మీ గోళ్ల ఆకృతి మీ గురించి, మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుందని తెలుసా!. ఔను అనే చెబుతున్నారు నిపుణులు. గోళ్ల ఆకృతి ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు అంటున్నారు నిపుణులు. వారు జరిపిన అధ్యయనాల ప్రకారం..నాలుగు రకాల గోళ్ల ఆకృతిపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని 'నెయిల్ షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా' పేర్కొన్నారు. ఈ గోళ్ల ఆకారం బట్టి మీ నిర్ణయాలు మంచివేనా, మీరు ఎలాంటి మనస్తతత్వం కలవారో చెప్పొచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆలస్యం ఎందుకు? మీ గోళ్లు ఏ ఆకారంలో ఉన్నాయో చెక్‌చేసుకుని మీ వ్యక్తితత్వం అలానే ఉందా లేదో తెలుసుకునేందుకు సిద్ధంకండి!
వ్యక్తిత్వాన్ని అంచనావేసే గోళ్ల ఆకారాలను నాలగు రకాలుగా విభజించారు నిపుణులు అవి పొడవాటి గోర్లు, గుండ్రటి గోర్లు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోర్లుగా విభజించారు.
నిలువుగా పొడవాటి గోర్లు ఉన్నట్లయితే..
ఇలాంటి గోర్లు ఉన్నవాళ్లు సృజనాత్మకంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధికలవారై ఉంటారు. వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా, తార్కికంగా కూడా ఆలోచిస్తారు. తమ సృజనాత్మక ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా నిరుత్సాహానికి గురవ్వుతుంటారు. దీంతో అక్కడే చతికిలపడిపోతారు. తిరిగి నూతనోత్సాహాంతో యథాస్థితికి రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణలో ఉండేదుకు యత్నించి.. నిరుత్సాహన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు అంటున్నారు నిపుణులు.
దీర్ఘచతురస్రాకార గోర్లు..
వీరు ఓపెన్‌మైండెడ్‌గా ఉంటారు. మంచి నమ్మకస్తులుగా కూడా ఉంటారు. భాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నపటికీ.. తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారై ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా. కట్టుబాట్లను అనుసరించడానికే ఇష్టపడతారు. ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పటికీ పరిస్థితిని బ్టటి ..తనను తాను నియంత్రించికుని సానుకూలంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం.
గుండ్రటి గోళ్లు కల వ్యక్తి లక్షణాలు
ఈ ఆకృతి గల వ్యక్తి అంత తేలికగా కంగారుపడరు. ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు. పరిశోధనాత్మకంగా ఉంటారు. ప్రశ్నించే గుణం ఎక్కువ. కొత్త సమాచారం కోసం వెతుకుతుంటారు. గొప్ప అభ్యాసకులుగా ఉంటారు. ఎదురు దెబ్బల తట్టుకుని పుంజుకుని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందర్నీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థంచేసుకోగలరు త్వరితగతిన స్నేహితులను సంపాదించుకోగలరు. విభేధాలను పరిష్కరించడంలో దిట్ట.
చతురస్రాకార గోళ్లు ఉంటే..
వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు., ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానకి ఇష్టపడతుంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్తవాటి కోసం అన్వేషిస్తూ..కొత్త కొత్త ప్రదేశాలను తరుచుగా సందర్శిస్తుంటారు. లక్ష్యం కోసం ఎంత శ్రమననై ఓర్చకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కొవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు. అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం వారు చెప్పాలనుకున్నది చెప్పేందుకే ఇష్టపడుతుంటారు. అలాగే కుటుంబం, స్నేహితులకు ప్రాముఖ్యత ఇవ్వడమే గాక మంచి శ్రేయోభిలాషిగా ఉంటారు కూడా.
(చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment