రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.
రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్‌నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment