Bharat Heavy Electricals Limited
-
బీహెచ్ఈఎల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56 శాతంపైగా జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,220 కోట్ల నుంచి రూ. 5,354 కోట్లకు స్వల్పంగా బలపడింది. పన్నుకుముందు లాభం 60 శాతం ఎగసి రూ. 53 కోట్లకు చేరింది. విద్యుత్ విభాగం నుంచి ఆదాయం 7 శాతం బలపడి రూ. 3,992 కోట్లను దాటింది. ఇండస్ట్రీ విభాగం టర్నోవర్ 21 శాతం క్షీణించి రూ. 947 కోట్లకు పరిమితమైంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 75 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ. 7,245 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 8,644 కోట్ల నుంచి రూ. 7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో.. -
తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు
సాక్షి, సంగారెడ్డి : మహిళా ఉద్యోగి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీబీఐ అధికారులతోపాటు బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో బీహెచ్ఈఎల్లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంస్థలో పై అధికారుల వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేహా సుసైడ్ నోట్లో రాశారు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆదేశించారు. (బతికుండగానే చంపేశారు) ఈ నేపథ్యంలో సుసైడ్‌నోట్‌లో ఉన్న ఎనిమిది మందిని మియాపూర్ పోలీసులు ఎందుకు విచారణ జరపలేదని అత్యున్నత ధర్మాసనం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అదే విధంగా లేఖలో ఉన్న బీహెచ్ఈఎల్ అధికారులు, ఇతర ఉద్యోగులపై కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళపై అధికారుల వేధింపులపై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. (వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) -
తెలంగాణలో కరెంటుకు లైనేది?
-
రెండేళ్లలో మణుగూరు.. మూడేళ్లలో కొత్తగూడెం
విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తాం ప్రభుత్వానికి భెల్ హామీ 1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులు అప్పగింత రెండేళ్లలో మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మించి ఇస్తాం! మూడేళ్లలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును పూర్తిచేస్తాం!! ఇదీ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఇచ్చిన హామీ. మంగళవారం తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు భెల్ సీఎండీ బీపీ రావు, డెరైక్టర్ అతుల్ సోక్తిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు తీసుకెళ్లి కలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తామని సీఎంకు బీపీ రావు హామీ ఇచ్చారు. తమవద్ద ఇప్పటికే 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు సరిపడ బాయిలర్లు, టర్బై న్లు, జనరేటర్లు (బీటీపీ) సిద్ధంగా ఉన్నందున... కేవలం రెండేళ్లలోనే 1,080 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో మొత్తం 1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులన్నీ అవగాహన ఒప్పందం రూపంలో భెల్‌కు అప్పగించాలని తెలంగాణ జెన్కోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అదేవిధంగా రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల నిర్మాణ బాధ్యతలను కూడా అవసరమైతే భెల్‌కే అప్పగించాలని కూడా సీఎం ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం- ప్రభుత్వం (జీ టు జీ) పద్ధతిలో ఎంవోయూ రూపంలో అప్పగించడం ద్వారా టెండర్ల ప్రక్రియకు పట్టే సుమారు పది నెలల కాలాన్ని తగ్గించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ఈపీసీ పద్ధతిలో మొత్తం పనులు! వాస్తవానికి ప్రస్తుతం జెన్కోలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను రెండుగా విభజించి అప్పగిస్తున్నారు. ఒకటి బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్ల (బీటీజీ) పనులు. ఈ పనులను ప్రస్తుతం కూడా జీ టు జీ కింద భెల్‌కే అప్పగిస్తున్నారు. యాస్ ప్లాంటు, కూలింగ్ టవరు వంటి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ల (బీవోపీ) పనులను మాత్రం టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు. అయితే, ఈ రెండు కంపెనీల మధ్య పరస్పరం అవగాహనతో పనులు జరగకపోవడం వల్ల ప్లాంట్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతోంది. అంతేకాక రెండు సంస్థలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. పెనాల్టీ చెల్లింపులో కూడా ఇదే ఆరోపణలకు దిగుతూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పద్ధతిలో బీటీజీ, బీవోపీ పనులను కూడా ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా సమన్వయంతో పనులు జరుగుతాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులతో పాటు ఎన్టీపీసీ కూడా ఈపీసీ పద్ధతిలోనే ఒకే సంస్థకు మొత్తం విద్యుత్‌ప్లాంట్ల పనులను అప్పగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పద్థతినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవీ ప్లాంట్ల వివరాలు! రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల విద్యు త్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద 800 మెగావాట్లు, మణుగూరులో 1,040 మెగావాట్లు, ఇల్లెందులో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లతోపాటు కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 1,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 7,040 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ జెన్కో ప్రణాళికలు తయారుచేసింది. ఇందులో భాగంగా మణుగూరులోని ఏడూళ్ల బయ్యారం సమీపంలో సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని గుర్తించింది. ఇక్కడ ఇప్పటికే బెల్ వద్ద సిద్ధంగా ఉన్న 270 మెగావాట్ల ఆరు యూనిట్ల కు సరిపడా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు (బీటీజీ)ను ఉపయోగించి త్వరగా ప్లాంటు సిద్ధమవుతుందని టీజెన్‌కో యోచిస్తోంది. ఇక కొత్తగూడెం వద్ద ఇప్పటికే 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. పూర్తిస్థాయి ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక కూడా సిద్ధమయింది. మొ త్తమ్మీద మెగావాట్‌కు 6 కోట్ల చొప్పున 1,880 మెగావాట్లకు లెక్కిస్తే మొత్తం రూ. 11,280 కోట్ల కాంట్రాక్టు భెల్‌కు దక్కనుంది.