వింత: కోడి ఆకారంలో మేక.. | Goat Born In The Shape Of Hen | Sakshi
Sakshi News home page

కోడిని పోలిన వింత మేక పిల్ల జననం 

Published Sun, Feb 7 2021 9:33 AM | Last Updated on Sun, Feb 7 2021 12:18 PM

Goat Born In The Shape Of Hen - Sakshi

కోడి ఆకారంలో పుట్టిన మేకపిల్ల

పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్‌ డ్రామా: నివ్వెరపోయే విషయాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement