wears
-
అనంత్ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్ ఫొటోలు
-
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
పూలనే చుట్టేయమంటా...
‘పూలనే కునుకేయమంటా... తను వచ్చెనంటా..’ పాట ‘ఐ’ సినిమాలోనిది. విక్రమ్, అమీ జాక్సన్‌లపై పూల మధ్య సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అదా శర్మ ‘పూలనే చుట్టేయమంటా..’ అంటున్నారు. అనడమే కాదు.. చుట్టుకున్నారు కూడా. పూల మొక్కలనే టాప్లా చేసుకుని, ధరించారామె. ఆ ఫొటోను షేర్ చేశారు అదా శర్మ. ‘ఈ సహజ సిద్ధమైన టాప్ చాలా బాగుంది. మీరు చాలా చాలా బాగున్నారు’ అంటూ అదా అభిమానులు ఆమెకు మెసేజ్ పెట్టారు. ఇలా ప్రత్యేకంగా తయారవ్వడం అదాకు ఇది మొదటిదేం కాదు. సమయం కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారామె. -
బట్టలు ఫుల్.. బిల్లు నిల్..
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. -
రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!
ఫ్రాన్స్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని తొలగించేందుకు 3డీ వర్చువల్ గ్లాసెస్ వినియోగించి.. రోగి స్పృహలో ఉండగానే శస్త్ర చికిత్స నిర్వహించారు. కృత్రిమ ప్రపంచాన్ని రోగికి చూపుతూ.. ఆపరేషన్ సమయంలో మెదడులోని భాగాలను సులభంగా పరీక్షించేందుకు అనుమతించే త్రీడీ అద్దాలను వినియోగించారు. రోగి స్పృహలో ఉన్నపుడే శస్త్ర చికిత్స నిర్వహించడంలో భాగంగా వైద్యులు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని ఏంజిర్ ఆస్పత్రిలో నిర్వహించిన చికిత్స విజయవంతమవ్వడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించేందుకు త్రీడీ గ్లాస్ లు వాడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడు పని తీరును ప్రత్యక్షంగా గుర్తించగలిగినట్లు ఏంజెర్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ ఫిలిప్పీ మెనీ తెలిపారు. కణతి కారణంగా రోగి ఇప్పటికే ఓ కన్ను కోల్పోయాడని, అందుకే దృష్టిని రక్షించేందుకు ప్రత్యేకంగా వినియోగించే ఈ కొత్త టెక్నాలజీని అతడి ఆపరేషన్ కు వాడినట్లు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, కీమో థెరపీ చేయించుకునే ప్రయత్నంలో కూడ ఉన్నాడని చెప్తున్నారు. స్పృహలో ఉండగా రోగికి ఆపరేషన్ చేయడం అనేది సుమారు పదేళ్లుగా జరుగుతోందని, అయితే వర్చువల్ రియాలిటీ అద్దాల వాడకం శస్త్ర చికిత్స సమయంలో వాడటం ఇదే మొదటిసారి అని డాక్టర్ మెనీ తెలిపారు. ఇలా చేయడంవల్ల రోగికి సంబంధించిన మాట, దృష్టి, కదలికలు చికిత్స సమయంలో స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశం ఉందంటున్నారు. పేషెంట్ కు ప్రత్యేక అనుభూతిని కల్గించడంకోసం కాదని, శస్త్ర చికిత్స సులభమవ్వడంకోసమే ఈ అద్దాలు వాడినట్లు వైద్యులు స్సష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మెనీ బృందం... భవిష్యత్తులో మెదడు కణతిల ఆపరేషన్ కు ఇదే విధానాన్ని అమల్లోకి తేనున్నారు. త్వరలో పిల్లల చికిత్సలకు కూడ వచ్చువల్ రియాలిటీ గ్లాసెస్ వినియోగించే యోచనలో ఉన్నారు. -
తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్
కాన్బెర్రా: బౌలర్ల ధాటికి మాత్రమే ఇన్ని రోజులు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించేవారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే ఇందుకు వేదికైంది. మ్యాచ్ ఆరో ఓవర్లో ఫించ్ కోట్టిన షాట్‌కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది. దీంతో చికిత్స కోసం గ్రౌండ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు మాములుగానే ఉన్న జాన్ వార్డ్ మందుస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్‌కు వచ్చారు. ఇదివరకే భారత్‌లో దేశవాలి క్రికెట్ సందర్భంగా అంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్ వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఓ అంపైర్ హెల్మెట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలివలి కాలంలో మైదనంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేఫ్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగానే అంఫైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది. -
మోదీ ఇచ్చిన తలపాగాలో మెరిసిన పాక్ ప్రధాని
లాహోర్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఓ తలపాగా ధరించి.. తన మనవరాలి పెళ్లి విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చిన గులాబీ రంగు రాజస్థానీ తలపాగా ధరించిన షరీఫ్.. పెళ్లి మంటపంలో కనువిందు చేశారు. మోదీ స్వయంగా అందించిన తలపాగాను ధరించడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలనే పాక్ ఆకాంక్షకు నిదర్శనమని పాక్ అధికార ప్రతినిధి తెలిపారు. ఆయనిచ్చిన కానుకను గౌరవించి, శాంతి సామరస్యాల స్థాపనలో తమ దేశ నిబద్ధతను, నిజాయితీని ప్రకటించారని పేర్కొన్నారు. శుక్రవారం తన పర్యటన సందర్భంగా మోదీ, పాక్ ప్రధానికి తలపాగా బహుమతిగా అందించారన్నారు. శనివారం జరిగిన ఈ వివాహ విందుకు షరీఫ్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు, విదేశీ ప్రముఖులు తదితర వీవీఐపీ అతిథులు దాదాపు రెండు వేల మంది విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రధాని మోదీ లాహార్ ఆకస్మిక పర్యటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
సెర్బియా బ్యూటీ చీర సింగారం
ఢిల్లీ : ఆటకే అందం తీసుకొచ్చే భామలు టెన్నిస్ క్రీడాకారిణులు. మెరుపు షాట్లతో అభిమానులను అలరించడంతోపాటుగా అందంలోనూ సూపర్ స్టార్లకు ధీటుగా నిలబడుతున్న భామలు చాలామందే వున్నారు. వారిలో సెర్బియన్ టెన్నిస్ బ్యూటీ అనా ఇవానోవిచ్ ఒకరు. ఇపుడు ఈ బ్యూటీ సాంప్రదాయ భారతీయ చీర కట్టుతో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన ఈ మెరుపు తీగ బంగారు రంగుచీరలో సింగారాలు ఒలకబోస్తూ ఒకఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో లైక్‌లు, షేర్ల వర్షం కురుస్తోంది. భారతీయ సంస్కృతికి ముగ్ధురాలైన ఈ అమ్మడు చీరలో తన అందం ఎంత ఎలివేట్ అవుతుందో చూసుకోవాలనుకుందిట. అందుకే చీర కట్టులో మెరిసి, మురిసిపోయింది. అంతటితో ఆగలేదు... వాటిని ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. కామెంట్ చేయమని ఫ్యాన్స్‌ను కోరింది. ఇక అంతే....ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకుపోయిన ఇవానోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకుంది. తర్వాత ఫామ్ ను కోల్పోయి మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇవనోవిచ్ అద్భుత ఆటతీరుతో ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.