
ముంబై: మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ (మహాజెన్‌కో) నుంచి రూ.8,000 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ప్రభుత్వ రంగ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) శనివారం తెలిపింది. ఆర్డర్ కింద కోరాడీ థర్మల్ పవర్ స్టేషన్ ప్యాకేజీలో భాగంగా రెండు 660 మెగావాట్ల బాయిలర్ టర్బైన్ జనరేటర్ల సరఫరా, నిర్మాణ పనులు చేపట్టడంతోపాటు ఉత్పత్తి కార్యకలాపాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. 52–58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని బీహెచ్‌ఈఎల్ వివరణ ఇచ్చింది.