
సాక్షి, పిఠాపురం: మామిడికాయ ఆకారంలో ఉన్న కోడి గుడ్డు చూపరులను అబ్బుర పరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కిరాణా వ్యాపారి బొమ్మిడి సత్తిబాబు తన దుకాణంలో విక్రయించడానికి కోడిగుడ్లు తెప్పించాడు. వాటిలో ఒక కోడి గుడ్డు అచ్చం మామిడికాయలా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. గుడ్డు తెల్లగా ఉన్నప్పటికీ పచ్చి మామిడికాయ ఆకారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment