Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

IPL 2025, Qualifier 1: RCB Beat Punjab Kings By 8 Wickets1
IPL 2025: పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ

ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్‌ జూన్‌ 1న జరిగే క్వాలిఫయర్‌-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో (గుజరాత్‌ వర్సెస్‌ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తలో 3, యశ్‌ దయాల్‌ 2, రొమారియో షెపర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు.పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), మార్కస్‌ స్టోయినిస్‌ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్‌ ఆర్య 7, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2, నేహల్‌ వధేరా 8, శశాంక్‌ సింగ్‌ 3, ముషీర్‌ ఖాన్‌ 0, హర్ప్రీత్‌ బ్రార్‌ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్‌ సాల్ట్‌ (27 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్‌ కోహ్లి 12, మయాంక్‌ అగర్వాల్‌ 19, రజత్‌ పాటిదార్‌ 15 (నాటౌట్‌) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో జేమీసన్‌, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్‌ పేరిట ఉండేది. 2024 సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్‌ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది.

India Targeted Airbases With Brahmos Before Pakistan Could Act: Shehbaz Sharif 2
ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్‌

భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్థాన్‌.. పచ్చి అబద్ధాలతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదంటూ బీరాలు పలికిన పాక్‌.. నిజాలను ఒక్కొక్కటిగా ఒప్పుకుంటోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు.భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిదని.. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందంటూ షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్‌ మిత్ర దేశమైన అజర్ బైజాన్‌లో పర్యటిస్తున్న షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారత్‌పై దాడి చేయాలని పాక్‌ ప్లాన్ చేసింది. అయితే, పాకిస్తాన్ చర్య తీసుకునే ముందే భారత్‌ మరో బ్రహ్మోస్‌ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని షెహ్‌బాజ్‌ చెప్పుకొచ్చారు. కాగా, దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్‌ దిగొచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని మూడు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్‌ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్‌ పర్యటనలో ఉన్న పాక్‌ ప్రధాని‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్‌తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్‌, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్‌ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రకటనను పాక్‌ పత్రిక ది డాన్‌ ప్రముఖంగా ప్రచురించింది.

YSRCP Leader Gadikota Srikanth Reddy Slams TDP Mahanadu3
‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’

తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్‌ జగన్‌‌దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్‌ జగన్‌ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్‌ జగన్‌‌ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్‌ జగన్‌‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్‌ జగన్‌ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్‌ జగన్‌ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్‌ జగన్‌ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్‌లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్‌ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్‌లో వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్‌ జగన్‌ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్‌మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్‌ జగన్‌ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్‌లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్‌సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్‌ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్‌జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్‌ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్‌ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్‌ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్‌ జగన్‌ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్‌ జగన్‌ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు.

IPL 2025, Qualifier 1: Punjab Kings Bags Unwanted Record For Batting Least Overs In IPL Playoffs History4
IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్‌

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్‌.. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరిట ఉండేది. 2008 సీజన్‌లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ చేసిన 101 పరుగుల స్కోర్‌ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది.ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్‌పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తలో 3, యశ్‌ దయాల్‌ 2, రొమారియో షెపర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), మార్కస్‌ స్టోయినిస్‌ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్‌ ఆర్య 7, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2, నేహల్‌ వధేరా 8, శశాంక్‌ సింగ్‌ 3, ముషీర్‌ ఖాన్‌ 0, హర్ప్రీత్‌ బ్రార్‌ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్‌ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం​ ఆ జట్టు స్కోర్‌ 30/1గా ఉంది. సాల్ట్‌ (14), మయాంక్‌ అగర్వాల్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

Govt doctor heard in audio clip telling colleague to kill COVID 19 patient5
‘ఆ కోవిడ్‌ పేషెంట్‌ను చంపేయ్‌’.. డాక్టర్ల సంభాషణ వైరల్‌

ముంబై: నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కోవిడ్‌-19 ప్రపంచాన్ని కకావికలం చేసింది. అయితే, ఆ సమయంలో కోవిడ్‌ సోకడంతో ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న ఓ మహిళా పేషెంట్‌ను చంపేయండి అంటూ ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ తాలూకు ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2021లో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దయామి అజిమోద్దీన్ గౌసోద్దీన్ భార్య కౌసర్ ఫాతిమాకు కోవిడ్‌-19 సోకింది. దీంతో చికిత్స చేయించుకునేందుకు లాతూర్‌లోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో కోవిడ్‌ -19 కేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహించిన డాక్టర్ శశికాంత్ డాంగే, అదనపు జిల్లా సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిందిజస్ట్‌ కిల్‌ డయామీ ఉమెన్‌ ఆ ఆడియో క్లిప్‌లో దేశ్‌ పాండే.. శశికాంత్‌ డాంగేతో ఇలా చెప్పారు. కోవిడ్‌ వార్డ్‌లోకి ఇంకా ఎవర్నీ అనుమతించొద్దు. జస్ట్‌ కిల్‌ డయామీ ఉమెన్‌ అని దేశ్‌ పాండే ఆదేశించగా.. అందుకు శశికాంత్‌ డాంగే.. ఆమెకు అందిస్తున్న ఆక్సిజన్‌ను మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నట్లు చెప్పాడు. ఇక,బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఉదయ్‌గిర్‌ సిటీ పోలీసులు డాక్టర్‌ దేశ్‌ పాండేపై మే 24న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అతని మొబైల్‌ను సీజ్‌ చేశారు. నోటీసులు జారీ చేసి అతని స్టేట్మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఈ ఘటనపై తాము ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆ ఆడియో క్లిప్‌ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై దిలీప్‌ గాడే తెలిపారు. డాక్టర్‌ డాంగే ప్రస్తుతానికి అందుబాటులో లేడని, వచ్చిన వెంటనే అతనిని విచారిస్తామన్నారు.కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే..కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. 2021లో తన భార్య కౌసార్‌ ఫాతిమాకు కోవిడ్‌-19 సోకింది. అదే ఏడాది ఏప్రిల్‌ 15న ఉద్గీర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.భోజనం చేస్తున్న డాక్టర్‌ పక్కనే బాధితురాలి భర్త ఆ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న నాందేడ్‌ రోడ్డులో ఉన్న ఓ కంటి ఆస్పత్రిలో కోవిడ్‌ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆ కోవిడ్‌ వార్డ్‌లో పేషెంట్లకు డాక్టర్‌ శశికాంత్‌ డాంగే ట్రీట్మెంట్‌ ఇస్తున్నారు. పది రోజుల పాటు ఫాతిమా ఆ వార్డ్‌లో చికిత్స తీసుకున్నారు. ఏడవ రోజు వార్డులో భోజనం చేస్తున్న డాక్టర్‌ డాంగే పక్కనే ఫాతిమా భర్త కూర్చున్నాడు.అలా చంపడం మీకు అలవాటే కదాఆ సమయంలో డాక్టర్ డాంగేకు.. డాక్టర్ దేశ్‌పాండే ఫోన్‌ చేశారు. ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లోనే ఉంది. ఫోన్‌ మాట్లాడే సమయంలో కోవిడ్‌ వార్డ్‌లో బెడ్లు,ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయా? లేవా? అని అడిగారు. అందుకు డాక్టర్‌ డాంగే ఖాళీ బెడ్‌లు లేవని చెప్పాడు. వెంటనే డాక్టర్ దేశ్‌పాండే దయామి రోగిని చంపేయండి. అలా చంపడం మీకు అలవాటే కదా’ అని చెప్పిన విషయాన్ని పక్కడనే ఉన్న ఫాతిమా భర్త విన్నాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. భార్యకు ట్రీట్మెంట్‌ అందుతున్న సమయంలో మాట్లాడటం కరెక్ట్‌ కాదనుకున్నాడు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫాతిమా కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.అనూహ్యంగా ఆ సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ మే 2, 2025న సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చింది. నాడు తనని కలత పెట్టేలా డాక్టర్లు మాట్లాడారని ఫాతిమా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Qualifier 1, PBKS VS RCB: Prabhsimran Completes 500 Runs In IPL 2025, Joins Elite List Featuring Suryakumar Yadav6
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే ఔటైన ప్రభ్‌సిమ్రన్‌.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్‌ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్‌ తొలి సీజన్‌లో పంజాబ్‌కే చెందిన షాన్‌ మార్ష్‌ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎంఐ), 2020 సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ (ఎంఐ), 2023 సీజన్‌లో యశస్వి జైస్వాల్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), 2024 సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) ఈ ఘనత సాధించిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్‌ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. సుయాశ్‌ శర్మ 3, జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాల్‌ తలో 2, భువనేశ్వర్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 7, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 18, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2, నేహల్‌ వధేరా 8, మార్కస్‌ స్టోయినిస్‌ 26, శశాంక్‌ సింగ్‌ 3, ముషీర్‌ ఖాన్‌ 0 పరుగులకు ఔట్‌ కాగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 13, హర్ప్రీత్‌ బ్రార్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్‌-2) ఉంటుంది.

We Are Ready Mamata Banerjees Poll Battle' Dare For PM Modi7
‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి. చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్‌ విసిరారు.ఈరోజు(గురువారం) ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

How To Lock Or Unlock Your Aadhaar Biometrics Online Heres A Step By Step Guide To Securing Fingerprint8
ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్

డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆధార్ బయోమెట్రిక్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం ఎలా?మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్‌కి వెళ్లండి.➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్‌లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం ఆధార్ లాక్‌ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.ఆధార్‌ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్‌ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్‌ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్‌లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి.

YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations9
వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు

సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్‌ తండ్రి, దివంగత వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్‌ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సోదరి వైఎస్‌ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్‌లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025

Director Sandeep Reddy Vanga Gets Surprise Gift From Ram Charan Couple10
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్‌ప్రైజ్‌.. అదేంటో తెలుసా?

టాలీవుడ్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్‌కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్‌ చిత్రంలో తన గ్లామర్‌తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్‌ సరసన స్పిరిట్‌లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా హీరో రామ్ చరణ్‌ దంపతులు పంపిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్‌ కిచెన్‌ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ ‍రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement