
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్‌ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది.
2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది.
ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment