
దంపతులపై హత్యాయత్నం
తిరుపతి జిల్లాలో ఘటన
తిరుపతి రూరల్ : మటన్ తీసుకెళ్లి మూడు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు వెళ్లిన దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి మల్లంగుంటలో జరిగింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. మల్లంగుంట పంచాయతీ వినాయకనగర్‌కు చెందిన కేశవులు, హేమలత దంపతులు మటన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వినాయక అనే వ్యక్తి మటన్ తీసుకెళ్లి రూ.1200 అప్పు పెట్టాడు. ఈ క్రమంలో కేశవులు, హేమలత దంపతులు సోమవారం రాత్రి వినాయక ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో ఆగ్రహించిన వినాయక కుమారులు ప్రదీప్, సందీప్, మరో వ్యక్తి కలిసి ఇనుపరాడ్‌తో దాడి చేశారు.
హేమలత మెడలోని 32 గ్రాముల బంగారు చైన్ లాక్కున్నారు. రక్తగాయాలతో పడి ఉన్న బాధితులు స్థానికులు చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. మంగళవారం బాధితుడు కేశవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.