
మనుషులుండే ఊళ్లు చాలా ఉన్నాయి.. మరి మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది.. సెంటూరిపే.. ఇటలీలోని ఈ చిన్న పట్టణం.. పై నుంచి చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్‌లో తమ పట్టణం మ్యాప్‌ను చూసి.. చూస్తా ఉంటే మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు.. దాన్ని తీర్చేసుకుందామని.. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు.. కట్‌చేస్తే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చింది.
ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే.. చాలామంది దీన్ని నమ్మలేదు. మార్ఫింగ్ చేశారని.. ఫొటోగ్రాఫర్‌ను విమర్శించారు. అయితే.. తర్వాత గూగుల్‌లో మ్యాప్‌లో చెక్ చేసుకుని.. తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా చెప్పారు. 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది.
(చదవండి: ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!)
Comments
Please login to add a commentAdd a comment