BHEL Project
-
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో.. -
భెల్ ప్రాజెక్ట్‌తోనే ప్రగతి సాధ్యం
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వెంకటగిరి: మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌తోనే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ దార్శినికతకు నిలువెత్తు నిదర్శనమైన మన్నవరం ప్రాజెక్ట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ను విస్మరించడంతో పాటు తరలించేందుకు ప్రయత్నించడంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 16న పాదయాత్ర మన్నవరం చేరుకుంటుందని చెప్పారు. ముగింపుసభకు వైఎస్సార్సీపీ కీలకనేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
ఏపీఐఐసీ భూములపై ‘పచ్చ’ డేగలు
సీఎం సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. భూ కబ్జాల పరంపరను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, చెరువులనే కాదు.. శ్రీకాళహస్తి మండలంలో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి అప్పగించిన భూములనూ వదలలేదు. జేసీబీ పెట్టి చదును చేస్తున్నారు. గట్లు వేసి దున్నకాలకు సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. - సువూరు 40 ఎకరాల ఆక్రవుణ - ఆక్రమిత భూమి విలువ రూ.6 కోట్లకు పైమాటే - సూత్రధారి ఓ వీఆర్వో! శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు గ్రామం ఉంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని 178, 185 బ్లాక్‌లో 225 ఎరకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా ఇనగలూరు రెవెన్యూ పరిధిలో 181వ బ్లాక్‌లో 165 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై వెలంపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయుకుడు కన్నుపడింది. బ్లాక్ నంబర్ 178లో దామరాకుల గుంట నుంచి మామిడిగుంటకు వెళ్లే దారిలో 20 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 20 ఎకరాలు ఆక్రమించేశాడు. జేసీబీతో చదును చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆక్రమిత భూమి విలవ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలసినా ఖాతరు చేయులేదు. వారం రోజుల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు. రెవెన్యూ అధికారి అండతోనే! టీడీపీ నాయకుడు ఆక్రమించిన భూమికి సమీపంలోనే మన్నవరం పరిశ్రమ ఉంది. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడి భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆ టీడీపీ నాయకుడు పావులు కదిపాడు. ఓ వీఆర్వోని బుట్టలో వేసుకుని తమ పని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఆక్రమిత భూమిని సాగు భూమిలాగ మార్చివేస్తే అనుభవం కింద వస్తుందని ఆ రెవెన్యూ అధికారి ఆ ‘పచ్చ’డేగకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ లోపు రియుల్ వ్యాపారులు వస్తే వారికి విక్రరుంచడమో లేపోతే ఏపీఐఐసీ వాళ్లు వస్తే అనుభవంలో ఉంది కాబట్టి ఎకరాకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించమని డివూండ్ చేయువచ్చని ఆ అధికారి టీడీపీ నాయకుడికి చెప్పినట్లు సమాచారం.