భెల్ ప్రాజెక్ట్‌తోనే ప్రగతి సాధ్యం
వెంకటగిరి: మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌తోనే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు
-
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
వెంకటగిరి: మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌తోనే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ దార్శినికతకు నిలువెత్తు నిదర్శనమైన మన్నవరం ప్రాజెక్ట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ను విస్మరించడంతో పాటు తరలించేందుకు ప్రయత్నించడంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 16న పాదయాత్ర మన్నవరం చేరుకుంటుందని చెప్పారు. ముగింపుసభకు వైఎస్సార్‌సీపీ కీలకనేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.