venkatagiri
-
ప్రభుత్వ స్కూల్లో టీచర్ కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
-
తిరుపతి : పోలేరమ్మ నగరోత్సవం..కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా వెంకటగిరి లో పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఆగని పచ్చమూకల బరితెగింపు..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ నేత తంగా పేచీరాజ్‌పై దాడి చేశారు. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ నేతలు దాడి చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దివ్యాంగుడిపై టీడీపీ కార్యకర్తల దాడి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, దివ్యాంగుడైన జువ్వాది అశోక్‌బాబుపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. తీవ్రంగా గాయపడిన అశోక్‌బాబు ఆస్పత్రి నుంచి ఇంటికి వచి్చన తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బాలరాంరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గణపవరం శాంతినగర్‌కు చెందిన అశోక్‌బాబు నూరుశాతం దివ్యాంగుడు. వీల్‌చైర్‌కే పరిమితం. ఈ నెల ఒకటో తేదీన పింఛను రూ.6 వేలు టీడీపీ నాయకులు అందించారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్‌పై అశోక్ ఇంటి వద్దకు వచ్చారు. వీల్‌చైర్‌లో ఇంటి గుమ్మం వద్ద అశోక్ తలమీద బీరుసీసాతో కొట్టి పరారయ్యారు.తలకు తీవ్రగాయమైన అతడిని స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోక్‌బాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై జరిగిన దాడి గురించి అశోక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గతంలో కూడా తనపై రెండుసార్లు దాడి జరిగిందని, ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ కార్యకర్తలు తమ ఇంట్లోకి బీరుసీసాలు విసిరేశారని అశోక్ తెలిపారు. రాజకీయ కక్షతో నా కుమారుడిపై హత్యాయత్నందెందులూరు(ఏలూరు జిల్లా): రాజకీయ కక్ష పెట్టుకున్న వ్యక్తులు 24 మంది మారణాయుధాలతో తన కుమారుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని)పై హత్యాయత్నానికి తెగబడ్డారని, వారిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ కామిరెడ్డి ఆనంద్‌బాబు, కామిరెడ్డి జలజాక్షి.. జిల్లా అడిషనల్ ఎస్పీ స్వరూపారాణికి ఫిర్యాదు చేశారు.మంగళవారం ఏలూరు ఎస్పీ కార్యాలయంలో ఈ అంశాలను మీడియాకు వివరించారు. ఈ నెల 7న శ్రీరామవరంలోని తన ఇంట్లోకి 24 మందితో పాటు మరికొంత మంది అక్రమంగా ప్రవేశించారని, తన కుమారుడు వైఎస్సార్సీపీ దెందులూరు మండల అధ్యక్షుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని) ఇంట్లో ఉండటాన్ని గమనించి తన కుమారుడిని చంపాలనే ఉద్దేశంతో మారణాయుధాలతో వచ్చారని వివరించారు. వారు తనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని చెప్పారు.తన కుమారుడు వెనుక వైపునకు వెళ్లి ఒక గదిలో తలుపు వేసుకుని ఉండగా గదిని పగులగొట్టి తన కుమారుడిని చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు రాగా రాత్రి ఒంటి గంట సమయంలో వారంతా వెళ్లిపోయారన్నారు. ఎప్పటికైనా చంపేస్తామని బెదిరించారని చెప్పారు. తన కుటుంబసభ్యులను కూడా దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేసి చోడవరపు లక్ష్మణరావు అనే వ్యక్తిని కూడా గాయపరిచారన్నారు. తమ ఇంట్లో పోస్టాఫీస్ ఫరి్నచర్, తన ఇంటి అద్దాలు, కురీ్చలు, తన కుమారుడి కార్యాలయం ధ్వంసం చేశారని తెలిపారు. తన కుమారుడిపై హత్యాయత్నం చేసిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుమారుడికి, తమ కుటుంబానికి భద్రత కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుతో పాటు ఫొటోలు, సీడీలు ఎస్పీకి జతపరిచినట్లు తెలిపారు. -
సీఎం జగన్ ప్రసంగం.. దద్దరిల్లిన వెంకటగిరి (ఫొటోలు)
-
చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఉందా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు -
చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఉందా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు -
వెంకటగిరి టీడీపీలో టికెట్ రగడ
-
వెంకటగిరిలో నేడు 1,008 టిడ్కో గృహాల ప్రారంభోత్సవం
-
వేంకటగిరిలో సామాజిక సాధికార యాత్ర
-
‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్ ఇండియా ఒన్ ప్రొడెక్ట్ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్లను పరిశీలించారు. కేంద్ర బృందానికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద జందాని ట్రెడిషన్ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్లపై ఆరాతీశారు. వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్ సన్స్ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు. -
వెంకటగిరికి జాతీయ ఖ్యాతి
తిరుపతి అర్బన్: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి వస్త్రాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. వెండి జరీ, ఆఫ్‌ఫైన్ జరీలను అమర్చి ప్రత్యేక శైలిలో చీరలు నేయడం ద్వారా ఇక్కడి చేనేత పరిశ్రమ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందింది. వెంకటగిరి చీరలను 17వ శతాబ్దంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. చీరకు రెండు వైపులా ఒకే డిజైన్ కనిపించే జాందనీ వర్క్‌తో నేయడంతోపాటు కాటన్ చీరలు చుట్టూ చంగావి రంగు చీరల తయారీకి వెంకటగిరి ప్రసిద్ధి. ఇక్కడ 22 సంఘాలు, 660 మంది సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనల్లో, ఆప్కో వస్త్రాలయాల్లో ఈ చీరలకు మంచి డిమాండ్ ఉంది. చీరల తయారీ విధానం ఇలా వెంకటగిరి చేనేత కార్మికులు చీరల తయారీలో క్రమపద్ధతి పాటిస్తుంటారు. ప్రధానంగా హాంక్ (చిలప) రూపంలో పత్తి, వెండి, బంగారు జరీలు, నాప్తాల్తోపాటు పత్తి శుద్ధీకరణ చేస్తారు. మరోవైపు హాంక్ కాటన్‌ను ఉడకబెట్టి, రాత్రంతా నానబెట్టి, కడిగి, రంగులు అద్దుతారు. అంతేకాకుండా తెల్ల చీరలకు బ్లీచింగ్ టెక్నిక్‌ని వాడడం, మానవ మూలకం, గ్రాఫ్ పేపర్ డిజైన్‌తోపాటు నేసిన వాటిలో లోపాలను సరిచేయడానికి మాస్టర్ వీవర్ ద్వారా తనిఖీ చేపట్టి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడం వీరి ప్రత్యేకత. వెంకటగిరికి ఢిల్లీ బృందం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఇన్వెస్ట్ ఇండియా కమిటీ పర్యవేక్షణలో చేతివృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యత సాధించడంతోపాటు గుర్తింపు పొందిన రంగాలకు ఈ ఏడాది నుంచి జాతీయస్థాయి అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన రాష్ట్రం నుంచి 12 రంగాలను ఎంపిక చేశారు. అందులో ముందు వరుసలో వెంకటగిరి చేనేత పరిశ్రమను జాతీయ అవార్డు పోటీలకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ ఇండియా కమిటీ ప్రతినిధి జిగీష తివారీ మిశ్రా నేతృత్వంలో ఓ బృందం ఈనెల 17వ తేదీ (మంగళవారం) వెంకటగిరిలో పర్యటించనుంది. వస్త్రాల నాణ్యతా, ప్రమాణాలపై నివేదిక రూపొందించనుంది. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు(17405) ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఏసీ కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.అనంతం రైల్వే కోపైలట్, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ యథావిధిగా బయల్దేరింది. సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో ప్రమాదం తప్పింది. -
డప్పు కొట్టి చెబుతున్నా!
రాజులేలిన గడ్డపై జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది. భక్తులు, స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వెంకటగిరి రాజాల ఆకాంక్షను నెరవేర్చింది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని సంకల్పించింది. ఈమేరకు నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాది కొకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. వెంకటగిరి సంస్థాన రాజులు ఏలుతున్న రోజులవి. 1917లో వెంకటగిరిలో కలరా మహమ్మారి వందలాది మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో వెంకటగిరి సంస్థానాధీశులు భారీ ఎత్తున శీతలయాగం నిర్వహించారు. మరోవైపు వెంకటగిరి నలువైపులా పొలిమేరలో గ్రామశిలలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా జాతర నిర్వహించారు. అప్పటి నుంచి వెంకటగిరి జాతర జరుగుతూనే వస్తోంది. వెంకటగిరి సంస్థానాధీశుల ఆధీనంలో జరుగుతున్న పోలేరమ్మజాతర 1992 నుంచి దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అరుదైన వేదిక వెంకటగిరి పోలేరమ్మజాతర నిమ్నవర్గాలతోపాటు జానపద కళారూపాల ప్రదర్శనకు అరుదైన వేదికగా నిలుస్తోంది. మతాలకు అతీతంగా వెంకటగిరీయులు నిర్వహించుకుంటారు. ఈ జాతరలో నిమ్నవర్గాలకు చెందిన వ్యక్తులు ముందుండి జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ జాతరకు దేశవిదేశాల్లో ఉన్న వెంకటగిరీయులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా పోలేరమ్మతల్లి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. నెరవేరిన కల వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహించాలనే స్థానికుల కల నెరవేరింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నేతన్ననేస్తం ఐదో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలేరమ్మ జాతరను వెంకటగిరీయుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు జీవో విడుదల చేస్తామని ప్రటించారు. -
వెంకటగిగిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం.. జగనన్నకు జనం జేజేలు (ఫొటోలు)
-
నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్.. సీఎం జగన్ సెటైర్లు
-
చేనేత చేయి పట్టుకొని నడిపిస్తా
-
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైయస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం (ఫొటోలు)
-
సీఎం జగన్ రాకతో.. దద్దరిల్లిన వెంకటగిరి సభ!
-
వెంకటగిరిలో సీఎం జగన్ సభ.. ఇసుకేస్తే రాలనంత జనం
-
వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం
-
నేతకు జీవం పోశాం
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో నేతన్నకు తోడుగా నిలిచి, అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేతకు, ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. ఇంతకు ముందు లేని విధంగా అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వ్రస్తాలను అమ్మే ఏర్పాటు చేశామని, తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నల ఖాతాల్లో రూ.193.64 కోట్లు నేరుగా జమ చేశారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ ఏడాది కూడా రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేల వెంకటగిరి అని చెప్పారు. అలాంటి ఈ గడ్డపై నుంచి ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆరి్థకంగా, రాజకీయంగా, విద్యా పరంగా, మహిళా సాధికారత పరంగా అన్ని విధాలా మేలు చేయడంలో.. అంబేడ్కర్, పూలే భావజాలాన్ని అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బీసీలు బ్యాక్ బోన్ క్లాసులు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని ఎన్నికల వేళ చెప్పాను. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఈ నాలుగేళ్లలో ప్రతి పనిలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపించే విధంగా అడుగులు వేశాను. ఈ కోవలోనే నవరత్నాలు తీసుకు వచ్చాను. నేతన్న నేస్తం తీసుకొచ్చాను. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ఏటా రూ.24 వేల చొప్పున వరుసగా ఇస్తూ పోతున్నా. ఇలా ఐదు విడతలుగా రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టాం. 80,686 మంది చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకి మేలు జరిగేలా ఇవాళ రూ.194 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఐదు దఫాలుగా రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం కూడా చేయలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఇకపై అలా జరగకుండా నవరత్నాలు తీసుకొచ్చాం. హామీలు గాలికొదిలేసిన గత ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గెలిచాక గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్లో రూ.1000 కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కారి్మకులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా ఎన్నో హామీలిచ్చి చివరకు చేనేతలను మోసం చేశారు. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామన్న వారు ఐదేళ్లకు కలిపి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మన ప్రభుత్వంలో ఆ పరిస్థితి మార్చేశాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు చెప్పిన మాట నెరవేరుస్తూ 2019 డిసెంబర్ 21న నా పుట్టిన రోజునాడు వైఎస్సార్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరుసగా ఐదో దఫా సహాయం చేశాం. సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,396 కోట్లు, నవరత్నాల్లో ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టాం. బకాయిలతో కలిపి ఆప్కోకు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు.. మొత్తంగా రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేయగలిగాం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి రూ.450 కోట్లు ఎక్కడ? మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లో రూ.3,706 కోట్లు ఎక్కడ? ఒక్కసారి మీరే ఆలోచించండి. వెంకటగిరికి వరాలు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే రామ్‌కుమార్‌రెడ్డి నిధులు అడిగారు. ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి చూశాం. రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ ఎస్టిమేషన్ తయారుచేయిస్తే రూ.553 కోట్లు అవుతుందన్నారు. ఇందుకు అనుమతులు మంజూరు చేస్తాను. 6 మండలాల్లో డ్రెయిన్లు, సీసీరోడ్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నా. మున్సిపాలిటీలో డ్రెయిన్లు, సీసీరోడ్లకు సంబంధించి ప్రతి గడపకూ తిరగమని రామ్‌కు చెబుతున్నాను. ఒక్కోసచివాలయానికి రూ.50 లక్షలు కేటాయిస్తాం. వెంకటగిరికి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించిన నిధులూ మంజూరు చేస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ గురుకుల స్కూల్ మంజూరు చేస్తున్నా. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నా. జాతర ఇవాళే వచ్చినట్లయ్యింది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేత పనులు గిట్టుబాటు కాక చేనేత కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మీరొచ్చాక (సీఎం జగన్) వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఆ పరిస్థితులు మారిపోయాయి. నవరత్నాల పథకాల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. నా భర్తకు కిడ్నీలో రాళ్లు వస్తే రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాం. పిల్లలకు స్కూల్లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. మీ (సీఎం) పుణ్య మా అని టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. సీఎం జగనన్న మేలు ఎప్పటికీ మరచిపోం. రెండు నెలల తర్వాత వచ్చే వెంకటగిరి జాతర.. ఇవాళే వచ్చినంత ఆనందంగా ఉంది. – సోమా విజయలక్ష్మి, చేనేత కార్మికురాలు, వెంకటగిరి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు వెంకటగిరిలో పర్యటించనున్న సీఎం వై ఎస్ జగన్
-
అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..?
ఆ నియోజకవర్గ టీడీపీలో చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో టికెట్ నీకే అంటూ ఆ ఇద్దరి నేతలని ఆయన మభ్యపెడుతున్నారా? గత ఎన్నికల్లో ఆ నియోజక వర్గంలో టీడీపీ గల్లంతు అయినా.. చంద్రబాబు వ్యవహార శైలి మారకపోవడంపై అక్కడి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజక వర్గం..? ఆ ఇద్దరు నేతలు ఎవరు..? గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘోరంగా ఓడిపోయారు.ఓటమిని జీర్ణించుకోలేని కురుగొండ్ల రామకృష్ణ తట్టా బుట్టా సర్దుకుని చెన్నైకు వెళ్ళిపోయారు. దీంతో టీడీపీ క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు.. మరో బీసీ నేత మస్తాన్ యాదవ్ ఎవరికివారే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తమకే మాట ఇచ్చారని ఇద్దరు నేతలూ చెప్పుకుంటున్నారు. 2009.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరవున పోటీచేసి గెలుపొందారు కురుగొండ్ల రామకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చెన్నైలో వ్యాపారాలపై దృష్టి పెట్టారు కురుగొండ్ల. సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్ కలుస్తున్నారు. కురుగొండ్లకు టికెట్ ఇస్తే.. వెంకటగిరిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గంవారు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, ఎర్రచందనం అక్రమ రవాణా, తనకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై విరుచుకుపడటంలాంటి కురుగొండ్ల వ్యవహార శైలిని వ్యతిరేకవర్గంవారు ప్రస్తావిస్తున్నారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలలో ఏకంగా కలెక్టర్‌పైనే దాడికి ప్రయత్నించడం.. మైకు విసిరేసి..ఎన్నికలకు సంబంధించిన పత్రాలను చించేయడం లాంటి వ్యవహారాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నారనీ వ్యతిరేక వర్గం నేతలు చెబుతున్నారు. పార్టీ కంటే సొంతప్రయోజనాల కే కురుగొండ్ల ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు అంత సులువుకాదని చాలామంది నేతలు.. టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట.రామకృష్ణకు టికెట్ వచ్చే అవకాశం లేదని.. కొత్త అభ్యర్థిని రంగం లోకి దించుతామని అధిష్టానమే చెప్పిందని కురుగొండ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు.. హైదరాబాదులో డాక్టర్‌గా ఉన్న మస్తాన్ యాదవ్ ఈసారి వెంకటగిరి నుంచి ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారట. చదవండి: బాబు, పవన్‌లపై లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వెంకటగిరికి స్థానికుడు కావడం.. తనకు అవకాశం ఇప్పించాలని.. హై రికమెండేషన్‌తో చంద్రబాబు ను సైతం కలిశారట మస్తాన్ యాదవ్. ‘‘తమ్ముడూ.. గో హెడ్ అని’’ చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్టు మస్తాన్ యాదవ్ తన అనుచరులు దగ్గర చెప్పుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నిస్తేజంగా మారింది. దీనికితోడు రామకృష్ణ, మస్తాన్ యాదవ్ మధ్య మరింత అగాథాన్ని పెంచింది చంద్రబాబేనని టీడీపీ క్యాడరే చర్చించుకుంటోంది. టికెట్‌పై చంద్రబాబు హామీ ఇచ్చారని ఇద్దరు నేతలు బహిరంగంగా చెప్పుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిందంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడంపై కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టిక్కెట్ గనక మరోసారి కురుగొండ్లకిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని.. అలా కాదని కొత్తవారికి అవకాశమిస్తే క్యాడర్ మొత్తం వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబు రాజకీయం వెంకటగిరి టీడీపీలో రచ్చ రచ్చగా మారింది. చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆగ్రహం
-
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన
సాక్షి, తిరుపతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లకు నల్ల జెండాలు కట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. వెంకటగిరిలోని కైవల్యా నదిలో నిమజ్జనం చేశాయి. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని రాంప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. చదవండి: ‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’ -
వెంకటగిరి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు విభాగాల్లో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జనార్ధన్‌నాయుడు నేతృత్వంలో ఐదుగురు సీఐలు, 15 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 14400 కు ఫిర్యాదుతోనే తనిఖీలు.. వెంకటగిరి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) విభాగంపై 14400, వెబ్సైట్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము తనిఖీలు నిర్వహించినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. ఆదరణ పథకం లబ్ధిదారుల వద్ద కట్టించుకున్న నగదులో రికార్డ్ అసిస్టెంట్ పెంచలయ్య వద్ద రూ.14,000 తక్కువగా ఉన్నట్లు, పన్నులు వసూళ్లకు సంబంధించి ఉండాల్సిన నగదులో రూ.25,000 తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. పలు విభాగాల్లోని అధికారుల వద్ద అనధికారికంగా మరో రూ.45,000 నగదు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. -
వెంకటగిరి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
-
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు) -
ఘోర రోడ్డు ప్రమాదం.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ మృతి
సాక్షి, తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మర్రిగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు(45) మృతి చెందారు. ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం -
తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర (ఫొటోలు)
-
బండరాయిపై భోజనం
-
ఉన్మాదం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు
సాక్షి, నెల్లూరు: వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటర్ విద్యార్థి చిగురుపాటి జ్యోతికను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ వర్క్‌ఫ్రమ్ హోమ్.. ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాత బకాయి అడిగినందుకు... అనుమసముద్రంపేట: మద్యం మత్తులో తనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడని హసనాపురానికి చెందిన సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాషిణి హసనాపురం సెంటర్లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం శ్రీకొలనుకు చెందిన గడ్డం విజయ్‌కుమార్ మరో ముగ్గురితో కలిసి మద్యం సేవించేందుకు కూల్‌డ్రింక్ షాపు వద్దకు రాగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పాత బకాయి సైతం చెల్లించాలని కోరడంతో ఇద్దరి నడుమ వాగి్వవాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విజయ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్‌పేట పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు. -
కుమార్తెపై ఆరు నెలలుగా అత్యాచారం
వెంకటగిరి: తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. తర్వాత వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం కలిగిన మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ మహిళ, తన ఇద్దరు బిడ్డలు, అంజయ్యతో కలిసి ఉంటోంది. ఆమె కుమార్తెపై కన్నేసిన ఈ కామాంధుడు గత 6 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు. గమనించిన పదేళ్ల కుమారుడు కేకలు వేయగా స్థానికులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది. అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు మునేశ్వరి, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, వలంటీర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటరాజేష్ విచారించి కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి బాధితుల నివాసం వద్దకు స్వయంగా చేరుకొని ఘటనపై ఆరా తీశారు. -
వీడిన మిస్టరీ: శ్రీదేవితో సుప్రియ వివాహం.. భర్త వేధించడంతో
సాక్షి, వెంకటగిరి: మండలంలోని కేజీపల్లి దళితవాడకు చెందిన వివాహితలు పీ విజయ, పీ సుప్రియ తమ ముగ్గురు చిన్నారులతో కలిసి ఈ నెల 16న అదృశ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారిని గురువారం రాత్రి హైదరాబాద్‌లో గుర్తించినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వేరుగా బతికేందుకు తమ పరిచయస్తుల ద్వారా కూకట్పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయకాలనీకి చేరుకున్నారు. వీరిని గుర్తించి సోమవారం వెంకటగిరికి తీసుకొచ్చి ఇన్చార్జి తహసీల్దార్ ఆదిశేషయ్య వద్ద హాజరుపరిచినట్లు వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యం కావడం జిల్లాలో సంచలనంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గాలింపు చర్యలను వేగవంతం చేయించారు. స్వతహాగా బతకాలని.. అదృశ్యమైన మహిళలు పీ విజయ, సుప్రియ తోడుకోడళ్లు. వీరిలో పెద్ద కోడలు విజయకు కృష్ణయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవ పడేవారు. చిన్నకోడలు సుప్రజకు కృష్ణయ్య సోదరుడు సుధాకర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే సుప్రియ వివాహానికి ముందు నెల్లూరులో నివాసం ఉండే సమయంలో ఓ వృద్ధ దంపతుల ఇంట్లో పనిచేసేది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న శ్రీదేవి (ట్రాన్స్‌జెండర్) సిద్దూ అనే పేరుతో పురుషుడి మాదిరి వస్త్రధారణ, ప్రవర్తన ఉండడంతో సుప్రియ ప్రేమించి రహస్య వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసి సుప్రియకు సైతం భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. (ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం) దీంతో సుప్రియ తన తోడుకోడలు విజయతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వేరుగా బతకాలని నిర్ణయించుకుని శ్రీదేవి అలియాస్ సిద్దూ సహయంతో పిల్లల ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటి నుంచి జీకేపల్లి ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే శ్రీదేవి అలియాస్ సిద్దూ గూడూరు నుంచి అద్దెకు తీసుకొచ్చిన కారులో శ్రీకాళహస్తి, అక్కడి నుంచి మరో కారులో విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో చేరుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీరిని తిరిగి వెంకటగిరి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కేసును ఛేదించిన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సైలు కామినేని గోపి, వెంకటరాజేష్, అనూష, తదితరులను అభినందించారు. -
మిస్సింగ్ కలకలం: ఆ ఐదుగురు ఎక్కడ?
సాక్షి, నెల్లూరు: జిల్లాలో మహిళలు, చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంకటగిరి మండలం జీకే పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరంతా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన ఐదుగురి జాడను కనుక్కునేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.(చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ) -
అజాత శత్రువుగా అందరివాడయ్యారు..
బల్లి దుర్గాప్రసాద్ సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎవరినీ నొప్పించక మెప్పించి అజాత శత్రువుగా అందరివాడయ్యారు. చిరునవ్వుతో మంచి తనంతో మమతానుబంధాలను పెనవేసుకున్నారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్ సభ్యుడిగా నిష్క్రమించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పార్లమెంట్ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ప్రజాసేవకే జీవితం అంకితం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రజాక్షేత్రంలో నిలబడి.. వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, తిరుపతి : తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత బల్లి దుర్గాప్రసాద్ బుధవారం సాయంత్రం ప్రజా క్షేత్రం నుంచి నిష్క్రమించారు. రాజకీయంగా వివాద రహితుడిగా పేరున్న దుర్గాప్రసాద్ నాలుగు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో మచ్చలేని నేతగా కొనసాగారు. నాలుగు పర్యాయాలు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక నేతగా ఖ్యాతి గడించారు. స్వస్థలం వెంకటగిరి అయినప్పటికీ రాజకీయ ప్రస్థానమంతా గూడూరులోనే సాగడం గమనార్హం. ఆయన తిరుపతికి వస్తే తన సన్నిహితులను తప్పక కలిసేవారు. ఎస్వీయూ ప్రొఫెసర్ దామోదరరెడ్డితో పలువురు అధ్యాపకులతో స్నేహంగా ఉండేవారు. మిత్రులను చాలా అభిమానంగా చూసేవారు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించేవారు. దుర్గాప్రసాద్‌కు ఏర్పేడు మండలం పల్లం గ్రామానికి చెందిన భక్తవత్సలనాయుడు మంచి స్నేహితుడు. ఆయన అనారోగ్యానికి గురై స్విమ్స్‌లో చేరిన విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ‘‘వాడికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆస్పత్రి నుంచి వెళ్లనివ్వకండి’’ అంటూ చెప్పినట్లు ఆయన స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు భార్య సరళమ్మ, కుమారులు బల్లి కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. కుమారుడు కల్యాణ్ తండ్రికి రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. రాజకీయ ప్రస్థానం ఇలా.. 1985లో గూడూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా 22,224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత 1989లో గూడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1994లో గూడూరు నుంచే 28,350 ఓట్ల మెజార్టీతో గెలుపొంది 1996–98 మధ్య కాలంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో 9,770 ఓట్లతో గెలుపొందారు. 2004లో టీడీపీ టికెట్ నిరాకరించినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. 2009లో పోటీచేసి 10,638 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఎంపీగా తిరుపతితో పాటు గూడూరు, వెంకటగిరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నించారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ దివంగత మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో గూడూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీ అడుగుపెట్టారు. అక్కడి నుంచి గూడూరు కేంద్రంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తుది శ్వాస విడిచే వరకు క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన స్వస్థలం వెంకటగిరిలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
అంతర్జాతీయ విపణిలో వెంకటగిరి జరీ
వెంకటగిరి.. చేనేత జరీ చీరలను చూస్తే మగువల మనస్సులు పురివిప్పుతాయి. మేను పులికించిపోతోంది. సంప్రదాయం, ఆధునీకత కలబోతల వర్ణ రంజితమైన చేనేతల అద్భుత కళాఖండాలు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి జరీ చీరలు దేశీయంగా మార్కెట్లో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం, సరైన మార్కెటింగ్ లేకపోవడంతో ఈ రంగం దశాబ్దాల కాలంగా చతికిల పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం లభించనుంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకానికి వెంకటగిరి జరీ చీరలు ఎంపికయ్యాయి. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి జరీ, పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. జిల్లాలోనే కాకుండా దేశీయంగా పలు రాష్ట్రాల్లోని బ్రాండెడ్ షోరూమ్స్‌లకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చీరల ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానికంగానూ ఏటా రూ.కోట్ల రిటైల్ వ్యాపారం జరుగుతోంది. వెండి జరీ, ఆఫ్‌ఫైన్ జరీతో వివిధ రకాల డిజైన్లతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో చీరను నేయడంతో మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెంకటగిరి చీరలకు భలే డిమాండ్ ఉంది. విదేశీ మహిళలు సైతం వెంకటగిరి చీరలపై మోజు పెంచుకుంటున్నారు. ఆధునిక డిజైన్లతో చీరలను నేస్తుండడంతో వెంకటగిరి చీరలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయి. వెంకటగిరి చీరల్లో జిందానీ వర్క్‌కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్ కనబడడం జాందనీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యత మరెక్కడా కనపడదు. విశిష్ట మహిళలకు వెంకటగిరి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. మార్కెట్ సౌకర్యం విస్తృతం మగువలకు అందాన్నిచ్చే వెంకటగిరి జరీ చీరలకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. జిల్లా, రాష్ట్రీయంగానే కాక దేశీయంగానూ మార్కెట్లో వెంకటగిరి చీరలకు డిమాండ్ ఉండడంతో ఏటా రూ.150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు సౌకర్యం లభిస్తే విక్రయాలు పెరిగి, రెట్టింపు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్థానిక మాస్టర్ వీవర్లు, నేత కార్మికుల అంచనా. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ నేతన నేస్తం’ పథకం అమలు చేసి ఇప్పటికే రెండు దఫాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. చేనేతకు మరింత లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ రంగంలోని యువతను ప్రోత్సహించి, ఎగుమతిదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మార్కెట్లో వెంకటగిరి చీరల విక్రయానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కల్పించింది. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ వసతికి మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకం’ ద్వారా జిల్లా నుంచి వెంకటగిరి జరీ చీరలను ఎంపిక చేశారు. చేనేత కార్మికులున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత చీరలు, గుంటూరు జిల్లా మంగళగిరి నేత కార్మికులు తయారు చేసే చీరలు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జిందానీ చీరలను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ఇవ్వనుంది. -
తిరుపతి మహిళకు వేధింపులు
-
రికార్డు స్థాయిలో జాతర ఆదాయం
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో జాతర ఆదాయం పెరిగింది. జాతర రోజు వర్షం కురిసినా అమ్మదర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. శక్తిస్వరూపిణి పోలేరమ్మ జాతర హుండీ ఆదాయం వివరాలను ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం వివరించారు. అంతకుముందు దేవదాయశాఖ కార్యాలయం ఆవరణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జాతరలో ప్రత్యేక దర్శనం టికెట్ రూ.100 ద్వారా రూ.5,13,700 రాగా గతేడాది జాతరలో రూ.5,02,700 వచ్చింది. ప్రత్యేక దర్శనం రూ.200 టికెట్ల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.8,46,000 రాగా గతేడాది రూ.7,78,400 వచ్చింది. హుండీల ద్వారా ఈ ఏడాది రూ.13,12,018 రాగా గతేడాది రూ.12,10,282 వచ్చింది. హుండీల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది రూ.1,01,737 ఆదాయం పెరిగింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.1,57,244 రాగా గతేడాది రూ.98,466 వచ్చింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.58,778 రాబడి వచ్చింది. మొత్తం మీద గతేడాది మొత్తం రూ.25,89,848 రాగా ఈ ఏడాది జాతరలో రూ.28,28,963 రాబడి వచ్చింది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రూ.2,39,115 రాబడి పెరిగినట్లు ఈఓ వివరించారు. ఆభరణాలు కూడా.. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరలో డొనేషన్లు, టికెట్ల ద్వారానే కాకుండా అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను సైతం భక్తులు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సమర్పించుకున్నారు. బంగారం గతేడాది 14.600 గ్రాములు రాగా ఈ ఏడాది 56.580 గ్రాములు భక్తులు సమర్పించారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 41.980 గ్రాముల బంగారం పెరిగింది. ఇక వెండి ఈ ఏడాది 1,896 కేజీలు రాగా గతేడాది 0.131 గ్రాములు మాత్రమే వచ్చింది. గతేడాది కంటే 1.765 కేజీల వెండి ఆభరణాలు అమ్మవారికి అధికంగా సమకూరినట్లు ఈఓ వివరించారు. చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి.. -
కుక్క కోసం కత్తిపోట్లు
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): పెంపుడు కుక్క విషయమై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానలా మారి చివరికి ముగ్గురు కత్తి పోట్లుకు గురైన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బొగ్గులమిట్ట ప్రాంతానికి చెందిన వినోద్, గణేష్ తమ బాబాయి వీరాస్వామి చెందిన పెంపుడు కుక్క తప్పిపోవడంతో వెతుక్కుంటూ రాగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గీతాంజలి కుమార్తె తులసి వద్ద కుక్క ఉండాన్ని గమనించారు. వినోద్, గణేష్‌లు తులసి, గీతాంజలిలను కుక్క విషయమై ప్రశ్నించే క్రమంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తులసి సోదరుడు సాయికిషోర్ ఒకింత ఆగ్రహంతో వినోద్, గణేష్‌పై దాడి చేశాడు. దీంతో వినోద్, సాయిగణేష్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే బొగ్గులమిట్టలో వివాదం మరింత తీవ్రమైంది. గణేష్, వినోద్‌పై దాడి చేశారన్న సమాచారం అందుకున్న వారి బాబాయి వీరాస్వామి గీతాంజలి ఇంటి వద్దకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వీరాస్వామి కత్తితో గీతాంజలి, తులసి, సాయి కిషోర్‌పై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
సాక్షి, సైదాపురం: వైఎస్సార్ ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేశారు, ఆయన ఆశయ సాధనలో భాగంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని వైఎస్సార్సీపీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని జోగిపల్లి, పొక్కందల, ఆదూరుపల్లి, ఊటుకూరు, తురిమెర్ల, పరసారెడ్డిపల్లి, గోవిందపల్లి, ఇస్కపల్లి, గిద్దలూరు, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి నోటి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమాలను నిర్వహించారు. ఆనం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి పేద కుటుంబానికి లబ్ధిచేకూరుతుందన్నారు. అవ్వా, తాతలకు, దివ్యాంగులకు పింఛన్ పెంచుతామన్నారు. రాజన్న రాజ్యం తిరిగి చూడాలంటే మనమందరం కష్టపడి జగనన్నను సీఎం చేద్దామని, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో తనను గెలిపించాలని కోరారు. వడ్డీలు చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోయిన డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు నాలుగున్నర రాజశేఖరరెడ్డి పాలన చూడాలంటే వైఎస్జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే ప్రతి ఒక్కరు వైఎస్సార్సీపీకి చెందిన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ చైర్పర్సన్ పోట్టేళ్ల శిరీషా, జిల్లా పార్టీ కార్యదర్శి దాసరిరాజు శంకరరాజు, మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్, సైదాపురం మాజీ సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి, ప్రచార కార్యదర్శి మహేంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటి కో–ఆర్డినేటర్ చెముర్తి జనార్దన్‌రాజు, నాయకులు టీవీఎల్‌నారాయణరావు, రాంగోపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కరణం శ్రీనివాసులునాయుడు, గజ్జెల రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ కామేశ్వరి, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్రజాస్వామిక కమిటీలు
సాక్షి, వెంకటగిరి: ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేసేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ సొంత పార్టీ మనుషులకే అందేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఐదేళ్లుగా రాజకీయ రాక్షస మూకల కమిటీలుగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులు, ఎన్నో కఠిన పరీక్షల్లో పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయి. జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్నించలేక జనం సైతం బాధితులుగా మిగిలిపోయారు. ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పాలన సాగించింది జన్మభూమి కమిటీలే. అధికారుల సాయంతో ప్రజాప్రతినిధులు పాలన సాగించాల్సి ఉండగా గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవస్థలో రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోయారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. పటిష్టంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జన్మభూమి కమిటీలకు దాసోహం అయిందని స్థానికులు చెబుతున్నారు. వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీలదే పెత్తనం కావడంతో ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేసేలా బాబు వ్యవహరించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటయిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేవలం అధికారపార్టీ వారికే పథకాలను అందిస్తూ మిగిలిన వారికి తీవ్రంగా అన్యాయం జరిగింది. సబ్సిడీ రుణం మంజూరు కావాలన్నా, పింఛన్‌కు అర్హత సాధించాలన్నా, చివరికి రేషన్‌కార్డు మంజూరు కావాలన్నా క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతకు బీజం పడింది. అధికారులు సైతం జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారు. అర్హులైన బాధితులు అధికారులను నేరుగా సంప్రదించి తమ గోడు విన్నవించుకున్నా స్పందించని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు అని తెలిస్తే చాటు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని తేల్చిచెబుతూ ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లు నిలిపివేసిన వైనం సర్వత్రా విమర్శలు పాల్జేసింది. అనేక సార్లు వారు అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులయిన వారికి పింఛన్ మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా జన్మభూమి కమిటీ సిఫార్సు లేనిదే ఏమి చేయలేని పరిస్థితిని కల్పించారు. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగింది. జన్మభూమి కమిటీల పెత్తనం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. నిరంకుశత్వంతో కూడిన అప్రజాస్వామిక విధానాలకు భిన్నంగా పారదర్శకతతో నిండిన ప్రజాస్వామిక చర్యలను చేపట్టాలి. దీనికి అస్మదీయుల ప్రయోజనాలే కీలకమని భావిస్తే బాధిత ప్రజానీకం తమ సమయం వచ్చినప్పుడు చెప్పే గుణపాఠానికి నాయకులు సిద్ధపడాలని ప్రజలంటున్నారు. అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బొమ్మిరెడ్డి కాంతమ్మ. రాపూరు మండలం సిద్ధవరానికి చెందిన ఆమెకు 69 సంవత్సరాల వయసు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ వస్తుండేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె అందిస్తున్న పింఛన్ రద్దు చేశారు. పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం మూలంగానే తనకు వస్తున్న పింఛన్‌ను నిలుపదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారి జన్మభూమి కమిటీలు రద్దు అయితే తప్ప తనకు పింఛన్ అందదని ఆమె చెపుతున్నారు. గూడు చెదిరినా.. గుండె కరగలేదు ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పి.ఈశ్వరమ్మ, మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు వీవర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంటిలో కుమారుడు, పిల్లలతో కలసి నివాసం ఉంటుంది. ఆమె జీవనం సాగిస్తున్న ఇళ్లు చిన్నపాటి వర్షం పడితేచాలు ఇళ్లు అంతా ఉరిసి తడిసిపోతుంది. దీంతో తమకు పక్కా గృహం మంజూరుచేయాలని పలు మార్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు విన్నవించుకుంది. అయినప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులయిన టీడీపీ నాయకుల ఆమోదం పొందిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తున్నారు తప్ప ఇళ్లు మంజూరుకు అన్నివిదాల అర్హత ఉన్న పేదలకు ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో వి«ధిలేక పలిగిన రేకుల ఇంటిలోనే గాలం వెలదీస్తున్నామని వాపోయారు. శాపంగా మారిన జన్మభూమి కమిటీలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి డక్కిలి మండలం మార్లగుంట గ్రామానికి చెందిన ఈగ లక్ష్మయ్య. భార్యా భర్తలు ఇద్దరు 70 ఏళ్లకుపై బడిన వయోవృద్ధులు. ఒక్కరికైనా పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెటుకున్నా, జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నాకు పింఛన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు అడ్డుచెపుతున్నారని అంటున్నారు. గిరిజనులమనే కనికరం కూడా లేకుండా ప్రభుత్వ పథకాల్లోనూ రాజకీయం చేస్తున్న జన్మభూమి కమిటీలే శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రుణాల్లోనూ రాజకీయమే ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పేరు పి.శ్రీదేవి. మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా మంజూరుచేస్తున్న సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఆమె పేరుతో అర్హుల జాబితా తొలగించారు. రుణం పొందేందుకు అర్హత ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు అవతారమెత్తిన టీడీపీ నాయకుల అరచకాలకు ఆమె లబ్ధి పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. -
టీడీపీ నాయకుల బరితెగింపు
సాక్షి, వెంకటగిరి: టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన కౌన్సిలర్ చల్లా మల్లికార్జున అనుచరులైన నరిసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై ఎమ్మెల్యే గన్‌మన్ సిరాజ్ కుటుంబసభ్యులు, పలువురు టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటుచేసుకుంది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. టీడీపీ నాయకుడు సుబ్బయ్య మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు నరసింహులు ఇంటి వద్దకు వచ్చి ఉద్దేశపూర్వకంగా మూత్రవిసర్జన చేస్తుండడంతో నరిసింహులు ఇది పద్ధతి కాదని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నరసింహులు ఇంటికి సమీపంలో నివశిస్తున్న విజయకుమార్, ప్రసాద్‌లు సుబ్బయ్య చేసిన పని సరికాదని సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా సుబ్బయ్య కుమారుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గన్‌మన్ సిరాజ్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వచ్చి నరసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి విషయం తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు దొంతు బాలకృష్ణ, శేతురాశి బాలయ్య, కౌన్సిలర్ మల్లికార్జున తదితరులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం హామీలు.. నీటిమూటలు
సాక్షి, వెంకటగిరి: ముఖ్యమంత్రి తమ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కారంపై హమీ ఇచ్చారంటే ఆ ప్రాంతవాసులకు ఆనందమే.. ఆనందం. చిరకాల సమస్యలతోపాటు తమ వ్యక్తిగత సమస్యలూ పరిష్కారం అవుతాయని వారి భావన. ఇదే వెంకటగిరీయుల్లోనూ కనిపించింది. అయితే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా డక్కిలి, వెంకటగిరిలో వరదలు పోటెత్తిన సమయంలో 2015 నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి ఇచ్చిన హమీలకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించని దుస్థితి. దీంతో చంద్రబాబు హామీలను నమ్మలేం అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. సమన్వయం లేక ఆగిన ఎస్ఎస్ కెనాల్ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటి నిల్వలు అందించడంతోపాటు తాగునీటి సమస్యను దూరం చేయాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.350 కోట్లు అంచనా వ్యయంతో తెలుగుగంగ అధికారుల పర్యవేక్షణలో మూడు ప్యాకేజీలుగా పనులు విభజించి ప్రారంభించారు. కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో పలు చోట్ల అటవీ అనుమతులు రావాల్సి ఉన్నా అప్పట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె రామకృష్ణల మధ్య సమన్వయం లేక ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అయింది. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సకాలంలో అందక పనులు నత్తనడకన సాగాయి. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు నీటిని పంపి అక్కడ నుంచి తెలుగుగంగ ద్వారా తమళనాడు ప్రజల దాహార్తిని తీర్చుతున్న చందంగా కండలేరు జలాలను ఎస్ఎస్ కెనాల్‌కు అందించేందుకు వీలుగా నియోజకవర్గంలోని అల్లూరుపాడు వద్ద రూ.230 కోట్లతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎస్ఎస్ కాలువ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు ఎప్పటికీ పూర్తవుతాయోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. తప్పుడు కేసులు.. అరదండాలు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రశ్నించిన స్వపక్ష నేతలపైనా పోలీసు కేసులు పెట్టించి జైల్లో కూర్చోపెట్టించిన చరిత్ర వెంకటగిరికే సొంతం. అధికారపార్టీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ మంచి బాబు కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల తీరు, కమీషన్ల వ్యవహరంపై ప్రశ్నించినందుకే పెన్షన్ వ్యవహరంలో కేసు నమోదు చేయించి బేడీలు వేయించారు. ఇక విపక్షానికి చెందిన నాయకుల మీద అయితే ఐదేళ్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు నమోదు చేయించారు. వెంకటగిరి మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన సుమారు 57 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలవారికిపై సామూహికంగా కేసులు పెట్టించిన సంఘటన వెంకటగిరిలో సంచలనం రేపింది. వివాదరహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడం నియోజకవర్గంలో రాజకీయ సంచలనానికి కేంద్ర బిందువయింది. ఐదేళ్లలో చేసిన పాపాలే శాపాలై పచ్చపార్టీ నేతలకు బుద్ధి చెప్పేందుకు అందరూ రంగం సిద్ధం చేసుకుని పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ మోడల్ కాలనీ ఊసే మరిచారు! సీఎం చంద్రబాబు నాయుడు అదే సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఆ కాలనీలో పర్యటించి హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న కాలనీ అభివృద్ధిని తన బాధ్యతగా తీసుకుని తక్షణమే డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి మోడల్‌కాలనీగా మార్చేస్తానని తెలిపారు. ఇది జరిగి సరిగ్గా 40 నెలలు గడిచింది. అయినా ఆ హామీకి సంబంధించి పురోగతి లేకుండా పోయింది. సీఎం హమీల అమలులో ప్రధానభూమిక పోషించాల్సిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే రామకృష్ణ, అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా సీఎం హమీ అమలుకాకపోవడంతో ఆ ప్రాంతంవాసుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. సీఎం సారు రావడంతో తమ కాలనీ రూపురేఖలు మారుతాయని భావించామని, అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు లేని చోట రోడ్లు వేసిన స్థానిక టీడీపీ నాయకులు ఏళ్ల తరబడి వర్షం వస్తే మోకాల్లోతు నీళ్లలో నడవాల్సిన ప్రాంతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము సీఎం హమీ మేరకు రూ.16 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇక వెంకటగిరి నుంచి నాయుడుపేట మండలం వరకూ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని ఇచ్చిన హామీకి దిక్కులేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతన్నల హమీలదీ అదే దారి! అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు కళాహీనంగా మారింది. శ్రమకు తగ్గ కూలీ లేకపోవడం, మార్కెట్లో ముడిసరుకు ధరలు చుక్కలు తాకడం, ప్రభుత్వ పథకాలు దరిచేరకపోవడం వెరసి చేనేతలు మగ్గాన్ని వీడి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. గతంలో ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు రూ.1000 వంతున ఇస్తున్న సిల్క్ సబ్సిడీని గత 7 నెలలుగా చెల్లించకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2000 ఇస్తామని హమీలు ఇస్తున్న చంద్రబాబును ఎలా నమ్మాలని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక నేతన్నల కుటుంబానికి నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ, వర్షాకాలంలో పనిదినాలు కోల్పోతున్నందుకు నెలకు రూ.2000 వంతున 2 నెలలకు రూ.4000 పరిహారం వంటివి నమ్మదగ్గ హామీలు కాదని వారు పెదవి విరుస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ హామీ అమలు సైతం మరిచిపోయారు. -
వెంకటగిరిలో టీడీపీ వెలవెల
వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న రాజాల కుటుంబీకులు ఆ పార్టీని వీడి బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటు వేలాదిమంది రాజాల అభిమానులు ఆ పార్టీలోకి వెళ్లారు. అధిక సంఖ్యాకుల సామాజిక వర్గానికి చెందిన చెందిన మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి ఉద్యమాలకు పెట్టింది పేరు. జమిందారీ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంది వెంకటగిరిలోనే. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది వెంకటగిరి సంస్థానం, రాజా కుటుంబీకులు, చేనేత పరిశ్రమ. ఇక నియోజకవర్గంలోని రాపూరు మండలంలోని చెల్లటూరు వద్ద 1983లో నిర్మించిన కండలేరు జలాశయాన్ని 11 కి.మీ. పొడవైన మట్టికట్టతో నిర్మించారు. ఇది ఆసియాలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్. ఇక వెంకటగిరి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కలిగిన వెంకటగిరి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించాయి. నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో మైకామైన్ పరిశ్రమ విరాజిల్లుతోంది. అరుదైన మైకా ఖనిజ సంపద వెంకటగిరిలో లభ్యమవతుండడంతో ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నియోజకవర్గంలోని రాపూరు మండలంలోనే ఉంది. అంతటి విశిష్టత కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఎందరో ఉద్దండులు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు, సీఎంగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. కృష్ణపట్నం–ఓబులవారిపల్లి రైల్వే పనులు చేసిన కాంట్రాక్టర్ నుంచి రూ.కోట్లు డిమాండ్ చేయడం, వారు నిరాకరించడంతో తన అనుచరులతో పనులు అడ్డగించడం, కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్‌కు సంబంధించి ఆడియో టేపులు లీకై రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. అయినా వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పచ్చపార్టీలో కనీస గౌరవం దక్కక వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆనం అభ్యర్థిత్వంతో వైఎస్సార్సీపీలో జోష్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కక రాజా కుటుంబీకులు వైస్సార్సీపీలో చేరారు. అంతకు ముందే మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సైతం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హ్యాట్రిక్ అందని ద్రాక్షే.. గతంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, ఓజిలి మండలాల్లో కొంతభాగం వరకూ నియోజకవర్గం ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరు నియోజకవర్గం అంతర్ధానం కావడంతో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో సరికొత్తగా వెంకటగిరి నియోజకవర్గం అవతరించింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌పార్టీకి పెట్టని కోటగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం 1983 నుంచి ఎనిమిది పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దఫాలు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్‌పార్టీకి నియోజకర్గ ఓటర్లు పట్టం కట్టారు.1956లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.వెంకటస్వామిరెడ్డి, 1957, 1962లో అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయానికి ప్రయత్నించిన అల్లం కృష్ణయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి ఓరేపల్లి వెంకటసుబ్బయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం జనరల్ కావడంతో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దిగా విజయం సాధించి 90వ దశకంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994లో జనార్దన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, రాజా కుటుంబీకుడు వీవీఆర్కే యాచేంద్ర విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రాజ్యలక్ష్మి వరుస విజయాలు సాధించారు. 1999లో హ్యాట్రిక్ విజయం సాధించలేక టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ౖటీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణను గెలుపొందారు. దీంతో ఆయన 2019లో హ్యాట్రిక్ ఆశలు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. అల్లం కృష్ణయ్య, నేదురుమల్లి రాజ్యలక్ష్మికి దక్కని హ్యాట్రిక్ విజయం ఈ దఫా కురుగొండ్ల రామకృష్ణ నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన ఆశలు నెరవేరుతాయో లేక వెంకటగిరి సెంటిమెంట్ మరోసారి పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే. వెంకటగిరి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు మొత్తం ఓట్లు 2,45,144 పురుషులు 1,42,674 స్త్రీలు 1,42,674 ఇతరులు 39 సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు సమీప అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు మెజారిటీ 2014 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 83,669 కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైఎస్సార్సీపీ 78,034 5,635 2009 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 69,731 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 62,965 6,766 2004 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 57,830 వీబీ సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ 51,135 6,695 1999 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 48,876 తాటిపత్రి శారద టీడీపీ 38,158 10,718 1994 వీవీఆర్కే యాచేంద్ర టీడీపీ 61,324 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 44,328 16,996 1989 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 62,270 నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 43,129 19,141 1985 వీబీ సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ 55,240 పెట్లూరు బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ 26,418 28,822 1983 నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 40,835 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 37,282 3,553 1978 నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ 26,696 పాదిలేటి వెంకటస్వామిరెడ్డి జనతాపార్టీ 26,284 412 1972 ఓరేపల్లి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ 33,136 అల్లం కృష్ణయ్య ఇండిపెండింట్ 9,092 24,044 1967 ఓరేపల్లి వెంకటసుబ్బయ్య ఇండిపెండెంట్ 31,193 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ 23,197 7,996 1962 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ 24,075 బండి చంద్రశేఖర్‌రెడ్డి స్వరాజ్ 16,285 7,790 1957 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ ––––– ––––– ––––– ––––– ––––– 1956 పాదిలేటి వెంకటస్వామిరెడ్డి కాంగ్రెస్ 45,989 ––––– ––––– 44,159 1830 -
స్థానికేతరులు గెలిస్తే మంత్రి పదవి ఖాయం
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్థానికేతరులకే సీఎం, మంత్రి, చైర్మన్ పీఠాలు దక్కుతాయనే సెంటిమెంట్ ప్రతి సారి రుజువైంది. స్థానికులైతే మాజీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు. 1978లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చక్కెర శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ పదవులను అలంకరించారు. 1983లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ చైర్మన్ పదవి పొందారు. 1989 ఎన్నికల్లో విజయం సాధించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తొలుత రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 2004 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాష్ట్ర ప్రాథమిక విద్య, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీసీ తరఫున పోటీలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గతంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేశారు. స్థానికులకు అచ్చిరాని వైనం వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, ఓరేపల్లి వెంకటసుబ్బయ్య, అల్లం కృష్ణయ్య, వీబీ సాయికృష్ణ యాచేంద్ర, వీవీఆర్కే యాచేంద్రతో పాటు వరుసగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కె.రామకృష్ణకు ఎలాంటి మంత్రి పదవి గానీ, ప్రభుత్వ పదవులు దక్కలేదు. -
రాజాలకు పెరుగుతున్న మద్దతు
సాక్షి, వెంకటగిరి: అధికార టీడీపీలో వివక్షకు గురై ధిక్కార స్వరం వినిపించిన రాజా కుటుంబీకులకు పట్టణంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదివారం స్థానిక రాజా ప్యాలెస్‌లో రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రను పట్టణంలోని పలువురు కలిసి సంఘీభావం తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ పటిష్టతకు కృషి చేసిన రాజా కుటుంబీకులను పార్టీ అధిష్టానంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడంతో ఆ పార్టీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయంగా రాజాలు తీసుకునే నిర్ణయానికి తాము మద్దతుగా ఉంటామని పలువురు సంఘీభావం తెలియజేశారు. -
మన్నూరు..బోరు!
ఓ వైపు వాయు కాలుష్యం.. మరో వైపు కలుషిత జలం ఆ పల్లె ప్రాణాలను తీస్తోంది. శ్వాస పీల్చుకోవాలంటే క్వారీల కాలుష్యం.. దాహం తీర్చుకుందామంటే ఫ్లోరైడ్ జలమే దిక్కు. పదేళ్లగా కలుషిత నీరు వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అధికారులకు ఎన్నో దఫాలుగా మొర పెట్టుకున్నా వారి ఆవేదన అధికారుల చెవికెక్కడం లేదు. వెంకటగిరి : జిల్లాలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో దినగండం నూరేళ్ల ఆయుషుగా జీవిస్తున్నారు. ఆ గ్రామంలో దాహర్తి కోసం 10 బోర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే గ్రామంలో భూగర్భ జలం పూర్తిగా అడుగంటి పోవడం వల్ల బోర్లలో నుంచి మంచి నీరు కాకుండా కలుషిత నీరు వస్తుంది. ఇవి తాగిన జనం రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తాగునీరు కలుషితం కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఏళ్ల తరబడి పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకే నెలలో కిడ్నీ సమస్యలతో 12 మంది మృతి గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది జనవరిలో 12 మంది కిడ్నీ సమస్యతో మత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలన్నీ కన్నీటిసంద్రంలో మునిగిపోయాయి. నెల వ్యవధిలోనే తక్కువ వయస్సు నుంచి నడి వయస్సు వరకు ఒకే వ్యాధితో చనిపోవడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ గ్రామానికి ఇంత పెద్ద సమస్య వచ్చిందనే ఆవేదనతో ఆ గ్రామస్తులు మదనపడుతున్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి అధికారులే కారణమని గ్రామస్తులు ముక్తకంఠంతో మండిపడుతోంది. గ్రామంలో ఎన్నీ బోర్లు వేసినా బోర్లలో నుంచి సురక్షిత నీరు రావడం లేదని చెబుతున్నారు. కిడ్నీ సమస్యతో గ్రామస్తులు చనిపోతుండడం వల్ల తాము కూడా చనిపోతామన్న ఆందోళనతో బతుకుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో గ్రామానికి చెందిన జడపల్లి రఘురామయ్య, బద్వేలు కృష్ణారెడ్డి, అనపల్లి శ్రీమరిరెడ్డి, జడపల్లి సురేంద్ర, బండి పోలయ్య, ఆవుల నరసయ్య, వానా బాలకృష్ణయ్య, అనబాక శంకరరెడ్డి, ఉప్పు జయరామయ్య, ఉప్పు రఘురామయ్య, ఉప్పు చెంగమ్మ, వెంకటరమణలు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డయాలసిస్ కోసం నెల్లూరు, తిరుపతి పట్టణాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సుజల స్రవంతి పథకం ఏదీ మా గ్రామంలో కలుషిత నీటి వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సుజల స్రవంతి ద్వారా గతంలో హామీలు ఇచ్చిన పాలకులు నేడు ఆ పథకం ద్వారా తమకు సురక్షిత నీటిని అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో సురక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జడపల్లి అపర్ణ గుక్కెడు తాగునీరు ఇవ్వాలి తమ గ్రామంలో మంచినీరు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గుక్కెడు మంచినీటి కోసం ఎన్ని బోర్లు వేసిన ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎన్నోసార్లు మంచినీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా వారు పట్టించుకోవడంలేదు. – పచ్చూరి కవిత రెండు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు మన్నూరుతో పాటు నాయుడు కండిగ్ర చెరువు గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉండడంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కోరాను. ఆయన స్పందించారు. త్వరలో ఆ గ్రామాల్లో వాటర్ప్లాంట్లు ప్రారంభిస్తాం. పదేళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీని ఆశ్రయించాం. – శింగంశెట్టి భాస్కర్‌రావు, ఎంపీపీ, బాలాయపల్లి -
వెంకటగిరిలో ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు : వెంకటగిరిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి.. కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలో తిరగొద్దంటూ.. ప్రత్యేక హోదా భరోసా యాత్ర బస్సును అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య లోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేస్తున్నారు. -
వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుతమ్ముళ్ల చేతివాటం
-
వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏ పార్టీలో చేరేది మరో రెండు నెలల్లో ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీ అనేది ఆగస్టులో చెబుతానని ఆయన తెలిపారు. అంతకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ రామ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు లేకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరేదీ తెలియాలంటే మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే. -
18వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 18వ రోజు ప్రజాసంకల్పయాత్రను వెంకటగిరిలో ముగించారు. ఇవాళ ఆయన 13.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో వైఎస్ జగన్ ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ రామకృష్ణాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ఎర్రగుడి, గోరంట్ల మీదగా వెంకటగిరి వరకూ కొనసాగింది. అంతకు ముందు వైఎస్ జగన్‌ను.. సి.బెళగలకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కలిశారు. గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలపై వారు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై తన భర్త నల్లన్నను గత ఏడాది హత్య చేశారని దస్తగిరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ సీపీలో ఉన్నామనే తమపై హత్యా రాజకీయాలు చేస్తున్నారని, నిందితులు ఇప్పటికీ బయటే తిరుగుతున్నారని వాపోయింది. కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు. అలాగే గోరంట్లలో బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
19వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, కర్నూలు : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటలకు వెంటగిరి, కొడుమూరు కోట్ల సర్కిల్, కొడుమూరు కొత్త బస్టాండ్, వర్కూరు ఎస్సీ కాలనీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వర్కూరు నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.30 గంటలకు వేముగోడు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు. ఈమేరకు 19రోజు పర్యటన వివరాలను వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. -
లారీని ఢీకొని యువకుడి దుర్మరణం
వెంకటగిరి: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బంగారుపేట తెలుగుగంగ కాలువ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలానికి చెందిన నోముల చిన వెంకటేష్ (21) నెల్లూరులోని ఓ స్వీట్ బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి సమీపంలోని ఇలగనూరులో ఉన్న తన బంధువుల ఇంటికి మంగళవారం మోటారుబైక్పై వచ్చాడు. బుధవారం తెల్లవారు.జామున నెల్లూరుకు బయలుదేరారు. బంగారుపేట సమీపంలో మరమ్మతులకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లారీ సిబ్బంది 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన బేకరీ బిల్లుపై ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట ఎండిపోతుందని..
మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదని ఆవేదన ఉరేసుకుని యువ రైతు ఆత్మహత్య వెంకటగిరి : వర్షాభావ పరిస్థితులతో కళ్ల ముందే నిమ్మతోట ఎండిపోతుందని తట్టుకు లేకపోయిన ఓ యువ రైతు చేసిన అప్పులు తీరవని మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డక్కిలి మండలం కమ్మపల్లికి పోకూరి వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు, చిన్నవాడైన నివాస్ (24) ఎంబీఎ చదువుతున్నాడు.తమలా కష్ట పడకూడదని, ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు కష్టపడ్డారు. అయితే ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తూనే వ్యవసాయంపై మక్కువతో తండ్రితో పాటు నిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. కొంత కాలంగా వర్షాభావంతో నీళ్లు లేక నిమ్మచెట్లు వాడు ముఖం పట్టాయి. అప్పులు చేసి పొలంలో మూడు చోట్ల బోర్లు వేయించినా నీటి జాడలు కనిపించలేదు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న కుటుంబ పరిస్థితితో ఆర్థికంగా మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నామని వారం రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. కాగా నివాస్‌కు ఎంబీఏ పరరీక్షలు ఉండటంతో గ్రామంలో ఉంటే అదే ఆలోచనతో ఉంటాడని మూడు రోజుల క్రితం వెంకటగిరిలో ఉంటున్న నివాస్ మేనమామ వెంకటేశ్వర్లు ఇంటికి పంపారు. ఇక్కడా అదే ధ్యాసతో మదన పడుతున్నాడు. పరీక్షల కోసం తిరుపతి వెళ్లేందుకు బుధవారం సిద్ధమైన కొద్ది సేపటికే నాకు భయంగా ఉంది.. ఏమీ చదవలేదు.. ఫెయిల్ అయితే ఇంకా బాధగా ఉంటుందని మేనమామ వద్ద వాపోయాడు. అయితే పరీక్షకు వెళ్లొద్దని అని ఆయన సముదాయించడంతో మానుకున్నాడు. ఈ క్రమంలో నివాస్ గురువారం మధ్యాహ్నం బజారుకు వెళ్లి వస్తానని చెప్పి సమీపంలో ఉన్న బంధువుకు చెందిన మోటారు సైకిల్ తీసుకుని వెళ్లాడు. ఎంత సేపటికి రాకపోయే సరికి బంధువులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నివాస్ కోసం బంధువులు వెతుకున్న తరుణంలో తోటలో గుర్తుతెలియని మృతదేహం ఉందని మనులాలపేట వాసులు చెప్పడంతో వారు వెళ్లి పరిశీలించి నివాస్ మృతదేహంగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ మాల్యాద్రి సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన బంధువులు మరో ఏడాది చదువు పూర్తిచేసి ఇంటికి అండగా ఉంటాడని భావించిన నివాస్ వ్యవసాయం చేస్తూ పంట ఎండిపోతుందని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు రోదించడం స్దానికులను కలిచివేసింది. తండ్రి వెంకటేశ్వర్లు నివాస్ మృతదేహం చూసి సోమ్మసిల్లి పడిపోయాడు. కమ్మపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కూలి పనికెళ్లి.. కడతేరాడు
చెట్టుకొమ్మ విరిగిపడి యువకుడి మృతి వెంకటగిరిరూరల్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ యువకుడు చెట్టు కొమ్మ కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సిద్ధవరం ఎస్టీ కాలనీకి చెందిన గడ్డం పెంచలయ్య, రాజమ్మ దంపతుల కుమారుడు గడ్డం శివ (19) కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గురువారం బాలాయపల్లి మండలం నిడిగల్లుకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో చెట్లు నరికేందుకు ఆ గ్రామస్తులతో పాటు శివ కూడా కూలీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న సమయంలో చెట్టుకొమ్మ విరిగి శివ తలపై పడింది. దీంతో శివ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించి సహచర కూలీలు శివను ఆటోలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. రోజువారి కూలీ పనులు చేసుకునే తమకు వైద్యం ఖర్చులకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో శివ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటే.. అకాలంగా మృతి చెందాడనే విషయం తెలిసిన శివ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శివ మృతితో సిద్ధవరం ఎస్టీకాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. -
హోరాహోరీగా క్రీడాపోటీలు
డక్కిలి: డక్కిలి గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం గుంటూరు జోనల్ స్థాయి మూడో జోన్ గురుకుల పాఠశాల, కళాశాలల పోటీలు హోరాహోరీగా సాగాయి. పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా ఆడారు. ఉదయం 7 నుంచి 11 గంటలు వరకు పోటీలు జరిగాయి. అనంతరం వర్షం జోరుగా కురవడంతో సాయంత్రం ప్రారంభమైన క్రీడా పోటీలు రాత్రి ఏడు గంటలు వరుకు సాగాయి. సీనియర్ హైజంప్ విభాగంలో సుప్రియ (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), దీపిక (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), రేవతి (పుదూరు) గెలుపొందారు. ట్రిపుల్ జంప్ విభాగంలో సుప్రజ (అద్దంకి, ప్రకాశం జిల్లా), తనుజా (సంగం), సంధ్య (ముత్తుకూరు), వాలీబాల్ సీనియర్స్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోరులో అమరావతి విజయం సాధించింది. నాగార్జునసాగర్–సూళ్లూరుపేట మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలిచింది. వినుకొండ – కొత్తకోడూరు జరిగిన మధ్య పోటీల్లో వినుకొండ విజయం పొందింది. పెద్దపావని – చీమకుర్తి మధ్య జరిగిన పోటీల్లో పెద్దపావని జట్టు గెలుపొందింది. ఖోఖో జూనియర్స్ విభాగంలో ఉప్పలపాడు – ఆర్కేపురం మధ్య జరిగిన పోటీల్లో ఆర్కేపురం గెలిచింది. సీనియర్స్ ఖోఖో విభాగంలో ముత్తుకూరు – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. త్రోబాల్ జూనియర్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు గెలుపొందింది. నాగార్జునసాగర్ – రాచర్ల మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. పెద్దపావని – పుదూరు మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలుపొందింది. వినుకొండ – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో వినుకొండ గెలుచింది. సింగరాయకొండ – సంగం మధ్య జరిగిన పోటీల్లో సంగం గెలుపొందింది. బోగోలు – కండలేరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు విజయం సాధించింది. కబడ్డీ జూనియర్స్ విభాగంలో డక్కిలి – బోగోలు మధ్య జరిగిన పోటీల్లో డక్కిలి జట్టు గెలిచింది. సూళ్లూరుపేట – బుచ్చిరెడ్డిపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు గెలిచింది. ఉప్పలపాడు – అమరావతి జట్ల మధ్య జరిగిన పోటీల్లో ఉప్పలపాడు గెలిచింది. పుదూరు–కొండెపి జట్ల మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలిచింది. కబడ్డీ సీనియర్స్ విభాగంలో రాచర్ల – బాపట్ల జట్ల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. సూళ్లూరుపేట – నాగులపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు విజయం సాధించింది. -
భెల్ ప్రాజెక్ట్‌తోనే ప్రగతి సాధ్యం
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వెంకటగిరి: మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌తోనే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ దార్శినికతకు నిలువెత్తు నిదర్శనమైన మన్నవరం ప్రాజెక్ట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ను విస్మరించడంతో పాటు తరలించేందుకు ప్రయత్నించడంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 16న పాదయాత్ర మన్నవరం చేరుకుంటుందని చెప్పారు. ముగింపుసభకు వైఎస్సార్సీపీ కీలకనేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
పోలేరమ్మ జాతర ఆదాయం రూ.9.58లక్షలు
వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకు జాతర ద్వారా రూ.9.58 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది జాతర హుండీ ద్వారా 7.34 లక్షలు ఆదాయం రాగా ఈ ఏడాది రూ.9.41 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది టికెట్ల ద్వారా రూ.4.47 లక్షల రాబడి రాగా ఈ ఏడాది రూ.200 టికెట్ల అమ్మకం ద్వారా రూ.6.41 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.5.67 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వై రామచంద్రరావు తెలిపారు. ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దుతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈఓ వివరించారు. -
జనజాతర
-
కరుణించమ్మా.. పోలేరమ్మా
-
దండాలు..దండాలు..పోలేరమ్మ తల్లో..
అమ్మవారి నిలుపు నేడు లక్షలాదిగా రానున్న భక్తులు మడిభిక్షాలకు చిన్నారులు సన్నద్ధం నేటి నుంచి భక్తులతోనిండనున్న వెంకటగిరి వెంకటగిరి:బంధాలు, అనుబంధాల కలయికకు వేదికైన వెంకటగిరి జాతరలో ప్రధాన ఘట్టానికి రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచి అసలు సందడి మొదలు కానుంది. అమ్మవారి విగ్రహం తయారీ పనులు ఉదయం నుంచే ఊపందుకోనున్నాయి. మిరాసీదారులు (కుమ్మరులు) వెంకటగిరి చెరువు నుంచి పుట్టమట్టిని, నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా ఇసుక తీసుకొచ్చి విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు మంగళవారమే ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తయారీ ప్రారంభించి రాత్రి 7 గంటలకు పూర్తి చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటలకు అమ్మవారిపై వస్త్రం కప్పి మెట్టినిల్లయిన జీనుగులవారివీధిలోని చాకలి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళతారు. పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండీ.. బుధవారం తెల్లవారే సరికి పట్టణంలో చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి చిన్నపాటి ఎదురు బుట్టకు పసుపు, కుంకుమ వేప ఆకులతో అలంకరించి ఇంటింటికి వెళ్లి మడిభిక్షాలు ప్రారంభిస్తారు. పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి..పోతురాజులకు టెంకాయ కోట్టండి.. పగలకపోతే మా నెత్తిన కొట్టండి.. అంటూ పాడుతూ మడిభిక్షం కోసం ఇంటింటికీ తిరుగుతారు. దీంతో పట్టణంలో జాతర సందడి మరింత జోరందుకుంటుంది. పలువురు భక్తులు తమ పిల్లలతో మడిభిక్షం ఎత్తిస్తామని పోలేరమ్మకు మొక్కుకుంటారు. అందులో భాగంగానే తమ పిల్లలను ఇంటింటికి పంపి వారు సేకరించిన బియ్యం, నగదును ఆసాదులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. అంతేగాక బుధవారం ఉదయం ప్రతి ఇంటిలో అంబళ్లు చేసి భక్తులకు పంచిపెడుతారు. మధ్యాహ్నం ఇంట్లో అమ్మవారిని పసుపుతో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గాలిగంగులతో శక్తిస్వరూపం.. గాలి గంగులు అనగా గంపలో పిండిదీపం పెట్టి గంపలకు పసుపు కుంకుమ వేప ఆకులతో అలకరించి అమ్మవారిని రమ్మని ఆహ్వానిస్తారు. ఈ తంతు పట్టణంలో కాంపాళెంలో జరుగుతుంది. గాలిరూపంలో చేరిన అమ్మవారిని అప్పటికే జీనుగులవారివీధిలోని మెట్టినిల్లు అయిన చాకలిఇంటికి చేరిన పోలేరమ్మ విగ్రహంలోకి ఆసాదులు ఆ శక్తిని ప్రవేశింపజేస్తారు. అప్పడు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారెలు సమర్పిస్తారు. కళ్లు, బొట్టు పెడతారు. అనంతరం కోడిపుంజును అమ్మవారికి దిష్టితీసి కోసి రక్తంతో దిష్టిచుక్కను పెడతారు. అప్పుడు అమ్మవారు పరిపూర్ణశక్తి స్వరూపిణిగా మారుతారని భక్తుల విశ్వాçÜం. అక్కడే భక్తుల దర్శనార్ధం అమ్మవారిని ఉంచి ప్రత్యేకంగా పూలతో అలకరించిన రథంపై కొలువుదీర్చుతారు. తర్వాత పాతకోట మీదుగా పోలేరమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటుచేసే ప్రత్యేక వేపాకుల మండపంలో నిలుపు చేస్తారు. గురువారం తెల్లవారుజాము నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది రానుండటంతో వెంకటగిరి జనసంద్రంగా మారనుంది. ప్రతి ఇంటా బంధుమిత్రుల కోలాహలం నెలకొననుంది. -
వెయ్యి మందితో బందోబస్తు
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెంకటగిరి: పోలేర మ్మజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్ గున్నీ తెలిపారు. శుక్రవారం ఆయన జాతర జరిగే ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, మరో 200 మందిని ఎమర్జెన్సీ దళాలుగా వినియోగిస్తామన్నారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య, క్యూలైన్లు నిర్వాహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. అంతకు మందు దేవస్థానం వద్ద ఏర్పాటు చేయనున్న బారికేడ్ల మ్యాప్ పరిశీలించి ఏఈ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ట్రయిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలేరమ్మకు పూజలు అనంతరం పోలేరమ్మకు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుడు తాండవ చంద్రారెడ్డి ఎస్పీకు శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, గూడూరు డీఎస్సీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
జాతర విజయవంతానికి సహకరించండి
వెంకటగిరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను విజయవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో గురువారం జాతర శాంతిసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సూచన మేరకు జాతరలో వీఐపీ పాస్ రద్దుతోపాటు రూ.500 టికెట్‌ను రూ.250కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలేరమ్మ నిలుపు మండపాన్ని ఈ ఏడాది సంప్రదాయ తడకలతో కాకుండా ఇనుప చట్రాలతో 8 అడుగులకు బదులు 6 అడుగులు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, క్యూలైన్లో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, వైఎస్సార్సీపీ నాయకుడు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు ఎల్.కోటీశ్వరరావు మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా జారత ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అంతకుముందు పోలేరమ్మ దేవస్థానం హుండీ ఆదాయంతోపాటు జాతర రాబడికి సంబంధించిన నగదు జమ ఖర్చుల వివరాలు సమగ్రంగా చెప్పకపోవడంతో ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారానికి దేవాదాయశాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరంరాజేశ్వరరావు, తహసీల్దార్ మైత్రేయ పి.రాజేశ్వరరావు, తాండవ చంద్రారెడ్డి, ఈవో వై.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: 8 మందికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం వెంకటగిరిరూరల్/డక్కిలి : మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకుంటున్న సమయంలో ప్రమాదంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన డక్కిలి మండలం నాగలపాడులో బుధవారం చోటుచేసుకుంది. నాగలపాడు గ్రామానికి చెందిన పలువురు వ్యక్తిగత పనుల నిమిత్తం వెంకటగిరికి చేరుకుని తిరిగి ఆటోలో నాగలపాడుకు బయలుదేరారు. నాగలపాడు దళితవాడ చర్చి మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆగ్రామానికి చెందిన రత్నయ్య, కృష్ణమ్మ, ఈశ్వరయ్య, పుల్లయ్య, చంద్రయ్య, సుశీలమ్మ, రా«ద తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రత్నయ్య, ఈశ్వరయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘గిరి’లో జాతర సందడి
దేవాదాయశాఖ ఏర్పాట్లు అధికారులతో సమీక్ష నేడు నేటి అర్ధరాత్రి రెండో చాటింపు వెంకటగిరి : జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేలా దేవాదాయ ధర్మాదాయశాఖ ఏర్పాట్లును ముమ్మరం చేసింది. ఈ నెల 21,22 తేదీల్లో నిర్వహించనున్న జాతరకు సంబంధించి గత బుధవారం సంప్రదాయబద్ధంగా తొలి చాటింపు నిర్వహించగా బుధవారం అర్ధరాత్రి రెండో చాటింపు వేయనున్నారు. 18వ తేదీన ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పోలేరమ్మ దేవస్థానం, నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి– రాజ్యలక్ష్మి ప్రగతి కళాతోరణంగా పిలవబడే ఆర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జాతరకు వచ్చి అమ్మను దర్శించుకునే భక్తులకు ఎటుంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు కార్యాచరణను రూపొందించేందుకు బుధవారం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జాతరకు హజరయ్యే భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ల ఏర్పాటులో ఈ ఏడాది అనుసరించనున్న విధానాలను ఖరారు చేయనున్నారు. వృద్ధులకు, చిన్నారులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం అప్పటి ఎస్పీ సెంథిల్‌కుమార్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. జాతరలో అమ్మవారి దర్శనం ప్రారంభం కాగానే పట్టణంలోకి ద్విచక్ర వాహనాలను మినహా ఆటోలు, కారులు ప్రవేశాన్ని నిషేధించడం మంచి ఫలితాలను ఇచ్చింది. అప్పటి నుంచి అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడాప్రాంగణం, వీఆర్‌జేసీ ఎదురుగా ఉన్న మైదానంలో పార్కింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక ప్రధానంగా క్యూలైన్ల ఏర్పాటులో మాత్రం ఏటా అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. ఈ ఏడాది అయిన పక్కా కార్యాచరణతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మదర్శన భాగ్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్సవ కమిటీ ఉత్తర్వులు లేవీ మరో వారం రోజుల్లో జాతర ప్రారంభం అవతున్నా.. ఇప్పటి వరకు దేవాదాయశాఖ నుంచి పోలేరమ్మ జాతర ఉత్సవ కమిటీ ఉత్తర్వులు స్థానిక అధికారులకు అందలేదు. జాతర ముగిసే 22వ తేదీ వరకు ఉత్సవ కమిటీ అధికారికంగా ఏర్పాట్లును పర్యవేక్షించాల్సి ఉంది. సాధారణంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే దేవస్థానం శాశ్వత కమిటీలో చైర్మన్‌తో పాటు పలువురు సభ్యులను నామినేట్ చేస్తారు. అయితే జాతర ఉత్సవ కమిటీలో చైర్మన్ గిరీకి స్థానం లేకుండా అందరూ సభ్యులుగానే ఉత్తర్వులు వెలవడనున్నట్లు తెలిసింది. శాంతిసంఘం సమావేశం రేపు జాతరను విజయవంతంగా నిర్వహించే క్రమంలో స్థానికంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, స్థానికులు ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకునేందుకు శాంతి సంఘం సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది గురువారం స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన దేవాదాయశాఖ, పోలీసులు, రెవెన్యూ, అధికారులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. ఇక అమ్మసేవలోభాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఈ సమావేశంలో తాము చేపట్టబోయే కార్యక్రమాలను అధికారులకు వివరించనున్నారు. గతంలో వైఫల్యాలను మననం చేసుకోని అవి పునరావృతం కాకుండా పక్కా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు -
పోలేరమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
వెంకటగిరి: జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి జాతర నిర్వాహణకు సబంధించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను సోమవారం ఆ దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, దేవస్థానం ఈవో వై రామచంద్రరావు, తహసీల్దార్ మైత్రేయ, జెడ్పీటీసీ దట్టం గుర్నా«థం, కౌన్సిలర్ కె చెంగారావు, లాలాపేట సింగిల్‌విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని పాల్గొన్నారు. -
సంప్రదాయబద్ధంగా జాతర తొలి చాటింపు
వెంకటగిరి: పట్టణంలో అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తజన సందోహం మధ్య ఏటా జరిగే గ్రామశక్తి పోలేరమ్మ జాతరను ఈ నెల 21, 22వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంప్రదాయబద్ధంగా తొలిచాటింపును బుధవారం అర్ధరాత్రి వేశారు. దేవస్థాన ఈఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమం జరిగింది. తొలుత గాలిగంగలు దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు తప్పెట్లు, మోతలు, కిలారింతలతో గ్రామంలో చాటు వేశారు. అనంతరం పోలేరమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీకి కసరత్తు పూర్తి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ దేవస్థాన ధర్మకర్తల మండలి శాశ్వత కమిటీ ఏర్పాటు కాలేదు. ఏటా ఉత్సవ కమిటీతోనే జాతరను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాదీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు దేవాదాయశాఖ అధికారులు తాత్కాలిక ఉత్సవ కమిటీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. నేడో..రేపో నియామక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. కాగా జాతర నిర్వహణకు సంబంధించి నిర్వహించే శాంతి సంఘ సమావేశ తేదీని ప్రకటించాలని బుధవారం దేవస్థాన ఈఓ రామచంద్రరావు తహశీల్దార్ మైత్రేయను లేఖ ద్వారా కోరారు. గూడూరు ఆర్డీఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో గ్రామస్తులతో కమిటీ సమావేశం త్వరలో జరగనుంది. జాతరలో కఠిన నిర్ణయాలు ఫలితాలిచ్చేనా..? వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ప్రధానంగా క్యూల ఏర్పాటులో ఏటా అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పోలేరమ్మ దేవస్థానం వద్ద డ్యూటీలు నిర్వహించే ఇతర ప్రాంతాల అధికారులు తమ పరిచయస్తులను దర్శనానికి ఎదురుగా పంపుతున్నారనే విమర్శలు ఏటా వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు వీఐపీ పాసుల పేరుతో దేవస్థాన క్యూలైన్ల వద్ద హల్చల్ చేస్తుండటం పరిపాటిగా మారింది. ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేయడమే కాకుండా రూ.500, రూ.100 ప్రత్యేక దర్శన టికెట్లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పలుమార్లు తెలియజేశారు. ఈ ప్రయోగం ఫలితమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. జాతరకు రాజాల అనుమతి జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవస్థాన ఈఓ రామచంద్రరావు బుధవారం వెంకటగిరి రాజాల అనుమతి కోరారు. ఈ మేరకు రాజా కుటుంబీకుడు డాక్టర్ వీబీ సాయికృష్ణయాచేంద్ర జాతరలో క్రియాశీలకమైన పనిబాపళోళ్లకు తాంబూలాలను అందించి వేడుక నిర్వహణకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడారు. శతాబ్దాల సంప్రదాయాలను తప్పకుండా జాతరను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ఈఓ రామచంద్రరావుకు సూచించారు. లాలాపేట సింగిల్ విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని, దేవస్థాన మాజీ కమిటీ అధ్యక్షుడు పులి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు
21, 22 తేదీల్లో జాతర వెంకటగిరిలో శుభకార్యాలు బంద్ వెంకటగిరి: జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సంబంధించి తొలిచాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన జాతరలో సంప్రదాయాలకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. జాతరకు సంబంధించి తొలిచాటు వేసిన రోజు నుంచి జాతర ముగిసేవరకూ వెంకటగిరిలో శుభకార్యాలు నిర్వహించరు. తరాలుగా వస్తున్న సంప్రదాయాలను నేటికీ ఆచరించడం విశేషం. ఈనెల 21, 22 తేదీలో నిర్వహించే జాతరకు సంబంధించి బుధవారం రాత్రి స్థానిక కాంపాళెంలో గాలిగంగుల దేవస్థానం వద్ద పూజలు నిర్వహించారు. రెండోచాటు ఈనెల 14న వినాయకచవితి తరువాత వచ్చే తొలి బుధవారం తొలిచాటు, రెండో బుధవారం రాత్రి రెండో చాటు వేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జాతరకు సంబంధించి రెండో చాటు వేయనున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి పట్టణంలో ఘటోత్సవం ప్రారంభం అవుతుంది. 21వ తేదీ రాత్రి అమ్మవారి నిలుపు, 22వ తేదీన నిమజ్జనం కార్యక్రమాలతో జాతర ముగుస్తుంది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మూడు సవర్లు బంగారు ఆభరణాల అపహరణ అన్నం వండుకుని తిని తీరిగ్గా చోరీ వెంకటగిరి: బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేలోగా దొంగలు ఇల్లును దోచేశారు. చోరీకి వచ్చిన గుర్తుతెలియని దుండగులు వంటి గది తాళం పగలగొట్టి అన్నం వండుకుని తిని చోరీకి పాల్పడడం బాధితులతో పాటు స్థానికులు విస్తుబోయారు. వెంకటగిరి పట్టణం కాలేజీమిట్టలో శనివారం ఈ విషయం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. కాలేజీమిట్టకు చెందిన నరేష్, ప్రవళిక దంపతులు గూడూరు రూరల్ మండలం నెర్నూరు గొల్లపల్లిలో బంధువుల పెళ్లికి హజరయ్యేందుకు ఇంటికి తాళం వేసుకుని నాలుగు రోజుల క్రితం వెళ్లారు. శనివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపునకు వేసిన తాళంతోపాటు ఇంట్లో బీరువా, బీరువాకు ఉన్న లాకర్ తాళాలు పగలగొట్టి లాకర్లో ఉన్న రెండు సవర్లు బంగారుచైన్, 6 గ్రాముల ఉంగరం అపహరించుకుపోయినట్లు గుర్తించారు. వీటి విలువు సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితుల అంచనా. ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరిస్తామని తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్జీఓ కాలనీలో మరోఇంట్లో.. పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి చెందిన సుగుణ తన ఇంటికి తాళం వేసుకుని పిల్లలతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లింది. భర్త సురేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉండడం, వరుసగా రెండు రోజులు సెలవుల రావడంతో సుగుణ భర్త వద్దకు Ðð ళుతూ సమీపంలోని బంధువులకు ఇల్లు చూస్తుండమని చెప్పి వెళ్లింది. అయితే శనివారం ఉదయం బంధువులు సుగుణ ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి వేసినతాళంతో పాటు బీరువా తాళం పగలగొట్టి ఉండడం గమనించి సుగుణకు సమాచారం ఇచ్చారు. ఆమె వస్తేగాని ఎంత మొత్తం చోరీకి గురైందో తెలియదని బంధువులు చెబుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వసూల్ రాజాలు
రుణాల పేరుతో దండకాలు లబ్ధిదారులతో బేరసారాలు వాట్సప్‌లో హల్చల్ చేస్తున్న ఓ అధికార పార్టీ కౌన్సిలర్ సంభాషణ మసకబారుతున్న అధికార పార్టీ ప్రతిష్ట వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీలో అధికారపార్టీ కౌన్సిలర్లు వసూల్ రాజాలుగా మారుతున్నారు. రుణాల పేరుతో దండకాలు సాగిస్తున్నారు. రుణం మంజూరు చేయిసే మాకేంటి అంటూ లబ్ధిదారులతో బేరసారాలకు దిగుతున్నారు. వాట్సప్‌లో హల్చల్ చేస్తున్న ఓ కౌన్సిలర్ బేరసారాల సంభాషణ పట్టణంలో సోమవారం చర్చనీయాంశంగా మారింది. సంభాషణ విన్న పలువురు మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు ఇలా మారిపోయారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండా మోసినందుకు ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందవచ్చుని భావించిన పేదల ఆశలు కౌన్సిలర్ల వైఖరితో అడియాసలు అవుతున్నాయి. ఇటీవల పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్ ఎస్సీ సబ్సిడీ రుణాన్ని పొందిన లబ్ధిదారుడుతో బేరం పెట్టాడు. ఫో¯Œæలో జరిగిన ఈ సంభాషణ వాట్సప్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సంభాషణలో సదరు కౌన్సిలర్ మరో వార్డు కౌన్సిలర్ కూడా ఎస్సీ సబ్సిడీ రుణం కోసం రూ.20వేలు వసూలు చేస్తున్నట్లు పేర్కొనడంతో అధికార పార్టీ కౌన్సిలర్ల తీరుపై పట్టణ ప్రజల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకెంత మంది టీడీపీ కౌన్సిలర్లు వసూల్ రాజాలుగా వ్యవహరిస్తున్నారోనన్న ^è ర్చ జోరుగా సాగుతుంది. వెంకటగిరి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటì æనుంచి ఎన్నడూ లేని విధంగా ఏకపక్షంగా పట్టణ ప్రజలు 25 వార్డులకు గానూ 21 వార్డులను టీడీపీకి కట్టబెట్టారు. అయితే పట్టణ ప్రజల ఆశలను పలువురు టీడీపీ కౌన్సిలర్లు అడియాశలు చేస్తున్నారు. మసకబారుతున్న అధికార పార్టీ ప్రతిష్ట వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార పార్టీ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారుతోంది. ఈ నెల 11న వృద్ధాప్య పింఛన్లను టీడీపీ నాయకులు స్వాహా చేసిన వ్యవహారం కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి వెళ్లగా, బాధ్యులుగా బిల్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు, మురళిను సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరచిపోక ముందే రుణాల బేరసారాల వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. వర్గపోరుతో వెలుగులోకి .. మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్ల మధ్యన నడుస్తున్న వర్గపోరుతో పలు కుంభకోణాలు, బేరసారాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి మున్సిపల్ సమావేశాల్లో స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్నారు. గత నెల రోజులుగా∙ఇరువర్గాలకు చెందిన కౌన్సిలర్లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఓ వర్గానికి చెందిన కౌన్సిలర్లను లక్ష్యంగా చేసుకుని మరో వర్గం పింఛన్ల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి రుణాల బేరసారాల సంభాషణను వాట్సప్‌లో పెట్టి చర్చకు తెరలేపారు. దీంతో వైరివర్గం కౌన్సిలర్లు సైతం మరోవర్గాన్ని దెబ్బతీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆ వర్గానికి చెందిన కౌన్సిలర్లు చనిపోయిన వృద్ధుల పింఛన్ల స్వాహతో పాటు మరికొన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో జరగబోయే కౌన్సిల్ సమావేశాన్ని వేదకగా చేసుకుని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పోలేరమ్మజాతరలో డ్రోన్ నిఘా
వెంకటగిరి : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఆయన నివాసంలో మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పాలకేంద్రం సెంటర్, క్రాస్‌రోడ్డు, కాశీపేట, కాంపాళెం, పాతబస్టాండ్, పోలేరమ్మ ఆర్చి, ఆర్టీసీ బస్టాండ్ తదితర 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జాతరలో వీఐపీ పాస్‌ల విధానం రద్దు చేస్తామని తెలిపారు. రాజాల సారెతీసుకొచ్చే సమయంలో 15 మందికి మించి వస్తే అనుమతించమన్నారు. అంతకుముందు సూళ్లూరుపేట సీఐ విజయకష్ణ, ఎస్సై రహీమ్రెడ్డిలు జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లలో భాగంగా ముందస్తుగా బందోబస్తు నిర్వహణ, భక్తులకు దర్శన ఏర్పాట్లలో అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలను స్థానిక పోలీస్ అధికారులతో చర్చించామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన మంగయ్య (45) శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్ నడుపుకుంటూ ఖమ్మం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు... ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టి వెళ్లి పోయింది. డ్రైవర్ మంగయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్టుషాపులు ఎత్తివేయించండయ్యా..
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డికి కలపాడు మహిళల వినతి వెంకటగిరి: తమ జీవితాల పాలిట శాపంగా మారిన బెల్టుషాపులను ఎత్తివేయించమని కలపాడు ఎస్సీ కాలనీ మహిళలు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి విన్నవించారు. స్థానికంగా శనివారం ఆయన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా 50 కుటుంబాలు లేని తమ కాలనీలో మూడు బెల్టుషాపులు పెట్టి తమ భర్తల సంపాదన కొల్లగొడుతున్నారన్నారు. పోలీసులకో,సారాయి పోలీసులకో చెపితే వచ్చి లంచాలు తీసుకుంటున్నారో ఏమోగానీ... కాలనీలో మాత్రం మద్యం బెల్టుషాపు ఎత్తివేయడం లేదని వాపోయారు. వెంటనే స్పందించిన బొమ్మిరెడ్డి ఎక్సైజ్ సీఐ ద్వారకానాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో బెల్టుషాపులను తీయించకపోతే మహిళలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, రైతు విభాగం కార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, వెంకటగిరి, డక్కిలి మండల కన్వీనర్లు ఆవుల గిరియాదవ్, రంగినేని రాజా, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి ఉన్నారు. -
గుంటూరుపై కృష్ణా జట్టు విజయం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్–19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యా^Œ ల్లో రెండో రోజైన బుధవారం గుంటూరుపై కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు–కృష్ణా జిల్లా జట్ల మధ్యన జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో గుంటూరు జట్టు 29.1 ఓవర్లకు 78 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్‌ను కొనసాగించి మొత్తం 375 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 45.3 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కొనసాగుతున్న వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల పోరు వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల మధ్యన పోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైఎస్సార్ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆటను కొనసాగించి మొత్తం 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. గురువారం ఆట కొనసాగనుంది. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
వెంకటగిరి : పట్టణంలోని తారక రామా క్రీడాప్రాంగణంలో గురువారం జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గురువారం కర్నూలు, కృష్ణా జట్లు మధ్య జరిగిన పోటీల్లో కృష్ణా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 43 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు కంటే కృష్ణా జిల్లా జట్టు 86 పరుగుల ఆధిక్యత సాధించింది. శుక్రవారం మ్యాచ్ కొనసాగనుంది. తూర్పుగోదావరి, ప్రకాశం జట్లు మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.2 ఓవర్లల్లో 82 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జట్టు ఆటముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. శుక్రవారం ఆట కొనసాగించనున్నారు. -
క్రికెట్ పోటీలు ప్రారంభం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో అండర్ –19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల మధ్యన పది రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలు త్రీడే మ్యాచ్‌లుగా ఉంటాయని వివరించారు. హోరాహోరీగా పోటీలు అండర్ –19 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నారు. తొలుత కర్నూలు–తూర్పుగోదావరి జట్ల మధ్యన పోటీ మొదలవగా కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. కర్నూలు జిల్లా జట్టు క్రీడాకారుడు యాదేష్ అత్యధికంగా 101 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తూర్పుగోదావరి జట్టు ఆటముగిసే సమయానికి 48 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అలాగే కృష్ణా–ప్రకాశం జట్ల మధ్యన జరిగిన పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణా జట్టు 68 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కౌశిక్ అత్యధికంగా 64 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జిల్లా జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. గురువారం మ్యాచ్‌లను కొనసాగించనున్నారు. -
బెటాలియన్ ఆయుధగారం తనిఖీ
వల్లివేడు(వెంకటగిరిరూరల్): మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌లో ఆయుధగారంను రాష్ట్ర బెటాలియన్స్ ఆర్మ్డ్ విభాగం డీఎస్పీ బీవీ రెడ్డి మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధగారం నిర్వాహణ వంటి అంశాలపై ప్రతిసంవత్సరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వెంకటగిరి బెటాలియన్ ఆయుధగారం నిర్వాహణపై సంతప్తికరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ డీఎస్సీ అరీఫుల్లా, యూనిట్ ఆర్మ్‌ర్ ఎన్.సుబ్బారావు, ఏఎస్సై ఎన్వీ కొండారెడ్డి, సిబ్బంది పి.ధనంజయులు, జే శ్రీనివాస్, బి.భాస్కర్ పాల్గొన్నారు.