CM Jagan Review Meeting On Village And Ward Secretariats - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్‌

Published Wed, Jan 4 2023 2:56 PM | Last Updated on Thu, Jan 5 2023 7:59 AM

CM Jagan Review Meeting On Village And Ward Secretariats - Sakshi

పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. చివరి స్థాయి వరకు సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా  ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఈ వ్యవస్థలో అర్జీలను త్వరితగతిన పరిష్కరించడం చాలా ముఖ్యం. ఇది మరింత మెరుగ్గా జరగాలంటే సచివాలయాల సిబ్బంది పనితీరుపై మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై  సచివాలయాల ఉద్యోగులందరికీ  అవగాహన కలిగించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకేసారి దాదాపు 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మంజూరు చేయడంతో పాటు, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వాటిని భర్తీ చేయడం తెలిసిందే. తొలి విడతలో భర్తీ కాని పోస్టులకు వరుసగా రెండో ఏడాది నియామక ప్రక్రియ చేపట్టడమూ విదితమే. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలకు సంబంధించి బుధవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమయంలో సచివాలయాల్లో ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను  భర్తీ చేయండి. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది. ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టాలి’ అని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అర్జీల పరిష్కారమన్నది చాలా ముఖ్యమని, వాటి పరిష్కారంలో స్పష్టత ఉండాలని సీఎం చెప్పారు. ఒకే అర్జీ మళ్లీ వచి్చనప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు ఆపై వ్యవస్థ పరిశీలన ద్వారా దానిని పరిష్కరించేలా చర్యలు ఉండాలన్నారు. అర్జీకి సంబంధించిన సమాచారం రీ వెరిఫికేషన్‌ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అనేది ప్రధానం అని చెప్పారు. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పని చేయగలుగుతాయని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
పర్యవేక్షణ కోసం ఎస్‌వోపీ 
– గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనుకున్న లక్ష్యాల మేరకు సమర్థవంతంగా పని చేయాలంటే.. ప్రతి ఒక్క ఉద్యోగి ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలన్న దానిపై సరైన ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) ఉండాలి. దీంతో పాటు పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఇది లేకపోతే ప్రయోజనం ఉండదు. 
– సిబ్బంది హాజరు దగ్గర నుంచి వారు ప్రజలకు అందుబాటులో ఉండటం వరకు అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిర్వహించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్‌వోపీలు ఉండాలి. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి అధికారి ఓనర్‌íÙప్‌ తీసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.  
 
ప్రతి నెలా 2 సచివాలయాలు సందర్శన   
– ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారు. వారి సేవలు ప్రజలకు అందాలి. ప్రతి ప్రభుత్వ విభాగంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌తో కూడిన హాజరును అమలు చేయాలి. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలైతే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారు.  
– దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టి పెడతారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ స్థాయి సచివాలయం వరకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలి. 
 
సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో ఏపీ నంబర్‌ వన్‌ కావాలి  
– సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో మన రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థాయిలో నిలవాలి. ఈ విషయమై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలం. గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలం. లేదంటే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదు. 
– సచివాలయాల్లో టెక్నాలజీ పరంగా.. సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదు.   నిరంతరం టెక్నాలజీని అప్‌డేట్‌ చేయాలి. సిబ్బందినీ అప్‌డేట్‌గా ఉంచాలి. అన్ని సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం 2,909 గ్రామ సచివాలయాలు వైర్‌లెస్‌ ఇంటర్‌నెట్‌తో నడుస్తున్నాయి. వాటిని వైర్డు ఇంటర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలి. గ్రామంలోని ఆర్బీకేలకు కూడా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి. అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలి. 
– ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ల్యాండ్‌ అడ్మిని్రస్టేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, కమిషనర్‌ షన్‌ మోహన్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.  

 చదవండి: ‘మనకు ఇదేం ఖర్మరా బాబూ’.. కుప్పం హడల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement