brushing teeth
-
నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!
రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? -
పిల్లలకు బ్రషింగ్ నేర్పడం ఇలా..
పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్ ప్రక్రియనూ నేర్పాలి..పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్‌తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం నేర్పాలి.పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్‌గా బ్రషింగ్ చేస్తారు.బ్రష్ మీద బఠాణీ గింజ అంత పేస్ట్ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్! -
పళ్లు తోముకుంటూ వేపపుల్ల మింగేశాడు.. ఆ తర్వాత..
సాక్షి,ఖమ్మం వైద్యవిభాగం: ఉదయం లేవగానే వేపపుల్లతో పళ్లు తోముకోవడం అలవాటు ఉన్న ఓ వ్యక్తి శనివారం అలాగే చేస్తుండగా పుల్ల ఒక్కసారిగా ఆయన గొంతులో నుంచి కడుపులోకి వెళ్లింది. దీంతో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే... ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన గీత కార్మికుడు పర్సగాని ఆదినారాయణ శనివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకుంటుండగా వేపపుల్ల గొంతులోకి వెళ్లి మెల్ల గా కడుపులోకి చేరింది. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకురాగా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ టి.అరుణ్‌సింగ్ పరీక్షలు నిర్వహించి చిన్నగాటు కూడా పెట్టకుండా ఎండోస్కోపీ మిషన్ ద్వారా కడుపులోని వేపపుల్లను బయటకు తీశారు. ఈ సందర్భంగా చికిత్స వివరాలను ఆస్పత్రి డైరెక్టర్, యూరాలజిస్ట్ కె.కిశోర్‌కుమార్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్‌సింగ్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కే.వీ.ఎస్ చౌహాన్, కేన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు వి.ప్రదీప్ వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
పేస్టు అనుకుని.. ఎలుకల మందుతో పళ్లు తోముకుని..
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): పేస్టు అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువతి మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమారె పాలపర్తి కీర్తి(18) తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది. చదవండి: హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఈ నేపథ్యంలో గురువారం పేస్టు అనుకుని ఎలుకల మందు బ్రెష్‌పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ శనివారం కీర్తి మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
బ్రషింగ్ ఎలా చేయాలో ఇటో లుక్కేయండి!
పళ్లను శుభ్రపరచుకోవడంలో భాగంగా బ్రష్ చేసే సమయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తుంటారు. నిజానికి ఒక క్రమపద్ధతిలో బ్రషింగ్ సాగాలి. దంతాలు దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన రీతిలో బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ఇలా చేసుకునే సమయంలో నిలువుగా బ్రష్ చేస్తూనే పళ్ల మీద బ్రష్ కదలికలు సున్నాలు చుడుతున్నట్లుగా గుండ్రంగా సాగాలి. ►మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►రెండు లేదా మూడు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. అంతకుమించి బ్రషింగ్ కూడా పళ్లకు మంచిది కాదు. ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్లపాటు స్క్రబ్ చేయండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మూడు నెలలకు ఓమారు లేదా బ్రిజిల్స్ వంగినట్లు, కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. అలాగే జ్వరం వచ్చాక లేదా ఏదైనా జబ్బుబారిన పడి కోలుకున్న వెంటనే బ్రష్ మార్చడం ఉత్తమం. -
నోట్లో పొక్కులా? నో వర్రీ?
కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్ అల్సరేషన్) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొక్కులకు సరైన కారణం తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించాలి. అందుకే నోట్లో పొక్కులు వచ్చే వారు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారంపాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: రేగి పండు.. పోషకాలు మెండు.. సరిగా బ్రష్ చేసుకుంటున్నారా? మనం బ్రష్ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి మన దంతాల, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచి, కేవలం దంతాలను మాత్రమే కాకుండా మన పూర్తి దేహానికి ఆరోగ్యాన్నిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... ► బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి. మరీ బిరుసైనవీ, గట్టివి అయితే పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు... చిగుళ్లు గాయపడే అవకాశమూ ఉంది. ►కిందివరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ఇలా బ్రష్ చేసుకునే సమయంలో బ్రష్‌ను పైకీ, కిందికీ నేరుగా కాకుండా... గుండ్రగా తిప్పుతున్నట్లుగా మృదువుగా బ్రష్ చేసుకోవాలి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లు గాయపడి, త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►బ్రషింగ్‌తో పాటు ముఖం కడుకున్న తర్వాత చివర్లో చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. -
దంతాలు మూడుసార్లు తోముకుంటేనే..
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు మూడు సార్లు పరిశుభ్రంగా దంతాలు తోముకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కనీసం పది శాతం దక్కుతుందని దక్షిణా కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 1,61,000 మందిపై జరిపిన అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పన్ల మధ్య చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా రక్త నాళాల ద్వారా గుండెలోకి వెళ్లడం వల్ల గుండె కొట్టుకోవడం లయ తప్పుతుందని, తద్వారా గుండె పోటు వచ్చే ఆస్కారం ఉందని వారు అభిప్రాయపడ్డారు. రోజుకు మూడు సార్లు పన్లు తోమడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తమ అధ్యయనంలో తేలిందని సియోల్‌లోని యెవా విమెన్స్ యూనివర్శిటీ డాక్టర్ తే జిన్ సాంగ్ చెప్పారు. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నా 40 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కులపై ఈ అధ్యయనం జరిపామని, వయస్సు, స్త్రీలా, పురుషులా, పేద వారా, ధనవంతులా, మద్యం తాగుతారా లేదా, వ్యాయామం చేస్తారా, లేదా అన్న అంశాలతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు పన్లు తోముతున్న వారిలో గుండె జబ్బుల అవకాశం పది నుంచి 12 శాతం వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. -
పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!
మనం బ్రషింగ్ ప్రక్రియను చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ మంచి బ్రషింగ్ అలవాట్ల వల్ల దాదాపు జీవితకాలమంతా మన దంతాలను రక్షించుకోవచ్చు. జీవితాంతం మన స్వాభావిక దంతాలతోనే హాయిగా నమిలి తింటూ, ఎన్నెన్నో రుచులు ఆస్వాదించవచ్చు. ఇలా రోజూ మంచి బ్రషింగ్ అలవాట్లను అనుసరిస్తే... భవిష్యత్తులో దంతవైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చులూ తగ్గుతాయి. అందుకే వీటిని అనుసరించండి. దంతాలు మెరిపిస్తూ మంచి చిరునవ్వుతో హాయిగా ఉండండి. పిల్లల బ్రషింగ్ కోసం సూచనలివి... ►చంటి పిల్లల తల్లులు మొదట తల్లులు తమ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లులు, పిల్లలు ఒకే చెంచాను ఉపయోగిస్తుంటారు. అందువల్ల తల్లుల నోట్లోని బ్యాక్టీరియా పిల్లల లాలాజలంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలి. తమ కోసం విడిగా చెంచాను ఉంచుకోవాలి. పిల్లల కోసం ఉద్దేశించిన చెంచాను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. ►ప్రతిసారీ పిల్లలకు పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి. ►పిల్లలు ఊయగలరు, టూత్‌పేస్ట్‌ను మింగబోరని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై బఠాణీగింజంత టూత్‌పేస్ట్ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి. ►చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేస్తుండటం మంచిది. ►చక్కెర కలిపిన జ్యూస్‌ల వంటి ద్రవాహారాలను పాల బాటిళ్లలో ఇవ్వవద్దు. ►పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక ఎట్టిపరిస్థిల్లోనూ బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. బాటిల్ నోట్లో పెట్టేసి మరచిపోవద్దు. దాని వల్ల పళ్లన్నీ పుచ్చిపోయి ‘నర్సింగ్ బాటిల్ కేరిస్’ అనే పళ్లసమస్య వచ్చే ప్రమాదం ఉంది. ►పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే... కప్స్ సహాయంతో వాళ్లు ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి. ►పిల్లలు ఘనాహారం తీసుకోవడం మొదలుపెట్టాక... వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి. తినగానే నోరు పుక్కిలించేలా జాగ్రత్త తీసుకోండి. ►ఇక బ్రషింగ్ విషయానికి వస్తే... పిల్లలు ఉపయోగించే బ్రష్ మృదువైన బ్రిజిల్స్ ఉన్నదై ఉండాలి. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకునేలా వారికి బ్రషింగ్ నేర్పాలి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోవడం నేర్పాలి. రఫ్‌గా బ్రష్ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని జరగవచ్చు. ►పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవడం వారికి నేర్పాలి. ►పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు. ►బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్ చేయకుండా చూడాలి. ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్ కూడా పిల్లలకు నేర్పాలి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దలు బ్రషింగ్ ఎలా చేసుకోవాలంటే... ►పెద్దలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండుమార్లు పళ్లు తోముకోండి. కొందరు రాత్రివేళ బ్రషింగ్ అనవసరం అనుకుంటారు. కానీ మన ఆరోగ్యమంతా చాలాకాలం పాటు బాగుండాలంటే రాత్రి బ్రషింగ్ చాలా అవసరం. ►ఆర్నెల్లకోమారు మీ డెంటిస్ట్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ►మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి. ►డాక్టర్లు సూచించే ప్రత్యేకమైన మెడికేటెడ్ టూత్పేస్ట్లు మినహా మిగతా టూత్‌పేస్ట్‌లన్నీ బ్రష్షింగ్ సమయంలో ఘర్షణను (ఫ్రిక్షన్‌ను) తగ్గిస్తాయి. కాబట్టి ఫలానా టూత్‌పేస్ట్ మాత్రమే మంచదని అనుకోకండి. మీకు సంతృప్తి కలిగేదాన్ని ఎంచుకోండి. ఏవైనా దంతసమస్యలు వస్తే డాక్టర్లు ఎలాగూ ప్రత్యేకమైన వాటిని సూచిస్తారు. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అప్పుడు చిగుళ్లు త్వరగా వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి. ►కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి. ►బ్రష్షింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. ఒకసారి మీకేదైనా జ్వరం వచ్చి తగ్గాక పాత టూత్‌బ్రష్‌ను వెంటనే మార్చండి. దాన్ని అలాగే కొనసాగించకండి. ►పిల్లల బ్రష్‌లైనా లేదా పెద్దలవైనా... బ్రష్ ఉపయోగించాక వాటిని టాయిలెట్ ఉన్న గదిలో ఉంచకూడదు. పక్కన ఆ గది బయట వాటిని విడిగా ఉంచాలి. ఎందుకంటే... మనం ఫ్లష్ చేసే సమయాల్లో టాయిలెట్లో ఉన్న బ్యాక్టీరియా మన బ్రిజిల్స్‌కు అంటుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వాటిని టాయిలెట్ రూమ్‌లో ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం... మనం బ్రష్ చేసుకున్న తర్వాత అలా తడిగా వదిలేస్తాం. కానీ టవల్‌తో తుడవడం లాంటిది చేసి, అది పొడిబారాకే దాన్ని భద్రపరచుకోవాలి. బ్రష్‌కు క్యాప్లాంటి కేస్లు ఉంటే అది మరింత మంచిది. డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
‘ఏడాదికోసారి స్నానం.. ఆమెతో ఉండలేను’
మన జీవితాల్లో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. దేహశుభ్రత గురించి పట్టించుకోకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. తైవాన్‌లో వెలుగుచూసిన ఉదంతమే దీనికి తాజా రుజువు. తైపీ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. భార్య నుంచి విడిపోవడానికి అతడు చెప్పిన కారణాలు విని న్యాయమూర్తులు అవాక్కయ్యారు. తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకునేదని వివరించాడు. ఉద్యోగం చేయొద్దని ఆమె పెట్టే బాధ భరించలేక కొన్నాళ్లు జాబ్ మానేసి, అత్తారింట్లో ఉన్నానని చెప్పాడు. 2015 చివర్లో తన భార్యకు చెప్పకుండా ఇళ్లు విడిచి వెళ్లిపోయి సించు అనే ప్రాంతంలో ఉద్యోగంలో చేరానని తెలిపాడు. అయితే నెల రోజుల తర్వాత తన ఆచూకీ తెలుసుకుని వచ్చిన ఆమె ఉద్యోగం మానేయాలని మళ్లీ ఒత్తిడి చేయడంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నాడు. తనపై భర్త చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. అతడిని తన తల్లిదండ్రులు సొంత కొడుకులా చూసుకున్నారని తెలిపింది. -
తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది!
వాషింగ్టన్: నాలుగేళ్ల కూతురు బ్రష్ చేసుకుండా మారాం చేస్తుందని ఓ తల్లి ఆవేశంతో చేసిన పని పసి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని మేరీ ల్యాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొదట తన కూతురు బ్రష్ చేసుకోవడానికి బాత్రూమ్కు వెళ్లిందని, బటయకు రావడం లేదని ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. చివరగా వారు టెస్టులు చేయడంతో తల్లి దాడి కొట్టడం వల్లే చిన్నారి చనిపోయిందని తేలింది. మేరీలాండ్ కు చెందిన ఐరిస్ హెర్నాండేజ్ రివాస్ అనే మహిళకు నాలుగేళ్ల కూతురు నోహేలీ అలెగ్జాండ్రో మార్టినెజ్ హెర్నాండేజ్ ఉంది. బ్రష్ చేసుకోమని తల్లి ఎంత చెప్పినా.. చిన్నారి నోహేలీ మాట వినకపోవడంతో ఆవేశానికి లోనైంది. చిన్నారి కడుపు, తల భాగాల్లో తీవ్రంగా కొట్టి, బాత్రూమ్లోకి నెట్టి గడియపెట్టింది. ఎంతసేపయినా కూతురు బయటకు రాలేదని గమనించి ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వాషింగ్టన్ డీసీలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అసలే తలకు సంబంధించిన ఓ సమస్యతో ఉన్న చిన్నారి తల్లి దెబ్బలకు తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడే చనిపోయింది. బెల్టుతో కూడా కొట్టినట్లు పోలీసుల వద్ద అంగీకరించింది. ఆమెకు శిక్ష ఇంకా ఖరారు చేయలేదు.