ఉపాధిని దెబ్బతీసిన అగ్నిప్రమాదం
గజ్వేల్రూరల్ : ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం వారి జీవనోపాధిని దెబ్బ తీసింది. ఇంటి పెద్దదిక్కు లేక.. ఇద్దరు ఆడ పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లికి తీరని నష్టం మిగిల్చింది. మండల పరిధిలోని రిమ్మనగూడ గ్రామానికి చెందిన చంద్రకళ గ్రామంలో చిన్నపాటి కిరాణ దుకాణం నడుపుతోంది.
భర్త చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను మోస్తూ కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో దు కాణంలో ఉన్న రూ. 10వేల నగదుతో పాటు రూ. 20వేల విలువ చేసే కిరాణ సామగ్రి కాలిపోయింది. దీంతో చంద్రకళ కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో ముని గిపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.