shape
-
తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!
మీ గోళ్ల ఆకృతి మీ గురించి, మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుందని తెలుసా!. ఔను అనే చెబుతున్నారు నిపుణులు. గోళ్ల ఆకృతి ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు అంటున్నారు నిపుణులు. వారు జరిపిన అధ్యయనాల ప్రకారం..నాలుగు రకాల గోళ్ల ఆకృతిపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని 'నెయిల్ షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా' పేర్కొన్నారు. ఈ గోళ్ల ఆకారం బట్టి మీ నిర్ణయాలు మంచివేనా, మీరు ఎలాంటి మనస్తతత్వం కలవారో చెప్పొచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆలస్యం ఎందుకు? మీ గోళ్లు ఏ ఆకారంలో ఉన్నాయో చెక్‌చేసుకుని మీ వ్యక్తితత్వం అలానే ఉందా లేదో తెలుసుకునేందుకు సిద్ధంకండి! వ్యక్తిత్వాన్ని అంచనావేసే గోళ్ల ఆకారాలను నాలగు రకాలుగా విభజించారు నిపుణులు అవి పొడవాటి గోర్లు, గుండ్రటి గోర్లు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోర్లుగా విభజించారు. నిలువుగా పొడవాటి గోర్లు ఉన్నట్లయితే.. ఇలాంటి గోర్లు ఉన్నవాళ్లు సృజనాత్మకంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధికలవారై ఉంటారు. వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా, తార్కికంగా కూడా ఆలోచిస్తారు. తమ సృజనాత్మక ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా నిరుత్సాహానికి గురవ్వుతుంటారు. దీంతో అక్కడే చతికిలపడిపోతారు. తిరిగి నూతనోత్సాహాంతో యథాస్థితికి రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణలో ఉండేదుకు యత్నించి.. నిరుత్సాహన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు అంటున్నారు నిపుణులు. దీర్ఘచతురస్రాకార గోర్లు.. వీరు ఓపెన్‌మైండెడ్‌గా ఉంటారు. మంచి నమ్మకస్తులుగా కూడా ఉంటారు. భాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నపటికీ.. తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారై ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా. కట్టుబాట్లను అనుసరించడానికే ఇష్టపడతారు. ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పటికీ పరిస్థితిని బ్టటి ..తనను తాను నియంత్రించికుని సానుకూలంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం. గుండ్రటి గోళ్లు కల వ్యక్తి లక్షణాలు ఈ ఆకృతి గల వ్యక్తి అంత తేలికగా కంగారుపడరు. ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు. పరిశోధనాత్మకంగా ఉంటారు. ప్రశ్నించే గుణం ఎక్కువ. కొత్త సమాచారం కోసం వెతుకుతుంటారు. గొప్ప అభ్యాసకులుగా ఉంటారు. ఎదురు దెబ్బల తట్టుకుని పుంజుకుని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందర్నీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థంచేసుకోగలరు త్వరితగతిన స్నేహితులను సంపాదించుకోగలరు. విభేధాలను పరిష్కరించడంలో దిట్ట. చతురస్రాకార గోళ్లు ఉంటే.. వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు., ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానకి ఇష్టపడతుంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్తవాటి కోసం అన్వేషిస్తూ..కొత్త కొత్త ప్రదేశాలను తరుచుగా సందర్శిస్తుంటారు. లక్ష్యం కోసం ఎంత శ్రమననై ఓర్చకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కొవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు. అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం వారు చెప్పాలనుకున్నది చెప్పేందుకే ఇష్టపడుతుంటారు. అలాగే కుటుంబం, స్నేహితులకు ప్రాముఖ్యత ఇవ్వడమే గాక మంచి శ్రేయోభిలాషిగా ఉంటారు కూడా. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఉన్న ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదీ చదవండి: IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం -
అబ్బురపరుస్తోన్న మామిడికాయ లాంటి గుడ్డు!
సాక్షి, పిఠాపురం: మామిడికాయ ఆకారంలో ఉన్న కోడి గుడ్డు చూపరులను అబ్బుర పరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కిరాణా వ్యాపారి బొమ్మిడి సత్తిబాబు తన దుకాణంలో విక్రయించడానికి కోడిగుడ్లు తెప్పించాడు. వాటిలో ఒక కోడి గుడ్డు అచ్చం మామిడికాయలా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. గుడ్డు తెల్లగా ఉన్నప్పటికీ పచ్చి మామిడికాయ ఆకారంలో ఉంది. -
మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది
మనుషులుండే ఊళ్లు చాలా ఉన్నాయి.. మరి మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది.. సెంటూరిపే.. ఇటలీలోని ఈ చిన్న పట్టణం.. పై నుంచి చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్‌లో తమ పట్టణం మ్యాప్‌ను చూసి.. చూస్తా ఉంటే మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు.. దాన్ని తీర్చేసుకుందామని.. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు.. కట్‌చేస్తే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే.. చాలామంది దీన్ని నమ్మలేదు. మార్ఫింగ్ చేశారని.. ఫొటోగ్రాఫర్‌ను విమర్శించారు. అయితే.. తర్వాత గూగుల్‌లో మ్యాప్‌లో చెక్ చేసుకుని.. తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా చెప్పారు. 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. (చదవండి: ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) -
చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం
వజ్రపుకొత్తూరు: కొబ్బరికాయ నుంచి మొలక బయటకొచ్చి చిలక ఆకారంలో ఆకట్టుకుంటోంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు పంచాయతీ హుకుంపేటలో గ్రామ వలంటీర్ కొండ ఈశ్వరీబాయి తన ఇంట్లో పూజ కోసం కొన్న కొబ్బరికాయ ఇలా చూపరులను ఆకర్షిస్తోంది. చిలక ఆకారంలో ఉండటంతో జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం -
వింత: కోడి ఆకారంలో మేక..
పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
ఆక్టోపస్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్ అనగానే ఏవో నాలుగు గీతలు, వాటి చివర్లకు మూడు పువ్వులు అప్లై చేసుకుని మురిసిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ట్రెండ్ మారింది. ఎగిరే పక్షులు, ఈదే చేపలు ఇలా అన్నింటినీ ఆర్ట్‌గా మార్చి.. గోళ్లపై మెరిపిస్తున్నారు ఇప్పటి మగువలు. అందుకే మరి ఈ వారం సరికొత్తగా ఆక్టోపస్ నెయిల్ ఆర్ట్‌ని అందిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. చూపరుల చేత ‘అహో.. అద్భుతం’ అనిపించుకోండి. 1. ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని షేప్ చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి లైట్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మధ్య వేలుకి రెడ్ కలర్ లేదా మీకు నచ్చిన డార్క్ కలర్‌తో (చిత్రంలో ఉన్న విధంగా) పెద్ద చుక్క పెట్టుకోవాలి. 2. తరువాత మధ్య వేలుకు ఉన్న చుక్కకు పై భాగానికి ఇరువైపులా (చిత్రాన్ని గమనిస్తూ) గీతలు పెట్టుకోవాలి. తరువాత చూపుడు వేలు, ఉంగరపు వేలుకు కూడా చిత్రాన్ని అనుసరిస్తూ కాస్త వాలుగా గీతలు అప్లై చేసుకోవాలి. 3. ఇప్పుడు ఆ గీతల చివరి భాగంలో అచ్చు చిత్రంలో ఉన్న విధంగా డిజైన్ చేసుకోవాలి. 4. ఇప్పుడు వైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని గీతలకు చిత్రాన్ని చూస్తూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి. 5. తరువాత మధ్య వేలుకి ఉన్న డిజైన్‌లో (చిత్రాన్ని అనుసరిస్తూ) రెండు వైట్ చుక్కలు పెట్టుకోవాలి. 6. ఇప్పుడు ఆ వైట్ చుక్కల్లో బ్లాక్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. తరువాత చిటికెన వేలు, బొటనవేళ్లకు ఇంతకు ముందు ఉపయోగించిన రెడ్ కలర్ లేదా మీరు ఎంచుకున్న డార్క్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని స్టార్స్ అప్లై చేసుకుని, వైట్ కలర్ నెయిల్ పాలిష్‌తో చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటే అదిరే నెయిల్ ఆర్ట్ మీ సొంతమవుతుంది. -
వింత ఆకృతి భవనాలు
-
గోళ్లకు వేళాయె..!
ఇల్లాలికి ఒక పని కాదు, ఒక్కరి పని కాదు,ఒక జన్మకు సరిపడా పని! ఇక తన గురించేం పట్టించుకుంటుంది? తల చిక్కు తీసుకుని, కళ్లకు కాటుక దిద్దుకోడానికే టైమ్ లేకపోతుంటే... వేళ్లూ, గోళ్లూ కూడానా! అయినా తప్పదండీ! ఎంత పనుంటే మాత్రం గోళ్లు గిల్లుకోవడం మానేస్తారా! ‘గిల్లుకోవడం’ అంటే... ఎక్కడో ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నట్లు... కటకట కటకట కొరికేసుకోవడం కాదు. శ్రద్ధగా, ఏకధ్యానంతో గోళ్లకు లాలపోసి ‘ముస్తాబు’ చెయ్యడం. ఎందుకంత కష్టం అంటారా! గోళ్లను చూసి ఎవరూ ఇల్లాలిని చూడరు కానీ, మిమ్మల్ని మీరు చూసుకుని ముచ్చటపడి, మురిసిపోడానికి... గోరంత అందమైనా మిగిలుండాలి కదా! రోజులో ఎన్నో పనులు. వీటిలో 50 శాతానికి పైగా చేతులే చేస్తుంటాయి. అన్ని పనులను చేసే చేతులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా మహిళలు. ఇంటి పనుల్లో భాగంగా తుడవడం, కడగడం, రుద్దడం.. వీటి కోసం చర్మానికి హాని కలిగించే రకరకాల రసాయనాలను రోజూ నేరుగానే ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల చేతులపై చర్మమే కాదు, వేలి కొసల్లో ఉండే గోళ్లూ ఎంతగానో దెబ్బ తింటుంటాయి. పసుపురంగులో, పాలిపోయి, పలచగా, అక్కడక్కడా విరిగి పోయి, మురికిగా... ‘మమ్మల్ని కాస్త పట్టించుకోవూ’అన్నట్టు చూస్తుంటాయి. కాని ‘తీరిక’లేదు అనే నెపంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, అప్పు డప్పుడు వాటికి రంగు వేస్తూ ఉంటారు. ‘ఇది శుభ్రతలో అతి పెద్ద లోపం’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు అందానికే కాదు మన ఆరోగ్యాన్నీ ఎదుటివారికి తెలియజేస్తుంటాయి. పాలిష్‌తో గోళ్లను మభ్య పెట్టకుండా ఇంట్లోనే ‘నఖ’ సొగసుకు ఏమేం చేయవచ్చో తెలుసుకుందాం. 20 నిమిషాలు చాలు: ముందుగా దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్‌ని అద్దుకొని అప్పటికే గోళ్లకు ఉన్న రంగును తొలగించాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వల్ల కంటికి కనిపించని క్రిములు కూడా తొలగి పోతాయి వేళ్ల చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి , చల్లని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. (వీలైతే కొద్దిగా మైల్డ్ షాంపూ నీటిలో కలపచ్చు) వేడినీటి గిన్నెలో 5-8 నిమిషాలు గోళ్లు మునిగేలా వేళ్లను ఉంచాలి. తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. తర్వాత మెత్తటి పొడి టవల్‌తో తడి లేకుండా తుడవాలి నెయిల్ కటర్‌తో మీడియమ్ లెంగ్త్‌లో గోళ్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్‌లో కట్చేసుకోవడం చాలా సులువు నెయిల్ ఫిల్లర్‌తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి క్యుటికల్ ఆయిల్‌ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడచ్చు. వేలితో నూనె అద్దుకొని గోరు మీద, చుట్టూత క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్ డెరైక్షన్‌లో మసాజ్ చేయాలి గోరుచుట్టూ ఉన్న మృత చర్మకణాలు (క్యుటికల్స్) క్యుటికల్ పుషర్తో తొలగించాలి. (నెయిల్ కిట్‌లో లేదా షాపులో విడిగానూ క్యుటికల్ పుషర్ లభిస్తుంది) ఆరోగ్యకరమైన గోళ్లకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్లోనే బాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా చర్మానికి హాని కలగ కుండా క్యుటికల్స్ను శుభ్రపరచాలి. (ఇందుకోసం మరో 10 నిమిషాల సమయం పడుతుంది) హ్యాండ్ లోషన్‌ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పొరపాటున గోళ్ల్ల మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి క్లియర్ బేస్ కోట్ని ప్రతి గోరుకు వేయాలి తర్వాత నచ్చిన నెయిల్‌పాలిష్‌ను బ్రష్‌తో తీసుకొని గోరు మధ్యన ఆ తర్వాత సైడ్స్ పాలిష్ వేసుకోవాలి. టాప్ కోట్ని ప్రతి గోరుమీద వేస్తే నెయిల్ పాలిష్ ఎక్కువ సమయం ఉంటుంది. ఇలాగే కాలి గోర్లకూ చేయాలి. గోళ్లు విరిగిపోతుంటే! వేలిపై గోరు కింది భాగం గులాబీ రంగులో కనిపించాలి. అలా కాకుండా తెల్లగా, నలుపులో కనిపించినా, పైన ముడతలు పడినట్టుగా ఉన్నా గోరు ఆరోగ్యం బాగోలేదని గుర్తించాలి. అలాగే గోళ్లు విరిగిపోతుండటం, పలచబడటం వంటివి కనిపిస్తున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోళ్లు బలంగా ఉండటానికి వైద్యుల సలహాతో పాటు ఆహార వ్యవహారాలలోనూ తగినంత జాగ్రత్త వహించాలి. గోళ్లు విరిగిపోతున్నాయి అని అదేపనిగా ఎక్కువసార్లు మెనిక్యూర్ చేయించకూడదు. కనీసం వారం రోజుల వ్యవధి ఇవ్వాలి. గోళ్లు విరిగిపోవడానికి క్యాల్షియం లోపం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి గోళ్లను కొరకడం మానేయాలి. అందుకు కారణమైన మానసిక ఒత్తిడి, ఇతరత్రా ఆందోళన కలిగించే పనులు, సమస్య లను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ (ఉతకడం, కడగడం, తుడవడం, ఇంటి శుభ్రత కు రసాయనాలను ఉపయోగించడం.. వంటివి) సమయంలో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించాలి. నీటిని గోర్లు, గోరు చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి శరీరం హైడ్రేట్ కాకుండా ఉండటానికి రోజూ పది గ్లాసుల వరకు మంచినీరు తాగాలి రాత్రి పడుకునే ముందు గోరు, గోరు చివర్ల చర్మం మృదువుగా మారడానికి హ్యాండ్మసాజ్ క్రీమ్ లేదా నూనెతో మసాజ్ చేసుకోవాలి గోళ్లతో డబ్బా మూతలను తీయడానికి ఉపయోగించకూడదు మూడు రోజులకు ఒకసారైనా పాత నెయిల్ పాలిష్‌ను తొలగించాలి గోళ్లలో ఫంగస్ ఏర్పడితే టీ-ట్రీ ఆయిల్‌ను రోజూ రెండు పూటలా మసాజ్‌కు వాడాలి. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఫంగస్ ఉంటే నీటి తడి ఎక్కువ సేపు లేకుండా జాగ్రత్త పడాలి. సమతుల ఆహారం: గోళ్లు బలంగా ఉండాలంటే రోజూ కప్పు గ్రీన్ టీ సేవించాలి బార్లీ, నట్స్, సోయా.. తీసుకునే ఆహారంలో చేర్చాలి గోళ్లు పెలుసుగా మారుతున్నాయంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల అయ్యుంటుంది. అందుకని చేపలు, చేప నూనెలు, కుసుమ నూనెలు ఆహారంలో విరివిగా చేర్చాలి. గోళ్ల మీద తెల్లటి చుక్కలుగా ఏర్పడటానికి కారణం జింక్ లోపం అయ్యుంటుంది. అందుకే మాంసం, గుడ్లు, చేపలను ఆహారంలో చేర్చాలి. వీటి బదులుగా ఛీజ్, బీన్స్, నట్స్, గోధుమ ఊక వంటివి కూడా తీసుకోవచ్చు. మసాజ్ ముఖ్యం: గోళ్లు పొడిగా, పెళుసుబారినట్టు ఉంటే రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్ జెల్లీతో మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు చేతులకు కాటన్ గ్లౌజ్‌లను వాడచ్చు ఇంటి పనుల్లో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించేవారు వాటిని శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీయవచ్చు నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి ఎసెటేట్ బేస్డ్ రిమూవర్స్ వాడటం మేలు. ఈ జాగ్రత్తలు పాటిస్తే గోళ్లు అందంగా కనిపిస్తాయి. వేలి కొసల్లో చిరునవ్వులు చిందిస్తాయి. స్పా, బ్యూటీ సెలూన్లలో గోళ్లను శుభ్రపరచడానికి, అందంగా మలచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్, క్లాసిక్, రేడియంట్ మెనిక్యూర్, పెడిక్యూర్ మొదలైనవి. స్పా పెడిక్యూర్‌లో ముందు వేడినీటిలో షాంపూ కలిపి, కాసేపు వేళ్లను ముంచి ఉంచుతారు. తర్వాత స్క్రబ్ చేసి, మసాజ్ క్రీమ్ వాడతారు. చేతులు, పాదాల రక్తప్రసరణ కోసం ఎక్కువ సేపు మసాజ్ చేస్తారు. అలాగే ప్యాక్ ప్రీమియమ్ ఉత్పత్తులను వాడతారు. ఇన్స్టంట్ మెనిక్యూర్, పెడిక్యూర్‌లను గోళ్లు పగుళ్లు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. మెనిక్యూర్, పెడిక్యూర్‌కి విడివిడిగా హ్యాండ్, ఫుట్ మసాజ్ క్రీమ్‌లను తప్పక వాడాలి. - అరవింద్, నేచురల్స్ బ్యూటీ స్పా, హైదరాబాద్