తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్ | Once hit, now wary: Umpire Ward wears helmet in Ind-Aus ODI | Sakshi
Sakshi News home page

తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్

Published Wed, Jan 20 2016 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్

తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్

కాన్బెర్రా: బౌలర్ల ధాటికి మాత్రమే ఇన్ని రోజులు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించేవారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, భారత్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే ఇందుకు వేదికైంది. మ్యాచ్ ఆరో ఓవర్లో ఫించ్ కోట్టిన షాట్కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది. దీంతో చికిత్స కోసం గ్రౌండ్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు మాములుగానే ఉన్న జాన్ వార్డ్ మందుస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్కు వచ్చారు. ఇదివరకే భారత్లో దేశవాలి క్రికెట్ సందర్భంగా అంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్ వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఓ అంపైర్ హెల్మెట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇలివలి కాలంలో మైదనంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేఫ్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగానే అంఫైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement