
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగింపు.
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్‌కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. (క్లిక్ చేయండి: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్)