రాత్రిపూట ట్విట్టర్ వాడుతున్నారా.. గుడ్ న్యూస్..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ తన యూజర్ల కోసం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో నైట్ మోడ్ యూజర్ ఇంటర్ ఫేస్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ ఆండ్రాయిడ్ యాప్ తో స్క్రీన్ లో వైట్ బ్రాక్ గ్రౌండ్ బదులుగా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్నాలజీ వెబ్ సైట్ మంగళవారం అ వివరాలను తెలిపింది. అయితే తర్వలో యూజర్లు ఇష్టం ఉన్న మోడ్ సెలెక్ట్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఆటోమేటిక్ గా నైట్ మోడ్ అప్లై అవుతుందా.. లేక యూజర్స్ సెలెక్ట్ చేసుకోవాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
ప్రస్తుతం ట్విట్టర్ సైట్ లో బ్యాక్ గ్రౌండ్ వైట్ గా ఉండి, లెటర్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయన్న విషయం తెలిసిందే. యూజర్లు రాత్రివేళ ట్వీట్లు చేయడం, బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు పడరాదని భావించిన తర్వాతే ట్విట్టర్ ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 'నైట్ మోడ్' తో పాటు కొన్ని బటన్లపై కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. ఓవర్ ఫ్లో బటన్స్, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్స్ ఫీజర్లతో కొత్త తరహాలో ట్వీట్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.