Ward
-
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
వచ్చేనెల 17న ‘పీఎం విశ్వకర్మ యోజన’
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుడుతోంది. వచ్చేనెల 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై రాష్ట్రంలో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి జిలాకలెక్టర్లను ఆదేశించారు. తొలుత ఈ పథకంపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సూచించారు. 18 రకాల వృత్తి, హస్త కళాకారుల్లో లబ్ధిదారులను గుర్తించాల్సి ఉందని, లబ్ధిదారుల నమోదు ప్రక్రియపై వలంటీర్లకు శిక్షనివ్వాలని సీఎస్ చెప్పారు. నైపుణ్య కేంద్రాలనూ గుర్తించాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. ఈ పథకం కింద తొలిదశలో ఒక లక్ష మంది లబ్ధిదారులతో ప్రారంభించనుందని, ఈలోగా రాష్ట్రంలో అర్హులైన 18ఏళ్లు నిండిన సంప్రదాయ కుల, చేతి వృత్తిదారులను, హస్త కళాకారులను గుర్తించాలన్నారు.లబ్ధిదారుల ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అనంతరం వెరిఫికేషన్ చేయాలని, అర్హులకు పీఎం విశ్వకర్మ యోజన సర్టీఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన తెలిపారు. గ్రామాల్లోని సంప్రదాయ కుల, హస్త కళాకారులకు నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం, మార్కెట్ అనుసంధానం చేయడం, సామాజిక భద్రత అందించడం ఈ పథకం లక్ష్యమని సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు 2023–2028 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లను వ్యయం చేయనుంది. -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్‌లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్‌లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు. -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. చివరి స్థాయి వరకు సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఈ వ్యవస్థలో అర్జీలను త్వరితగతిన పరిష్కరించడం చాలా ముఖ్యం. ఇది మరింత మెరుగ్గా జరగాలంటే సచివాలయాల సిబ్బంది పనితీరుపై మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై సచివాలయాల ఉద్యోగులందరికీ అవగాహన కలిగించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకేసారి దాదాపు 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మంజూరు చేయడంతో పాటు, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వాటిని భర్తీ చేయడం తెలిసిందే. తొలి విడతలో భర్తీ కాని పోస్టులకు వరుసగా రెండో ఏడాది నియామక ప్రక్రియ చేపట్టడమూ విదితమే. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలకు సంబంధించి బుధవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సచివాలయాల్లో ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయండి. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది. ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టాలి’ అని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అర్జీల పరిష్కారమన్నది చాలా ముఖ్యమని, వాటి పరిష్కారంలో స్పష్టత ఉండాలని సీఎం చెప్పారు. ఒకే అర్జీ మళ్లీ వచి్చనప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు ఆపై వ్యవస్థ పరిశీలన ద్వారా దానిని పరిష్కరించేలా చర్యలు ఉండాలన్నారు. అర్జీకి సంబంధించిన సమాచారం రీ వెరిఫికేషన్ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అనేది ప్రధానం అని చెప్పారు. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పని చేయగలుగుతాయని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పర్యవేక్షణ కోసం ఎస్వోపీ – గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనుకున్న లక్ష్యాల మేరకు సమర్థవంతంగా పని చేయాలంటే.. ప్రతి ఒక్క ఉద్యోగి ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలన్న దానిపై సరైన ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ఉండాలి. దీంతో పాటు పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఇది లేకపోతే ప్రయోజనం ఉండదు. – సిబ్బంది హాజరు దగ్గర నుంచి వారు ప్రజలకు అందుబాటులో ఉండటం వరకు అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిర్వహించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్‌వోపీలు ఉండాలి. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి అధికారి ఓనర్íÙప్ తీసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రతి నెలా 2 సచివాలయాలు సందర్శన – ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారు. వారి సేవలు ప్రజలకు అందాలి. ప్రతి ప్రభుత్వ విభాగంలో ఫేషియల్ రికగ్నైజేషన్‌తో కూడిన హాజరును అమలు చేయాలి. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలైతే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారు. – దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టి పెడతారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ స్థాయి సచివాలయం వరకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలి. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో ఏపీ నంబర్ వన్ కావాలి – సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్ స్థాయిలో నిలవాలి. ఈ విషయమై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలం. గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలం. లేదంటే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదు. – సచివాలయాల్లో టెక్నాలజీ పరంగా.. సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదు. నిరంతరం టెక్నాలజీని అప్డేట్ చేయాలి. సిబ్బందినీ అప్డేట్గా ఉంచాలి. అన్ని సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం 2,909 గ్రామ సచివాలయాలు వైర్లెస్ ఇంటర్నెట్తో నడుస్తున్నాయి. వాటిని వైర్డు ఇంటర్ నెట్‌తో అనుసంధానం చేయాలి. గ్రామంలోని ఆర్బీకేలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. అంగన్వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలి. – ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ల్యాండ్ అడ్మిని్రస్టేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, కమిషనర్ షన్ మోహన్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. చదవండి: ‘మనకు ఇదేం ఖర్మరా బాబూ’.. కుప్పం హడల్ -
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. (బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం) సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ‘‘గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి. ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్‌కు సన్నద్ధం కావాలని’’ సీఎం సూచించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు వెల్లడించారు. ల్యాండ్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించి, ఈ షెడ్యూల్‌ను తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయని సీఎం పేర్కొన్నారు. -
బోగీలే ఐసోలేషన్ వార్డులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో ఆ రైలు బోగీలను కరోనా బాధితులకు చికిత్సనందించే వార్డులుగా రూపొందించాలని ముందుకొచ్చింది. ఇందుకోసం ఒక నమూనా బోగీని కూడా తయారు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే మరికొద్ది రోజుల్లోనే వారానికి 10 బోగీలు తయారు చేయనున్నట్టు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ వెల్లడించారు. బోగీలను ఐసీయూ కేంద్రాలుగా ఎలా మార్చారంటే ► ఒక కూపేలో ఒకవైపు లోయర్ బెర్త్‌నే మంచం మాదిరి గా రూపొందించి అన్ని బెర్త్‌లను తొలగించారు. ► ఆ బెర్త్ ఎదురుగా రోగుల సామాన్లు, వైద్య పరికరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. ► ప్రతీ కోచ్‌లో ఉండే 4 టాయిలెట్ల స్థానంలో రెండు వాష్‌రూమ్‌లుగా మార్చి ఫ్లోరింగ్ మార్చారు. ప్రతీ బాత్రూమ్లో హ్యాండ్ షవర్, బక్కెట్, మగ్ ఉంచారు. ► ప్రతీ కోచ్‌లోనూ 220 ఓల్టుల ఎలక్ట్రికల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ► బోగీ వెలుపల 415 ఓల్టుల విద్యుత్ సరఫరా. ► బోగీకి 10చొప్పున ఇలా వార్డులు తయారు చేశారు. ► ఇక రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐసీయూలు, మెడికల్ స్టోర్లు, పాంట్రీలు, అధికారుల కోసం గదులు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకి కనీసం మూడు పడకలైనా ఉండాలి. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి 0.7 పడకలు ఉన్నట్టుగా అంచనా. -
రాష్ట్రంలో కొత్తగా 34,350 ఉద్యోగాల భర్తీ
అమరావతి: గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకూ ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సచివాలయంలో 10మంది ఉద్యోగులను నియమించేలా విధివిధానాల్ని రూపొందించారు. ఫలితంగా వార్డు సచివాలయాల్లో కొత్తగా 34,350 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించింది. దాంతోపాటు వార్షిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ పథకాలను వంద శాతం మేరకు అమలు చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 నుంచి 100 మంది పౌరులకు సంబంధించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంది. పన్నుల వసూలు, పరిశుభ్రత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సూచించింది. పురపాలికలు, నగరపాలికల్లోని వార్డు కార్యాలయం, అంగన్ వాడీ భవనం, పాఠశాల, ఇతర ప్రభుత్వ భవనాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాంతోపాటు వార్డు పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, సానిటేషన్, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, రెవెన్యూ, వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులుగా 10 మందిని నియమించాలని నిర్ణయించింది. జూలై 22వ తేదీన నియామకాల నోటిఫికేషన్ చేపట్టి.. ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ లోగా నియామకాలను పూర్తి చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి. -
‘పైళ్ల’ను అధిక మెజార్టీతో గెలిపించాలి
సాక్షి,భువనగిరిటౌన్ : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని 28వ వార్డులో కిసాన్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పట్టణ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, అమ్జద్అలీ, పద్మ, జైయిని రవిందర్‌గుప్తా, సరగడ కరణ్, రవి, స్వప్న, బ్రహ్మచారి, రమేష్‌పాల్గొన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో.. టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కోకన్వీనర్ ఆకుల జయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ, కె.యాదమ్మ, శిరీష, నర్మద, జయలక్ష్మి, పద్మ, రాధిక, శ్యామల, జ్యోతి, ఉమా, ఇందిరలు పాల్గొన్నారు. ‘పైళ్ల గెలుపు ఖాయం’: భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శివారెడ్డిగూడెంలో వారాల రాంచంద్రారెడ్డి, బొక్క ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హామాలీసంఘం సభ్యులు 35 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరోసారి టీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వారాల అంజిరెడ్డి, వంగాల ధనుంజయ్య, బొడిగె మల్లయ్య, వెంపాల సంజీవరెడ్డి, నారి శ్రీశైలం, పెద్దిరెడ్డి శ్రీను, సంజీవరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేకల దేవేందర్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొక్క మల్లారెడ్డి, ఏర్పుల రమేశ్, మేకల ప్రభాకర్‌రెడ్డి, సరసాని నర్సిరెడ్డి, వారాల వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
అందనంత ఎత్తులో వైద్యం!
సాక్షి, విశాఖపట్నం : కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) చర్మవ్యాధుల విభాగం రోగులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. వృద్ధులు, వికలాంగులు మెట్ల మార్గం ద్వారా రెండంతస్తులు ఎక్కడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలను తల్లులు ఎత్తుకుని అంత ఎత్తు ఎక్కలేకపోతున్నారు. అక్కడ లిఫ్ట్ కూడా లేదు. లిఫ్ట్ ఏర్పాటు చేసే అవకాశమూ లేదు. అలాగే ర్యాంపు కూడా లేదు. దీంతో ఎక్కడెక్కడ నుంచో ఉచిత వైద్యానికి వచ్చే ఈ పేద రోగులు రెండంతస్తులను పడుతూ లేస్తూ ఎక్కుతున్నారు. ఈ చర్మ వ్యాధుల ఓపీకి రోజుకు 150 నుంచి 200 మంది వరకు సగటున నెలకు ఐదు వేల మంది వస్తుంటారు. వీరిలో పది శాతం మంది వయో వృద్ధులు, చిన్నారులే ఉంటున్నారు. వీరు ఒకసారి ఓపీ చూపించుకున్నాక దిగువన ఉన్న మందుల కౌంటరు వద్దకు మందుల కోసం, ఇతర పరీక్షల కోసం రావలసి వస్తోంది. ఒక్కసారి ఎక్కడానికే నానా బాధలు పడుతున్న వీరు రెండోసారి రెండంతస్తులు ఎక్కి దిగడం వారి వల్ల కావడం లేదు. అలా మెట్లెక్కలేని వారు విధిలేని పరిస్థితుల్లో కేజీహెచ్ ఎదురుగాను, పరిసరాల్లోనూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ స్తోమతు కూడా లేని వారు ఓపిక కూడగట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కి వైద్యం అందుకుంటున్నారు. విచిత్రమేమిటంటే కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న చర్మవ్యాధుల ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో కేజీహెచ్‌లో పనిచేస్తున్న కొంతమంది చర్మవ్యాధి వైద్యులవే కావడం విశేషం. కేజీహెచ్ ఓపీకి వెళ్లలేని వారంతా సమీపంలో ఉన్న చర్మ వ్యాధుల ఆస్పత్రుల్లో వైద్యానికి వెళ్తున్నారు. ఇలా రెండో అంతస్తులో చర్మ వ్యాధుల ఓపీ బ్లాక్ ఉండడం పరోక్షంగా ఆ వైద్యులకు బాగా కలిసొస్తోంది. అందువల్లే ఈ కేజీహెచ్ ఓపీ బ్లాక్ ఎంతగా అందుబాటులో లేకపోతే అంతగా వీరికి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ వైద్యులకు హృద్రోగం కేజీహెచ్ చర్మ వ్యాధుల విభాగంలో 14 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు, మరో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ముగ్గురు సీనియర్లలో ఇద్దరు హృద్రోగంతోను, ఒకరు ఆర్థరైటిస్తోనూ బాధపడుతున్నారు. గుండె జబ్బులతో ఉన్న వారు రెండంతస్తుల మెట్లు ఎక్కడం ప్రమాదం కావడంతో వారు దిగువన ఉన్న వార్డుకే పరిమితమవు తున్నారు. ఆర్థరైటిస్ వల్ల మరో మహిళా వైద్యురాలు కూడా ఓపీకి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కొద్దిమందే ఓపీ చూస్తున్నారు. సైకియాట్రీ వార్డుకు మార్చాలి.. ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగువన (గ్రౌండ్ ఫ్లోర్లో) నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న సైకియాట్రీ వార్డును చర్మవ్యాధుల ఓపీకి కేటాయించాలని, లేనిపక్షంలో దిగువనే మరో చోట ఇవ్వాలని ఆ విభాగం వైద్యులు చాన్నాళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ ఆ మార్పు జరగడం లేదు. గత ఏడాది నవంబర్‌లో ఒకసారి, రెండ్రోజుల క్రితం మరొకసారి వీరు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. పరిశీలించి కేటాయిస్తాను.. చర్మవ్యాధుల ఓపీని గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. అయితే ఖాళీగా ఉన్న సైకియాట్రీ వార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినందున ఈ ఓపీకి కేటాయించడానికి వీల్లేదు. చర్మవైద్యుల్లో హృద్రోగంతో ఉన్న వారు ఉన్నారు. వీరి ఇబ్బందులను, రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ ఫ్లోర్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాను. – డా.జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
అభివృద్ధికి నిధులు కేటాయించాలి
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని 13వ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. 13వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్డు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 108 గంటల ధర్నాకు ఆయన మద్ధతు తెలిపి మాట్లాడారు. స్లమ్ ఏరియాలో ఉన్న వార్డుకు అధిక నిధులు కేటాయించాలని, వార్డులోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అభివృద్ధి చెందిన వార్డులకు, అభివృద్ధి చెందని వార్డులకు నిధులు సమానంగా కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వార్డులోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఎఫ్‌సీఐ రోడ్డు, శ్మశానవాటికకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్ హాశం, దండెంపల్లి సత్తయ్య, నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, బోడ ఇస్తారి, పోలె సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ ఎండి.సలీం, ఆళ్ల బసవయ్య, గాదె నర్సింహ, పాక లింగయ్య, నోముల యాదయ్య, శంకర్ పాల్గొన్నారు. -
నిధులిస్తలేరు
కామారెడ్డి టౌన్ : బల్దియాకు తన వార్డునుంచే ఎక్కువ ఆదాయం సమకూరుతున్నా.. సమస్యల పరిష్కారానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆవేదన చెందిన 32వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలు ప్రారంభం కాగానే నిధుల కేటాయింపులో తన వార్డుకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ 32 వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మతో వాగ్వాదానికి దిగారు. 32వ వార్డునుంచి బల్దియాకు ఎల్ఆర్ఎస్ ద్వారా రూ. 2 కోట్ల వరకు నిధులు సమకూరాయని, కానీ వార్డులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు.కౌన్సిలర్లను సంప్రదించకుండానే ఎజెండాను ఇష్టానుసారంగా సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి సమావేశంలో ఆందోళన చేస్తున్నారని, ఇలాగైతే సభనుంచి సస్పెండ్ చేస్తామని చైర్పర్సన్ సుష్మ హెచ్చరించారు. దీంతో కౌన్సిలర్ రామ్మోహన్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులోనుంచి కిరోసిన్ బాటిల్ తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఇతర కౌన్సిలర్లు, అధికారులు అతడిని అడ్డుకుని కిరోసిన్ బాటిల్‌ను లాక్కుని హాల్ బయట పెట్టారు. రామ్మోహన్ మరోసారి బాటిల్ తీసుకుని, చైర్పర్సన్ వద్దకు వచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. సభ్యులు అడ్డుకుని బయటకు తీసుకువెళ్లి, శాంతింపజేశారు. సమావేశం వాయిదా.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యులతో చర్చించి సమావేశం తేదీని ఖరారు చేస్తామని చైర్పర్సన్ తెలిపారు. కౌన్సిలర్‌పై కేసు నమోదు కామారెడ్డిక్రైం: మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆత్మహత్యకు యత్నించిన కౌన్సిలర్ రామ్మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ ఫిర్యాదు మేరకు రామ్మోహన్‌పై ఆత్మహత్యాయత్నంతోపాటు సమావేశానికి అంతరాయం కలిగించడం, న్యూసెన్స్ చేయడం కేసులు నమోదు చేశామన్నారు. పట్టించుకోవడం లేదు.. నా వార్డులో రూ.2 కోట్ల వరకు ఎల్ఆర్ఎస్ నిధులు వచ్చా యి. నిబంధనల ప్రకారం ఇందులో 50 శాతం నిధులు మా వార్డులో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చైర్పర్సన్ దీనిని పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించా. – రామ్మోహన్, 32వ వార్డు కౌన్సిలర్, కామారెడ్డి అత్యధికంగా నిధులు కేటాయించాం.. 32వ వార్డుకు అన్యాయం చేస్తున్నామన్నది వాస్తవం కాదు. పట్టణంలో అన్ని వార్డులకంటే 32వ వార్డుకే ఎక్కువ నిధులు కేటాయించాం. రూ. కోటికిపైగా నిధులిచ్చాం. అయినా ప్రతిసారి రామ్మోహన్ సమావేశాన్ని అడ్డుకుంటున్నారు. – పిప్పిరి సుష్మ, మున్సిపల్ చైర్పర్సన్, కామారెడ్డి -
తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్
కాన్బెర్రా: బౌలర్ల ధాటికి మాత్రమే ఇన్ని రోజులు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించేవారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే ఇందుకు వేదికైంది. మ్యాచ్ ఆరో ఓవర్లో ఫించ్ కోట్టిన షాట్‌కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది. దీంతో చికిత్స కోసం గ్రౌండ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు మాములుగానే ఉన్న జాన్ వార్డ్ మందుస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్‌కు వచ్చారు. ఇదివరకే భారత్‌లో దేశవాలి క్రికెట్ సందర్భంగా అంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్ వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఓ అంపైర్ హెల్మెట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలివలి కాలంలో మైదనంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేఫ్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగానే అంఫైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది. -
కేజీహెచ్‌లో నర్సుల నిర్లక్ష్యం
-
ప్రతి ఓటూ కీలకమే
వెంకటగిరిటౌన్,న్యూస్‌లైన్: పట్టణంలోని 16 వార్డులో కౌన్సిలర్ స్థానానికి జరుగుతున్న పోటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ ప్రధాన పార్టీల మధ్య జరిగే ఈ వార్డులో ఈ ధపా పట్టణంలోనే అత్యధికంగా 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలయిన వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ట్, బీజేపీ, లోక్‌సత్తా అభ్యర్థులతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు ఈ వార్డు బరిలో ఉన్నారు. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు ఈ వార్డు నుంచి తిరిగి పోటీలో ఉన్నారు. తొలుత ఈ వార్డు నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీచేసిన పలువురిని బుజ్జగింజి పోటీ నుంచి విరమింపజేశారు. చివరకు 9 మంది బరిలో ఉండడంతో పట్టణంలో ఈ వార్డు పలితంపై ఆసక్తి నెలకొంది. కాగా 1868 మంది ఓటర్లు ఉన్న ఈ వార్డులో ప్రతి ఓటూ కీలకంగా మారుతుండడంతో వలసలు వెళ్లిన ఓటర్లును పోలింగ్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.