town
-
HYD: మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
అనగనగా ఒక ఊరు..
మన మూలం చెప్పేది ఊరే! అందుకే మన పరిచయం ఊరి నుంచే మొదలవుతుంది! ఒక్కో ఊరుది ఒక్కో స్వభావం! సంస్కృతీసంప్రదాయాల నుంచి అభివృద్ధిబాట దాకా! ఆ భిన్నత్వాన్నే చెబుతోందీ ‘అనగనగా ఒక ఊరు’!అన్యులను అంటుకోని మలాణా (హిమాచల్ ప్రదేశ్)మన దేశంలోని అతి పురాతన గ్రామం ఇది. కులు, పార్వతి లోయల మధ్యలో సముద్రమట్టానికి 2,652 మీటర్ల (8,701 అడుగుల) ఎత్తులో.. మలాణా నది ఒడ్డున కొలుౖవై ఉంది. ప్రకృతి అందాలకు ఆలవాలం. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. మలాణీయులకు భారతీయ పోలికలకన్నా మెడిటరేనియన్ పోలికలే ఎక్కువ. బహుశా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు! స్థానిక భాష కనాశీ. ఆధునిక ఛాయలకు దూరంగా ప్రాచీన సంస్కృతీ సంప్రదాయలకు నిలయంగా ఉంటుంది.జమదగ్నిని వీళ్లు జమ్లు దేవతగా కొలుస్తారు. ఆయననే తమ గ్రామ రక్షకుడిగా భావిస్తారు. జమదగ్నికి ఇక్కడ గుడి ఉంటుంది. మలాణీయులది ఫ్రెండ్లీ నేచరే కానీ మలాణీయేతరులెవరైనా వీళ్లకు అస్పృశ్యులే! వీరి అనుమతి లేకుండా పరాయి వాళ్లెవరూ వీరిని అంటుకోకూడదు. దూరం నుంచే మాట్లాడాలి. నడిచేప్పుడు వాళ్ల ఇంటి గోడలను కూడా తాకకూడదు. ఇక్కడి కొట్లలో పర్యాటకులు ఏమైనా కొనుక్కుంటే ఆ వస్తువులను చేతికివ్వరు కౌంటర్ మీద పెడతారు. అలాగే పర్యాటకులూ డబ్బును కౌంటర్ మీదే పెట్టాలి.పొరపాటున తాకితే వెంటనే స్నానం చేయడానికి పరుగెడ్తారు. ఈ ఊరిలో పోలీసులకు ప్రవేశం లేదు. మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ప్రత్యేకమైన న్యాయవ్యవస్థ ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం గల ఊరు అని దీనికి పేరు. వీరి ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని పోలి ఉంటుందట! వీళ్ల ప్రధాన ఆర్థిక వనరు గంజాయి. ఎక్కడపడితే అక్కడ గంజాయి వనాలు కనిపిస్తుంటాయి. బ్యాన్ అయినప్పటికీ ‘మలాణా క్రీమ్’ పేరుతో ఇక్కడి గంజాయి దేశంలో ప్రసిద్ధి. ఉత్పత్తిలో మహిళలే అగ్రగణ్యులు. వంట పని నుంచి సాగు, మార్కెటింగ్ దాకా అన్ని బాధ్యతలూ మహిళలవే. మగవాళ్లు గంజాయి మత్తులో నిద్రపోతుంటారని మలాణా సందర్శకుల పరిశీలన. ఇక్కడ వెహికిల్స్ వెళ్లేంత రోడ్లు ఉండవు. వీళ్ల రోజువారీ రవాణాకు కేబుల్ కార్లే మార్గం.లక్షాధికారుల హివ్రే బాజార్ (మహారాష్ట్ర)తన తలరాతను తానే తిరగరాసుకుని అత్యధిక మిలయనీర్లున్న విలేజ్‌గా వాసికెక్కిందీ ఊరు. మరాఠ్వాడా ప్రాంతం, అహ్మద్‌నగర్ జిల్లాలోని హివ్రే బాజార్ ఒకప్పుడు దట్టమైన అడవి, పంటపొలాలతో అలరారిన గ్రామం. అడవిలోని చెట్లు వేటుకు గురై, వర్షాభావ స్థితులు ఏర్పడి.. చెరువులు కూడుకుపోయి.. భూగర్భ జలాలు అడుగంటి.. బావులు ఎండిపోయి.. కరవు కాటకాలకు నిలయమైంది. తాగుడు, క్రైమ్‌కు బానిసైంది. ఒకానొక దశలో సారా కాయడం, నేరాలే హివ్రే బాజార్‌కు ఉపాధిగా మారాయన్నా విస్తుపోవాల్సిన పనిలేదు. 90 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి, ఇక ఆ ఊరికి ఉనికిలేదనే పరిస్థితికి చేరిపోయింది. ప్రభుత్వోద్యోగులకైతే పనిష్మంట్ బదిలీ కేంద్రంగా మారింది.వలస వెళ్లిన వాళ్లు పోనూ.. మిగిలిన జనం తమ ఊరు అలా అయిపోవడానికి కారణాలు వెదుక్కున్నారు. ఆ అన్వేషణలోనే పరిష్కారమూ తట్టింది గ్రామ పెద్దలకు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ‘ఉపాధి హామీ’ పథకంతో అడవిని, చెరువులను పునరుద్ధరించుకోవచ్చనీ, వాన నీటిని సంరక్షించుకోవచ్చనీ అనుకున్నారు. తమ ఊరికే ప్రత్యేకమైన పంచవర్ష ప్రణాళికను వేసుకున్నారు. దాని ప్రకారం జనాలు నడుం కట్టారు. తొలకరికల్లా అడవుల సంరక్షణ, ప్లాంటేషన్, చెరువులు, బావుల పూడికతీత, వాటర్ షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు.పడిన ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టుకున్నారు. అయిదేళ్లూ కష్టాన్ని పంటికింద బిగబట్టారు. శ్రమ ఫలించసాగింది. నాటిన మొక్కలు ఎదిగాయి. అడవి పచ్చగా కళకళలాడింది. భూగర్భజల స్థాయి పెరిగింది. చెరువులు, బావుల్లోకి నీరు చేరింది. పంటలు లాభాలు పండించలేకపోయినా తిండిగింజలకు కొదువ లేకుండా చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఊరి వాతావరణం మారసాగింది. వర్షపాతం పెరిగింది. నీళ్లొస్తే జీవకళ వచ్చినట్టే కదా! ప్రకృతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు హివ్రే బాజార్ వాసులు. వలస వెళ్లిన వాళ్లంతా మళ్లీ సొంతూరుకి చేరిపోయారు. మద్యాన్ని మరచిపోయారు. ఆదాయం తద్వారా జీవన ప్రమాణం పెరిగాయి.మూత బడిన బడులు తెరుచుకున్నాయి. 30 శాతానికి పడిపోయిన అక్షరాస్యత క్రమంగా 69 శాతానికి పెరిగింది. యువతలోంచి టీచర్లు, ఇంజినీర్లు వస్తున్నారు. ఇప్పుడక్కడ రైతు నెలసరి సగటు ఆదాయం 30 వేలు. 235 కుటుంబాల్లోకి 60 మంది రైతులు (ఫిబ్రవరి, 2024 నాటికి) లక్షాధికారులు. అలా దారిద్య్రం నుంచి అభివృద్ధి పథంలోకి నడిచిన ఈ ఊరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.శుచీశుభ్రతల చిరునామా మావల్యాన్నాంగ్ (మేఘాలయా)స్వచ్ఛభారత్ కంటే ముందే 2003లోనే ఆరువందల జనాభా గల ఈ చిన్న ఊరు ఆసియాలోకెల్లా క్లీనెస్ట్ విలేజ్‌గా కీర్తి గడించింది. ఇక్కడ అయిదేళ్ల పిల్లాడి నుంచి పళ్లూడిపోయిన వృద్ధుల వరకు అందరూ సామాజిక బాధ్యతతో మెలగుతారు. మావల్యాన్నాంగ్ పిల్లలంతా ఉదయం ఆరున్నరకల్లా లేచి చీపుర్లు పట్టుకుని వీథుల్లోకి వచ్చేస్తారు. వీథులన్నీ శుభ్రం చేస్తారు. డస్ట్బిన్స్లోంచి ఆర్గానిక్ చెత్తను వేరుచేసి మట్టి గుంతలో వేసి కప్పెట్టి, మిగిలిన చెత్తను కాల్చేస్తారు. తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయ్యి స్కూల్ బాటపడతారు.ఇది వారి రోజువారీ కార్యక్రమం. ఆ ఊరి బాటల వెంట పూల మొక్కలను పెంచడం, పచ్చదనాన్ని సంరక్షించడం పెద్దల పని. ఇక్కడ ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ ఉంటుంది. ప్రతి ఇల్లూ అద్దంలా మెరుస్తూంటుంది. రోజూ చేసే ఈ పనులే కాకుండా ప్రతి శనివారం చిన్నాపెద్దా అందరూ సోషల్ రెస్పాన్స్బిలిటీకి సంబంధించిన స్పెషల్ అసైన్మెంట్స్నూ చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిందని వాళ్ల బాధ. తాము ప్లాస్టిక్‌ని నివారించినా.. పర్యాటకుల వల్ల ఆ సమస్య ఏర్పడుతోందని వాళ్ల ఫిర్యాదు. ‘రీసైకిల్ చేయగలిగిన వాటితో ఇబ్బంది లేదు.. చేయలేని ప్లాస్టికే పెద్ద ప్రాబ్లం అవుతోంది.వాటిని కాల్చలేం.. పూడ్చలేం. పర్యాటకులు కూడా పర్యావరణ స్పృహతో ఉంటే బాగుంటుంది’ అని మావల్యాన్నాంగ్ వాసుల సూచన. మీ ఊరికి ఇంత శుభ్రత ఎప్పటి నుంచి అలవడిందని అడిగితే ‘130 ఏళ్ల కంటే ముందు.. కలరా ప్రబలినప్పటి నుంచి అని మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం’ అంటారు. శుభ్రత ముందు పుట్టి తర్వాత మావల్యాన్నాంగ్ పుట్టిందనడం సబబేమో ఈ ఊరి విషయంలో!పొదుపు, మదుపుల మాధాపార్ (గుజరాత్)కచ్ జిల్లాలోని ఈ ఊరిలో మొత్తం 7, 600 (2021 నాటి లెక్కల ప్రకారం) ఇళ్లు ఉన్నాయి. వీళ్లలో యూకే, అమెరికా, కెనడాల్లో నివాసముంటున్నవారే ఎక్కువ. మాధాపార్‌లో మొత్తం 17 బ్యాంకులున్నాయి. విదేశాల్లో ఉంటున్న మాధాపార్ వాసులు ఈ బ్యాంకుల్లోనే తమ డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. అలా వాళ్లు డిపాజిట్ చేసిన మొత్తం రూపాయలు (2021 లెక్కల ప్రకారం) అయిదువేలకోట్లు. దీంతో మాధాపార్ దేశంలోకెల్లా ధనికగ్రామంగా పేరొందింది. ఈ ఎన్ఆర్ఐలు 1968లోనే లండన్‌లో ‘మాధాపార్ విలేజ్ అసోసియేన్’ను స్థాపించుకున్నారు. దీని ఆఫీస్‌ను మాధాపార్లోనూ ప్రారంభించి ఊరి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. వ్యవసాయపరంగానూ మాధాపార్ ముందు వరుసలోనే ఉంది. వీరి వ్యవసాయోత్పత్తులు ముంబైకి ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఆటస్థలాలు, మంచి విద్యాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, చెరువులు, చెక్ డ్యామ్‌లకు కొదువలేదు.మోడర్న్ విలేజ్ పున్సరీ (గుజరాత్)మామూలుగా ఊరు అనగానే .. మట్టి ఇళ్లు, మంచి నీటి కొరత, కరెంట్ కోత, మురికి గుంతలు, ఇరుకు సందుల ఇమేజే మెదులుతుంది మదిలో! కానీ సబర్‌కాంతా జిల్లా.. అహ్మదాబాద్‌కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పున్సరీ మాత్రం ఆ ఇమేజ్‌కి భిన్నం! ఇక్కడ 24 గంటల మంచినీటి, కరెంట్ వసతి ఉంటుంది. టాయ్‌లెట్ లేని ఇల్లుండదు. రెండు ప్రైమరీ స్కూళ్లు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సిస్టం.. మాత్రమే కాదు ఊరంతటికీ వైఫై, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు, 140 లౌడ్ స్పీకర్లతో దేశానికే మోడల్ విలేజ్‌గా విరాజిల్లుతోంది. అంతేకాదు ఇది స్కూల్ డ్రాపౌట్స్ లేని గ్రామం కూడా. దీని అభివృద్ధి కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీ నిరంతరం శ్రమిస్తోంది. అందులో అయిదుగురు మహిళలున్నారు. ఈ గ్రామాభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300కు పైగా అధికారులు ఈ ఊరును సందర్శించారు.మత్తూర్ (కర్ణాటక) సంస్కృతిసంస్కృతం పండిత భాషగానే బతికి కనుమరుగైపోయింది. కానీ షిమోగా జిల్లాలోని మత్తూర్‌లో ఆ భాష నేటికీ వినపడుతుంది. పండితుల నోటెంటే కాదు అక్కడి ఇంటింటా! ఆ గ్రామవాసులు తమ మూలాలను, సంస్కృతీసంప్రదాయాలనూ పరిరక్షించు కోవాలనే దృఢనిశ్చయంతో ఆ భాష ఉనికిని కాపాడుకుంటున్నారు. అందుకే మత్తూర్‌లో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా మార్చేసుకున్నారు.పెళ్లి పీటలెక్కని బర్వాకలా (బిహార్) కైమూర్ హిల్స్‌లోని ఈ ఊరు.. గుజరాత్ బెస్ట్ విలేజ్ పున్సరీకి భిన్నం. కనీస వసతులకు కడు దూరం. ఇక్కడ తాగునీటి సరాఫరా లేదు. కరెంట్ కనపడదు. టాయ్లెట్లు, డ్రైనేజ్ల గురించి అడగనే వద్దు. రోడ్లూ ఉండవు. ఈ స్థితి వల్ల ఈ ఊరు వార్తల్లోకి ఎక్కలేదు. ఈ స్థితి వల్ల ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. సుమారు 50 ఏళ్లుగా ఈ ఊళ్లో మంగళ వాయిద్యాల మోగడం లేదు. కనీస అవసరాలు లేని ఆ ఊరికి మా అమ్మాయిని ఎలా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులంతా తమ మాట్రిమోనీ లిస్ట్‌లోంచి బర్వాకాలాను డిలీట్ చేసేశారు. కనాకష్టంగా 2017లో ఒక్కసారి మాత్రం ఇక్కడ పెళ్లి హడావిడి కనిపించింది. ఎందుకూ.. ఊరి ప్రజలంతా కష్టపడి రోడ్డు వేసుకోవడం వల్ల! ఇంకేం ఆ పెళ్లితో ఊరి కళ మారి తమకూ కల్యాణ ఘడియలు వచ్చేస్తాయని అక్కడి బ్రహ్మచారులంతా సంబరపడ్డారట. అది అత్యాశే అయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిగో ఈ నేపథ్యం వల్లే ఆ ఊరు పేరు వైరల్ అయింది.ద్వారాలు కనపడని శని శింగణాపూర్ (మహారాష్ట్ర)శిరిడీని దర్శించిన చాలామందికి శనైశ్చరుడి ఊరు శని శింగణాపూర్ సుపరిచితమే. శనైశ్చరుడి ఆలయం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. చెప్పుకోవాల్సిన ప్రత్యేకత అదే. ఇక్కడుండే ఆఫీస్ బిల్డింగ్స్, రిసార్ట్స్ వంటి వాటికి, ఆఖరకు పోలీస్ స్టేషన్‌కి కూడా తలుపులు ఉండవు. కొన్నిళ్లల్లో మాత్రం ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కనపడ్తాయి తలుపుల స్థానంలో. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఊరు అప్పటి నుంచీ ఇంతే అట!పాములను పెంచుకునే శెట్పాల్ (మహారాష్ట్ర)ఈమధ్య.. హైదరాబాద్, మణికొండ ప్రాంతంలోని నివాసాల మధ్య నాగుపాము కనపడిందని సోషల్ మీడియాలో ఒకటే గోల. అలాంటిది శెట్పాల్ గ్రామమే నాగుపాముల మయమని తెలిస్తే వీడియోల కోసం ఆ ఊరికి క్యూ కడతారో.. భయంతో బిగుసుకుపోతారో! శెట్పాల్లో ఈ ఇల్లు.. ఆ ఇల్లు అనే భేదం లేకుండా ఏ ఇంటినైనా చుట్టొస్తాయట నాగుపాములు. వాటిని చూసి అక్కడివాళ్లు ఆవగింజంతైనా భయపడకపోగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను ముద్దు చేసినట్టుగా ముద్దు చేస్తారట. ఆ పాములూ అంతే.. శెట్పాల్ వాసులను సొంతవాళ్లలాగే భావిస్తాయిట. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ పాములు విసుగుతోనో.. కోపంతోనో.. చిరాకేసో.. ఏ ఒక్కరినీ కాటేసిన సందర్భం ఒక్కటీ లేదని స్థానికుల మాట. అందుకేనేమో శెట్పాల్æ జనాలు ఈ పాములను తమ ఇలవేల్పుగా కొలుస్తారు!కవలల్ని కనే కొడిన్హీ (కేరళ)మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు అంటారు. కానీ ఒకే ఊళ్లో డజన్లకొద్దీ కనిపిస్తే! అవునా.. నిజమా.. అని హాశ్చర్యపోయే పనిలేదు. నిజమే! ఆ దృశ్యం కొడిన్హీలో కనిపిస్తుంది. ఈ ఊళ్లో దాదాపు రెండువేల కుటుంబాలు ఉంటాయి. దాదాపు అయిదు వందల కవల జంటలు కనిపిస్తాయి. ఈ విశేషంతో అత్యధిక కవలల రేటు నమోదైన ఊళ్ల సరసన కూడా చేరింది కొడిన్హీ. ఇక్కడ ఇంతమంది కవలలు పుట్టడానికి కారణమేం ఉండొచ్చని పలు అధ్యయనాలూ జరిగాయి. ప్చ్.. ఏమీ తేలలేదు!రెండు పౌరసత్వాల లోంగ్వా (నాగాలాండ్)మోన్ జిల్లాలోని ఈ ఊర్లో కొన్యాక్ నాగా జాతి ప్రజలు ఉంటారు. ఆ జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ఇదీ ఒకటి. ఆ ఊరి వాసులకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద నివాసమే. అతని ఇంటిని మన దేశంతో పాటు మయన్మార్ కూడా పంచుకుంటుంది. అంటే అతనిల్లు సరిగ్గా ఈ రెండు దేశాల సరిహద్దు మీద ఉంటుంది. డీటేయిల్‌గా చెప్పాలంటే ఆ ఇంటి పడకగది ఇండియాలో ఉంటే వంటగది మయన్మార్‌లో ఉంటుంది. దీనివల్ల ఆ ఊరు ఈ రెండు దేశాల హద్దులోకి వస్తుందని ఇటు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది.. అటు మయన్మార్ కూడా లోంగ్వా వాసులకు తమ సిటిజ¯Œ షిప్‌ని మంజూరు చేస్తుంది. మన దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంలో ఈ ఊరి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఉంది.చెప్పులొదిలి వెళ్లాల్సిన వెళ్లగవి (తమిళనాడు)కొడైకెనాల్ దగ్గర్లోని చిన్న తండా ఇది. వంద కుటుంబాలుంటాయి. మూడు వందల ఏళ్ల నాటి ఈ తండాకు రోడ్డు లేదు. ట్రెక్కింగ్ ఒక్కటే మార్గం. ఇక్కడ చెప్పుల జాడలు కనిపించవు. ఊరి పొలిమేరల్లో బోర్డ్ కూడా ఉంటుంది.. ‘దయచేసి మీ పాదరక్షలను ఇక్కడే వదిలేయండి’ అని! ఎందుకంటే ఇక్కడ ఇళ్లకన్నా గుళ్లు ఎక్కువ. లెక్కకు మించిన గుడులైతే ఉన్నాయి కానీ ఒక్క బడీ లేదు. అంతెందుకు ఒక్క ప్రాథమిక కేంద్రం కూడా లేదు. ఒక టీ కొట్టు, చిన్న కిరాణా కొట్టు తప్ప ఇంకే కనీస సౌకర్యాలూ వెళ్లగవిని చేరలేదు. రోజువారీ అవసరాలకు ఈ తండా వాసులు కొడైకెనాల్ దాకా నడిచివెళ్తారు.దయ్యాల కొంప కుల్ధారా (రాజస్థాన్)జైసల్మేర్ జిల్లాలోని ఈ ఊరు 13వ శతాబ్దం నాటిది. ఇప్పుడు మొండి గోడలతో.. నిర్మానుష్యంగా కనిపించే కుల్ధారా ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులకు నిలయం. ఒక మంత్రగాడి శాపంతో రాత్రికి రాత్రే ఆ ఊరు మాయమైందని ఒక కథ, భూస్వాముల దాష్టీకాలను తట్టుకోలేక ఆ బ్రాహ్మణులంతా కుల్ధారా వదిలి వెళ్లిపోయారని ఇంకో కథ ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా మనుషుల ఆనవాళ్లు లేక ఇది ఘోస్ట్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. పాలీవాల్ బ్రాహ్మణుల ఆత్మలు నేటికీ ఆ ఊరిలో తిరిగుతుంటాయనే ప్రచారమూ ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం కుల్ధారాను పర్యాటక కేంద్రంగా మలచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.పోర్చ్‌గీస్ జాడ.. కోర్లాయీ (మహారాష్ట్ర)అలీబాగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ ఊరిని పోర్చ్‌గీస్ వాళ్లు నిర్మించారు. అందుకే ఒకప్పుడు దీన్ని పోర్చ్‌గీస్‌లో ‘మరో డి చాల్’ అనేవారట. అంటే ‘గుండ్రని చిన్న కొండ’ అని అర్థం. ప్రస్తుతం ఇక్కడి వాళ్లు పోర్చ్‌గీస్ క్రీయోల్ (యాస) ‘క్రిస్టీ’లో మాట్లాడుతారు. అంతేకాదు ఇక్కడ పేర్లన్నీ పోర్చుగీస్వే ఉంటాయి. పోర్చ్‌గీస్ ఫుడ్డే తింటారు. క్రీయోల్ అనే పదమే రూపాంతరం చెంది కోర్లాయీగా స్థిరపడింది.ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్ జాంబుర్గిర్కి సమీపంలో ఉన్న ఈ ఊరును ‘ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్’ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ భాషను మాట్లాడుతూ, గుజరాతీ పద్ధతులను పాటించే ఆఫ్రికన్స్ ఉంటారు కాబట్టి. ఆఫ్రో– అరబ్ వారసులైన వీళ్లను సిద్దీస్ అంటారు. బానిసలుగా అరబ్ షేక్‌ల ద్వారా ఇక్కడికి వచ్చారు. దాదాపు 200 ఏళ్ల నుంచి వాళ్లు ఈ ఊరిలోనే జీవిస్తున్నారు.సోలార్ తొలి వెలుగు ధర్నాయీ (బిహార్)జహానాబాద్ జిల్లాలో, బో«ద్ గయాకు దగ్గర్లో ఉంటుందీ ఊరు. దీని జనాభా 2,400. ఒకప్పుడు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గింది. కానీ కొన్నేళ్ల కిందట. ఆ ఊరి ప్రజలే పూనుకొని సోలార్ పవర్ ప్లాంట్‌ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది 450 ఇళ్లకు, 50 వాణిజ్య సముదాయాలకు ఎలాంటి కోతల్లేని కరెంట్‌ని అందిస్తోంది. ధర్నాయీ వాసుల ఈ సాహసం ఆ ఊరిని.. దేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్‌నే వాడుతున్న తొలి గ్రామంగా నిలబెట్టింది. ఇప్పడు ఆ ఊర్లో ఇప్పుడు పిల్లలు చదువును కేవలం పగటి పూటకే పరిమితం చేసుకోవడం లేదు. స్త్రీలు రాత్రివేళల్లో గడపదాటడానికి భయపడటమూ లేదు.ఇవేకాక ఫస్ట్ విలేజ్ మానా, బ్యూటిఫుల్ విలేజ్ చిరాపూంజీ, వలస పక్షుల ఆత్మహత్యలకు కేంద్రం జతింగా, ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కుంబలంగీ, బార్టర్ సిస్టమ్ అమల్లో ఉన్న జూన్ బేల్ మేల (అసోం) లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఊర్ల జాబితా చాంతాడంత పెద్దది. సమయం చిక్కినప్పుడల్లా వాటి గురించి తెలుసుకుంటూ.. డబ్బు వెసులుబాటైనప్పుడల్లా చుట్టిరావడమే! ప్రస్తుతం ఈ వివరాలతో వెరీ నెక్స్›్ట వెకేషన్‌కి డిస్టినేషన్ని టిక్ చేసేసుకోండి మరి! -
మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?
-
అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు
మందుబాబులకు వైన్‌లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోర్చుగల్‌లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్‌తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు. ఒలింపిక్‌లో ఉండే స్మిమ్మింగ్ పూల్‌ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది వైన్నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B — Boyz Bot (@Boyzbot1) September 12, 2023 (చదవండి: సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!) -
Macherla: 144 సెక్షన్ గడువు పొడిగింపు
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్‌కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. (క్లిక్ చేయండి: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్) -
జోషిమఠ్ పగుళ్లు.. ఉత్తరాఖండ్ సీఎం కీలక ప్రకటన
డెహ్రాడూన్: బ్రదినాథ్ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. జ్యోతిమఠ్ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం. జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. గ్లేసియర్లు కరగడం, కన్స్ట్రక్షన్ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది. -
దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!
పలానా దేశం అనగానే వాళ్లు ఇలా ఉంటారనే ఒక భావన ఒకటి ఉంటుంది. దక్షిణాఫ్రికా అనగానే నల్లజాతీయలు అని తెలుస్తుంది అందరికీ. అక్కడ ఘోరమైన ఎండలు కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా ఉంటారు. అలాంటి చోట ఒరానియా అనే ఒక విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. పైగా అక్కడ రోడ్లు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి కార్మికులు, సెక్యురిటీ గార్డు వరకు అంతా తెల్లవాళ్లే. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది . ఈ పట్టణం పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది, వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం. స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన పట్టణం ఈ పట్టణం 1991 నుంచి ఇలానే ఉంది. వారంతా 17వ శతాబ్దపు డచ్ వలసదారుల వారుసులు. దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ నది ఒడ్డున సుమారు 8 వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రవేట్ యజామాన్యంతో కలిసి ఒక పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా కూడా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణవివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దుకుంది. అయితే ఆ పట్టణ వాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్ కోతలు, స్థానికి పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. అంతేకాదు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఈ పట్టణంలో ఉండాలనుకునే నివాసితులు కొన్ని విలువలను పాటించాలి, భాద్యతగా మెలగాలి, సభ్యుత్వం పొంది ఉండాలి. ఐతే ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంతవరకు తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ నగరంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఐతే చాలామంది మాత్రం ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగానూ వర్ణవివక్షతకు పెద్ద పీఠం వేసే ప్రాంతంగానే చూస్తుండటం గమనార్హం. అంతేకాదు దక్షిణాఫ్రికా నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఈ పట్టణాన్ని పునరుద్ధరించటానికి అవిశ్రాంతంగా ప్రయత్నించారు. అందులో భాగంగా 1995లో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కలిసి ఉన్నారు కూడా. (చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!) -
YSR Jagananna Colonies: కాలనీ కాదు.. ఊరే..
ఆనందపురం(భీమిలి): అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటి అరా కాలనీ ఇళ్లు మంజూరు చేసి.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సగంలోనే విడిచి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని సౌకర్యాలతో కాలనీలను నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. జగనన్న కాలనీ నిర్మాణ పనులు ఓ పద్ధతిలో జరిగి గ్రామాలను తలపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే మండలంలోని వెల్లంకి జగనన్న కాలనీ. ఇక్కడ సుమారు రూ.60 కోట్లు విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించి సుమారు 300 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ముందుగానే విశాలమైన గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేశారు. విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. దీంతో మొత్తం లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో దాదాపు వంద ఇళ్లు వరకూ పూర్తయ్యాయి. లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. సకాలంలో ఇసుక, సిమెంట్‌తోపాటు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుండడంతో మిగతా ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక్కడ ఒకేసారి మూడు వందల ఇళ్లు నిర్మిస్తుండడంతో ఓ కొత్త ఊరును తలపిస్తోంది. నిర్దేశించిన స్థలంలో లబ్ధిదారుడు తనకు నచ్చిన విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆధునిక సౌకర్యాలతో నిర్మించుకోవడంతో ఇక్కడ పట్టణ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులు ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతున్నారు. కలలో కూడా ఊహించలేదు వలస వచ్చి వెల్లంకిలో భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త ముసిలిబాబు వంటల పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలీచాలని కూలి వల్ల అద్దె చెల్లించుకోలేని పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇల్లు మంజూరు చేశారు. అధికారులు అన్ని రకాలగా సహకారం అందించడంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని.. అందులోనే నివాసం ఉంటున్నాం. అద్దె భారం తొలగిపోయింది. ముఖ్యమంత్రి జగనన్నకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. – వెర్రి దేవి, జగనన్న కాలనీ లబ్ధిదారు, వెల్లంకి జగనన్న రూ.లక్షల ఆస్తినిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలాంటి పేదలకు లక్షలు విలువ చేసే ఆస్తిని కాలనీ ఇంటి రూపంలో అందజేసి ఎంతో సాయపడ్డారు. నేను నా భర్త రోజు కూలి చేసుకుని ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాం. దీనికి ముందు తెలిసిన వారి స్థలంలో కమ్మలపాక వేసుకుని ఉండేవాళ్లం. వర్షాకాలం వస్తే కారిపోయి నానా ఇబ్బందులు పడ్డాం. రూపాయి ఖర్చే లేకుండా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిన జగన్ బాబే మరలా ముఖ్యమంత్రి కావాలి. – బూస రామయ్యమ్మ, ఇంటి లబ్ధిదారు, వెల్లంకి (చదవండి: అదిగో పులి... ఇదిగో తోక) -
మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది
మనుషులుండే ఊళ్లు చాలా ఉన్నాయి.. మరి మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది.. సెంటూరిపే.. ఇటలీలోని ఈ చిన్న పట్టణం.. పై నుంచి చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్‌లో తమ పట్టణం మ్యాప్‌ను చూసి.. చూస్తా ఉంటే మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు.. దాన్ని తీర్చేసుకుందామని.. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు.. కట్‌చేస్తే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే.. చాలామంది దీన్ని నమ్మలేదు. మార్ఫింగ్ చేశారని.. ఫొటోగ్రాఫర్‌ను విమర్శించారు. అయితే.. తర్వాత గూగుల్‌లో మ్యాప్‌లో చెక్ చేసుకుని.. తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా చెప్పారు. 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. (చదవండి: ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) -
కోడి గడియారం
ఒక ఊళ్లో ఒక కోడి, దాని పిల్లలు ఉండేవి. అవి రోజూ పగలు, రాత్రి ‘క్కొ.. క్కొ.. క్కొ..’ అని, ‘ట్వియ్ ట్వియ్’ అరుచుకుంటూ ఊరంతా తిరుగుతుండేవి. రానురాను వీటి అరుపులతో ఊరి ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. దాంతో అందరూ ఆగ్రహించి.. కోడిని, కోడి పిల్లలను ఊళ్లో నుంచి తరిమేశారు. కోడి తన పిల్లలను తీసుకుని పొరుగూరికి వెళ్లింది. కొత్త వాతావరణం చూసి కోడిపిల్లలు మరింత ఆనందంతో ఇంకా గట్టిగా ‘క్కొ.. క్కొ.. క్కొ.. క్కొ..’ అని అరవడం ప్రారంభించాయి. అవి అలా ఊరంతా తిరుగుతూ ఎడతెరపి లేకుండా అరుస్తుండడంతో ఊరివాళ్లు చికాకుపడి కోడిని, దాని పిల్లలను ఆ ఊరి నుంచి కూడా తరిమేశారు. కోడి మళ్లీ తన పిల్లలను తీసుకుని ఇంకొక ఊరికి వెళ్లింది. అక్కడకూడా వీటి అరుపులు భరించలేక అందరూ తరిమేశారు. ఇలా అన్ని ఊళ్లూ తిరగలేక కోడికి విసుగు వచ్చింది. అడవిలోకి వెళ్లిపోయి, తన పిల్లలతో కలిసి అక్కడే ఉండటం ప్రారంభించింది. ఇక్కడ కోడి, కోడిపిల్లల కూతలు లేకపోవడంతో జనాలకు తెల్లవారుజామునే లేవడం ఆలస్యం అవుతోంది. దాంతో పనులన్నీ ఆలస్యమైపోతున్నాయి. చివరకు అన్ని ఊళ్లలోని జనం కోడిని, దాని పిల్లలను వెతుక్కుంటూ వచ్చి దయచేసి తమ ఊరికి రమ్మంటూ బతిమాలారు. అప్పుడు కోడి ఒక్కొక్క ఊరివారికి ఒక్కొక్క కోడిపిల్లను ఇచ్చి ‘‘దీనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి’’ అని చెప్పింది. కోడిపిల్లలు పెద్దవై కొక్కొరొక్కో అని కూయడంతో ఆయా గ్రామాల ప్రజలు తెల్లవారినట్లు తెలుసుకుని నిద్రలేచి తమ దైనందిన చర్యలలో పడటం అలవాటుగా మార్చుకున్నారు. మంచి చెప్పేవారికి, పదిమందికీ మేలు చేసేవారికి కూడా ఒక్కోసారి కోడికి ఎదురైన అనుభవం ఎదురు కావచ్చు. అంతమాత్రాన నిరాశ పడి ఊరుకోకూడదు. తమ ప్రబోధాలను, తాము చేసే మంచిని కొనసాగిస్తుండాలి. – డి.వి.ఆర్ -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్‌డయాక్సైడ్‌ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి అర్బన్ : నీతి ఆయోగ్‌తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గాశంకర్‌మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్ భగీర«థ పనులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మా ణం, కేసీఆర్ కిట్ల పథకం అమలు తీరు బాగుందని తెలిపారు. అలాగే టూరిజం అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయని, జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా జంతు సంపద అధికంగా లేదన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు పెంపకాన్ని అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కర్ణాటక రాష్ట్రం తరహాలో ఎకో టూరి జానికి ప్రత్యేక అధికారులను నియమించేలా చూస్తామని తెలిపారు. మరో 8 నెలల్లో జిల్లా సందర్శనకు వస్తానని, అప్పటి లోపు అభివృద్ధి చేసి చూపించాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ రవికిరణ్, డీఆర్వో మోహ న్లాల్, జిల్లా అధికారులు అనురాధ, డాక్టర్ అప్పయ్య, అక్బర్, రాజారావు, భూపాలపల్లి మునిసిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
మురుగు.. పరుగు
కల్వకుర్తి టౌన్ : పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రెయినేజీలు లేక మురుగు రోడ్లపై పారుతుంది. కల్వకుర్తి పట్టణంలో మొత్తం 20వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో డ్రెయినేజీల నిర్మాణం సరిగా లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నా ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పందులకు ఆవాసంగా.. గ్రామపంచాయతీ అనుమతితో పలు కాలనీల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో ఇళ్ల మధ్యలో మురుగు నిలుస్తుంది. దాంతో పందులు సంచిరిస్తూ ఆవాసాలుగా మారుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2.18కోట్లు కల్వకుర్తి పట్టణంలో ఇప్పటివరకు 20 కాలనీల్లో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2కోట్ల18లక్షలు నగరపంచాయతీ ఖర్చుచేసింది. యీ నిధులతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామని పాలకులు చెబుతున్నా వివిధ కాలనీల్లో మురుగు మాత్రం రోడ్లపైనే పారుతోంది. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేకపోతున్నామని పట్టణంలోని వివిధ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం పట్టణంలో మురుగు రోడ్లపై పారుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. రూ.కోట్లు ఖర్చుచేసినా డ్రెయినేజీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మురుగు కాల్వలు, రోడ్ల కోసం రూ.20కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. – రాచోటి శ్రీశైలం, చైర్మన్, నగర పంచాయతీ -
పండగ ముగిసింది.. పట్నం రమ్మంది
- తట్టా బుట్టా సర్ధుకుంటున్న వ్యవసాయ కూలీలు - బతుకు వేటలో భాగంగా పట్నం దిశగా అడుగులు - ఆలూరు మండలంలో పెరుగుతున్న వలసలు ఆలూరు రూరల్ : వర్షాభావం కారణంగా స్థానికంగా పనులు లేకపోవడం, అరకొరగా పండిన పంట దిగబడులు ఇళ్లు చేరడం, ఉపాధి పనులు ప్రారంభించకపోవడం, సంక్రాంతి సైతం వెళ్లిపోవడం వెరసి ఆలూరు డివిజన్లోని పల్లెలు వలస బాట పట్టాయి. బతుకు వేటలో భాగంగా చిన్న, సన్నకారు, వ్యవసాయ కూలీలు గుంటూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సోమవారం మండల పరిధిలోని హుళేబీడు, తుంబళబీడు, ఆలూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలు తట్టాబుట్టా సర్ధుకుని పిల్లాపాపలతో గుంటూరు పోయేందుకు దాదాపు ఆరు ఆటోల్లో గుంతకల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా స్థానికంగా ఉపాధి పనులు అరకొరగా కొనసాగుతుండడం, పనికితగ్గ వేతనం లేకపోవడం, పనులు చేసినా కూలీ డబ్బులు చేతికి రాకపోవడంతోనే వలస వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా పనులు అరకొరగానే ఉన్నాయని ఇప్పటికే అక్కడకు వెళ్లిన వారు చెప్పారని, అయితే ఇక్కడే ఉంటే పూట గడవని పరిస్థితులు వస్తాయని భావించి ఉన్నకాడికే చాలనే ఉద్దేశ్యంతో వెళ్తున్నామని నిట్టూర్చారు. -
పట్టణాభివృద్ధే ధ్యేయం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలెబోయిన రాధిక, ఆకుల లవకుశ, డీఈ వెంకటేశ్వర్రావు, సూర్గి శంకర్, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా
మున్సిపాలిటీ : సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. మంగళవారం పట్టణంలోని 27వ వార్డులోని ప్రియాంక కాలనీలో మెటల్ రోడ్డు పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు వచ్చినప్పుడు పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి అందివ్వాలన్నారు. అనంతరం కాలనీలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్ బైరు దుర్గయ్యగౌడ్, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, టైసన్ శ్రీను, దేశగాని శ్రీనివాస్, డీఈ వెంకటేశ్వర్రావు, కాంట్రాక్టర్లు వెంకటరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు. టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి. చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు. ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు. ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు. -
వెల్లింగ్టన్ లో వింత సమస్య!
వెల్లింగ్టన్ : న్యూజిల్యాండ్ లోని ఓ పట్టణం వింత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే.. అక్కడ మాత్రం ఉద్యోగాలు చేసేవారు లేక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు ఫుల్ గా ఉన్నా అభ్యర్థులు లేకపోవడం ఆ సిటీలో పెద్ద సమస్యగా మారిపోయింది. అంతేకాదు అక్కడ ఉన్న ఇళ్ళలో కూడ ఎవరూ నివసించేందుకు ముందుకు రావడం లేదట. న్యూజిల్యాండ్ క్లుతా జిల్లా, కైటంగట పట్టణంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు బదులుగా అభ్యర్థుల కొరత బాధిస్తోందట. ప్రపంచంలో ఎన్నోదేశాలు ఎదుర్కొంటున్న సమస్యకు భిన్నంగా అక్కడి ప్రభుత్వం.. ఉద్యోగులు కావాలంటూ ఎదురు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతి చిన్న పట్టణమైన కైటంగటలో కేవలం 800 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు అత్యధికంగా ఉండటంతో ప్రభుత్వం అభ్యర్థులకోసం పడిగాపులు పడాల్సివస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తామని ముందుకొచ్చేవారికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇల్లు, స్థలంతోపాటు, అధిక వేతనాలు అందించేందుకు సైతం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 1000 దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయని, అందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇతర ప్రాంతాలనుంచి కూడ అభ్యర్థులను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా మేయర్ బ్రియాన్ కేడోజిన్ తెలిపారు. క్లుతా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎక్కువగా డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పరిశ్రమల్లోనే కావడం, దానికి తోడు కైటంగట పట్టణం ఓ మారుమూలకు ఉండటం కూడ ఇక్కడకు ఉద్యోగాలకోసం వచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్నట్లు మేయర్ చెప్తున్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. స్థానిక ప్రజలు ఉద్యోగాలకు సరిపోకపోవడంతో సమీపంలోనే ఉన్న డునిడెన్ నుంచి బస్సుల్లో కొందర్ని ఇక్కడికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తాను, తన కుటుంబం తిండికోసం ఇబ్బందులు పడుతున్నపుడు ఈ ప్రాంతం తనకు ఉద్యోగాన్నిచ్చి ఆదుకుందని, ఇప్పుడు తానుసైతం ఇబ్బందులుపడే ఇతర కివి కుటుంబాలకు ఉద్యోగాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్రియాన్ చెప్తున్నారు. అలాగే కైటంగటలో డైరీ ఫాం నిర్వహిస్తున్న మూడో తరం వ్యక్తి ఎవాన్ డిక్ కూడ ఈ డ్రైవ్ లో భాగం పంచుకున్నాడు. ఇదో ఓల్డ్ ఫ్యాషన్ కమ్యూనిటీ అని, ఇక్కడ ఇళ్ళకు ఎవ్వరూ తాళాలు కూడ వేసుకోరని, పిల్లలు హాయిగా పరుగులు పెట్టి ఆడుకునేట్లుగా ఉండే ఈ ప్రాంతంలో అధికశాతం ఉద్యోగాలు, ఇళ్ళు ఉన్నా... ప్రజలే తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగాలు కావాలన్నా దొరకని నేటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలిస్తాం రండి బాబూ.. అంటూ అభ్యర్థులకోసం పడిగాపులు పడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ... -
గబ్బిలాలు ఆ ఊరిని ఆక్రమించాయి!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పట్టణంలోని ఓ తీర ప్రాంతం గబ్బిలాల సామ్రాజ్యంగా మారింది. వాటి కారణంగా అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల దైనందిన కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పదకొండు వేల జనాభా ఉన్న ఈ తీర ప్రాంతంలో దాదాపు ఒక లక్ష కు పైగా గబ్బిలాలు అక్కడి చెట్లను తమ నివాసాలుగా మార్చుకోవడంతో ఆ తీర ప్రాంత పట్టణాన్ని 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'గా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. ఈ గబ్బిలాల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతుండటంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వాటన్నింటిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండటంతో కనీసం ఇంటి కిటికీలు తెరవలేకపోతున్నామని.. అవి చేసే శబ్దాన్ని భరించలేకపోతున్నామని అక్కడి వాసులు వాపోతున్నారు. దాదాపు ఆస్ట్రేలియాలో నివసించే గ్రే-హెడ్ గబ్బిలాల్లో నాలుగింట ఒకటి ఇక్కడ నివసిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ జాతికి చెందిన గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉండటంతో వాటిని అధికారుల చంపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ పట్టణంలో ఉన్న చెట్లన్నింటినీ నరికేసే పనిలో పడ్డారు. -
28 ఏళ్ళ తర్వాత అక్కడో శిశువు పుట్టింది..!
ఆ ప్రాంతంలో పిల్లలు పుట్టడమే కరువై... సంవత్సరాలు దాటి పోయింది. నవజాత శిశువులకోసం పరితపించే అక్కడి ప్రజలకు.. దశాబ్దాల తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ళుగా వారు కంటున్న స్వప్నం... వారం క్రితం సాకారమైంది. ఇటలీలోని ఓస్థానా పట్టణంలో 1987 తర్వాత ఏ కుటుంబంలోనూ పిల్లలు పుట్టడమే చూడలేదని, స్థానిక మేయర్ లాంబార్డో చెప్తున్నారు. గతవారం ఓ కుటుంబంలో శిశువు జన్మించడం నిజంగా అద్భుత సన్నివేశమని... దీంతో అక్కడి ప్రజలు ఆనందంలో తేలియాడుతున్నారని ఇటలీ డైలీ న్యూస్ పేపర్ లా స్టాంపా వెల్లడించింది. ఓస్థానాలో పుట్టిన చిన్నారితోపాటు... కేవలం 85 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే ఇక్కడి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజానికి 1975 లో ప్రారంభమై...1976-87 కు మధ్య కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టడం చరిత్రను సృష్టించింది. అప్పట్లో చివరిగా ఓ అబ్బాయి పుట్టినట్లు స్థానిక మేయర్ జియాకోమో లాంబార్డో చెప్తున్నారు. జననాల ట్రెండ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటూ స్థానికంగా ప్రత్యేక వేడుకను కూడా నిర్వహించారు. జనాభా తగ్గిపోవడాన్ని అరికట్టడం ఎంతో కష్టమని, ఆ దిశగా తాము ఎన్నో ఆలోచనలు చేస్తున్నామని లాంబార్డో అంటున్నారు. ముఖ్యంగా యువ ఇటాలియన్లకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం కూడా ఇక్కడ జనాభా తగ్గడానికి కారణమని ఆయన అంటున్నారు. ఉద్యోగాలకోసం ఇక్కడి ప్రజలు అనేకమంది స్వంత ఇళ్ళను కూడా వదిలి నగరాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇటలీలోని ఈ ఓస్థానా పట్టణంలో ప్రస్తుతం ఓ దుకాణం, ఓ బార్, రెండు రెస్టారెంట్లు మాత్రమే ఉన్నట్లు స్థానిక వార్తా వెబ్ సైట్ 'ది లోకల్' ప్రకారం తెలుస్తోంది. ఉత్తర ఇటలీలో కొంత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, దక్షిణ ఇటలీలోని సిసిలీ సహా అన్ని ప్రాంతాలూ తీవ్రమైన భౌగోళిక మార్పులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళనకు గురైన కొందరు స్థానికులు... ఇక్కడి జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైద్యపరీక్షలు చేయించుకొని, మరణాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిసిలీ ద్వీపంలోని గంగి పట్టణంలో గతేడాది మరో ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడి సుమారు 20 గృహాలు రెండు డాలర్లకన్నా అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సుమారు 50 మంది ముందుకొచ్చారు. వీరు తిరిగి వెళ్ళకుండా ఉండేందుకు కొనుగోలుదారుల ఇష్టప్రకారం పునరుద్ధరణకు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం గంగిలో 7 వేల మంది నివాసితులు ఉన్నారు. అయినప్పటికీ ఓస్థానాలో పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడుతుందేమోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఓస్థానాలో జన్మించిన శిశువు పాబ్లో రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇక్కడ తిరిగి పుట్టుక ప్రారంభమవ్వడం గర్వించదగ్గ మార్పు అని మేయర్ లాంబార్డో అంటున్నారు. స్థానిక యువకులు పట్టణం వదిలి ఉద్యోగాలకోసం వలస వెళ్ళకుండా ఆపే తమ ప్రయత్నం క్రమంగా ఫలిస్తోందని, తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం ఉపాధికోసం ఊరు వదిలి వెళ్ళినా.. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడంతో తిరిగి బస చేసేందుకు యువకులు వస్తున్నారని లాంబార్డో చెప్తున్నారు. తమ ప్రయత్నాలతో క్రమంగా జనాభా కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నట్లు ఆయన అంటున్నారు. -
కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది. సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది. మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. -
మాట మరచిన ఊరు
‘‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. నీకు నోరే లే కపోతే నీ కోసం ఊరే మూగబోతుంది’’ అన్నట్టుగా ఆ అన్నా చెల్లెళ్ల కోసం ఊరు ఊరంతా మూగబోయిన వైనమిది. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో నివసించే ముహర్రమ్ మూగ, చెవిటి. ముహర్రమ్ మంచివాడు కావడంతో చుట్టుపక్కలవాళ్లు అతనిని బాగా అభిమానిస్తారు. ఒక రోజు ముహర్రమ్, సోదరితో కలిసి ఒక షాపు మీదుగా వెళుతుంటే... ఆ షాపతను గుడ్‌మార్నింగ్ అంటూ అతడిని విష్ చేశాడు. అదీ సైన్ లాంగ్వేజ్‌లో. ఆ తర్వాత వీళ్లిద్దరూ లోకల్ క్యాబ్ ఎక్కబోతుంటే ఆ డ్రైవర్ కూడా ముహర్రమ్ని సైన్ లాంగ్వేజ్‌లోనే పలకరించాడు. ఈ రెండు సంఘటనలు జరిగిన కాసేపటికే... స్థానికులంతా గుంపుగా వచ్చి ముహర్రమ్తో సంభాషించడం ప్రారంభించారు. అదీ సైన్లాంగ్వేజ్లోనే. అప్పుడు అర్ధమైంది ముహర్రమ్కి... తమ చుట్టుపక్కల వాళ్లంతా తన ‘భాష’ నేర్చుకున్నారని. అదీ తన కోసమేనని. ‘‘నోటిమాట లేదు నొసట... ఎన్నో నోళ్లున్నాయి నా కోసం ఇచట’’ అంటూ ఉప్పొంగిపోయిన ముహర్రమ్ ఆనందం ఆపుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. కొసరంత: మదిని కదిలించే ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని నిశ్శబ్దంగా షూట్ చేశాయి కొన్ని కెమెరాలు. శామ్సంగ్ సంస్థ వినికిడి లోపం ఉన్నవారి కోసం తాము రూపొందించిన వీడియో కాల్ సెంటర్ ప్రమోషన్ ఇది. ఒక యాడ్ ఏజెన్సీ ఈ మొత్తం కథను నడిపింది. మొహర్రమ్కి తెలియకుండా చుట్టుపక్కలవాళ్లకు సైన్ లాంగ్వేజ్ నేర్పి మరీ ఈ ఈ యాడ్ చేసేందుకు నెలలు పట్టింది. గత వారం యూట్యూబ్‌కి ఎక్కిన ఈ వీడియోని లక్షలాదిగా వీక్షకులు చూస్తున్నారని రూపకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట! -
పల్లె పొమ్మంది.. పట్టణం రమ్మంది
అన్నదాతల ప్రధాన పండుగ సంక్రాంతి...వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక రైతులు అప్పులపాలయ్యారు. ఆనందానికి, ఆడంబరానికి దూరమయ్యారు. ఫలితంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో అంతంతమాత్రంగానే ఉంది. పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు మాత్రం సంక్రాంతిపై మక్కువచూపుతున్నారు. ఘనంగా జరుపుకుంటున్నారు. అనంతపురం కల్చరల్ : పల్లె సీమల పండుగైన సంక్రాంతిని గ్రామీణుల కంటే పట్టణవాసులే ఎక్కువగా, వినూత్నంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఇల్లు ముత్యాల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తోంది. కార్పొరేట్ పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంప్రదాయలను మరుగున పడకుండా కాపాడుతున్నారు. విద్యార్థులతో పండుగ చేరుుంచి మన సంస్కృతిని కాపాడుతున్నారు. మకర సంక్రమణమే...మకర సంక్రాంతి సాధారణంగా జనవరిలో పంట చేతికి వస్తుంది. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఏ రోజైతే ధనుస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతి లేదా సంక్రమణం పిలుస్తారు. సంబరాలు చేసుకుంటారు. సంక్రమణం అంటే ఒక చోట నుంచి మరో చోటుకు జరిగే మార్పు! సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతున్నాడని దీనినే సంక్రమణం అంటారు. ఈ సమయంలోనే ఆయనం మారుతుంది. అప్పటి వరకూ దక్షిణాయనంగా ఉండే కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారుతుంది. పంచాంగంలో ఈ సంక్రమణ తేదీలు, సమయాలు యథావిధిగా కనపడతాయి. ముఖ్యంగా ఈ తేదీలలోనే సంక్రాంతి పర్వదినాలు వస్తాయి. సంక్రమణ కాలంలో మహావిష్ణువు నేత్రాలు తెరుచుకుంటాయని ప్రతీతి. ఈ ఆధునిక కాలంలో కల్పవక్షం లాంటి దేవుళ్లలో ‘అయ్యప్ప’ ఒకడు. నేడు హరిహర సుతునికి నెయ్యి అభిషేకాలతో ఆరాధనలు జరుగనున్నాయి. స్వామివారి మహత్యం తెలిపే మకరజ్యోతి ఆకాశంలో దివ్య తేజస్సుతో వెలుగొందేది కూడా ఈ సంక్రమణలోనే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే... మంచి పంటలు, పశువుల సంపదలు.... ఆయురారోగ్యాలు ఎప్పటికి ఇలాగే ఉండాలని ‘సంక్రాంతి’ని కాంతి వంతంగా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఒక చోట నుంచి మరో చోటికి సంక్రమణం చేస్తున్నట్టే... పల్లెల అందాలు పట్టణాలకు వలసలొచ్చినట్టు ప్రతి ఇంటి ముందు రంగవల్లులు.... హరివిల్లులవుతున్నాయి. ముత్యాల ముగ్గుల్లో ఆచార వ్యవహారాలు చిందులేస్తున్నాయి. భక్తి భావం రెట్టింపై పర్వదినాలలో ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. యువతలో పెరిగిన ఆధ్యాత్మికత సంస్కృతి సంప్రదాయాలపై ఒక నాడు పెద్దవారిలో మాత్రమే ఆసక్తి... గౌరవం కనపడేది. ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఆచారాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఆధ్యాత్మిక భావజాలం గణనీయంగా పెరిగింది. ఈ సంక్రాంతి పర్వదినాలలో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా పలు ఆలయాలలో తిరుప్పావై ఉత్సవాలు, గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవాలు, మకరజ్యోతి వేడుకలు, సూర్యగ్రహ పూజలు వైభవంగా జరుగుతున్నాయి. వీటిన్నింటిలో యువత ఉత్సాహంగా ముందుంటోంది. ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం. సంప్రదాయాలను పాటించడానికి... ముందు వరుసలో నడుస్తున్న కొందరి అభిప్రాయాలు వారి మాటల్లోనే... సంక్రాంతి అంటే సంబరం అన్ని పండుగలకన్నా సంక్రాంతి పర్వదినాలొస్తున్నాయంటే మాకెంతో సంబరం. మూడు రోజుల పాటు ముత్యాల ముగ్గులలో మునిగి తేలుతాం. ఇంటినిండా వచ్చిన బంధువులు... పండుగ హడావుడి వెరసి ఇళ్లే చిన్నసైజు పల్లెలా సంబరాలను తెస్తాయి. ముఖ్యంగా అపార్టుమెంట్లలో జరిగే సందడే వేరుగా ఉంటుంది. - దివ్య, విద్యార్థిని, పాతూరు సంక్రాంతి పల్లె పండుగ సంక్రాంతి పర్వదినాలు ఒకప్పుడు పల్లెలకు పరిమితమయ్యేవి. కాలం తెచ్చిన విం తలో భాగమేమోననిపించే విధంగా అది కాస్తా పట్టణాలకు చేరుకుని ఇక్కడంతా సందడిగా మారిపోయింది. మా ఇంట్లో అందరూ పండుగ వచ్చిదంటే మహా సరదాగా ఉంటారు. పిల్లలేమో ప్రతిరోజు ముత్యాల ముగ్గుల వేయాలని పట్టుబడతారు. ప్రకృతిని ఆరాధించాలనే భావం, దివ్య సందేశంలా సంక్రాంతి తెస్తుంది. - జయ, గృహిణి -
ప్రతి ఓటూ కీలకమే
వెంకటగిరిటౌన్,న్యూస్‌లైన్: పట్టణంలోని 16 వార్డులో కౌన్సిలర్ స్థానానికి జరుగుతున్న పోటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ ప్రధాన పార్టీల మధ్య జరిగే ఈ వార్డులో ఈ ధపా పట్టణంలోనే అత్యధికంగా 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలయిన వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ట్, బీజేపీ, లోక్‌సత్తా అభ్యర్థులతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు ఈ వార్డు బరిలో ఉన్నారు. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు ఈ వార్డు నుంచి తిరిగి పోటీలో ఉన్నారు. తొలుత ఈ వార్డు నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీచేసిన పలువురిని బుజ్జగింజి పోటీ నుంచి విరమింపజేశారు. చివరకు 9 మంది బరిలో ఉండడంతో పట్టణంలో ఈ వార్డు పలితంపై ఆసక్తి నెలకొంది. కాగా 1868 మంది ఓటర్లు ఉన్న ఈ వార్డులో ప్రతి ఓటూ కీలకంగా మారుతుండడంతో వలసలు వెళ్లిన ఓటర్లును పోలింగ్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. -
అవకాశం దొరికింది.
కడుపు నింపుకునేందుకు చక్కని అవకాశం దొరికింది. ఇప్పుడు వదిలేశామా మళ్లీ ఇలాంటి అవకాశం మాకు దక్కదని అనుకున్నాయో ఏమో ఎక్కడెక్కడినుంచి వచ్చిన పక్షులు తమ నోటికి పని పెట్టాయి. నగరంలోని ఓ ప్రాంతంలో మంగళవారం ధాన్యం తింటున్న చిలుకలు, పావురాళ్లు, ఓ ఉడుత