భారత చీరలంటే తనకిష్టమంటూ చీరను ప్రదర్శిస్తున్న హసీనా
భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమం
మద్దతిస్తున్న విపక్ష బీఎన్‌పీ
ఉద్యమాన్ని తప్పుబడుతున్న ప్రధాని హసీనా
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్‌లో కొంతకాలంగా వంటనూనె, ప్రాసెస్ట్ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె ఆవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు అభివరి్ణస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీసు ఎదురుగా వాళ్లు భార్యల చీరలకు ఎందుకు నిప్పుపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. బీఎన్‌పీ నేతలు, వారి భార్యలు భారత్‌లో చీరలు కొనుక్కొచి్చ, బంగ్లాదేశ్‌లో అమ్ముకుంటున్నారన్నారు. ‘గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. బీఎన్‌పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా?’అని హసీనా నిలదీశారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని అన్నారు.
ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తోందని హసీనా అన్నారు. భారత వ్యతిరేక ఆన్‌లైన్ ప్రచారం యూరప్, అమెరికాల్లో ఉన్న బంగ్లాదేశీయులతో ముందుగా మొదలైంది. పారిస్‌లో ఉంటున్న పినాకీ భట్టాచార్య భాయ్‌కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు ఇందులో లేరు. తర్వాత్తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వారూ ఈ ప్రచారంలో తోడయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment