చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్‌ | Cm Jagan Speech On Venkatagiri Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్‌

Published Sun, Apr 28 2024 3:49 PM | Last Updated on Sun, Apr 28 2024 3:49 PM

Cm Jagan Speech On Venkatagiri Public Meeting

సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.

‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్‌ అంటే గుర్తుకొచ్చేది జగన్‌. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్‌. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్‌. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్‌. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్‌. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్‌. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్‌. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement