చంద్రబాబు తెలంగాణకు అవసరమా..? : పైళ్ల శేఖర్‌ రెడ్డి | TRS Candidate P Shekar Reddy Canvass In Bhongiri | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తెలంగాణకు అవసరమా..? : పైళ్ల శేఖర్‌ రెడ్డి

Published Mon, Dec 3 2018 11:14 AM | Last Updated on Mon, Dec 3 2018 11:14 AM

TRS Candidate P Shekar Reddy Canvass In Bhongiri - Sakshi

ప్రచారంలో మాట్లాడుతున్న శేఖర్‌రెడ్డి

సాక్షి, వలిగొండ (భువనగిరి) : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రబాబు తెలంగాణకు అవసరమా అని టీఆర్‌ఎస్‌ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పహిల్వాన్‌పురం, రెడ్లరేపాక, కంచనపల్లి, పులిగిల్ల, కేర్చుపల్లి, మొగిలిపాక, తుర్కపల్లి, గోపరాజుపల్లి, చిత్తాపురం, ముద్దాపురం, వెంకటాపురం, గుర్నాథ్‌పల్లి, అరూరు, జంగారెడ్డిపల్లి, నర్సాయిగూడెం గ్రామాల్లో తనను గెలిపిం చాలని ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు బతుకమ్మలు, పీర్లతో ప్రజ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో బతుకులు ఆగమయ్యాయని అన్నారు. మహాకూటమికి ఓటేస్తే అమరావతికి వేసినట్లేనని చెప్పారు.

కాంగ్రెస్‌ ఎప్పుడైనా 24 గంటల విద్యుత్‌ ఇచ్చిందా అని ప్రశ్నించా రు. బస్వాపురం రిజర్వాయర్‌తో సాగు నీటి కష్టాలు దూరంకానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎలిమి నేటి సందీప్‌రెడ్డి, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, అందెల లింగంయాదవ్, ఎంపీ పీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీని వాస్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బద్ధం భాస్కర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ పనుమటి మమతనరేందర్‌రెడ్డి, మార్కెట్, ఆత్మ చైర్మన్లు మారగోని జంగాలుగౌడ్, గంగధారి రాములు, నాయకులు పబ్బు ఉపేందర్, కొమిరెల్లి సంజీరెడ్డి, గూడూరు యాదిరెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, మాద శంకర్, కొనపూరి కవిత, వనగంటి మాధవి, రఘునాథం, గూడూరు నర్సింహారెడ్డి, గంగినేని హరినాథ్, డేగల పాండరి, కిరణ్‌రెడ్డి, చిట్టెడి జనార్దన్‌రెడ్డి, వెంకన్న, శ్రీధర్‌రెడ్డి, శివశాంతరెడ్డి, సంగిశెట్టి క్రిష్టఫర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

కంచనపల్లిలో పార్టీలో చేరిన వారితో పైళ్ల శేఖర్‌రెడ్డి

2
2/2

ప్రచారానికి హాజరైన ప్రజానీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement