సాక్షి, ప్రకాశం/గుంటూరు: ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎల్.గుడిపాడు, వైదన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించగా, ఓర్చుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కారుతో పాటు రెండు బైకులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఉంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: జిల్లాలో వినుకొండ మండలం విట్టంరాజుపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విట్టంరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు సుజాత గెలుపొందగా, ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి..
జిల్లాలోని నూజెండ్ల మండ లంలో టీడీపీ నేతలు బరితెగించారు. ములకలూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కోటేశ్వరమ్మ విజయం సాధించగా, ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.టీ డీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
(చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ)
ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్
Comments
Please login to add a commentAdd a comment