
ప్రతీకాత్మక చిత్రం
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): పేస్టు అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువతి మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమారె పాలపర్తి కీర్తి(18) తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది.
చదవండి: హాస్టల్‌లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఈ నేపథ్యంలో గురువారం పేస్టు అనుకుని ఎలుకల మందు బ్రెష్‌పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ శనివారం కీర్తి మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment