణను పొందింది. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న దురాచారానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వీధి నాటికలను (స్ట్రీట్ప్లే) సైతం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులు ప్రదర్శిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పుడిప్పుడే కాఫీడే వంటి కార్పొరేట్ సంస్థలు వీకెండ్లో ఈ సంస్థ ద్వారా ప్రదర్శనలు ఇప్పి స్తూ తమ వినియోగదారులకు మనోరంజకాన్ని కలిగిస్తున్నాయి. అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి... ఓ మహాయజ్ఞంలా నాటకాలను ప్రదర్శిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులను ఎన్నో అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ నాటక రంగ సంస్థ ‘షార్ట్, స్వీట్ థియేటర్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన నాటకాల పోటీల్లో ‘బెస్ట్ ఇండిపెండెంట్ థియేటర్ కంపెనీ’ అవార్డును ఈ సంస్ధ సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ నవల ఆధారంగా రూపొందిన ‘మిర్రర్ మిర్రర్’ నాటకాన్ని సైతం భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రదర్శించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. మనలోని మంచి చెడులను అద్దం మనకు తెలియజెబితే ఎలా ఉంటుంది అన్న ఊహ తో రూపకల్పన చేసినదే మిర్రర్ మిర్రర్. ఈ నాటకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులెన్నో లభించాయి. ప్రొడక్షన్ ఖర్చుకు మాత్రమే వసూలు ‘నాటక రంగంపై ఉన్న మక్కువతోనే ఈ సంస్ధను ప్రారంభిం చాను తప్ప వాణిజ్య పరంగా ఏదో లాభపడాలని కాదు. అం దుకే మా నాటకాలకు అయ్యే ప్రొడక్షన్ ఖర్చుకు సరిపోయేం త మొత్తాన్ని మాత్రమే టికెట్ల రూపంలో వసూలు చేస్తాం. ఒక్కొసారి మా టీం సభ్యులమే కాక కొంతమంది ఫుల్‌టైమ్ నటులను కూడా మా ప్రదర్శనల కోసం పిలుస్తుంటాం. వారి కి అవసరమైన ఖర్చులను కూడా ప్రొడక్షన్ మొత్తం నుంచే భరి స్తాం. అందుకే మేం ప్రదర్శించే నాటకాలకు సంబంధించిన టికెట్ ధర నామమాత్రంగా ఉంటుంది. ఆనాటి కళ ఎన్నటికీ మరుగుపడిపోకూడదన్నదే మా ఆశయం.’ - రంగరాజ్, ‘ఉయ్ మూవ్ థియేటర్’ వ్యవస్థాపకృబంద సభ్యుడు నాటక రంగంపై ఆసక్తి ఉండి ‘ఉయ్ మూవ్ థియేటర్’లో సభ్యులుగా చేరాలనుకునే వారు www.wemovetheatre.in, register@-wemovetheatre.in లలో లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చు. -
నైట్‌షెల్టర్ల స్థితిగతులపై సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని నైట్‌షెల్టర్ల స్థితిగతులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సంబంధిత అధికారులతోసమీక్షించారు. కుటుంబాల కోసం నైట్‌షెల్టర్లను నడపడంపై శ్ర ద్ధ వహించాలని ఎల్జీ ఈ సందర్భంగా సూచించారు. నిరాశ్రయ కుటుంబాల్లో భద్రతా భావం కల్పించేందుకు ఇటువంటి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నగరంలో చలి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల అప్పటివరకు నిరాశ్రయులకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించారు. కాగా నగరంలోని 249 నైట్షెలర్లలో నిరాశ్రయులు రాత్రిపూట తలదాచుకుంటున్నారు. వీటిలో మొత్తం 18,805 మంది ఆశ్రయం పొందే వీలుంది. నైట్ షెల్టర్లలో 91 శాశ్వత నిర్మాణాలు, 111 పోర్టాకేబిన్లు,37 టెంట్లు ఉన్నాయి. మరో తొమ్మిది డీడీఏ కమ్యూనిటీ సెంటర్లలో నడుస్తున్నాయి. వసుంధరా ఎన్క్లేవ్ నివాసితుల సంక్షేమ సంఘం (ఆర్డబ్ల్యూఏ) కూడా నైట్‌షెల్టర్ కోసం ఓ ప్లాట్‌ను ఇచ్చింది. నగరంలోని నైట్‌షెల్టర్లలో 20 షెల్టర్లు ప్రత్యేకంగా చిన్నారుల కోసం నడుస్తున్నాయి. మహిళల కోసం 19, కుటుంబాల కోసం 13 , వికలాంగుల కోసం రెండు నడుస్తున్నాయి. -
ఈ ‘నైట్ షో’ నచ్చలేదు
ఆ పేరు మార్చకపోతే నా పేరుకే భంగం కలుగుతుంది అంటూ నటి నయనతార దర్శకుడిపై ఒత్తిడి చేయడంతో చిత్రం పేరు మార్చక తప్పలేదట. నయనతార నా మజాకా అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఏమా టైటిల్, ఏమా కథ? వివరాల్లో కెళితే...అందాలభామ నయనతార తొలిసారిగా ఒక హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అదీ ఒక ఒక వేశ్య పాత్రలో. అలాంటి పాత్రను చేయడానికి ఆమె అంగీకరించిందంటే దానికి ప్రత్యేకత ఏదో ఉండే ఉండాలి. ఇకపోతే ఈ క్రేజీ భామ నటిస్తున్న ఆ చిత్రం పేరు నైట్‌షో. చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె సరసన యువ నటుడు ఆది నటించడం విశేషం. అయితే నైట్‌షో అనే టైటిల్ నయనతార ఇమేజ్‌కు భంగం కలిగేదిగా ఉందని, అసలాపేరే బీ గ్రేడ్‌లో ఉందని ఆమె సన్నిహితులు చెవిలో జోగారట. దీంతో ఆ టైటిల్ మార్చమని చిత్ర దర్శక, నిర్మాతపై నయనతార ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం. నయనతార అంతటి హీరోయిన్ ఆదేశించడంతో దర్శక, నిర్మాతలకు పాటించక తప్పుతుందా? పైగా ప్రత్యామ్నాయ పేరును కూడా ఆ ముద్దుగుమ్మకే చూపించారట. నయనతార అజిత్‌తో తొలిసారిగా జత కట్టిన చిత్రం ఆరంభం. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆరంభంలో నయనతార పాత్ర పేరు మాయ. ఈ పేరునే నైట్‌షో చిత్రానికి ఖరారు చేయమని ఆమె చెప్పడంతో దర్శక, నిర్మాతలు అదే పేరును ఖరారు చేశారని యూనిట్‌వర్గాల మాట. -
ఫ్లైఓవర్ల కింద టెంట్లు వేయండి: ఎల్జీ
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో రక్తం గడ్డకట్టేలా చలిపులి పంజా విసురుతుండడంతో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికారులను ఆదేశించారు. నిరాశ్రయుల కోసం ఫ్లైఓవర్ల కింద టెంట్లు వేయాలని ఆదేశించిన ఎల్జీ, నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ఢిల్లీ మెట్రోను కోరారు. గత రెండు రోజుల్లో ఎల్జీ నగరంలోని అనేక నైట్ షెల్టర్లను సందర్శించారు. నగరంలోని నిరాశ్రయులందరికీ నీడ, పడక సదుపాయం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఢల్లీ పట్టణ ఆశ్రయ అభివృద్ధి బోర్డు (డీయూఎస్ఐబీ)కి టెంట్లు సమకూర్చుకునేందుకు అదనంగా మరో రూ.7 కోట్లను జంగ్ కేటాయించారని ఎల్జీ అధికార నివాసమైన రాజ్‌నివాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు డీయూఎస్ఐబీకి రూ.5 కోట్లు కేటాయించారు. ప్రజలను సురక్షితంగా, వెచ్చగా ఉండే నైట్ షెల్టర్లకు తరలించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలామంది నిరాశ్రయులు రోడ్లను, ఫ్లైఓవర్లను విడిచిపెట్టడం లేదని అధికారులు చెప్పారు. ఇలా మొండిగా వ్యవహరిస్తున్న వారి కోసం ఎల్జీ ఫ్లైఓవర్ల కిందనే టెంట్లు వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ ఏర్పాట్లు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉంటాయని అన్నారు. -
సలి సంపేత్తోంది..
అనంతపురం అగ్రికల్చర్ : రాత్రి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. సాయంత్రం నుంచి వేకువజాము వరకు ఉష్ణోగ్రతలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదైంది. డిసెం బర్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడం ఇదే తొలిసారి అని రేకులకుంటలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాధినేని మల్లీశ్వరి తెలిపారు. సాధారణంగా ఈ సమమంలో 15 డిగ్రీల మేర ఉండేదన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలు గా నమోదైనట్లు తెలిపారు. ఫలితంగా జిల్లా ప్రజలను చలి గజ గజ వణికిస్తోంది. పగలు కూడా 26 డిగ్రీలకు మించడం లేదు. సాయంత్రం 6 నుంచే చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వేకువ జామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. రహదారుల్లో పొగమంచు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోం ది. ఉదయం వేళ శ్రామికులు, పాలు, పారిశుధ్య కార్మికులు, పల్లె ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండు రోజులుగా చలి తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. డిసెం బర్‌లోనే ఇలా ఉంటే జనవరిలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చలి పులి దెబ్బకు ఉన్ని దుప్పట్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు, సాక్సు లు, టీ, కాఫీలకు గిరాకీ పెరిగింది.