ప్రతి ఓటూ కీలకమే | every vote important | Sakshi
Sakshi News home page

ప్రతి ఓటూ కీలకమే

Published Sat, Mar 29 2014 4:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

every vote important

 వెంకటగిరిటౌన్,న్యూస్‌లైన్: పట్టణంలోని 16 వార్డులో కౌన్సిలర్ స్థానానికి జరుగుతున్న పోటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ ప్రధాన పార్టీల మధ్య జరిగే ఈ వార్డులో ఈ ధపా పట్టణంలోనే అత్యధికంగా 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలయిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ట్, బీజేపీ, లోక్‌సత్తా అభ్యర్థులతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు ఈ వార్డు బరిలో ఉన్నారు. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది.

 

టీడీపీ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు ఈ వార్డు నుంచి తిరిగి పోటీలో ఉన్నారు. తొలుత  ఈ వార్డు నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీచేసిన పలువురిని బుజ్జగింజి పోటీ నుంచి విరమింపజేశారు. చివరకు 9 మంది బరిలో ఉండడంతో పట్టణంలో ఈ వార్డు పలితంపై ఆసక్తి నెలకొంది. కాగా 1868 మంది ఓటర్లు ఉన్న ఈ వార్డులో ప్రతి ఓటూ కీలకంగా మారుతుండడంతో వలసలు వెళ్లిన ఓటర్లును పోలింగ్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement