ఒంగోలు : సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు, వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మది్వరాట్ శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిస్తే పలికే దైవంలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సైతం ఇబ్బందిగా ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేకమైన జీవో ద్వారా నెలకు రూ.5 వేలు కేటాయిస్తూ ఉత్తర్వులివ్వడం హర్షణీయమన్నారు. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం మొత్తానికి ఇది ఒక శుభదినంగా చెప్పారు. జీవో జారీ అయ్యేందుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల రజని, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, కటారి శంకర్, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్‌చార్జి బొట్ల సుబ్బారావు, ధరణికోట లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment