ప్రచారం నిర్వహిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
సాక్షి,భువనగిరిటౌన్ : కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలో ప్రిన్స్‌కార్నర్ వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ఎక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్పా టీఆర్‌ఎస్ పార్టీ ఏమి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజలు అభివృద్ధి సాధిస్తారన్నారు. మహాకూటమి నియోకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, వాటిని అనుబంధ సంఘాలు, మహాకూటమి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో పలు వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహాగీర్, బీసుకుంట్ల సత్యనారాయణ, బుద్దుల సత్యనారాయణ, ముచ్యాల మనోజ్, పున్న కైలాష్, మహ్మద్ మజహర్, కొల్లోజు సతీష్‌కుమార్, దం డు నరేష్, ఎజాజ్, ఎడమ పవన్, గిరిశ్, ఇమ్రాన్, అ చ్చాలు, శోభన్‌బాబు, అ ఫ్రోజ్, సమీర్, కళ్యాణ్, అజర్‌లు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలో 22, 23, 24, 25 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్‌గుప్తా, తాడూరి భిక్షపతి, దూసరి చంద్రశేఖర్‌గౌడ్, రవిలు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎర్ర రమేష్, మారగోని నాగరాజు, నాగరాజు, శ్రీకాంత్, పసుపూరి శ్రీహరిలు పాల్గొన్నారు.
వలిగొండ : భువనగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు సోమవారం యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో రోడ్‌షోతో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, మహాకూటమి నాయకులు గరిసె రవి, కుంభం విద్యాసాగర్‌రెడ్డి, వెంకట్‌పాపిరెడ్డి, కొండూరు వెంకటేశం, బోడ సుదర్శన్, గూడూరు జంగారెడ్డి, సయిద్, కాసుల వెంకన్న, కొండూరు సాయి, బోళ్ల శ్రీనివాస్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, పుల్లగూర్ల జంగారెడ్డి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment