సెర్బియా బ్యూటీ చీర సింగారం | serbia tennis beauty ana ivanovic wears indian saree | Sakshi
Sakshi News home page

సెర్బియా బ్యూటీ చీర సింగారం

Published Sat, Dec 12 2015 4:25 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

సెర్బియా బ్యూటీ చీర సింగారం

సెర్బియా బ్యూటీ చీర సింగారం

ఢిల్లీ : ఆటకే అందం తీసుకొచ్చే భామలు టెన్నిస్ క్రీడాకారిణులు. మెరుపు షాట్లతో అభిమానులను అలరించడంతోపాటుగా అందంలోనూ సూపర్ స్టార్లకు ధీటుగా నిలబడుతున్న భామలు చాలామందే వున్నారు.  వారిలో సెర్బియన్ టెన్నిస్ బ్యూటీ అనా ఇవానోవిచ్ ఒకరు. ఇపుడు ఈ బ్యూటీ సాంప్రదాయ భారతీయ చీర కట్టుతో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన ఈ మెరుపు తీగ బంగారు రంగుచీరలో సింగారాలు ఒలకబోస్తూ ఒకఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో లైక్‌లు, షేర్ల వర్షం కురుస్తోంది.


భారతీయ సంస్కృతికి ముగ్ధురాలైన ఈ అమ్మడు చీరలో తన అందం ఎంత ఎలివేట్ అవుతుందో  చూసుకోవాలనుకుందిట. అందుకే  చీర కట్టులో మెరిసి, మురిసిపోయింది. అంతటితో ఆగలేదు... వాటిని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసింది. కామెంట్ చేయమని ఫ్యాన్స్‌ను కోరింది. ఇక అంతే....ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకుపోయిన ఇవానోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకుంది. తర్వాత ఫామ్ ను కోల్పోయి మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇవనోవిచ్ అద్భుత ఆటతీరుతో ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement