వైరల్‌గా మారిన భారత విద్యార్థిని ఫొటో
మూలాలు మరవలేదంటూ నెటిజన్ల ప్రశంసలు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది. గడ్డ కట్టించే చలిలోనూ వస్త్రధారణలో రాజీ పడలేదు. స్నాతకోత్సవంలో సంప్రదాయ దుస్తులే ధరించింది! స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం చలి వణికిస్తోంది. మైనస్ డిగ్రీలతో సర్వం గడ్డ కట్టుకుపోతోంది. అయినా సరే, లక్ష్మీకుమారి అనే భారతీయ విద్యార్థిని అస్సలు రాజీ పడలేదు.
స్నాతకోత్సవానికి లెహెంగా ధరించి ప్రశంసలు అందుకుంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మైనస్ డిగ్రీల వాతావరణం. బయట ఎటు చూసినా మంచు. ఊహించలేనంతటి చలి! అయినా సరే, లెహంగా ధరించడంలో రాజీపడలేదు’’అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిని సంప్రదాయంతో మేళవించిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతటిప్రతికూల వాతావరణంలోనూ గ్రాడ్యుయేషన్ కోసం సంప్రదాయ దుస్తులు ధరించడం బాగుంది. ఆమె నిజమైన భారతీయురాలు. అంతర్జాతీయ వేదికపై తన మూలాలను ఇంతందంగా చూపించింది’’అంటూ పొగుడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment