‘పైళ్ల’ను అధిక మెజార్టీతో గెలిపించాలి | TRS Mla P. sheker Reddy Canvass In Bhongir | Sakshi
Sakshi News home page

‘పైళ్ల’ను అధిక మెజార్టీతో గెలిపించాలి

Published Tue, Nov 13 2018 8:54 AM | Last Updated on Tue, Nov 13 2018 12:33 PM

TRS Mla P. sheker Reddy Canvass In Bhongir - Sakshi

భూదాన్‌పోచంపల్లి : కండువా కప్పి ఆహ్వానిస్తున్న మల్లారెడ్డి

సాక్షి,భువనగిరిటౌన్‌ : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  పైళ్ల శేఖర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని 28వ వార్డులో కిసాన్‌నగర్‌లో ఎన్నికల  ప్రచారం నిర్వహించారు.   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పట్టణ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, అమ్జద్‌అలీ,  పద్మ, జైయిని రవిందర్‌గుప్తా, సరగడ కరణ్, రవి, స్వప్న, బ్రహ్మచారి, రమేష్‌పాల్గొన్నారు.
మహిళా విభాగం ఆధ్వర్యంలో..
టీఆర్‌ఎస్‌ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కోకన్వీనర్‌ ఆకుల జయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ, కె.యాదమ్మ, శిరీష, నర్మద, జయలక్ష్మి, పద్మ, రాధిక, శ్యామల, జ్యోతి, ఉమా, ఇందిరలు పాల్గొన్నారు.  


 

‘పైళ్ల గెలుపు ఖాయం’:
భూదాన్‌పోచంపల్లి :  వచ్చే ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శివారెడ్డిగూడెంలో వారాల రాంచంద్రారెడ్డి, బొక్క ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హామాలీసంఘం సభ్యులు 35 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలను కప్పి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వారాల అంజిరెడ్డి, వంగాల ధనుంజయ్య, బొడిగె మల్లయ్య, వెంపాల సంజీవరెడ్డి, నారి శ్రీశైలం, పెద్దిరెడ్డి శ్రీను, సంజీవరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేకల దేవేందర్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొక్క మల్లారెడ్డి, ఏర్పుల రమేశ్, మేకల ప్రభాకర్‌రెడ్డి, సరసాని నర్సిరెడ్డి, వారాల వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement