వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ దుకాణం కాలి బూడిద అయింది. వివరాలు.. మండల కేంద్రంలోని పోలేరమ్మ ఆలయం ఎదుట ఫ్యాన్సీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ ఆధారంగా మంటలు చెలరేగాయి.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ రూ. 7లక్షల ఆస్తినష్టం జరిగిందని దుకాణం యాజమాని తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం
Published Mon, Sep 14 2015 8:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement