సెల్‌ఫోన్ కొనడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకున్నాడు.
పిఠాపురం(తూర్పుగోదావరి): సెల్‌ఫోన్ కొనడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మాదాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అప్పన్న(19) గత కొన్నిరోజులుగా సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని అడుగుతున్నాడు.
అయితే, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తల్లి ఇవ్వలేకపోయింది. తనకు కోరిన సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన అప్పన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.