prakasm district
-
జగన్ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు.ఇసుక పాలసీపై కావాలంటే విచారణ చేసుకోవచ్చు.. కాని గత ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదని వైవీ అన్నారు. వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జగన్ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
YSRCP ప్రకాశం జిల్లా అభ్యర్థులు వీళ్లే
ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అందుకే బీజేపీలో చేరేందుకు బాబు ప్రయత్నాలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడనే ఐటీ నోటీసులిచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధంగా దొంగ ఓట్లు చేర్పించారో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ‘‘జమిలి ఎన్నికలు వచ్చినా.. సాధారణ ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం మళ్లీ సీఎం జగన్నే ఎన్నుకుంటారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదు.. అందుకే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వేషాలు వేసినా.. ఎంత మందితో కలిసి వచ్చినా. మళ్లీ వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమే’’ అని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ తన పాదయాత్రలో సీఎంను దుర్భాషలాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. చదవండి: కాళ్ల బేరం ఖరీదెంత? -
సీఎం చిత్రపటానికి విశ్వబ్రాహ్మణుల క్షీరాభిషేకం
ఒంగోలు : సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మది్వరాట్ శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిస్తే పలికే దైవంలా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సైతం ఇబ్బందిగా ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేకమైన జీవో ద్వారా నెలకు రూ.5 వేలు కేటాయిస్తూ ఉత్తర్వులివ్వడం హర్షణీయమన్నారు. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం మొత్తానికి ఇది ఒక శుభదినంగా చెప్పారు. జీవో జారీ అయ్యేందుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల రజని, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, కటారి శంకర్, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్చార్జి బొట్ల సుబ్బారావు, ధరణికోట లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య తదితరులు పాల్గొన్నారు. -
వలస బతుకుల మెతుకు వేట..!
సొంతూరులో ఉపాధి కరువు.. ప్రతి పూటా బతుకు పోరాటం.. జీవనయానం కోసం వేల కి.మీ. పయనం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఆ చెంతనే నిప్పుల కొలుములు పెట్టుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్లోనే వీరికి ఆదరువు. ఒక వైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నా.. బుక్కెడు మెతుకుల కోసం వలస జీవులు ఊరూరా తిరుగుతూ తమకు తెలిసిన నైపుణ్యంతోపనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వలస జీవుల జీవన ఆరాటంపై స్పెషల్ ఫోకస్... దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): మధ్యప్రదేశ్..ఉత్తరప్రదేశ్..ఛత్తీస్‌ఘడ్.. ఇవన్నీ జిల్లాకు సుదూర ప్రాంతాలే. ఎన్నో వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఎన్నో ఆశల మధ్య జీవనం సాగిస్తున్నారు వలస జీవులు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. పనిచేస్తేకానీ నోటికందని మెతుకుని రెక్కల కష్టం చేద్దామన్నా స్థానికంగా అండ లేక, పూటగడవడమే కష్టమైన వేళ.. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిప్పుల కొలిమిలో ఇనుమును కరిగించి.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో పిల్లా పెద్దా,.. ఆడ, మగ.. ఇలా అందరికీ ఇనుముతోనే బతుకు అంతా ముడిపడి ఉంటుంది. ఒకరో ఇద్దరో కాదు ఐదు వేల మందికి పైగా నిరుపేదలకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిల్లాకు పొట్టచేత పట్టుకుని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏటా వ్యవసాయ సీజన్లో ఒక్కడే ఉండి ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే.. యాంత్రీకరణ గణనీయంగా పెరిగిన ఈ రోజుల్లోనూ వారు చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలై పని రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఆడ, మగ తేడా లేకుండా పనిముట్లు తయారు చేస్తారు. పనిముట్లు తయారు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు తమ వెంట తెచ్చుకుంటారు. వీటి తయారీకి లారీల పాత కమాన్ ప్లేట్లు కేజీ రూ.80కి కొంటారు. వాటిని కొలిమిలో కాల్చి ఇనుమును కరిగించి, సమ్మెటల సాయంతో గునపాలు, కొడవళ్లు, పారలు, వంట పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన నిప్పుల పొయ్యి రాజేసుకుని చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తింటారు. రాత్రయితే రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని గుడి మెట్ల పక్కనో..షాపుల ఆవరణలో నిద్రిస్తారు. సైజును బట్టి కొడవలి రూ.20 నుంచి రూ.200 వరకు విక్రయిస్తారు. గొడ్డలి రూ.150 నుంచి రూ.300, మాంసం కత్తి రూ.100 నుంచి రూ.250 వరకు విక్రయిస్తారు. రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయాలు ఉంటాయి. ఊరూరా తిరుగుతూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాకుతున్నారు. సంచార జీవితం సాగిస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 5 వేల మందికి పైగా పనిముట్ల తయారీలో జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా జన సంచార ప్రాంతాల్లో కొంత స్థలంలో తాత్కాలికంగా కొలిమి ఏర్పాటు చేసుకుని పనిముట్లు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా దర్శి బస్టాండ్ ప్రాంతం, తాళ్లూరు వీకే కళాశాల వద్ద, వినుకొండలో కురిచేడు రోడ్లో గొర్రెల బడ్డి వద్ద వ్యవసాయ పరికరాలు తయారు చేసుకుని విక్రయిస్తున్నారు. దొనకొండ నాలుగు కూడళ్ల ప్రాంతంలో, చీమకుర్తిలో జవహర్ హాస్పిటల్ వద్ద, బీవీఎస్ కళాశాల ప్రాంతం, గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, మోటు వద్ద, మార్కాపురంలో తర్లుపాడు మండల కేంద్రం, కొండపి బస్టాండ్ ప్రాంతంలో, కట్టంవారిపాలెం వద్ద, యర్రగొండపాలెం బస్టాండ్ ప్రాంతంలో అర్ధవీడు మండలం కుంట వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని డిమాండ్ ఉన్న రోజుల వరకు అక్కడే ఉంచి పనిముట్లు తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తారు. అక్కడ ఆదరణ లేదు మధ్యప్రదేశ్‌లో పనిముట్లు తయారు చేసినా సరైన ఆదరణ లేదు. అమ్ముకోవాలంటే గిరాకీ లేదు. అందుకే వ్యవసాయ సీజన్లో ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటూ పలు గ్రామాలు తిరుగుతూ పనిముట్లు అమ్ముకుంటాం. రోజుకు గ్రామాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు వస్తాయి. ఖర్చులు పోను జీవనానికి ఇబ్బందులు ఉండవు. ఉపాధి కల్పిస్తున్న ఏపీకి ప్రత్యేక కృతజ్ఞతలు. – జగదీష్, భోపాల్, మధ్యప్రదేశ్ -
పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా..
ప్రకాశం : పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామపై ఓ మేనల్లుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీరాపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బండి శివ తన మామను కలిసి పెళ్లి చేసుకునేందుకు కుమార్తెను తనకు ఇవ్వాలని కోరాడు. తనకు ఇష్టం లేదని మామ మారంరెడ్డి నరసింహారెడ్డి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మామపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తెపై కూడా అదే కత్తితో చేతిపై కోసి గాయపరిచాడు. క్షతగాత్రులను స్థానికులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్ఐ సురేష్‌కు సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శివను అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
నెల క్రితమే ప్రేమ పెళ్లి.. ఏమైందో తెలియదు.. భార్యపై కత్తితో దాడి
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య కొత్తా పావని పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన భర్త సాయికుమార్ పరారీలో ఉన్నాడు. పావని దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. -
Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి..
-
పేస్టు అనుకుని.. ఎలుకల మందుతో పళ్లు తోముకుని..
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): పేస్టు అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువతి మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమారె పాలపర్తి కీర్తి(18) తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది. చదవండి: హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఈ నేపథ్యంలో గురువారం పేస్టు అనుకుని ఎలుకల మందు బ్రెష్‌పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ శనివారం కీర్తి మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి....
ఉలవపాడుః ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడ బంగినపలి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు –కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్‌పసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది మార్చి నుండి జులై వరకు సీజన్సాగుతుంది. ఎకరమునకు 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్‌లకు పంపిస్తారు. బెంగుళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఫల రాజుగా పేరొందిన మామిడి కాయలకు ఉలవపాడు ప్రాంతం ఫేమస్ గా చెప్పుకోవచ్చు. -
టైగర్ రొయ్యపై పెరుగుతున్న ఆసక్తి
అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో రారాజుగా నిలిచి దాదాపు దశాబ్దానికి పైగా డాలర్ల వర్షం కురిపించిన టైగర్ రొయ్య తిరిగొస్తోంది. గతంలో వివిధ రకాల వైరస్లు చుట్టుముట్టడంతో ఆక్వా సాగులో అవి అంతర్ధానమయ్యాయి. తాజాగా టైగర్ రొయ్యల సాగు ప్రభ మళ్లీ ప్రారంభం కానుంది. టైగర్ సరికొత్త బ్రూడర్‌తో పునరాగమనంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. నకిలీలపై దృష్టిసారించిన అధికార యంత్రాంగం హేచరీల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టైగర్ అంటే ఆక్వా రంగంలో రారాజు... నీలి విప్లవానికి నాంది. అంతర్జాతీయ మార్కెట్లో టైగర్ రొయ్యకు మంచి గిరాకీ ఉంది. కేవలం ఎగుమతి కోసమే ఉత్పత్తి చేసే టైగర్ రొయ్య పేరు రెండు దశాబ్దాల పాటు వినపడకుండా పోయింది. 1990 తరువాత వివిధ రకాల వైరస్లు సోకటంతో కనుమరుగైంది. ఆ తరువాత వెనామీదే రాజ్యం. తాజాగా వెనామీ కూడా వైరస్‌లా బారిపడి రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ఎన్నో అధునాతన ప్రయోగాలు, పరిశోధనలతో వైరస్‌కు ఎలాంటి తావులేకుండా ఉండే సరికొత్త టైగర్ బ్రూడర్స్‌ను దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ బ్రూడర్స్ ద్వారా సీడ్‌ను ఉత్పత్తి చేసి ఆక్వా సాగు చేసే రైతులకు అందజేస్తున్నారు. దీంతో తిరిగి వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. నకిలీకి తావులేకుండా నిఘా.. టైగర్ రొయ్యల సాగు తిరిగి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ టైగర్ రొయ్యల సీడ్ బారిన పడకుండా ఆక్వా రైతులను కాపాడటానికి తనిఖీలను ఇప్పటికే ముమ్మరం చేసింది. టైగర్ సీడ్ ముసుగులో వెనామీ రొయ్య పిల్లలను రైతులకు అంటగట్టకుండా హేచరీలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేకంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 41 హేచరీలపై కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ), జిల్లా మత్స్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇటీవల దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో ఒక హేచరీ నుంచి నకిలీ టైగర్ సీడ్ బయటకు వచ్చిందని సమాచారం రావటంతో అధికారులు తనిఖీలు చేసి దానిని మూసివేశారు. టైగర్ సీడ్ పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు అనుమతి.. టైగర్ రొయ్యల సీడ్ ఉత్పత్తికి దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. సరికొత్త బ్రూడర్‌తో సీడ్‌ను ఉత్పత్తి చేయటానికి తమిళనాడు చెంగల్పట్టులోని హేచరీ, నెల్లూరు జిల్లాలోని వైష్ణవి హేచరీలకు మాత్రమే అనుమతులిచ్చాయి. ఈ రెండు హేచరీలు సరికొత్త బ్రూడర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సీడును ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా నుంచి సరికొత్త బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకొని కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి అనేక పరీక్షల తరువాత అనుకూలంగా ఉంటేనే వాటి నుంచి సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో సాగు చేయాలనుకునే వారు నేరుగా ఈ రెండు హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చిన సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోనే వెయ్యాలి. వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉండే హేచరీలలో వెనామీ సీడ్‌తో కలిపి మొత్తం టైగర్ సీడేనని రైతులను మోసం చేయాలని చూసే వారిపై క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. స్టేక్ హోల్డర్స్‌కు అవగాహన.. ఆక్వాకల్చర్ భాగస్వాముల సమావేశాలు (స్టేక్ హోల్డర్స్) ఏర్పాటు చేసి మత్స్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆక్వా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ) యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆక్వాకల్చర్ భాగస్వాములు అంటే రైతులతో పాటు, ఫీడు, సీడు ఉత్పత్తిదారులు, హేచరీల యజమానులు, ట్రేడర్స్,ఎక్స్‌పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు దీనికిందకు వస్తారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ నెల 23న స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించి నకిలీ టైగర్ రొయ్య సీడ్‌తో పాటు ఆక్వాకు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా అధికారులు అవగాహన కల్పించారు. నకిలీ సీడ్స్ సృష్టిస్తే కఠిన చర్యలు జిల్లాలో ఉన్న 41 హేచరీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అధికారులు జిల్లా మత్స్య శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సీఏఏ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. అనుమతి ఉన్న రెండు హేచరీల నుంచి తీసుకొచ్చిన టైగర్ సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోకే వెళ్లాలి. హేచరీలకు వెళ్లకూడదు. అలా ఎవరైనా టైగర్ రొయ్య సీడ్‌ను తీసుకొచ్చి హేచరీల్లోని వెనామీ సీడ్‌తో కలిపి నకిలీగా సృష్టిస్తే క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడం. టైగర్ సీడ్ నకిలీ అన్న మాట ఏ ఒక్క ఆక్వా రైతు నోటి నుంచి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – ఆవుల చంద్ర శేఖర రెడ్డి, జాయింట్ డైరెక్టర్, జిల్లా మత్స్యశాఖ -
యువతితో రెండేళ్ల సహజీవనం.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్
కంభం(ప్రకాశం జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం సీఐ బీటీ నాయక్, కంభం ఎస్ఐ నాగమల్లేశ్వరరావులు కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని చిన్నకంభం గ్రామానికి చెందిన కాగిపోగు ప్రభాకర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాల వైద్యుడికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే వైద్యశాలలో డెంటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పట్టణానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో పడి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడుగుతుండగా మాట దాటేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడన్న విషయం తెలుసుకొని అతడిని ప్రశ్నించింది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారవడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీసుస్టేషన్ ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 16వ తేదీ సాయంత్రం మార్కాపురం బస్టాండ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..
దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): పిల్లనిచ్చే వారు లేక కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఈ నెల 21న గర్భిణి అనుమానాస్పద కేసులో భర్త, మామలను నిందితులుగా తేల్చి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు పూర్వాపరాలను దర్శి డీఎస్పీ ప్రకాశరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి గురులింగం కుమారుడు శ్రీనివాసరావు..చిలకలూరి పేటకు చెందిన తన్నీరు వెంకాయమ్మ కుమార్తె శైలజను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో నెల రోజులు క్రితం శ్రీనివాసరావు పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీనివాసరావు నివాసంలో నుంచి పారిపోవడం గమనించాడు. నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండటంతో ఈ నెల 16న పెద్దల సమక్షంలో భార్య భర్తలకు సర్ది చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఈనెల 21న శైలజ పశువుల పాకలో శవమై కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారించారు. భర్త శ్రీనివాసరావు తహసీల్దార్ ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా గ్రామంలో తమ పరువు పోతుందని భావించి నిద్రపోతున్న సమయంలో కాలుతో తొక్కి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన వారిని డీఎస్పీ అభినందించారు. చదవండి: ఎందుకిలా చేశావు తల్లీ... ! దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు.. -
ఓటమి జీర్ణించుకోలేక.. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, ప్రకాశం/గుంటూరు: ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎస్ఎల్.గుడిపాడు, వైదన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించగా, ఓర్చుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కారుతో పాటు రెండు బైకులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఉంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: జిల్లాలో వినుకొండ మండలం విట్టంరాజుపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విట్టంరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు సుజాత గెలుపొందగా, ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి.. జిల్లాలోని నూజెండ్ల మండ లంలో టీడీపీ నేతలు బరితెగించారు. ములకలూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కోటేశ్వరమ్మ విజయం సాధించగా, ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.టీ డీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ) ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్ -
ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!
కొమరోలు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది.. కానీ మూడు గ్రామాలు కలిసిన ఊరది. ఆ ఊర్లో రెండు పంచాయతీలున్నాయి. అక్కడి ఓటర్లు ఇద ్దరు సర్పంచ్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు ఊర్లు రెండు మండలాలుగా విభజిం చడంతో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ ఊరు, గిద్దలూరు మండల పరిధిలోని రెండు ఊర్ల కలయికగా పొదలకొండపల్లె గ్రామం ఏర్పడింది. మూడు గ్రామాల కలయికతో విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది. గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలు భౌగోళికంగా కలిసి ఉండగా, కొమరోలు మండల పరిధిలో పొట్టిరెడ్డిపల్లె గ్రామం కూడా ఆ గ్రామాల్లోనే మిళితమై ఉంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె్ల, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి -
వింత: కోడి ఆకారంలో మేక..
పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
అనగనగా ఒక ఊరు.. అందరిదీ ఒకేమాట
ఉలవపాడు: పెదపట్టపుపాలెం.. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార గ్రామం. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదంటే అతిశయోక్తికాదు. ఇప్పటి వరకు సర్పంచ్‌లందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. పెద్దలందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉంటారు. పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయాలు జరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం కూడా లేకుండా చేస్తారు. తొలుత చాకిచర్ల నుంచి 1998లో పెదపట్టపుపాలెం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఆ తరువాత నాలుగు సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన ఎన్నికల్లో ప్రళయ కావేరి సుబ్రమణ్యం, 2003లో ఆవుల జయరాం, 2008 లో వాయల పోలమ్మ, 2013 లో తుమ్మల తిరుపతమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న రెండు శతాబ్దాల నాటి చెట్టు కింద కూర్చుని గ్రామస్థులందరూ కలసి కాపుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. పెదపట్టపుపాలెం గ్రామం వ్యూ .. ఆదర్శప్రాయం... పెదపట్టపుపాలెం గ్రామం విడిపోయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇటీవల సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియతో సహా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎంపీటీసీ ఎన్నికలు జరగాయి. అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 4239. ఇందులో 2147 మంది పురుషులు, 2098 మంది మహిళలు. 3070 మంది ఓటర్లలో 1574 మంది పురుషులు, 1496 మంది మహిళలు ఉన్నారు. ఇంత మంది ఓటర్లు ఉన్నా అందరూ కలసికట్టుగా ఒకే నిర్ణయానికి కట్టుబడుతున్నారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవానికి నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల నిధులు కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. ఈ సారీ ఏకగ్రీవమే అయితే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నజరానా అందే అవకాశం ఉంది. ఇలా ఈ గ్రామం వివాదాలకు తావులేకుండా ఎన్నికల వ్యయం ప్రభుత్వానికి భారం కాకుండా ఆదర్శవంతంగా నిలుస్తోంది. చదవండి: ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు! పెద్దల మాటకు గౌరవం..: ఇక్కడ గ్రామçస్థులు పెద్దల మాటకు గౌరవం ఇస్తారు. అధికారులకు కూడా సమస్యలు రాకుండా చూస్తారు. ఇక్కడ పని చేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. – మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శి -
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే సవాల్
సాక్షి, తాడేపల్లి: వెంగయ్య మృతికి తాను కారణం కాదని.. జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెంగయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి.. తనని అడ్డుకుని.. బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నా రాంబాబు గుర్తు చేశారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు ‘‘సింగరపల్లిలో 95 శాతం సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు.. వాగ్వాదం జరగలేదు. చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్‌కల్యాణ్‌లా శవ రాజకీయాలు చేయడం నాకు రాదు.వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని’’ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరారు. చదవండి: నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని -
పట్టించిన టైలర్ లేబుల్.. రెండో ప్రియుడితో కలిసి..
యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను హతుడు ధరించి ఉన్న చొక్కా టైలర్ లేబుల్ పట్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను కేవలం 12 రోజుల్లో అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గత నెల 26వ తేదీన పుల్లలచెరువు నుంచి గంగవరం వెళ్లే దారిలో 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తుతెలియన వ్యక్తి హత్యకు గురైనట్లు సీఐ దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో అతడి చొక్కాపై ఉన్న టైలర్ లేబుల్ ఆధారంగా మృతుడిది గుంటూరు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాడుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుడు వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన తిరుమల శ్రీనుగా గుర్తించారు. శ్రీను గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు ప్రాంతాల్లో తిరుగుతూ నైటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అతడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. తన స్వగ్రామం ఉప్పరపాలెంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అదే గ్రామానికి చెందిన గోళ్ల నాగార్జునతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని గ్రహించిన శ్రీను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. శ్రీనును అడ్డు తొలగించుకోవాలని ఆమె మరో ప్రియుడు నాగార్జునతో కలిసి పథకం వేసింది. పథకంలో భాగంగా పుల్లలచెరువులో నైటీలు అమ్ముదామని ఆమె శ్రీనుతో చెప్పింది. గంజాయి తాగే అలవాటు ఉన్న శ్రీను.. ఆమెతో కలిసి గంగవరం రోడ్డులోని నిర్మానుష్య స్థలంలోకి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న ఆమె రెండో ప్రియుడు నాగార్జున కర్రతో దాడి చేసి శ్రీనును తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెతో కలిసి టవల్‌తో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. గతంలో నిందితుడు నాగార్జున ఒక యువతిని మోసం చేశాడు. హతుడు అప్పట్లో బాధితురాలికి అండగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉండటంతో శ్రీనును నాగార్జున హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు హతుడి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తన తండ్రి అంజయ్యకు విషయం చెప్పి అది ఇచ్చాడు. ఆ గొలుసును అమ్మి పెట్టాలని ఆయన తమ సమీప బంధువు రావులపల్లి హనుమంతయ్యకు ఇచ్చాడు. మృతుడి బంగారు గొలుసు, హత్యకు ఉపయోగించిన కర్ర, నిందితుల సెల్ఫోన్లు, నాగార్జునకు చెందిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగార్జున, హతుడి ప్రియురాలు, అంజయ్య, హనుమంతయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన సీఐ దేవప్రభాకర్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పి.ముక్కంటి, వి.హరిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు అంజి, హుస్సేన్, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు. -
మూడు కోట్లు మూసీలో పోశారు!
వృథా నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షంగా మార్చాలన్న తలంపుతో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపయోగంగా మారింది. పథకం ఏర్పాటు లక్ష్యం మంచిదైనప్పటీకీ అధికారుల నిర్ణయాలు, ప్రజా ప్రతినిధుల దురాలోచనలతో అది మూలనపడింది. దీంతో రైతులకు మేలు జరగక పోగా, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ కోవకు చెందినదే పొదిలి మండలంలోని పాములపాడు పంచాయతీలో గల కాశీపురం ఎత్తిపోతల పథకం. పొదిలి రూరల్: పొలం పక్కనే నీరు ప్రవహిస్తున్నా అది పైర్లకు ఉపయోగపడకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఆ నీటిని సాగుభూములకు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. మండలంలోని పాములపాడు, గొల్లపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో 1988–89 సంవత్సరంలో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో మూíసీనదిపై ఈ పథకాన్ని నిర్మించారు. దీనికి 25 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు విద్యుత్ మోటార్లు, నీటి సరఫరాకు పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కాకున్నా పథకం మొదట్లో కొంతమేరకు పనిచేసింది. నీటి సరఫరా లేక సాగు తగ్గి నిర్వహణ లోపంతో మూడేళ్ల అనంతరం రైతులు ఒక లక్ష రూపాయలు పైబడి విద్యుత్ బకాయిలు పడ్డారు. కరెంట్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అధికారులు సరఫరా తొలగించారు. పథకం పని చేయక పోవడంతో మోటార్లు, భవనం తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అక్కడ పిచ్చి చెట్లు పెరిగి సాగు భూములు బీడుగా మారాయి. ప్రజల విన్నపం మేరకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం పథకం గ్రౌండ్ రిపోర్టు తయారు చేసింది. రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిప్రాయాలు తెలుసుకొని పథకానికి అక్కడ అనువైన ప్రాంతం కాదని, కుంచేపల్లి మూసీనది మాగాణి వద్ద ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని పెర్కొంటూ నివేదిక పంపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడి: కాశీపురం ఎత్తిపోతల పథకంను కుంచేపల్లి వద్ద పునర్నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, అధికారులు మొత్తుకున్నా వారి మాటలును గత తెలుగుదేశేం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆపార్టీ నాయకులు అప్పటి అధికారులపై వత్తిడి తెచ్చి పనిచేయని పథకానికి మరమ్మతుల కోసం రూ.3.20 కోట్లతో ఎస్టిమెషన్ వేయించి మంజూరు చేయించారు. ఈ పథకానికి 10 క్యూసెక్కులు నీటి పరిమాణం అవసరమని అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టు బావి, సంపు నిర్మాణాలు చేపట్టినట్లు కాకి లేక్కలు చూపి పాత పథకానికే ఏవో కొన్ని మొక్కుబడి పనులు చేసి మసిపూచి మారేడుకాయ చేశారు. పాత భవనాన్ని మర్మతులు చేసి, తలపులు బిగించి, మోటార్లు రీపేరు చేయించి, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పథకానికి నీరు రావాలంటే మూసీ నదిలో నీరు నిల్వ ఉండాలి. నీరు నిల్వ ఉండాలంటే నదికి అడ్డంగా కట్టనిర్మించాలి. కానీ ఇక్కడ అలాంటి పని చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించినా పథకం పనిచేయలేదు. మూసీనదిలో ఇసుక మేట వేయడం, పథకం ప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దీంతో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పటికీ నది వద్ద చుక్కనీరు నిల్వ ఉండక పోవడం కొసమేరుపు. వందలాది ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ స్కీం వినియోగంలోకి తీసుకురాక పోతే మరలా సామగ్రి దొంగల పాలౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఖ్యాతిగాంచిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమైనా నదిలో నీరు నిల్వ ఉండటానికి అడ్డు కట్ట వేసి ఈ స్కీం వినియోగంలోకి తీసురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. -
ఏపీ రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కంటే ప్రతిభావంతులైన వారు బీజేపీలో ఉన్నప్పటికి తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు శక్తి వంచన మేరకు దక్షిణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: జేపీ నడ్డా టీం: రామ్ మాధవ్‌కు దక్కని చోటు!) పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందో ఆ మేరకు దక్షిణ ప్రాంతంలో అమలు పరుస్తామని పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నకాలంలో బీజేపీ అధికారంలోకి తేవడం అంత ఆషామాషీ కాదని కాని ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. తద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. వ్యవసాయ బిల్లులో ఒకటి రెండు అంశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ రైతులకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని పురేందశ్వరి అన్నారు. -
ఏడు నిమిషాల్లో రేషన్ కార్డు!
బల్లికురవ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ గ్రామాల్లోని లబ్ధిదారులకు భరోసానిస్తోంది. రేషన్‌కార్డు కోసం మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలోని సూరేపల్లి గ్రామంలోని ఓ దివ్యాంగ కుటుంబం గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో అనేకసార్లు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలో కార్డు మంజూరుకు మోకాలడ్డారు. దీంతో విసిగి వేసారిన ఆ కుటుంబం సోమవారం గ్రామ వలంటీర్‌కు రేషన్‌కార్డు లేదని చెప్పిన 7 నిమిషాల్లోనే తక్షణమే మంజూరు చేయడంతో పాటు కార్డు అందజేశారు. వివరాల్లోకి వెళితే.. సూరేపల్లి గ్రామానికి చెందిన తోరటి వినోద్ కుమార్‌కు పుట్టుకతోనే పోలియో సోకింది. ఏ పనీ చేయలేడు. 2014లో గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మరో దివ్యాంగురాలు రాహేలును వివాహం చేసుకున్నాడు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్న అక్కసుతో జన్మభూమి కమిటీ తమకు కార్డు రాకుండా అడ్డుకున్నారని వినోద్ కుమార్, రాహేలు వాపోయారు. గ్రామ వలంటీర్ మార్కు తమ ఇంటికి రాగా కార్డు లేదని చెప్పగా వెంటే సచివాలయానికి తీసుకువెళ్లి 10.50 గంటలకు దరఖాస్తు చేయించగా 7 నిమిషాల్లోనే వీఆర్వో వీరనారాయణ, తహసీల్దార్ అశోక్ వర్ధన్ మంజూరు చేయటంతో వెంటనే ప్రింట్ తీసి లబ్ధిదారు రాహేలుకు అందజేశారు. సీఎం, అధికారులకు రుణపడి ఉంటా : తోరటి రాహేలు 5 సంవత్సరాల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి.. చివరకు మాకు రాదని విసిగిపోయాం. వలంటీర్ మార్కు మా ఇంటికి వచ్చి మీకు కార్డు వెంటనే ఇప్పిస్తామని చెప్పి 7 నిమిషాల్లోనే అందజేయటం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, అధికారులకు, వలంటీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. రేషన్‌కార్డు లేక ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందలేదు. -
తప్పుడు రాతలపై ఎమ్మెల్యే సీరియస్..
సాక్షి, ఒంగోలు: తనపై కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను అసంతృప్తిగా ఉన్నానంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. (ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..) ఏ సీఎం చేయని గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గంలో కూడా అడిగినవన్నీ చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో కొందరు కిందస్థాయి అధికారులు పనిచేయడం లేదని, బిల్లులు చేయమని మాత్రమే నిలదీశానన్నారు. తప్పుడు రాతలు రాసే పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి హెచ్చరించారు. (ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే దుష్ప్రచారం) -
టీడీపీకి ముచ్చెమటలే..!
సాక్షి, నెట్వర్క్ : ‘ఐదేళ్లలో చేసిందేమీ లేదు. చెప్పుకునేందుకూ ఏమీ లేదు. తెలుగుదేశం నోట మాట రావడం లేదు. అందుకే.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ముందుకు రాలేదు’.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల వ్యాఖ్యలు ఇవి. సానుకూల పరిస్థితులు లేకపోవడం.. విజయావకాశాలు అంతంత మాత్రంగానైనా కనిపించకపోవడంతో టీడీపీ నేతలు అధినేతకు ముందుగానే చుక్కలు చూపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి.. తగవులను తెచ్చిపెట్టినందుకు ఇప్పుడు శిక్ష అనుభవించం డంటూ పరోక్ష హెచ్చరికలు పంపారు. ఫలానా నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చకపోతే.. రూ.కోట్లు ఖర్చు చేసైనా ఓడిస్తామన్న పలు మండలాల ముఖ్య నాయకులు ఇప్పటికీ అదే మాటపై కొనసాగుతున్నారు. పైకి మాత్రం సర్దుకుపోతున్నామని చెబుతున్నా.. గెలుపునకు కృషి చేయడం లేదని అధిష్టానం గుర్తించిందని స్వపక్షీయులే చెబుతుండటంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అన్న వైఎస్ జగన్ భరోసాతో పార్టీ శ్రేణులు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ ఉత్సాహంగా ఉరకలేస్తూ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చేతులెత్తేసిన టీడీపీ నేతలు నెల్లూరు రైల్వే స్టేషన్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి తల్లకిందులైందని.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఎన్నికలకు ముందే గ్రహించిన నేతలు తమను ఎన్నికల్లో పోటీ చేయమంటారేమోనని ముందుగానే తప్పించుకునే మార్గాల్ని వెతుక్కున్నారు. గెలుపోటముల సంగతెలా ఉన్నా.. తమ వర్గాన్ని నిలబెట్టుకునేందుకు అనివార్యంగా కొందరు ముందుకు వచ్చినా పరిస్థితులు చక్కబడలేదు సరికదా నానాటికీ క్షీణిస్తూ వస్తున్నాయి. మరోవైపు రెండు జిల్లాల్లోనూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన మేకపాటి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, నల్లపురెడ్డి, ఆదాల, మానుగుంట కుటుంబాలతోపాటు ఇతర సామాజిక వర్గాల్లోని ముఖ్యులు అన్ని స్థాయిల్లోనూ వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలవటం పార్టీ నాయకులు, శ్రేణుల్లో విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. మరోవైపు సీనియర్ నేతలు ఫ్యాన్ కిందకు చేరడం, జగన్మోహన్రెడ్డి అభిప్రాయాలకు పూర్తి విలువనిచ్చి.. సిట్టింగ్‌లు సైతం పోటీకి దూరంగా ఉంటూ అభ్యర్థుల విజయానికి సీనియర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఎన్నికల సీజన్ ఆరంభం నుంచీ అభ్యర్థుల వెతుకులాటలో పడిన టీడీపీకి బుజ్జగింపులు, బతిమలాటలతో సమయమంతా సరిపోయింది. పోలింగ్ సమయం గంటల్లోకి వచ్చినా టీడీపీ నాయకులకు గెలుపుపై ఏమాత్రం నమ్మకం కుదరడం లేదు. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాలు పూర్తిగా.. తిరుపతి, బాపట్ల స్థానాల్లో పాక్షికంగా కలిసి ఉన్న రెండు జిల్లాల్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమీపిస్తున్నా సమన్వయం, సహకారం కుదరక టీడీపీ తల్లడిల్లుతోంది. నచ్చీనచ్చని వివాహం కుదిర్చితే.. ప్రతి విషయంలో అలకకు దారితీస్తుందన్నట్లు.. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాల నుంచి పోటీకి అభ్యర్థులు లేక శిద్ధా రాఘవరావు, బీద మస్తాన్‌రావు ను చంద్రబాబు బలవంతంగా ఒప్పించారు. ఫలితంగా ప్రచారపర్వం ఆఖరి క్షణాల్లోనూ వారిలో అసహనం పెరుగుతోందని నేతలు, శ్రేణులు వాపోతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. బాపట్ల ఎంపీ టీడీపీ అభ్యర్థిగా మాల్యాద్రి శ్రీరామ్ వద్దని.. ఆయన తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన అధిష్టానం తిరిగి ఆయనను బాపట్ల నుంచే రంగంలోకి దింపడాన్ని దేనికి సంకేతంగా భావించాలన్న టీడీపీ శ్రేణుల ప్రశ్నలకు నాయకుల నుంచి సమాధానాలు లేవు. ఒంగోలు ఎంపీ సీటు ససేమిరా నాకొద్దు అన్న శిద్ధా రాఘవరావుకు టీడీపీ అధిష్టానం అనేక హామీలు ఇస్తే గానీ.. పోటీకి అంగీకరించక తప్పలేదని ముఖ్య అనుచరులే గుర్తు చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి బరిలో ఉన్న టీడీపీ నేత బీద మస్తాన్రావుది సైతం దాదాపు అదే పరిస్థితి. ఫలితాలపై ముందే ఒక అంచనా ఉన్నప్పటికీ చంద్రబాబు మాటను వారు కాదనలేకపోయారు. ‘మీరు పోటీ చేయండి చాలు. రూ.కోట్లు కుమ్మరించే బాధ్యత నాది’ అని పార్టీ అ«ధ్యక్షుడు హామీ ఇచ్చిన తరువాత కూడా ‘మీ సీట్లు వద్దు.. మీరిచ్చే డబ్బులూ మాకొద్దు మహాప్రభో’ అని కొందరు పారిపోయారంటే ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పరిస్థితి ఏమిటో అంచనా వేయొచ్చని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు.. ఆ తరువాత కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఆ తలంపు కూడా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు. ఆయనదంతా పచ్చి మోసం ‘ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు కడపకు ప్రాణపదమైన వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు రెండు జిల్లాల పశ్చిమ ప్రాంత ప్రజలను దారుణంగా మోసగించారు. రెండుసార్లు శంకుస్థాపన చేసినా.. పూర్తిగా విస్మరించారు. అందుకే ఈ ప్రాంత ప్రజలకు టీడీపీపై నమ్మకం లేదు’ అని వి.వెంకటేశ్వరరెడ్డి వాస్తవ పరిస్థితిని వివరించారు. ‘వైఎస్ పాలనలో ఎలాంటి మేలు జరిగిందో ప్రజలకు గుర్తుంది. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులతోపాటు వెలిగొండ పనులు జరిగాయి. భవిష్యత్తులో అయినా వెలిగొండ నీరు అందాలంటే.. మాట తప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలి’ అని మార్కాపురం వాసిగా కోరుకుంటున్నానని, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశ్చిమ ప్రాంత వాసుల కోరిక కూడా ఇదేనని వెంకటేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నడివయసులో ఉన్న బత్తాయి తోటల నుంచి మంచి దిగుబడి, ఆదాయం పొందాల్సిన తాను కరువు వల్ల తోటల్ని నరికేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పెద్దారవీడుకు చెందిన శివారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ‘అందుకే యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కందుకూరు, ఉదయగిరి తదితర పశ్చిమ నియోజకవర్గాల రైతులు, ప్రజలు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి.. మా ఆశలను నిలబెట్టే మొనగాడి కోసం ఎదురుచూస్తున్నారు’ అని శివారెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ ఐదేళ్లలో ఏం చేశారని.. ‘భారీ పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. దుగరాజపట్నం పోర్టును చంద్రబాబు పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో కృష్ణప ట్నం పోర్టు నిర్మాణం వంటి ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. ఆ తరహాలో ఒక్కటైనా చంద్రబాబు హయాంలో ఉందా’ అని నిరుద్యోగి ఎం.రాజశేఖర్ ప్రశ్నించారు. ‘చిత్తూరు, నెల్లూరు జిల్లాల నడుమ శ్రీసిటీ సెజ్ వచ్చింది. రెండు జిల్లాల్లోని యువత, మహిళల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎందరికో జీవన భృతి సా«ధ్యమైంది. ఆ కోవలో ఒక్కటంటే ప్రాజెక్ట్ చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు’ అని కేఎన్వీ వసుంధర అనే విద్యావేత్త నిలదీశారు. పాడి పరిశ్రమ వెన్ను విరిచారు ‘ప్రకాశం జిల్లా కరువుకు కేరాప్ అడ్రస్ లాంటిది. పాడి పరిశ్రమ ఇక్కడి వారికి ఆధారం. ఇలాంటి చోట మిల్క్ డెయిరీని పడకేయించింది ఈ ప్రభుత్వం. పాడి రైతులకు రూ.45 కోట్ల వరకు ఉన్న బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి.. రూ.5 కోట్లు కూడా ఇవ్వలేదు. వైఎస్ హయాంలో సుబాబుల్ టన్నుకు రూ.4 వేల ధర వచ్చింది. ఇప్పుడు రూ.2,500 రావడం కూడా గగనమైంది. ఐదు నెలలుగా అధికారిక కొనుగోళ్లు లేవు. కందుల కొనుగోళ్లలో అవినీతి. ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు’ అని మద్దిపాడుకు చెందిన చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ నీళ్లు కూడా ఇవ్వడం చేతకాని నాయకత్వం ఉందని దర్శికి చెందిన కొండయ్య ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతుగా నిలిచే నాయకత్వాన్ని తాము కోరుకుంటున్నామని, వైఎస్ జగన్ ద్వారా మేలు కలుగుతుందనే భరోసా ఉందని రైతు సంఘం నాయకుడు వెంకట్రావు ముక్తాయించారు. మత్స్యకారులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని.. తీరప్రాంత మత్స్యకారులు ఆయన వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నారని ఉలవపాడుకు చెందిన బ్రహ్మయ్య, కృష్ణ పేర్కొన్నారు. నోట్లు విరజిమ్ముతున్నా... ‘మా ఊరాయన మంత్రి. మూడేళ్లు మా వైపు చూడలేదు. ఇప్పుడు నోట్లు విరజిమ్మి ఓట్లు కొల్లగొడతారట. నెల్లూరోళ్లను అంత తక్కువగా అంచనావేస్తే ఎలా’ అని న్యాయవాది శీనయ్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే నగర వాసుల మనోగతం అర్థమవుతుంది. పోలీస్ వాహనాల్లో తీసుకొచ్చి నోట్లు విరజిమ్ముతున్నారు. కానీ.. జనాభిమానం ముందు ఇలాంటివేమీ పనిచేయదు’ అని ఒంగోలుకు చెందిన సీనియర్ వైద్యుడు వేణు అన్నారు. ఉత్సాహంతో ఉరకలు వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మెజార్టీ ప్రజలు పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈసారి వర్గాలకు అతీతంగా ప్రజానీకం మొత్తం వైఎస్సార్ సీపీకి నీరాజనం పడుతోంది. వైఎస్ హయాంలో ఈ రెండు జిల్లాలకు జరిగిన మంచిని మననం చేసుకుంటూ.. మాట తప్పని, మడమ తిప్పని జగన్ గుణాన్ని గుర్తు చేసుకుంటూ తమకంతా మంచే జరుగుతుందనే భరోసాతో.. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. ‘నవరత్నాలు’ తమ కుటుంబాల పాలిట ఆణిముత్యాలుగా మారతాయనే ఆశాభావం అన్నివర్గాల్లో వ్యక్తమవుతోంది. -
బోరుబండిని ఢీకొన్న కారు : ఇద్దరు మృతి
ఒంగోలు : కొనకమిట్ల మండలం మర్రిపాలెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న బోరుబండిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఫంక్షన్‌కు హాజరై మెదక్ జిల్లా సిద్ధిపేట తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.